తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన జెర్సీ హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే! షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంతరం నేడు (ఏప్రిల్ 22న) థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాపై బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ రివ్యూ ఇచ్చాడు. 'జెర్సీ సినిమాను చూసి భరించలేకపోతున్నాను. ఇదేం సినిమారా బాబు. కబీర్ సింగ్‌లో షాహిద్ ఎలా హింసాత్మకంగా ఉన్నాడో ఇక్కడ కూడా అలానే ఉన్నాడు. ఈ సినిమా చేసేందుకు షాహిద్‌కు ఇదొక్కటి సరిపోతుందేమో!' అని ట్వీట్ చేశాడు కేఆర్‌కే.
మరో ట్వీట్‌లో 'కేవలం క్రికెట్ చూడటానికి నేను జెర్సీ సినిమా ఎందుకు చూడాలో నాకైతే అర్థం కావడం లేదు. అంతగా కావాల్సి వస్తే ఐపీఎల్ చూస్తాను. జెర్సీ నిర్మాతలు సినిమా క్రికెట్ గురించి కాదని ప్రతిచోటా చెబుతూ వచ్చారు. వారి మాటలను నమ్మి నేను సినిమా చూడాలని నిర్ణయించుకున్నాను. తీరా సినిమా చూశాక ఆరు గంటల క్రికెట్‌ను వారు జెర్సీ ద్వారా మూడు గంటల్లో చూపించినట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు మినహా అంతా క్రికెట్ చుట్టూనే సాగుతోంది' అంటూ కేఆర్‌కే వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మరోపక్క ఇషాన్ ఖట్టర్, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్ సింగ్, కునాల్ కెమ్ము తదితరులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Ye Film #Jersey Mujhse Jheli Nahi Jaa Rahi. Ye Kaya Hai Bhai? Film Ka Hero #KabirSingh main mental and violent tha. Waisa Hi Yahan hai. Toh Bas Shahid Ke Liye Itna Hi Kafi tha Film Karne Ke Liye. These actors are really Big Jhandu.
— KRK (@kamaalrkhan) April 21, 2022
I really can’t understand that why should I watch film #jersey to watch cricket. If I have to watch cricket only then better I will watch #IPL.
— KRK (@kamaalrkhan) April 21, 2022
Makers of #Jersey are saying everywhere that the film is not about cricket. So I decided to watch the film on their words. After watching the film, I can say that makers must be thinking to show 6hours cricket in 3hours film. Coz This film is all about cricket except few scenes.
— KRK (@kamaalrkhan) April 21, 2022
చదవండి: ఓటీటీలో అమితాబ్ బచ్చన్ లేటెస్ట్ మూవీ, ఎక్కడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment