
బాహుబలి: టాలీవుడ్ కులాలపై వర్మ సెటైర్లు
బాహుబలి-2 సినిమా సాధించిన బ్లాక్ బస్టర్ విజయంతో ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలలో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఇదే పనిలో కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన టాలీవుడ్‌లో ఉన్న కులాల కుమ్ములాటల గురించి ప్రస్తావించేందుకు ఈ సినిమాను వాడుకున్నాడు. కొంతమంది హీరోలు కాపుల మీద, కమ్మల మీద దృష్టి పెట్టినట్లుగా ప్రభాస్ కూడా రాజుల మీద మాత్రమే దృష్టి పెట్టి ఉంటే అతడు కేవలం ఒక ప్రాంతీయ హీరోగానే మిగిలిపోయేవాడని, అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు అంతర్జాతీయ స్టార్ అయ్యాడని వర్మ ట్వీట్ చేశాడు.
ప్రాంతీయ అభిమానుల గురించి ప్రభాస్ పెద్దగా పట్టించుకోడు కాబట్టి అతడు జాతీయ, అంతర్జాతీయ అభిమానులను సొంతం చేసుకున్నాడని, ప్రాంతీయ అభిమానులను గురించి పట్టించుకునే స్టార్లు ఎప్పటికీ ప్రాంతీయంగానే ఉండిపోతారని కూడా అన్నాడు. ఇక ఉత్తర భారతానికి చెందిన ఒక వ్యక్తి... హిందీ సినిమాలో తొలిసారి ఓ దక్షిణాది హీరో మిగిలిన ఉత్తరాది హీరోలందరినీ హీరోయిన్లుగా కనపడేలా చేశాడంటూ కామెంట్ చేశారు. దానికి కూడా స్పందించిన వర్మ.. ఉత్తర దక్షిణాలను వేర్వేరుగా చూడొద్దని, భారతీయ సినిమా అనే మొత్తం కాన్సెప్టులో చూడాలని, అలాగే ప్రభాస్‌ను కేవలం దక్షిణ భారతీయ నటుడిలా కాకుండా భారతీయ నటుడిలా చూడాలని హితవు పలికాడు.
If Prabhas concentrated on Rajulu like others did on Kaapulu kammalu etc he would remain regional..he became international because he dint
— Ram Gopal Varma (@RGVzoomin) 2 May 2017
Since Prabhas dint care regional fans he got national and international fans .. Stars who care regional fans will always remain regional
— Ram Gopal Varma (@RGVzoomin) 2 May 2017
Only bigger film than BB2 is to see extremely tight close ups of all south Indian super stars n directors when being told BB2 collections
— Ram Gopal Varma (@RGVzoomin) 2 May 2017
Seeing love of entire india for him I request u to lose this horrible regressive view of north south divide and embrace Prabhas as Indian https://t.co/3vX8UyfoXI
— Ram Gopal Varma (@RGVzoomin) 2 May 2017