![Shahid Kapoor Jersey Movie Ott Release Date Fixed - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/17/sah.jpg.webp?itok=m-xesjIs)
షాహిద్ కపూర్ నటించిన తాజా చిత్రం 'జెర్సీ'. తెలుగు నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీని హిందీలో అదే పేరుతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్ 40 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానం సంపాదించి కొడుకు కోరికను నెరవేర్చిన అర్జున్ తల్వార్ అనే తండ్రి పాత్రలో కనిపించాడు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
ఇదిలా ఉండగా ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో జెర్సీ సినిమా ఈనెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో షాహిద్‌కు జోడిగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించింది. దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment