వాషింగ్టన్: కరోనా లాక్‌డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లు రీఓపెన్ కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. జులై 10 నుంచి థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయని సమాచారం. అయితే ఇక్కడ కాదండోయ్ అత్యధిక కరోనా కేసులు నమోదైన అమెరికాలో. జులై 10 నుంచి లాస్‌ఏంజిల్స్, న్యూయార్క్ నగరాలలో సినిమా థియేటర్లు ఓపెన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై 10 నుంచి థియేటర్లలో సినిమా చూడొచ్చని అక్కడి వార్తాసంస్థ ట్వీట్ చేయగా ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ రీట్వీట్ చేశారు. దీంతో అక్కడి సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (ఆ దేవదూతకు కృతజ్ఞతలు: నటి)
ఇక భారత్‌లో లాక్‌డౌన్ సండలింపులు ఇస్తున్నప్పటికీ థియేటర్స్ రీ ఓపెన్‌కు కేంద్రప్రభుత్వం నిరాకరించింది. జనసమూహం ఎక్కువగా ఉండటం, కరోనా వ్యాప్తి ఎక్కువగా చెందే అవకాశం ఉండటంతో థియేటర్లు, విద్యాసంస్థలు, తదితర వాటికి అనుమతులను ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లకు అక్కడి ప్రభుత్వాలు పలు నిబంధనలతో అనుమతులు ఇస్తున్నాయి. ఇక షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలు థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియక ఓటీటీ బాట పడుతున్నాయి. (బ్యాక్‌గ్రౌండ్ అలా వర్కవుట్ అవుతుంది)
IMPORTANT DEVELOPMENT... Movie theatres in #LA and #NYC hope to reopen on 10 July 2020 https://t.co/PvYLUhyAI9
— taran adarsh (@taran_adarsh) June 17, 2020
Comments
Please login to add a commentAdd a comment