baahubali-2
-
బెస్ట్ ఛాయిస్ స్వీటీయేనా?
టాలీవుడ్లో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న నటీనటుల్లో ప్రభాస్, అనుష్క జంట ఒకటి. ఇప్పటి వరకూ వీరిద్దరూ కలిసి నాలుగు చిత్రాలలో నటించారు. అవన్నీ విజయాలు సాధించడం విశేషమే. బిల్లా చిత్రంతో కలిసిన ఈ జంట బాహుబలి-2 వరకూ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. ఈ క్రేజీ జంటపై ప్రేమ వదంతులకు ఇది కూడా ఒక కారణం కావచ్చు. వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మీడియాలో హోరెత్తుతోంది. ఇప్పటి వరకూ దక్షిణాదికే పరిమితం అయిన ప్రభాస్, అనుష్క క్రేజ్ బాహుబలి-2తో ప్రపంచస్థాయికి చేరింది. ఇకపోతే బాహుబలి ఫీవర్ నుంచి బయట పడ్డ ప్రభాస్ సాహో చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోంది. ఇంతకు ముందు లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.అయితే ఇప్పటికీ ఇందులో నటించే నాయకి ఎంపిక జరగలేదు. ఇది త్రిభాషా చిత్రం కావడంతో బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు భావించినట్లు సమాచారం. అయితే సాహో చిత్రంలో నటించడానికి బాలీవుడ్ భామలెవరూ సెట్ కానట్టుంది. కొందరు కాల్షీట్స్ సమస్య కారణంగా అంగీకరించకపోయారని, మరి కొందరు అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో వారిని దర్శక, నిర్మాతలు పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది. దీంతో సాహోలో ప్రభాస్ పక్కన అనుష్కనే బెస్ట్ ఛాయిస్ అనే భావనకు ఆ చిత్ర వర్గాలు వచ్చినట్లు తాజా సమాచారం. బాహుబలి-2 తరువాత ఈ బ్యూటీ మరో కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు. అంతకు ముందు ఒప్పుకున్న భాగమతి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. దీంతో బాహుబలి చిత్ర క్రేజ్‌ను సాహో చిత్ర యూనిట్ వాడుకోవడానికే సిద్ధం అయినట్లు సినీ వర్గాల సమాచారం. అయితే దీని గురించిన అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. -
బరస్ట్ అయిన హీరోయిన్ అనుష్క
బాహుబలి-2 మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ అనుష్క... సినీ గ్లామర్ ప్రపంచంపై బరస్ట్ అయ్యింది. తాము సినిమాల్లో గ్లామర్‌గా, అందంగా కనిపించే తమను జనాలు ఆదరిస్తారని, అయితే నటుల కన్నీళ్లు, కష్టాలను మాత్రం వారు అర్థం చేసుకోరని ఆమె వాపోయింది. మరీ ముఖ్యమంగా నటీమణుల జీవితాలు అద్దాల మేడ లాంటిదని, ఆ మాటలు అక్షరాలా నిజమని అనుష్క పేర్కొంది. తెరపై కనిపిస్తే ఆహో, ఓహో అనేవారే ...ఆ తర్వాత తమతో వెటకారంగా మాట్లాడతారని అంది. హీరోయిన్లకేంటి చేతి నిండా డబ్బు, ఖరీదైన జీవితం అని కూడా భావిస్తారనీ, అయితే అలాంటి భావన చాలా తప్పు అని వాళ్ల కష్టాలు, కన్నీళ్లు తమకు మాత్రమే తెలుసనీ అనుష్క చెప్పుకొచ్చింది. మేకప్ వేసుకోవడానికే గంటల తరబడి సమయం పడుతోందని, షూటింగ్ అయిన తరువాత ఇంటికెళ్లితే ఒళ్లంతా నొప్పులు, బాధ అవన్నీ ఇంటో వాళ్లకు తెలిస్తే వాళ్లు బాధ పడతారనీ, చాలాసార్లు ఒంటరిగా గదిలో కూర్చుని ఏడ్చేదాన్నని అనుష్క తెలిపింది. అలాగే పాత్రల కోసం బరువు పెరగడం గురించి మాట్లాడుతూ... అదంతా గతమని, అదో మానసిక వేదన అంటూ ఓ సినిమా కోసం బరువు పెరిగి ఆ తరువాత తగ్గడానికి తాను పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావని వెల్లడించింది. పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చినా... మౌనమే సమాధానంగా ఉండే.... అనుష్క తాజాగా స్పందిస్తూ తన ఇంట్లో ఈ విషయమై ఒత్తిడి బాగా పెరిగిందని, అయితే ఇప్పట్లో పెళ్లి ప్రస్తావన తీసుకు రావద్దని వారితో చెప్పానని తెలిపింది. ఒప్పుకున్న చిత్రాలు పూర్తయ్యే వరకూ పెళ్లి మాట ఎత్తవద్దని ఇంట్లోవాళ్లకు గట్టిగా చెప్పాననీ ఈ స్వీటీ వెల్లడించింది. ఇటీవలే అనుష్క...కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని కొల్లూర్‌లో గల మూకాంబిక గుడిని సందర్శించుకుంది. దీంతో వివాహం కోసం ఆమె పూజలు చేసేందుకు ఆలయానికి వచ్చిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. -
బాహుబలి ఓ లెక్కా.. మాది 5000 కోట్లు!
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి -2 సినిమా రూ. 1500 కోట్ల వసూళ్లు సాధించినా, బాలీవుడ్ సీనియర్ దర్శకుడు అనిల్ శర్మకు మాత్రం అది పెద్ద గొప్ప లెక్కలా ఏమీ కనిపించడం లేదు. 2001లో వచ్చిన గదర్: ఏక్ ప్రేమ్ కథ, 2007 నాటి అప్నే, 2010 నాటి వీర్, 2013 నాటి సింగ్ సాబ్ ద గ్రేట్ లాంటి సినిమాలు ఆయనే తీశారు. అయితే, ఇటీవల బాహుబలి-2 సినిమా బాక్సాఫీసు వసూళ్ల గురించి ఆయన దగ్గర మీడియా ప్రస్తావించినప్పుడు ఆయన తేలిగ్గా కొట్టి పారేశారు. సన్నీ డియోల్‌తో తాను తీసిన గదర్ సినిమాతో పోలిస్తే ఇవి పెద్ద వసూళ్లే కావని ఆయన వ్యాఖ్యానించారు. కాకపోతే అప్పటి కాలం, అప్పటి టికెట్ ధరలు, నాటి డబ్బు విలువ అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. దాదాపు 16 ఏళ్ల క్రితం ఆయన తీసిన గదర్ సినిమా అప్పుడే 265 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే దాని విలువ దాదాపు రూ. 5000 కోట్ల వరకు ఉంటుందని ఆయన అన్నారు. గదర్ సినిమా వచ్చినప్పుడు టికెట్ ధర కేవలం రూ. 25 మాత్రమే ఉండేదని, ఆ లెక్కన ఇప్పటి టికెట్ ధరలు, ద్రవ్యోల్బణం కలిపి లెక్కేసుకుంటే అప్పటి రూ. 265 కోట్లు ఇప్పటికి రూ. 5000 కోట్ల లెక్క అవుతుందని ఆయన వివరించారు. అందువల్ల ఇప్పటివరకు బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొట్టినట్లేమీ కాదని తేల్చి చెప్పేశారు. మంచి సినిమాలు ఎప్పుడూ రికార్డులను బద్దలుకొడతాయని, అయితే బాహుబలి2 మాత్రం ఎలాంటి రికార్డులూ బద్దలుకొట్టలేదని అనిల్ శర్మ అన్నారు. తనను ఈ విషయాలన్నింటిలో ఇరికించవద్దని, మంచి సినిమాలు వస్తే రికార్డులు ఆటోమేటిగ్గా బద్దలవుతాయని తెలిపారు. ఆయన ప్రస్తుతం తన కొడుకు ఉత్కర్ష్ హీరోగా వస్తున్న తొలి సినిమా జీనియస్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. కాగా ఇప్పటివరకు బాహుబలి-2 హిందీ వెర్షన్‌కు రూ. 478 కోట్ల వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ విడుదల చేసిన ఈ సినిమా ఆమిర్ ఖాన్ తీసిన దంగల్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. #Dangal and #Baahubali2 are akin to WAKE-UP CALL for Indian film industry... The *global biz* is an EYE-OPENER... Game changers, both... — taran adarsh (@taran_adarsh) 23 May 2017 The resounding success of #Baahubali2 and #Dangal globally reiterates the fact that language is no deterrent if content is strong enough... — taran adarsh (@taran_adarsh) 23 May 2017 The industry yearns for Hits... #Dangal and #Baahubali2 have achieved what we thought was IMPOSSIBLE and UNACHIEVABLE... Time to rejoice... — taran adarsh (@taran_adarsh) 23 May 2017 #Baahubali2 and #Dangal are PRIDE OF INDIAN CINEMA... Time to make success a habit... Concentrate on content... Positive results will follow — taran adarsh (@taran_adarsh) 23 May 2017 Indeed, #Baahubali2 has emerged the HIGHEST GROSSER EVER... Yeh jo public hain yeh sab jaanti hain... Audience knows it all! https://t.co/kEp0s6d8N0 — taran adarsh (@taran_adarsh) 22 May 2017 -
450 కూడా దాటేస్తారా?
విడుదలైన మొదటి రోజు నుంచే అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తున్న బాహుబలి-2 సినిమా హిందీలో అయితే రాక్ బస్టర్లా సాగిపోతోంది. ఇప్పటికే దాదాపు 433 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా కచ్చితంగా రూ. 450 కోట్లు దాటేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మూడో వారంలో కూడా ఈ సినిమా తన వసూళ్ల పరుగును ఆపడం లేదని, అలాగే కొనసాగుతోందని చెప్పాడు. కేవలం హిందీ వెర్షన్లోనే మొత్తం 17 రోజుల్లో రూ. 432.80 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలిపాడు. ఇప్పుడు రూ. 450 కోట్ల దిశగా వెళ్తోందన్నాడు. రెండో రోజున రూ. 50 కోట్లు దాటిందని, మూడో రోజున రూ. 100 కోట్లు దాటిందని, నాలుగో రోజున రూ. 150 కోట్లు, ఆరో రోజున రూ. 200 కోట్లు, 8వ రోజున రూ. 250 కోట్లు, 10వ రోజున రూ. 300 కోట్లు, 12వ రోజున రూ. 350 కోట్లు, 15వ రోజున రూ. 400 కోట్లు దాటినట్లు వివరించాడు. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్దమొత్తంలో వసూలు చేసిన సినిమాలు ఏవీ లేకపోవడం గమనార్హం. #Baahubali2 continues its PHENOMENAL RUN... Collects ₹ 42.55 cr in Weekend 3... 17-day total: ₹ 432.80 cr Nett. HINDI... REMARKABLE... — taran adarsh (@taran_adarsh) 15 May 2017 #Baahubali2 is now racing towards ₹ 450 cr... [Week 3] Fri 10.05 cr, Sat 14.75 cr, Sun 17.75 cr. Total: ₹ 432.80 cr Nett. HINDI. India biz. — taran adarsh (@taran_adarsh) 15 May 2017 #Baahubali2 Crossed ₹50 cr: Day 2 100 cr: Day 3 150 cr: Day 4 200 cr: Day 6 250 cr: Day 8 300 cr: Day 10 350 cr: Day 12 400 cr: Day 15 HINDI — taran adarsh (@taran_adarsh) 15 May 2017 -
'ప్రభాస్‌తో చేయాలంటే అదృష్టం ఉండాలి'
ముంబై: బాహుబలి-2 సినిమాను పొగడ్తలతో ముంచెత్తింది బాలీవుడ్ నటి ఆలియా భట్. ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా వెల్లడించింది. బాహుబలిలో ప్రతి సీన్‌ను దర్శకుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారని కితాబిచ్చింది. ఆదివారం ట్వీటర్లో ఫ్యాన్స్‌తో కాసేపు చిట్‌చాట్ చేసిన ఆలియా వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పింది. ప్రభాస్‌తో సినిమా చేస్తారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా అలాంటి చాన్స్ వస్తే అసలు వదులుకొనని పేర్కొంది. ప్రభాస్ అంతర్జాతీయ స్ధాయి నటుడని ఆయనతో నటించడం అంటే అదృష్టం కలిసి రావాలని అంది. బాహుబలి 2 సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు.. ఈ భారీ విజయానికి మరో పేరు కావాలా?. ఇదో రాక్ బస్టర్ చిత్రం. తనకు చాలా నచ్చిందని సమాధానమిచ్చింది ఆలియా. ఆలియా ప్రస్తుతం డ్రాగన్, గల్లీ బాయ్ సినిమాల్లో నటిస్తున్నారు. -
400 నాటౌట్..!
ఒకవైపు అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ బాలీవుడ్ హీరో నటించిన సర్కార్-3 సినిమా విడుదలైంది. మరోవైపు ఆయుష్మాన్ ఖురానా, పరిణీతి చోప్రా జంటగా నటించిన మేరీ ప్యారీ బిందు కూడా విడుదలైంది. శుక్రవారం నాడు విడుదలైన స్ట్రెయిట్ హిందీ సినిమాలు రెండు ఉండగా, ఆ రెండింటి కలెక్షన్లు కలిపి చూసినా, బాహుబలి మూడో శుక్రవారం సాధించిన కలెక్షన్ల కంటే తక్కువగానే ఉన్నాయట! ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఒక్క హిందీ వెర్షనే 400 కోట్ల నెట్ కలెక్షన్లు దాటిపోయింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ డబ్బింగ్ హక్కులు, ప్రచార ఖర్చు కలిపి కూడా కరణ్ జోహార్ పెట్టింది మొత్తం 90 కోట్లే. ఇప్పుడు 400 కోట్లకు పైగా కలెక్షన్ రావడంతో ఆయన పంట పండినట్లయింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితర దిగ్గజాలు నటించిన ఈ సినిమా ఇంకా మరెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి. #Baahubali2 *400 NOT OUT*... Continues to shatter MYTHS + RECORDS... 3rd Fri HIGHER than *combined* Fri biz of #Sarkar3 + #MeriPyaariBindu. — taran adarsh (@taran_adarsh) 13 May 2017 -
భల్లాల దేవుడి రథం ఎలా పరుగులు తీసింది?
వెయ్యికోట్ల కలెక్షన్లు దాటిన మొట్టమొదటి భారతీయ సినిమాగా బాహుబలి-2 రికార్డులు బద్దలుకొట్టింది. చాలావరకు థియేటర్లలో ఇప్పటికీ ఏ రోజు టికెట్లు ఆరోజు దొరకడం కష్టంగానే ఉండటంతో రూ. 1500 కోట్లు కూడా దాటేయొచ్చని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాలో చాలా విశేషాలే ఉన్నా.. అన్నింటికంటే ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవాటిలో భల్లాల దేవుడు వాడిన కత్తుల రథం ఒకటి. ముందు భాగంలో కత్తులతో కూడిన ఆ రథం మీద భల్లాలదేవుడు మొదటి భాగంతో పాటు రెండో భాగంలో కూడా హల్చల్ చేస్తాడు. మొదటి భాగంలో ఆ రథం ఎలా నడిచిందో కూడా చూపించలేదు గానీ, రెండో భాగంలో మాత్రం దున్నపోతులు దాన్ని లాక్కెళ్తున్నట్లు గ్రాఫిక్స్‌లో చూపించారు. అయితే అసలు ఆ రథం అంత శరవేగంగా ఎలా వెళ్లిందన్నది ఇప్పటికీ చాలామందికి తెలియని రహస్యమే. దానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ ఉపయోగించారట. ఆ విషయాన్ని సినిమా ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దాని శక్తితోనే కావల్సినంత వేగంగా రథం వెళ్లింది. ఈ రథాన్ని పూర్తిగా సాబు సిరిల్, ఆయన బృందమే తయారుచేసింది. అంతేకాదు.. రథం ముందు భాగంలో ఒక కారు స్టీరింగ్, దానికి ఒక డ్రైవర్ కూడా ఉన్నారట. ఆ డ్రైవరే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్‌తో కూడిన రథాన్ని నడిపిస్తుంటారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్లు సులభంగా ఎక్కడైనా బిగించే అవకాశం ఉండటం, దానికితోడు మంచి వేగంగా తీసుకెళ్లగలిగే శక్తి ఉండటంతో దాన్నే ఈ రథానికి ఉపయోగించుకున్నారు. 350 లేదా 500 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్‌ను ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. -
శివగామితో కట్టప్ప రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
-
శివగామితో కట్టప్ప రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
చెన్నై: రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి-2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. మాహిష్మతి సామ్రాజ్యం రాజమాత శివగామి పాత్రల్లో నటించిన రమ్యకృష్ణకు హీరోల స్థాయిలో పేరు వచ్చింది. ఇక రాణికి విశ్వాసపాత్రుడిగా, బానిసగా కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి. కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులకు సమాధానం దొరికింది. అయితే థియేటర్లలో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది..! సినిమా విరామంలో స్నాక్స్, డ్రింక్స్ తీసుకుని థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులు తెరపై కనిపిస్తున్న దృశ్యం చూసి షాకయ్యారు. శివగామి (రమ్యకృష్ణ) పక్కన కట్టప్ప (సత్యరాజ్) కూర్చుని రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇదేంటి రాజమాతతో బానిస ఇంత చనువుగా ఉండటం ఏంటి? అంటూ ప్రేక్షకులు అయోమయానికి గురయ్యారు. కాసేపు ఏమీ అర్థం కాలేదు. కట్టప్ప ఓ చీరను శివగామికి కానుకగా ఇవ్వగా ఆమె తీసుకుని మురిసిపోతోంది. ప్రేక్షకులు అయోమయంలో ఉండగానే ఇది పోతిస్ యాడ్ అంటూ తెరపై కనిపిస్తుంది. ఇది వ్యాపార ప్రకటన అని తెలిశాక ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దేశ వ్యాప్తంగా బాహుబలికి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి పాపులర్ టెక్స్టైల్ బ్రాండ్ కోసం రమ్యకృష్ణ, సత్యరాజ్‌లతో యాడ్ రూపొందించారు. ఇందులో వీరిద్దరూ రాజు, రాణిగా కనిపిస్తారు. రమకృష్ణ బాహుబలి సినిమాలో మాదిరిగా అదే వేషధారణతో కనిపించగా, సత్యరాజ్ మాత్రం ఈ సినిమాలో పాత్రకు భిన్నంగా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి రాచఠీవిలో కనిపిస్తాడు. మొత్తానికి ఈ యాడ్ చూసిన ప్రేక్షకులు అయోమయానికి గురికావడంతో పాటు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
బాహుబలి చీరలు.. బంపర్ హిట్టు!!
బాహుబలి-2 సినిమా వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో ఆ సినిమా మానియా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఈ మానియా చీరలకు కూడా పాకింది. బాహుబలి సినిమా పోస్టర్లనే చీరల మీద ప్రింట్ చేసి, వాటిని అమ్ముతుంటే.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం అయిన ఏలూరులోని ఒక మిల్లులో ఈ చీరలను ప్రింటింగ్ చేయిస్తున్నారు. సినిమాలోని కొన్ని దృశ్యాలను ఎంపిక చేసుకుని, మంచి రంగులతో చీరల మీద వాటిని ప్రింట్ చేయిస్తున్నారు. తొలి బ్యాచ్‌లో కేవలం 50 చీరలు మాత్రమే ప్రింట్ చేయించి కొంతమంది స్నేహితులు వాటిని పంచుకున్నారు. సినిమా విడుదల రోజున వాళ్లంతా కలిసి ఆ చీరలు కట్టుకుని సినిమా చూశారు. దేవసేన, అమరేంద్ర బాహుబలి ఇద్దరూ విల్లు పట్టుకుని, ఒక్కొక్కరు మూడేసి బాణాలు పట్టుకుని ఉన్న ఫొటోను చీర పల్లు మీద ప్రింట్ చేయించారు. దాంతోపాటు మాహిష్మతి సామ్రాజ్యాన్ని కూడా మొత్తం చీరమీద వచ్చేలా ప్రింట్ చేశారు. ఆ చీరలు కట్టుకుని తన స్నేహితురాళ్లతో ఉన్న ఫొటోను ఫేస్బుక్లోను, వాట్సప్లోను ఒక మహిళ పోస్ట్ చేయగా, అది విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ చీరలు తమకు కావాలంటే తమకు కావాలంటూ ఆమెకు విపరీతంగా ఫోన్లు వచ్చాయి. దాంతో ఇప్పుడు దాదాపు మరో 500 వరకు చీరలకు ఆర్డర్ ఇచ్చారు. ఈసారి రమ్యకృష్ణ, రాణా దగ్గుబాటిల ఫొటోలు కూడా వేయిస్తున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ఈ చీరల ఫొటోను గతంలో తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇంతకుముందు రజనీకాంత్ నటించిన కబాలి సినిమా సన్నివేశాలను కూడా ఇలా చీరల మీద ప్రింట్లు వేయించారు. #Baahubali2mania -
బాహుబలి: టాలీవుడ్ కులాలపై వర్మ సెటైర్లు
బాహుబలి-2 సినిమా సాధించిన బ్లాక్ బస్టర్ విజయంతో ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలలో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఇదే పనిలో కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన టాలీవుడ్లో ఉన్న కులాల కుమ్ములాటల గురించి ప్రస్తావించేందుకు ఈ సినిమాను వాడుకున్నాడు. కొంతమంది హీరోలు కాపుల మీద, కమ్మల మీద దృష్టి పెట్టినట్లుగా ప్రభాస్ కూడా రాజుల మీద మాత్రమే దృష్టి పెట్టి ఉంటే అతడు కేవలం ఒక ప్రాంతీయ హీరోగానే మిగిలిపోయేవాడని, అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు అంతర్జాతీయ స్టార్ అయ్యాడని వర్మ ట్వీట్ చేశాడు. ప్రాంతీయ అభిమానుల గురించి ప్రభాస్ పెద్దగా పట్టించుకోడు కాబట్టి అతడు జాతీయ, అంతర్జాతీయ అభిమానులను సొంతం చేసుకున్నాడని, ప్రాంతీయ అభిమానులను గురించి పట్టించుకునే స్టార్లు ఎప్పటికీ ప్రాంతీయంగానే ఉండిపోతారని కూడా అన్నాడు. ఇక ఉత్తర భారతానికి చెందిన ఒక వ్యక్తి... హిందీ సినిమాలో తొలిసారి ఓ దక్షిణాది హీరో మిగిలిన ఉత్తరాది హీరోలందరినీ హీరోయిన్లుగా కనపడేలా చేశాడంటూ కామెంట్ చేశారు. దానికి కూడా స్పందించిన వర్మ.. ఉత్తర దక్షిణాలను వేర్వేరుగా చూడొద్దని, భారతీయ సినిమా అనే మొత్తం కాన్సెప్టులో చూడాలని, అలాగే ప్రభాస్‌ను కేవలం దక్షిణ భారతీయ నటుడిలా కాకుండా భారతీయ నటుడిలా చూడాలని హితవు పలికాడు. If Prabhas concentrated on Rajulu like others did on Kaapulu kammalu etc he would remain regional..he became international because he dint — Ram Gopal Varma (@RGVzoomin) 2 May 2017 Since Prabhas dint care regional fans he got national and international fans .. Stars who care regional fans will always remain regional — Ram Gopal Varma (@RGVzoomin) 2 May 2017 Only bigger film than BB2 is to see extremely tight close ups of all south Indian super stars n directors when being told BB2 collections — Ram Gopal Varma (@RGVzoomin) 2 May 2017 Seeing love of entire india for him I request u to lose this horrible regressive view of north south divide and embrace Prabhas as Indian https://t.co/3vX8UyfoXI — Ram Gopal Varma (@RGVzoomin) 2 May 2017 -
700 కోట్లకు చేరువలో బాహుబలి!!
-
ఆ విధంగా బాహుబలి-2కు సీఎం భారీ సాయం!
మల్టిపెక్స్ లలో సినిమా టికెట్ ధరలను అదుపుచేస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు అధికారులు కీలక ఫైలును సిద్ధం చేశారు. ఆ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేస్తే.. మరు క్షణం నుంచే టికెట్ గరిష్ట రూ.200గా నిర్ణయిస్తూ జీవో జారీ అయ్యేది. కానీ అత్యవసర పని నిమిత్తం గురువారం సీఎం దుబాయ్ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం బాహుబలి-2 విడుదలైంది. ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో మల్టిపెక్స్ లు పోటీపడ్డాయి. టికెట్ ధరల్ని అమాంతం పెంచేశాయి. కాంబోప్యాక్ ల పేరుతో జనాన్ని అడ్డగోలుగా దోచుకున్నాయి. ఏదైతేనేం.. తొలిరోజే వంద కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించిన బాహుబలి-2.. సినీచరిత్ర రికార్డుల్ని బద్దలుకొట్టేదిశగా దూసుకుపోతోంది. ఆ విధంగా ఫైలుపై సీఎం సంతకం చేయకపోవడం సినిమాకు పరోక్షంగా ఎంతో సాయపడిందని కన్నడ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భారీ ధరకు బాహుబలి టికెట్లు కొన్న సీఎం.. ఇక విదేశాల నుంచి సోమవారం తిరిగొచ్చిన ముఖ్యమంత్రి.. నేరుగా బెంగళూరులోని ఓరియాన్ మాల్ కు వెళ్లి.. ఒక్కో టికెట్ రూ.1050కి కొనుగోలుచేసిమరీ బాహుబలి-2 సినిమా చూశారు. ఇంతకీ ఆయనెవరో కాదు.. మన పొరుగు రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే! సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తానన్న ఆయనే.. అధిక ధర చెల్లించి సినిమా చూడటంపై కర్ణాటకలో రాజకీయ వివాదం చెలరేగింది. ధరల నియంత్రణపై కన్నడ సంఘాలు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే.. సీఎం అధిక ధర చెల్లించి సినిమా చూడటం వివాదాస్పదమైంది. కాగా, ఇది సీఎం వ్యక్తిగత విషయమని, మనవడి బలవంతం మేరకే సిద్ధరామయ్య సినిమా చూశారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రైవేటు వాహనంలో వచ్చి బాహుబలి-2 చూసిన సీఎం.. ఆ వెంటనే అధికారిక హోదాలో చాముండేశ్వరీ స్టుడియోకి వెళ్లి 'నిరుత్తరా' అనే కన్నడ సినిమాను వీక్షించారు. నటి భావన నిర్మించిన ఈ సినిమా ప్రదర్శనకు సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. -
700 కోట్లకు చేరువలో బాహుబలి!!
భారతదేశ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ నటించిన 'పీకే' సినిమాకు వచ్చిన రూ. 792 కోట్లే అత్యధిక వసూళ్లు. ఈ రికార్డును తుడిచిపెట్టేయడానికి బాహుబలి-2 సిద్ధం అవుతోంది. ఇప్పటికే దాదాపు 700 కోట్ల కలెక్షన్లకు చేరువలోకి వచ్చినట్లు సినీవర్గాల టాక్. ఓపెనింగ్ వీకెండ్లోనే దాదాపు 540 కోట్ల వసూళ్లు సాధించిన బాహుబలికి.. సోమవారం మేడే కావడం, చాలామందికి సెలవు కావడం బాగా కలిసొచ్చింది. అమెరికా బాక్సాఫీసులో కూడా ఈ సినిమా రికార్డులు బద్దలుకొడుతోంది. అక్కడ ప్రస్తుతం విన్ డీజిల్ నటించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్8 మొదటి స్థానంలోను, ఒక లాటిన్ సినిమా రెండో స్థానంలోను ఉండగా మూడోస్థానంలో బాహుబలి నిలిచింది. ఒక దక్షిణ భారత పరిశ్రమకు చెందిన సినిమా హిందీలో విడుదలై... అక్కడ తొలి నాలుగు రోజుల్లో రికార్డు సృష్టించడం ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఒక్క హిందీలోనే తొలి నాలుగు రోజుల్లో 150 కోట్ల రూపాయలు నెట్ వసూలుచేసి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్టు తరణ్ ఆదర్శ్ తెలిపారు. సోమవారం నాటి కలెక్షన్లతో ఈ సినిమా అన్ని రికార్డులనూ నాకౌట్ బిజినెస్‌తో బుల్డోజ్ చేసిందని, ఇప్పటికి ఇంకా ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, మొత్తం వివరాలు మళ్లీ చెబుతానని అన్నారు. అప్పటికే కేవలం హిందీ వెర్షన్లోనే తొలి నాలుగు రోజుల్లో 150 కోట్లు సాధించిన విషయాన్ని ఆయన ప్రకటించారు. అదే సమయంలో రాజమౌళి, బాహుబలి టీమ్ కలిసి భారతీయ సినిమా గర్వంగా నిలిచేలా చేశారంటూ రాజమౌళిని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. అలాగే, ఒక్క అమెరికాలోనే ఓపెనింగ్ వీకెండ్లో ఒక భారతీయ సినిమా రూ. 65.65 కోట్లు సాధించగలదని ఎవరైనా కనీసం ఊహించగలరా అంటూ.. యూఎస్ రికార్డుల గురించి కూడా వెల్లడించారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా భారతదేశంలో 6500 స్క్రీన్లతో పాటు ప్రపంచవ్యాప్త్ంగా 9వేల స్క్రీన్లలో విడుదలైంది. దాదాపు మరో వారం రోజుల వరకు కూడా చాలావరకు థియేటర్లలో టికెట్లన్నీ అప్పుడే అమ్ముడైపోయాయి. సినిమాకు అంతగా వసూళ్లు వస్తాయా అని చాలామంది వ్యక్తం చేసిన అనుమానాలను ఈ వసూళ్లు పటాపంచలు చేశాయి. #Baahubali2 is the new yardstick... Crossed ₹ 50 cr: Day 2 Crossed ₹ 100 cr: Day 3 Crossed ₹ 150 cr: Day 4 Nett biz... HINDI... India biz. — taran adarsh (@taran_adarsh) 2 May 2017 Indeed, you and Team #Baahubali have made Indian cinema proud... Thank you, @ssrajamouli ji https://t.co/K6qqlvqBHM — taran adarsh (@taran_adarsh) 2 May 2017 #Baahubali2 - USA: Thu + Fri $ 4,562,936, Sat $ 3,403,900, Sun $ 2,245,100. Total: $ 10,211,936 [₹ 65.65 cr]. PHENOMENAL! @Rentrak — taran adarsh (@taran_adarsh) 1 May 2017 Did you ever imagine an Indian film would collect ₹ 65.65 cr in its *opening weekend* in USA alone? #Baahubali2 has achieved the feat... — taran adarsh (@taran_adarsh) 1 May 2017 -
బాహుబలి 450 కోట్లు దాటేసిందా?
రాంగోపాల్ వర్మ చెప్పినట్లు భారతీయ సినిమాలను బాహుబలికి ముందు, ఆ తర్వాత అని రెండు యుగాలుగా విడదీయాల్సి ఉంటుందేమో. సరిగ్గా మూడంటే మూడు రోజుల్లోనే ఏకంగా 450 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన సినిమా ఇప్పటివరకు ఏదీ లేదు. ఆ ఫీట్ అసాధ్యం కాదని, కష్టం మాత్రమేనని బాహుబలి-2 నిరూపించింది. బాహుబలి మొదటి భాగం దాదాపు రూ. 650 కోట్ల వరకు వసూలు చేసిన తర్వాత రెండో భాగం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో ఓపెన్ అయ్యింది. మొదటిరోజే ఈ సినిమాకు రూ. 121 కోట్ల కలెక్షన్లు వచ్చాయని హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహార్ చెప్పారు. ట్రేడ్ ఎనలిస్టు రమేష్ బాలా కూడా ఈ సినిమా వసూళ్ల గురించి ట్వీట్ చేశారు. ఆదివారంతో ముగిసిన మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్త వసూళ్లు చూసుకుంటే రూ. 450 కోట్లు దాటిపోతాయని చెప్పారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా.. ఆమిర్ ఖాన్ నటించిన పీకే. దానికి రూ. 792 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు కచ్చితంగా ఆ సినిమాను బాహుబలి-2 దాటేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారానే ఈ సినిమాకు రూ. 500 కోట్ల వరకు వచ్చాయని చెబుతున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా ఇక వసూళ్ల రికార్డులను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పలేమని అంటున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా ప్రతిరోజూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంది. #Baahubali2 is the 1st movie to make it to Top 3 at the #NorthAmerica BO with less than 500 Theaters (425) / lowest theater count.. -
బాహుబలి సెకండాఫ్ ముందే చూసేశారు!
బాహుబలి-2 సినిమా విడుదలైన తర్వాత కష్టపడి టికెట్ సంపాదించుకున్నారు.. ఎంచక్కా థియేటర్‌కు వెళ్లారు. అక్కడ సినిమా చూస్తుంటే ఫస్టాఫ్‌లోనే బ్రహ్మాండమైన వార్ సీక్వెన్సులు కనిపిస్తున్నాయి. అబ్బో ఫస్టాఫే ఇలా ఉందంటే సెకండాఫ్‌లో ఇంకెన్ని యుద్ధాలు ఉంటాయో, అది ఇంకెంత అదిరిపోతుందో అని చూశారు. ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా అనుమానం వచ్చింది. ఎక్కడో తేడా కొట్టినట్లుందే అనుకున్నారు. తీరా క్లైమాక్స్ దగ్గర అసలు విషయం తెలిసింది. ఏమిటంటే, సినిమాలో ఫస్టాఫ్ ముందు చూపించడానికి బదులు సెకండాఫ్ ముందు చూపించి, దాని తర్వాత ఫస్టాఫ్ ప్లే చేశారు. ఈ గందరగోళం బెంగళూరులోని పీవీఆర్ ఎరీనా మాల్లో జరిగింది. దాంతో ప్రేక్షకులకు ఒళ్లు మండిపోయింది. మొత్తం సినిమా మళ్లీ మొదట్నుంచి వేయాలంటూ పట్టుబట్టారు. అయితే అప్పటికే తర్వాతి షో ప్రేక్షకులు వచ్చేయడంతో ఏమీ చేయలేక ఊరుకున్నారు. ఈ విషయం గురించి ట్విట్టర్లో పుంఖానుపుంఖాలుగా రాసి పారేశారు. తాను గత రాత్రి పీవీఆర్ ఎరీనా మాల్లో బాహుబలి సినిమాకు వెళ్లానని, అక్కడి వాళ్లు ముందు సెకండాఫ్ సినిమా చూపించారని, ప్రేక్షకులకు క్లైమాక్స్ సమయంలోనే అసలు విషయం తెలిసిందని అన్నారు. ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా 6500 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా అయితే 9వేల స్క్రీన్లలో విడుదలైంది. బాక్సాఫీసులో కూడా ఇది రికార్డులు బద్దలు కొడుతోంది. Last night premiere show at PVR Arena Mall #Bengaluru, they played the 2nd half of #Baahubali2 first. Audience realised during climax only — T S Sudhir (@Iamtssudhir) 28 April 2017 Upset viewers forced the theatre to play the entire #Baahubali2 movie from the beginning then ! Just told about it by a viewer — T S Sudhir (@Iamtssudhir) 28 April 2017 @Iamtssudhir I was there in the show.. Thought "if u have this much great war sequence in First half how it is going to be in second..".. -
బాహుబలిలో సెన్సారైన దృశ్యాలు...
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన సంచలనాత్మక చిత్రం ‘బాహుబలి–2’ చిత్రంపై సెన్సార్ కత్తెర పడిందా ? పడితే ఎలాంటి సీట్లను కత్తిరించారన్న ఆసక్తి కలుగుతోంది. చిత్రంలోని రణరంగానికి సంబంధించిన సన్నివేశాల్లో తలలు తెగనరికితే రక్తం చిమ్మే కొన్ని భయానక దృశ్యాలకు మాత్రమే సెన్సార్ బోర్డ్ కట్లు చెప్పింది. రానా, ప్రభాస్‌ల ఇద్దరి మధ్య జరిగే యుద్ధానికి సంబంధించిన కొన్ని దృశ్యాలపై కూడా సెన్సార్ బోర్డు కత్తెర విధించగా, ఆ మేరకు సెన్సార్ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని చిత్ర దర్శకుడు రాజమౌళి పునర్ షూటింగ్ జరిపి వాటిని నిడివి తగ్గకుండా జోడించారు. మిగతా అభ్యంతరకర దృశ్యాలను మాత్రం యథాతధంగా తొలగించారు. సినిమాలో కట్లు సూచిస్తూ హైదరాబాద్‌లోని సీబీఎఫ్సీ రీజనల్ అధికారి పీవీఆర్ రాజశేఖరం జారీ చేసిన ఉత్తర్వుల కాపీ మీడియాకు దొరికింది. హిందీ వర్షన్ బాహుబలికి మాత్రం ఒక్క కట్ కూడా చెప్పకుండా సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. బహుశా తెలుగు వెర్షన్‌పై వ్యక్తం చేసిన అభిప్రాయలను పరిగణనలోకి తీసుకొని నిర్మాత ముందుగానే వాటిని హిందీ వర్షన్ నుంచి తొలగించి ఉండవచ్చు. -
ఉప్పలపాటి వంశానికి ప్రభాస్ గాడ్ గిఫ్ట్
ఉప్పలపాటి వంశానికి ప్రభాస్ దేవుడిచ్చిన వరమని ప్రముఖ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల అన్నారు. బాహుబలి-2 సినిమా వీక్షించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... 'ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది నా మాట కాదు. ప్రపంచం అంతా ఒకటే మాట. అదే బాహుబలి. దర్శకుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. భూమిమీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం బాహుబలి సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే రాజమౌళి, ప్రభాస్ ఫ్యామీలి కూడా. ఉప్పలపాటి వంశానికి ప్రభాస్ గాడ్ గిఫ్ట్. వెరీ ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను' అని అన్నారు. మరోవైపు బాహుబలి-2 చిత్రంపై ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమాలో ప్రభాస్-అనుష్క జంట చాలా బాగుందని, అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా అదిరిపోయాయని తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాలతోపాటు మిగిలిన దిక్షిణాది రాష్ట్రాల్లోనూ బాహుబలి దుమ్మురేపుతున్నాడు. త్రివేండ్రం, చెన్నైల్లో సినీ ప్రేమికులు బాహుబలికి సాహో అంటున్నారు. ఇక బాహుబలి ఫీవర్‌తో ఉత్తరాది ఊగిపోతోంది. ఖాన్ త్రయం సినిమాలకు మించిన క్రేజ్‌తో నార్త్‌లోనూ దుమ్మురేపుతోంది. మల్టీఫ్లెక్స్‌ల నుంచి మామూలు థియోటర్ల వరకూ ఎక్కడ చూసినా బాహుబలి సందడే కనిపిస్తోంది. -
ఉప్పలపాటి వంశానికి ప్రభాస్ గాడ్ గిఫ్ట్
-
బాహుబలి-2 థియేటర్లపై సెన్సార్ బోర్డు దాడులు
హైదరాబాద్: ఇప్పటికే బాహుబలి-2 బెనిఫిట్ షోలకు అనుమతి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో కొన్ని థియేటర్లలో నిబంధలనకు విరుద్ధంగా గురువారం మూవీ ప్రీ రిలీజ్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సెన్సార్ బోర్డు సభ్యులు కొందరు ఎల్బీనగర్ లోని విజయలక్ష్మి థియేటర్‌పై దాడులు నిర్వహించారు. నిబంధనలను విరుద్ధంగా బాహుబలి-2 ప్రదర్శిస్తున్నారని బోర్డు అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యానికి, సెన్సార్ బోర్డు అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. సెన్సార్ బోర్డు సభ్యులు మరికొన్ని థియేటర్లపైనా దృష్టిపెట్టారు. బోర్డు సభ్యులపై విజయలక్ష్మి థియేటర్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. మరోవైపు విజయలక్ష్మి థియేటర్ కాంప్లెక్స్ వద్ద బీజేవైఎం ఆందోళన చేపట్టింది. బాహుబలి-2 ప్రీ రిలీజ్ షో నిలిపి వేయాలంటూ థియేటర్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. థియేటర్ వద్ద గొడవ జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి-2 రేపు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9వేల స్క్రీన్లపై ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్న విషయం తెలిసిందే. -
అమ్మతో సినిమా చూడటానికి ప్రభాస్ సంకోచం
బాహుబలి-2 ఇంకొన్ని గంటల్లో థియేటర్ల ముందుకు రాబోతుంది. గురువారం ముంబైలో ప్రీమియర్ షోకు షెడ్యూల్ బుక్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోగా ప్రధాన పాత్ర పోషించిన ప్రభాస్ తన సినిమాను చూడాల్సిన అత్యంత ముఖ్యమైన తొలి వ్యక్తి, ఆమె కావాలని కోరుకుంటున్నారు. ఆమె ఎవరో తెలుసా? ప్రభాస్ తల్లి శివ కుమారి అట. అయితే తన ఫిల్మ్ మొదట తన తల్లినే చూడాలని భావిస్తున్న ప్రభాస్ మాత్రం ఆమెతో కలిసి సినిమా చూడటానికి సంకోచిస్తున్నాడట. దీనికి గల ప్రధాన కారణం వెనువెంటనే ఫీడ్ బ్యాక్ ను పొందడాన్ని ప్రభాస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. బాహుబలి: ది కన్‌క్లూజన్ పార్ట్ ను ఎంజాయ్ చేసే వారిలో తొలి వ్యక్తి తన అమ్మనే కావాలని ప్రభాస్ కోరుకుంటున్నారు. అదేవిధంగా తల్లి అభిప్రాయం కోసం కూడా ప్రభాస్ ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నాడని తెలుస్తోంది. కానీ తన తల్లి పక్కనే కూర్చుని వెనువెంటనే ఫీడ్ బ్యాక్ పొందడానికి మాత్రం సంకోచిస్తున్నాడని ఫిల్మ్ వర్గాల టాక్. దేశవ్యాప్తంగా దాదాపు 8000 స్క్రీన్లపై బాహుబలి: ది కన్‌క్లూజన్ ను ప్రదర్శించబోతున్నారు. తెలుగుతో పాటు తమిల్, హిందీ, మలయాళంలో ఇది స్క్రీన్లపైకి వస్తోంది. -
తెలంగాణలో బాహుబలి 5 షోలే
-
బాహుబలి బెనిఫిట్ షోలకు అనుమతి లేదు
హైదరాబాద్ : ‘సాక్షి’ ‘బ్లాక్‌బలి’ కథనంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. బాహుబలి-2 బెనిఫిట్ షోలకు అనుమతి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తాము అయిదు ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఇచ్చామని ఆయన బుధవారమిక్కడ స్పష్టం చేశారు. ఎక్కువ ధరకు టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే కాంబో ఆఫర్ల పేరుతో మోసం చేస్తే ఉపేక్షించేది లేదని తలసాని హెచ్చరించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఉపేక్షించేది లేదన్నారు. మరోవైపు థియేటర్ల యాజమాన్యాలకు వాణిజ్య పన్నుల శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. ఎక్కువ రేట్లకు ఎవరు టికెట్లు అమ్మినా 18004253787 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. అయితే పెయిడ్ ప్రీమియం పేరుతో హైదరాబాద్ లో ఈ సినిమాను గురువారం రాత్రి నుంచే ప్రదర్శిస్తున్నారు. కాగా బాహుబలి-2 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9వేల స్క్రీన్లపై ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. తమిళనాడు, కేరళలలో 70-75 శాతం బాహుబలి పార్ట్-2 కోసమే బుక్ అవ్వగా.. తెలంగాణ ఆంధ్ర్రప్రదేశ్ లలో 80 శాతం థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. మరోవైపు అభిమానులు కూడా తొలిరోజే ఈ సినిమాను చూసేందుకు పోటీలు పడుతున్నారు. పెద్ద మొత్తం వెచ్చించి అయినా టికెట్ కొనేందుకు సిద్ధపడుతున్నారు. -
బాహుబలి-2 తొలి రోజే రికార్డులు సృష్టించనుందా?
