
ఈ ఏడాది జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమాన్ని రెండు వేదికల్లో నిర్వహించనున్నారు. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్‌లో ఏకకాలంలో ఈ వేడుకను జరపాలనుకుంటున్నారు. హాలీవుడ్‌లో ఆస్కార్ తర్వాత అంతటి ప్రతిష్టాత్మక అవార్డుగా పేరుపొందిన గోల్డెన్ గ్లోబ్ ఫంక్షన్ ఈ నెల 28న జరగనుంది. కోవిడ్‌ని దృష్టిలో పెట్టుకునే ఇలా రెండు వేదికల్లో ఈ అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు నిర్వాహకులు. 78 ఏళ్ల గోల్డెన్ గ్లోబ్స్ చరిత్రలో ఇలా రెండు చోట్ల వేడుకను నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే ఆస్కార్ వంటి వేరే అవార్డు షోలను రెండు వేదికల్లో నిర్వహించిన సందర్భాలున్నాయి. ఈ వేడుకకు అందరూ హాజరయ్యేలా జరుపుతారా, లేదా వర్చువల్‌గా నిర్వహిస్తారా అనేది ఇంకా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment