two places
-
రాహుల్ రెండు వారాల్లోగా తేల్చుకోవాలి
న్యూఢిల్లీ: రాయ్‌బరేలీ, వయనాడ్‌లలో నెగ్గిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ సీటును వదులుకోవాలో తేల్చుకోవడానికి మరో 11 రోజులే మిగిలి ఉన్నాయి. చట్టం, రాజ్యాంగం నిబంధనల ప్రకారం ఏదైనా ఒక అభ్యర్థి రెండు చోట్ల నుంచి గెలుపొందితే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి రెండు వారాల్లోగా ఏదో ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుందని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణులు పి.డి.టి. ఆచారి శుక్రవారం తెలిపారు. 17వ లోక్‌సభ రద్దయినా.. కొత్త ప్రొటెం స్పీకర్ వచ్చేవరకు స్పీకర్‌గా ఓం బిర్లా కొనసాగుతారని, ఆయనకు రాహుల్ తన రాజీనామా లేఖను పంపాల్సి ఉంటుందని వివరించారు. రెండు వారాల్లోగా నెగ్గిన రెండు సీట్లలో ఒకదాన్ని వదులుకోకపోతే.. రెండు సీట్లూ కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఆచారి తెలిపారు. రెండుసార్లు గెలిపించిన వయనాడ్ (కేరళ), తమ కుటుంబానికి కంచుకోట అయినా రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్)లలో రాహుల్ దేన్ని వదులుకుంటారో వేచిచూడాలి. -
సేఫ్‌సైడ్ కోసం.. రెండు చోట్లా పోటీ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీని కాంగ్రెస్ సేఫ్పైడ్గా రెండో నియోజకవర్గంలోనూ పోటీకి దింపింది. బదౌర్ (ఎస్పీ రిజర్వుడు) స్థానం నుంచి చన్నీ పోటీ చేస్తారని ప్రకటించింది. చన్నీతో కలిపి ఆదివారం మొత్తం ఎనిమిది మందితో కూడిన తుది జాబితాను కాంగ్రెస్ విడుదల చేనింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది. నామినేషన్లకు మరో రెండు రోజులు గడువు మిగిలి ఉందగనా... కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ సర్వే ప్రకారం చన్నీ చమకౌర్ నియోజకవర్గంలో ఓడిపోతున్నారని తేలిందని, అందుకే కాంగ్రెస్ ఆయన్ను మరోచోటు నుంచి పోటీకి నిలిపిందని ఆప్. చదవండిః ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు -
ఒక వేడుక.. రెండు వేదికలు
ఈ ఏడాది జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమాన్ని రెండు వేదికల్లో నిర్వహించనున్నారు. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్‌లో ఏకకాలంలో ఈ వేడుకను జరపాలనుకుంటున్నారు. హాలీవుడ్లో ఆస్కార్ తర్వాత అంతటి ప్రతిష్టాత్మక అవార్డుగా పేరుపొందిన గోల్డెన్ గ్లోబ్ ఫంక్షన్ ఈ నెల 28న జరగనుంది. కోవిడ్‌ని దృష్టిలో పెట్టుకునే ఇలా రెండు వేదికల్లో ఈ అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు నిర్వాహకులు. 78 ఏళ్ల గోల్డెన్ గ్లోబ్స్ చరిత్రలో ఇలా రెండు చోట్ల వేడుకను నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే ఆస్కార్ వంటి వేరే అవార్డు షోలను రెండు వేదికల్లో నిర్వహించిన సందర్భాలున్నాయి. ఈ వేడుకకు అందరూ హాజరయ్యేలా జరుపుతారా, లేదా వర్చువల్‌గా నిర్వహిస్తారా అనేది ఇంకా ప్రకటించలేదు. -
కత్తిపోట్లు
ఇరగవరం : పైరుపచ్చని సీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రోజు వ్యవధిలో జరిగిన హత్యాయత్నం ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ రెండు ఘటనలకూ తణుకు నియోజకవర్గం కేంద్రబిందువైంది. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఓ తోపుడుబండి వ్యాపారిపై దుండగులు కత్తులతో తెగబడగా, శనివారం మధ్యాహ్నం గణేశ్ నిమజ్జనంలో చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో ఇరగవరం మండలం యర్రాయి చెరువు ప్రాంతంలో తండ్రీకొడుకులపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. తండ్రీకొడుకులపై దాడి తండ్రీకొడుకులపై కొందరు కత్తులతో దాడి చేసిన ఘటన ఇరగవరం మండలం కావలిపురం పంచాయతీ పరిధిలోని యర్రాయి చెరువు ప్రాంతంలో సంచలనం సృష్టించింది. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. యర్రాయి చెరువు ప్రాంతం లో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ నిమజ్జనోత్సవం శనివారం మధ్యాహ్నం జరిగింది. ఊరేగింపులో గ్రామానికి చెందిన కుక్కల శ్రీరామ చంద్రమూర్తి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌తో జుత్తిగ శ్రీనివాస్, ఆయన కుమారుడు దిలీప్ ఘర్షణ పడ్డారు. దీంతో పెద్ద మనుషులు గొడవను సర్దుబాటు చేసి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో కోపోద్రిక్తులైన జుత్తిగ శ్రీనివాస్, అతని కుమారుడు దిలీప్ వారి సమీప బంధువులైన పితాని శ్రీను, జుత్తిగ శ్రీను, జుత్తిగ గెరటయ్య, జుత్తిగ ఆదినారాయణతో కలిసి కుక్కల శ్రీరామచంద్రమూర్తి ఇంటికి వెళ్లి అతినిపైనా అతని కొడుకు చంద్రశేఖర్‌పైనా విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిద్దరినీ గ్రామస్తులు తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రం గా గాయపడిన శ్రీరామచంద్రమూర్తిని మెరుగైన వైద్యం కోసం తణుకులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని కుమారుడు చంద్రశేఖర్‌కు తణుకు ఏరియా ఆస్పత్రిలోనే వైద్యం అందిస్తున్నారు. మెడికో లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇరగవం పోలీసులు తెలిపారు. తోపుడు బండి వ్యాపారిపై హత్యాయత్నం తణుకు : తణుకు పట్టణంలో శుక్రవారం రాత్రి ఓ తోపుడుబండి వ్యాపారిపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. అసలు ఎవరు దాడి చేశారు? ఎందుకు చేశారు? అనే ప్రశ్నలకు జవాబులు అంతుబట్టడం లేదు. ఉండ్రాజవరం మండలం కె.సావరం గ్రామానికి చెందిన కాకర్ల దుర్గాప్రసాద్ (35)పై శుక్రవారం అర్ధరాత్రి తణుకు–ఉండ్రాజవరం రోడ్డులో హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్‌ను చికిత్స నిమిత్తం తొలుత తణుకు ప్రభుత్వాస్పత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీఐ సీహెచ్ రాంబాబు, పట్టణ ఎస్ఐ జి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరి పని ? తణుకు పట్టణంలో రోడ్డు పక్కనే తోపుడు బండిపై పండ్లు అమ్మే దుర్గాప్రసాద్‌కు వివాదరహితుడిగా పేరుంది. అతడు రోజూ స్వగ్రామమైన కె.సావరం నుంచి సైకిల్‌పై పట్టణానికి వచ్చి పండ్లు విక్రయించిన అనంతరం తిరిగి రాత్రి ఇంటికి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో వెనుక నుంచి మోటారుసైకిల్‌పై వచ్చిన ఇద్దరు కత్తులతో దుర్గాప్రసాద్‌పై దాడికి తెగబడ్డారు. ముఖాలకు రుమాలలు కట్టుకుని టోపీలు ధరించి ఉన్న వీరు దుర్గాప్రసాద్‌ను విచక్షణారహితంగా నరికేశారు. దుర్గాప్రసాద్ కిందపడిపోయాడు. కొద్దిదూరం ముందుకు వెళ్లిన దుండగులు తిరిగి వెనక్కు వచ్చి మళ్లీ దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న క్షతగాత్రుడిని ఆ తర్వాత స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు 108 వాహనంపై తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక ప్రకారం దుర్గాప్రసాద్‌పై దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకు చేశారు? అనేది తెలియరావడంలేదు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పాత గొడవలు ఉన్నాయా అనేది కూడా ఆరా తీస్తున్నారు. హత్యాయత్నం జరిగిన ప్రాంతంలోని అపార్టుమెంటులో ఉన్న సీసీ కెమెరాతోపాటు, ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. దుర్గాప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. -
బంగారు, వెండి ఆభరణాల చోరీ
రావులపాలెం, రంగంపేటల్లో వేర్వేరు సంఘటనలు రావులపాలెం : వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో 49 కాసుల బంగారం, సుమారు మూడున్నర కిలోల వెండి ఆభరణాలు చోరీ అయ్యాయి. రావులపాలెం వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలోని ఒక ఇంటిలో సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించారు. బాధితుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న తుట్టగుంట శ్రీరామచంద్రమూర్తి కె.గంగవరం మండలం కుందూరు పీహెచ్సీలో ఎంపీహెచ్‌ఈఓగా పని చేస్తున్నారు. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదానికి గురికావడంతో విధులకు సెలవు పెట్టారు. సోమవారం ఇంటికి తాళాలు వేసి భార్య రామలక్ష్మితో కలసి కపిలేశ్వరపురం మండలం కోటిపల్లిలోని అత్తవారింటికి వెళ్లారు. మంగళవారం ఉదయం స్థానికులు ఫోన్ చేసి, ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయని చెప్పారు. వారు వచ్చిచూడగా, ఇంటిలోని రెండు బీరువాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై వీపీ త్రినాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. ఆభరణాలతో పాటు ఎల్ఈడీని కూడా దొంగలు అపహరించారు. ఆరు కాసుల బంగారం, సుమారు 3 కిలోల వెండి ఉంటుందని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై ఆర్‌వీరెడ్డి తెలిపారు. గేటు తాళం పగులగొట్టి.. రంగంపేట : మండల కేంద్రమైన రంగంపేటలో కిరాణా వ్యాపారి గళ్లా శ్రీనివాసరావు ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. రూ.4.60 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను దొంగలు అపహరించారు. స్థానిక మెయిన్ రోడ్డు పక్కనే శ్రీనివాసరావు కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. దొంగలు ఇంటి వెనుక భాగం నుంచి చొరబడి, మెయిన్ ఇనుప గేటు తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు. పడక గదిలోని బీరువా తెరిచి, అందులో పెట్టిన 43 కాసుల బంగారం, 35 తులాల వెండి వస్తువులు తస్కరించారు. సమాచారం అందుకున్న పెద్దాపురం సీఐ.రాజశేఖరరావు, రంగంపేట ఏఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. అలాగే శ్రీనివాసరావు ఇంటి పక్కనే ఉంటున్న కుసుమంచి రాజేష్ కిరాణా షాపులో కూడా టేబుల్ సొరుగులను దొంగలు పగులగొట్టారు. అందులో డబ్బు లేకపోవడంతో వెళ్లిపోయారు. సీఐ రాజశేఖరరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.