ముంబై : బాహుబలి-2 కౌంట్ డౌన్ మొదలైంది. రేపే అన్ని థియేటర్ల సిల్వర్ స్క్రీన్లపైకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్లను జోరుగా కొనుగోలు చేయగా.. భారీగా థియేటర్ల ముందు ప్రేక్షకులు బారులు తీరారు. దాదాపు సినిమా ప్రదర్శించబోయే అన్ని థియేటర్ల టిక్కెట్లు బుక్ అయిపోయాయి. బాహుబలి పార్ట్-1 లో సస్పెన్షన్‌గా ఉన్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అయితే 2015లో విడుదలైన పార్ట్-1 బాక్స్ ఆఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. రేపు విడుదల కాబోతున్న బాహుబలి పార్ట్-2 మరెన్ని రికార్డుల సృష్టిస్తోందని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9వేల స్క్రీన్లపై దీన్ని ప్రదర్శించబోతున్నారు. తమిళనాడు, కేరళలలో 70-75 శాతం బాహుబలి పార్ట్-2 కోసమే బుక్ అవ్వగా.. తెలంగాణ ఆంధ్ర్రప్రదేశ్ లలో 80 శాతం థియేటర్లలో ఈ సినిమానే విడుదల చేస్తున్నారు. 9వేల స్క్రీన్లలో రోజుకు 5 షోలు. అంటే ఒక్క షోకు 300 మంది చొప్పున తీసుకున్నా.. తొలిరేజే రూ.135 కోట్లకు పైగా బాక్సాఫీసు కలెక్షన్లను వసూలు చేయనుందని ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్టులు చెబుతున్నారు. ఫిల్మ్ యూనిట్ అభ్యర్థన మేరకు సింగిల్ స్క్రీన్ థియేటరల్లో 10 రోజులు పాటు రోజుకు ఆరు షోలు వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ వసూలు మరింత పెరుగనున్నాయని అనాలిస్టులు పేర్కొంటున్నారు. అంటే అదనంగా మరో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేర తొలి వీక్ కలెక్షన్లు నమోదుకానున్నాయని ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్టు శ్రీధర్ పిలై చెప్పారు. అయితే తెలంగాణలో రోజుకు ఐదు షోలు మాత్రమే వేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ సినిమా హిందీ వెర్షన్ అద్భుతంగా ఉందని, హిందీ వెర్షన్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎక్స్లెంట్ గా నమోదయ్యాయని పిలై పేర్కొన్నారు. ఇప్పటికే అంచనాలను అధిగమించి టిక్కెట్లను ప్రేక్షకులు బుక్ చేసుకున్నారని హిందీ ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్టు కోమల్ నహ్తా తెలిపారు. ఈ సినిమా తొలి పార్ట్ దేశీయ బాక్స్ ఆఫీసు కలెక్షన్లు గ్రాస్ రూ.360 కోట్ల నుంచి రూ.370 కోట్ల వసూలయ్యాయి. కంక్లూజిన్ పార్ట్ లో 450 కోట్ల నుంచి 460 కోట్ల వసూలుచేయొచ్చని కోమల్ అంచనావేస్తున్నారు. ఇదే దేశీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లని పేర్కొన్నారు. ఓవర్సిస్ మార్కెట్లోనూ ఇది దుమ్మురేపబోతుందట. దుబాయ్ లో ఇప్పటికే లక్షకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయని పిలై తెలిపారు. ఇప్పటివరకు ఏ సినిమాకు లేని అడ్వాన్స్ బుకింగ్స్ దీనికి దక్కినట్టు వెల్లడించారు. సింగపూర్, మలేసియా, నార్త్ అమెరికాలోనూ ఇది రికార్డులు సృష్టిస్తుందని పిలై అంచనావేస్తున్నారు. -
'బాహుబలి-2' విడుదల చేయొద్దని పిటిషన్
చెన్నై: టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి-2 మూవీకి తాజాగా ఓ సమస్య తలెత్తింది. ఇటీవల తమిళ వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని మూవీ యూనిట్ అట్టహాసంగా నిర్వహించింది. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్న తరుణంలో మూవీని నిలిపి వేయాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శరవణన్ మద్రాస్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రావలసిన బకాయిలు చెల్లించేవరకూ బాహుబలి-2 విడుదలను నిలిపివేయాలని తన పిటిషన్లో శరవణన్ పేర్కొన్నారు. రూ.1.18 కోట్ల మేర బకాయిలు తనకు అందాల్సి ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రాజెక్టు బాహుబలి. అయితే మూవీ రిలీజ్‌ను అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇండస్ట్రీలో ఈ పిటిషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. మూవీ దర్శకుడు, నిర్మాతలుగానీ ఈ పిటిషన్‌పై ఏ విధంగానూ స్పందించలేదు. 'బహుబలి: ది బిగినింగ్' కి సీక్వెల్ అయిన బాహుబలి-2 ఈ నెల 28న దేశంలోనే రికార్డు సంఖ్య థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. శరవణన్ దాఖలు చేసిన పిటిషన్ త్వరలోనే విచారణకు రానున్నట్లు సమాచారం. -
చిన్న బాహుబలి అనే పిలుస్తున్నారు..
బాహుబలి చిత్రంలో చిన్ననాటి అమరేంద్ర బాహుబలిగా.. అదేనండీ చిన్నప్పటి ప్రభాస్‌గా నటించిన నిఖిల్ గుర్తున్నాడుగా.. ఆ బాలనటుడు విశాఖలో శుక్రవారం ప్రారంభమైన బాలల జాతీయ చిత్రోత్సవానికి బుల్లి అతిథిగా హాజరయ్యాడు. బాహుబలి చిత్రం తనకు లభించిన గొప్ప అవకాశమనీ, అప్పట్నించీ తన పేరు చిన్న బాహుబలి అయిపోయిందని చెబుతున్నారు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న నిఖిల్ సాక్షితో కొంతసేపు ముచ్చటించాడు. ఆ విశేషాలే ఇవి.. సాక్షి : హాయ్! నిఖిల్, నీ పూర్తి పేరు? నిఖిల్: నిఖిలేశ్వర్ సాక్షి : మీది హైదరాబాదేనా? నిఖిల్: మాది అమలాపురం దగ్గర నేదునూరు. కానీ డాడీ వ్యాపార రీత్యా హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. సాక్షి : ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఎలా ఉంది? నిఖిల్: చాలా బాగుంది, నేను బాలల చిత్రోత్సవంలో పాల్గొనటం ఇదే తొలిసారి. ఇక్కడ ఇంత మంది పిల్లలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సాక్షి : ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశావు? నిఖిల్: 45 సినిమాలు పూర్తి చేశాను. మరో ఐదు సినిమాల్లో నటిస్తున్నా. సాక్షి : నీ మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది? నిఖిల్: నా మొదటి సినిమా లవ్లీ. ఆ సినిమా మా డ్యాన్సు మాస్టర్ ద్వారా వచ్చింది. నేను చిన్నప్పుడు సుబ్బరాజు మాస్టర్ దగ్గర డ్యాన్సు నేర్చుకునేవాడిని. నా ముఖంలో హావభావాలను గుర్తించి లవ్లీ డైరెక్టర్ నాకు అవకాశం ఇచ్చారు. సాక్షి : బాహుబలిలో నటించటం ఎలా ఉంది? నిఖిల్: బాహుబలి సినిమా నాకో గొప్ప అవకాశం. నేను ఎక్కడికి వెళ్లినా నా పేరుతో కాకుండా చిన్న బాహుబలి అని పిలుస్తున్నారు. సాక్షి : బాహుబలి సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? నిఖిల్: బాహుబలి సినిమా కోసం బాల నటుడు కావాలని ప్రకటించారు. రాజమౌళి గారి తండ్రి విజయేంద్రప్రసాద్ ఆడిషన్స్ నిర్వహించారు. ఆయనే నన్ను ఎంపిక చేశారు. సాక్షి : బాహుబలి–2లో కూడా నీ పాత్ర ఉందా? నిఖిల్: ఉంది. కానీ బాహుబలి మొదటి భాగంలోనే ఎక్కువ సేపు కనిపిస్తాను. రెండో భాగంలో నా పాత్ర కేవలం ఐదు నిమిషాలే. సాక్షి : మీకు బాగా గుర్తుండిపోయే ప్రశంస? నిఖిల్: హీరో నాని అభినందన. కృష్టగాడి వీర ప్రేమగాథ సినిమాలో నటించేందుకు వెళ్లినప్పుడు బాహుబలిలో బాగా నటించావని నాని మెచ్చుకున్నారు. సాక్షి : రాజమౌళి లాంటి డైరెక్టర్‌తో పనిచేయటం ఎలా అనిపించింది? నిఖిల్: ఆయనతో పనిచేయటం చాలా గొప్ప విషయం. ప్రతీ సీన్ ను వివరించడమే కాకుండా ఎలా చేయాలో కూడా చేసి చూపించేవారు. అందుకే ఆయన డైరెక్షన్ లో చేయడాన్ని చాలా ఇష్టపడతాను. సాక్షి : మీ అభిమాన హీరో? నిఖిల్: సీనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ సాక్షి : తెలుగులో అందరి హీరోలతో నటించావా? నిఖిల్: లేదండీ.. ఈ మధ్య పవన్ కల్యాణ్ గారితో కాటమరాయుడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆదే రోజు వేరే సినిమా షుటింగ్‌లో ఉండటం వలన నటించలేకపోయాను. సాక్షి : వైజాగ్ ఇంతకు ముందు వచ్చావా? నిఖిల్: ఇక్కడ మాకు బంధువులు ఉన్నారు. అందువలన నేను చాలా సార్లు వైజాగ్ వచ్చాను. నాకు ఆర్కే బీచ్ అంటే చాలా ఇష్టం. ప్రతీ సారి ఆర్కే బీచ్‌కు వెళ్తాను. సాక్షి : నీ ఫ్యూచర్ ప్లాన్? నిఖిల్: పెద్ద హీరోను కావటం. హీరోను కాకపోతే ఫుట్‌బాల్ ప్లేయర్ అవుతాను. -
300 స్క్రీన్లలో రేపే విడుదల..!
బాహుబలి-2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్న చర్చ కంటే, దాని ట్రైలర్ ఎలా ఉండబోతోందన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతోంది. సాధారణంగా ట్రైలర్లు అంటే అర నిమిషం నుంచి ఒక నిమిషం వరకు ఉంటాయి గానీ, బాహుబలి మాత్రం సినిమా పేరుకు తగ్గట్లే ఏకంగా 2 నిమిషాల 20 సెకన్లతో పెద్ద ట్రైలర్ విడుదల చేస్తోంది. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో దీన్ని విడుదల చేస్తామని చెబుతున్నారు. ప్రభాస్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ఈ సినిమా మీద మొదటి భాగం కంటే ఎక్కువ అంచనాలున్నాయి. సోషల్ మీడియాలో సాయంత్రం 5 గంటలకు విడుదల చేయడంతో పాటు.. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 300 స్క్రీన్లలో కూడా ఈ ట్రైలర్‌ను గురువారమే విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్కంఠను కూడా ట్విట్టర్లో పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా బాహుబలి ట్విట్టర్ పేజీలో ఈ సినిమా ట్రైలర్ విడుదల గురించి మరో ట్వీట్ చేశారు. మరొక్క 24 గంటల్లో విడుదల అవుతోందని, అంతా సిద్ధంగా ఉండాలని అందులో చెప్పారు. Just ONE day left for the Trailer of #Baahubali2 - The Conclusion on social media at 5 pm.. Brace yourselves! pic.twitter.com/IKvYecHuVZ — Baahubali (@BaahubaliMovie) 15 March 2017 -
బాహుబలి-2 పోస్టర్ వచ్చేసింది
కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు? అనే ప్రశ్నకు జవాబు త్వరలోనే సమాధానం దొరకబోతోంది. బాహుబలి-2ను త్వరలో విడుదల చేసేందుకు రాజమౌళి అండ్ కో సిద్ధమౌతోంది. శివరాత్రి సందర్భంగా ప్రమోషన్ల కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బాహుబలి-2 మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఏనుగుపైకి ఎక్కుతున్న ప్రభాస్ పోజ్ చూడ ముచ్చటగా ఉంది. కాగా, ఆర్కా మీడియా వర్క్స్ బాహుబలిని నిర్మిస్తోంది. విజువల్ రియాల్టీ(వీఆర్)లో బాహుబలి-2 తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. -
200% రాంగ్ న్యూస్..
అభిమానుల భారీ అంచనాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయనే ప్రచారం ఊపందుకుంటోంది. శంకర్ హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించిన రోబో సినిమా సీక్వెల్ రోబో 2.0, తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి బాహుబలి పార్ట్ 2 సినిమాలు 2017 ఏప్రిల్ 17 వ తేదీన విడుదల కానున్నాయనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. అదే నిజమైతే రెండు భారీ సినిమాల మధ్య నెలకొనే పోటీ భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోతుంది. అభిమానులకు పెద్ద పరీక్షగా తయారవుతుంది. ఇటీవలే బాహుబలి-2 సినిమాను ఏప్రిల్ 17, 2017లో విడుదల చేస్తామంటూ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు శంకర్ 'ఐ' సినిమా పరాజయం తరువాత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా రోబో 2.0 ను తమిళ నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా అదే రోజున విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తుండటం విశేషం. ఈ క్రమంలో రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లకు రావడమనేది సినిమా మార్కెట్‌ను దెబ్బ తీస్తుందనేది విశ్లేషకుల మాట. అయితే బాహుబలి-2, రోబో2.0 సినిమాలు ఒకే రోజు విడుదల అవుతాయనే వార్త 200% రాంగ్ న్యూస్ అంటూ బాహుబలి మార్కెటింగ్ పీఆర్ మహేష్ ఎస్ కోనేరు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలుగు బాహుబలికి తమిళంలో ఎంత డిమాండ్ ఉందో.. తమిళ రోబోకు కూడా తెలుగులో అంతే డిమాండ్ ఉందనేది అభిమానులందరికీ తెలిసిన విషయమే.