450 కూడా దాటేస్తారా? | baahubali-2 hindi version racing towards rs 450 crores, tweets taran adarsh | Sakshi
Sakshi News home page

450 కూడా దాటేస్తారా?

Published Mon, May 15 2017 4:14 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

450 కూడా దాటేస్తారా?

450 కూడా దాటేస్తారా?

విడుదలైన మొదటి రోజు నుంచే అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తున్న బాహుబలి-2 సినిమా హిందీలో అయితే రాక్ బస్టర్‌లా సాగిపోతోంది. ఇప్పటికే దాదాపు 433 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా కచ్చితంగా రూ. 450 కోట్లు దాటేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మూడో వారంలో కూడా ఈ సినిమా తన వసూళ్ల పరుగును ఆపడం లేదని, అలాగే కొనసాగుతోందని చెప్పాడు. కేవలం హిందీ వెర్షన్‌లోనే మొత్తం 17 రోజుల్లో రూ. 432.80 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలిపాడు.

ఇప్పుడు రూ. 450 కోట్ల దిశగా వెళ్తోందన్నాడు. రెండో రోజున రూ. 50 కోట్లు దాటిందని, మూడో రోజున రూ. 100 కోట్లు దాటిందని, నాలుగో రోజున రూ. 150 కోట్లు, ఆరో రోజున రూ. 200 కోట్లు, 8వ రోజున రూ. 250 కోట్లు, 10వ రోజున రూ. 300 కోట్లు, 12వ రోజున రూ. 350 కోట్లు, 15వ రోజున రూ. 400 కోట్లు దాటినట్లు వివరించాడు. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్దమొత్తంలో వసూలు చేసిన సినిమాలు ఏవీ లేకపోవడం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement