బరస్ట్‌ అయిన హీరోయిన్‌ అనుష్క | won't marry until projects are completed : Anushka | Sakshi
Sakshi News home page

ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని: అనుష్క

Published Sat, Jun 3 2017 5:36 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

బరస్ట్‌ అయిన హీరోయిన్‌ అనుష్క

బరస్ట్‌ అయిన హీరోయిన్‌ అనుష్క

బాహుబలి-2 మూవీ సక్సెస్ను ఎంజాయ్‌ చేస్తున్న హీరోయిన్‌ అనుష్క... సినీ గ్లామర్‌ ప్రపంచంపై బరస్ట్‌ అయ్యింది. తాము సినిమాల్లో గ్లామర్‌గా, అందంగా కనిపించే తమను జనాలు ఆదరిస్తారని, అయితే నటుల కన్నీళ్లు, కష్టాలను మాత్రం వారు అర్థం చేసుకోరని ఆమె వాపోయింది. మరీ ముఖ్యమంగా నటీమణుల జీవితాలు అద్దాల మేడ లాంటిదని, ఆ మాటలు అక్షరాలా నిజమని అనుష్క పేర్కొంది. తెరపై కనిపిస్తే ఆహో, ఓహో అనేవారే ...ఆ తర్వాత తమతో వెటకారంగా మాట్లాడతారని అంది. హీరోయిన్లకేంటి చేతి నిండా డబ్బు, ఖరీదైన జీవితం అని కూడా భావిస్తారనీ, అయితే అలాంటి భావన చాలా తప్పు అని వాళ్ల కష్టాలు, కన్నీళ్లు తమకు మాత్రమే తెలుసనీ అనుష్క చెప్పుకొచ్చింది.

మేకప్‌ వేసుకోవడానికే గంటల తరబడి సమయం పడుతోందని,  షూటింగ్‌ అయిన తరువాత ఇంటికెళ్లితే ఒళ్లంతా నొప్పులు, బాధ అవన్నీ ఇంటో వాళ్లకు తెలిస్తే వాళ్లు బాధ పడతారనీ, చాలాసార్లు ఒంటరిగా గదిలో కూర్చుని ఏడ్చేదాన్నని అనుష్క తెలిపింది. అలాగే పాత్రల కోసం బరువు పెరగడం గురించి మాట్లాడుతూ... అదంతా గతమని, అదో మానసిక వేదన అంటూ ఓ సినిమా కోసం బరువు పెరిగి ఆ తరువాత తగ్గడానికి తాను పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావని వెల్లడించింది.

పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చినా... మౌనమే సమాధానంగా ఉండే....  అనుష్క తాజాగా స్పందిస్తూ తన ఇంట్లో ఈ విషయమై ఒత్తిడి బాగా పెరిగిందని, అయితే ఇప్పట్లో పెళ్లి ప్రస్తావన తీసుకు రావద్దని వారితో చెప్పానని తెలిపింది. ఒప్పుకున్న చిత్రాలు పూర్తయ్యే వరకూ పెళ్లి మాట ఎత్తవద్దని ఇంట్లోవాళ్లకు గట్టిగా చెప్పాననీ ఈ స్వీటీ వెల్లడించింది. ఇటీవలే అనుష్క...కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని కొల్లూర్‌లో గల మూకాంబిక గుడిని సందర్శించుకుంది. దీంతో వివాహం కోసం ఆమె పూజలు చేసేందుకు ఆలయానికి వచ్చిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement