'జెర్సీ' విడుదల ఇప్పట్లో లేనట్లే.. సినిమా మళ్లీ వాయిదా | Jersey Movie Again Postponed From December 31 | Sakshi
Sakshi News home page

Jersey Movie: 'జెర్సీ' విడుదల ఇప్పట్లో లేనట్లే.. సినిమా మళ్లీ వాయిదా

Published Tue, Dec 28 2021 4:45 PM | Last Updated on Tue, Dec 28 2021 4:45 PM

Jersey Movie Again Postponed From December 31 - Sakshi

Jersey Movie Again Postponed From December 31: బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్‌ రెడ్డి సినిమాను 'కబీర్‌ సింగ్‌'గా రీమెక్‌ చేసిన తర్వాత షాహిద్‌ చేస్తున్న మరో రీమెక్‌ చిత్రం ఇది. నెచురల్ స్టార్‌ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌కి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన ఈ చిత్రం విడుదల తేదిని డిసెంబర్‌ 31, 2021కి ఖరారు చేశారు. 

అయితే తాజాగా డిసెంబర్‌ 31న కూడా జెర్సీ చిత్రం విడుదలకు నోచుకోనట్లు తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా పడినట్లు ప్రముఖ చిత్ర పరిశ్రమ విమర్శకుడు తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విటర్‌లో తెలిపాడు. 'ఎ‍క్స్‌క్లూజివ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌.. జెర్సీ చిత్రం డిసెంబర్‌ 31 విడుదల కావట్లేదు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వినిపిస్తున్న మాటల్లో నిజం లేదు.' అని ట్వీట్ చేశారు. క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్‌ బ్యాట్‌ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? అనే ఎమోషనల్‌ అంశాలతో తెరకెక్కించిన సినిమా జెర్సీ. 


ఇదీ చదవండి: 83 చిత్రంపై రజనీ కాంత్‌ రియాక్షన్‌.. పొగడ్తలతో బౌండరీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement