Shahid Kapoor Jersey Movie In Trouble: షాహిద్ కపూర్ జెర్సీకి వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. తెలుగు నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కేజీఎఫ్ 2, బీస్ట్ చిత్రాల కారణంగా ఏప్రిల్ 22కు మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీని ఓ వివాదంలో చూట్టుముట్టుంది. బాలీవుడ్ సినీ రచయిత రూపేశ్ జైశ్వల్ జెర్సీ విడుదలను ఆపాలంటూ తాజాగా కోర్టును ఆశ్రయించాడు.
చదవండి: యశ్, విజయ్ ఎఫెక్ట్, వెనక్కి తగ్గిన షాహిద్ కపూర్
జెర్సీ స్క్రిప్ట్ తనదంటూ కాపీరైట్ కింద కేసు నమోదు చేశాడు. ఈ మేరకు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘‘ది వాల్’ అనే పేరుతో ఈ కథకు సంబంధించిన కాపీరైట్స్‌ను ఫిలిం రైటర్స్ అసోసియేషన్‌లో 2007లోనే రిజిస్టర్ చేయించాను. తెలుగుతో పాటు హిందీ జెర్సీ సినిమా కథ నాదే. నా కథలో ఎన్నో మార్పులు చేసి నాకు తెలియకుండా స్క్రిప్ట్ తీసుకున్నారు’ అని తన పిటిషన్‌లో ఆయన పేర్కొన్నాడు. అంతేకాదు ఏప్రిల్ 22న విడుదల కాబోతోన్న ఈమూవీని వెంటనే ఆపివేయాలని కోర్టును కోరాడు. థియేటర్లతో సహా మరే ఇతర ఓటీటీల్లో కూడా ఈ మూవీ విడుదల కాకుండా చూడాలన్నాడు.
చదవండి: అందుకే మీకు చరణ్ డామినేషన్ ఎక్కువ ఉందనిపిస్తుంది
కనీసం ఈ కేసు తీర్పు వచ్చేవరకైనా ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశాడు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో వేచి చూడాలి. తెలుగు జెర్సీని నిర్మాతలైన అల్లు అరవింద్, నాగవంశీలు హిందీ జెర్సీ కూడా నిర్మాతలుగా వ్యవహించారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు కరోనా లాక్‌డౌన్ కారణంగా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా సెకండ్ లాక్ డౌన్ వచ్చి సినిమా రిలీజ్‌ను ఆపేసింది. సంక్రాంతి సమయంలో ఈ మూఏవీరి రిలీజ్ చేయాలనుకోగా కరోనా భయంతో థియేటర్స్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి జెర్సీని వాయిదా పడేలా చేసింది. ఇక ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని కెజిఎఫ్ 2 సినిమా రావడంతో మళ్ళీ వాయిదా వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment