
కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు? అనే ప్రశ్నకు జవాబు త్వరలోనే సమాధానం దొరకబోతోంది. బాహుబలి-2ను త్వరలో విడుదల చేసేందుకు రాజమౌళి అండ్ కో సిద్ధమౌతోంది. శివరాత్రి సందర్భంగా ప్రమోషన్ల కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బాహుబలి-2 మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఏనుగుపైకి ఎక్కుతున్న ప్రభాస్ పోజ్ చూడ ముచ్చటగా ఉంది.
కాగా, ఆర్కా మీడియా వర్క్స్ బాహుబలిని నిర్మిస్తోంది. విజువల్ రియాల్టీ(వీఆర్)లో బాహుబలి-2 తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.