kamaal R khan
-
పలువురితో నిర్మాత ఎఫైర్లు.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య!
బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే) సెలబ్రిటీలను, వారి సినిమాలను విమర్శించడమే పనిగా పెట్టుకుంటాడు. స్టార్ హీరోల సినిమా రిలీజవుతుందంటే చాలు ముందుగానే ఫ్లాప్, డిజాస్టర్ అంటూ ప్రచారం చేస్తాడు. సినీప్రముఖుల వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో బయటపెడుతూ విమర్శలు గుప్పిస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 'బ్రేకింగ్.. ఓ బడా నిర్మాత భార్య ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం హోటల్లో ఉంటోంది. తన భర్త చాలామందితో అఫైర్లు పెట్టుకున్నాడన్న కోపంతో అతడికి ఏకంగా విడాకులు ఇచ్చేందుకు రెడీ అయింది' అని రాసుకొచ్చాడు. అయితే ఆ నిర్మాత ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ ట్వీట్‌పై కొందరు నెటిజన్లు గరమవుతున్నారు.వారి వ్యక్తిగత విషయాల్లోకి తొంగి చూడటం అవసరమా? అని క్లాస్ పీకుతున్నారు. మరికొందరు మాత్రం అది ఎవరై ఉంటారా? అని ఆలోచనలో పడ్డారు. నెటిజన్ల రియాక్షన్స్ కింది ట్వీట్స్‌లో చూడండి. Breaking:- One big producer’s wife has left his house and staying in a hotel. She is angry because of multiple affairs of producer husband and asking for divorce. I am loving it. — KRK (@kamaalrkhan) January 18, 2023 It's T-Series owner Bhushan Kumar .... Divya ghosla right now in oberai mumbai .. room number B255 — Ravi construction pvt ltd (@SonaliK55399651) January 19, 2023 The real news is that #tseries ki Divya pakdi gayi range hathon with john Abraham. Bhushan ne bhaga diya ghar se🙌 — Viraj Sanghi (@bombaywala77) January 18, 2023 చదవండి: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మంచు మనోజ్ కొత్త ఇల్లు కొన్న త్రిష.. ఎన్ని కోట్లో తెలుసా? -
జెర్సీ సినిమా భరించలేకున్నానంటూ కేఆర్కే రివ్యూ
తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన జెర్సీ హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే! షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంతరం నేడు (ఏప్రిల్ 22న) థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాపై బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ రివ్యూ ఇచ్చాడు. 'జెర్సీ సినిమాను చూసి భరించలేకపోతున్నాను. ఇదేం సినిమారా బాబు. కబీర్ సింగ్‌లో షాహిద్ ఎలా హింసాత్మకంగా ఉన్నాడో ఇక్కడ కూడా అలానే ఉన్నాడు. ఈ సినిమా చేసేందుకు షాహిద్‌కు ఇదొక్కటి సరిపోతుందేమో!' అని ట్వీట్ చేశాడు కేఆర్కే. మరో ట్వీట్లో 'కేవలం క్రికెట్ చూడటానికి నేను జెర్సీ సినిమా ఎందుకు చూడాలో నాకైతే అర్థం కావడం లేదు. అంతగా కావాల్సి వస్తే ఐపీఎల్ చూస్తాను. జెర్సీ నిర్మాతలు సినిమా క్రికెట్ గురించి కాదని ప్రతిచోటా చెబుతూ వచ్చారు. వారి మాటలను నమ్మి నేను సినిమా చూడాలని నిర్ణయించుకున్నాను. తీరా సినిమా చూశాక ఆరు గంటల క్రికెట్‌ను వారు జెర్సీ ద్వారా మూడు గంటల్లో చూపించినట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు మినహా అంతా క్రికెట్ చుట్టూనే సాగుతోంది' అంటూ కేఆర్కే వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మరోపక్క ఇషాన్ ఖట్టర్, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్ సింగ్, కునాల్ కెమ్ము తదితరులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Ye Film #Jersey Mujhse Jheli Nahi Jaa Rahi. Ye Kaya Hai Bhai? Film Ka Hero #KabirSingh main mental and violent tha. Waisa Hi Yahan hai. Toh Bas Shahid Ke Liye Itna Hi Kafi tha Film Karne Ke Liye. These actors are really Big Jhandu. — KRK (@kamaalrkhan) April 21, 2022 I really can’t understand that why should I watch film #jersey to watch cricket. If I have to watch cricket only then better I will watch #IPL. — KRK (@kamaalrkhan) April 21, 2022 Makers of #Jersey are saying everywhere that the film is not about cricket. So I decided to watch the film on their words. After watching the film, I can say that makers must be thinking to show 6hours cricket in 3hours film. Coz This film is all about cricket except few scenes. — KRK (@kamaalrkhan) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఓటీటీలో అమితాబ్ బచ్చన్ లేటెస్ట్ మూవీ, ఎక్కడో తెలుసా? 'కేజీయఫ్-2' విజయంపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
'అలియా భట్‌కు హీరోతో పెళ్లవుతుంది, కానీ కష్టమే!'
సినీ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే)కు విమర్శలు కొత్తేమీ కావు. సెలబ్రిటీల మీద సెటైర్ వేయనిదే ఆయనకు పొద్దు గడవదు. కానీ తమ అభిమాన తారల వ్యక్తిగత విషయాల గురించి కామెంట్ చేస్తే ఫ్యాన్స్‌కు నచ్చదు. దీంతో తరచూ ట్రోలింగ్‌కు గురవతుంటాడు కేఆర్కే. తాజాగా బాలీవుడ్లో ప్రముఖ ప్రేమజంట మీద సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న స్టార్ జంట ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ రానున్న పదేళ్లలో విడాకులు తీసుకోవడం తథ్యం అంటూ నోరు పారేసుకున్న కేఆర్కే తాజాగా మరో ప్రేమజంట మీద పడ్డాడు. త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్న రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జోడీ మీద జోస్యం చెప్పాడు. వీళ్లిద్దరికీ 2022లో వివాహం అవుతుందని, కానీ పెళ్లైన 15 ఏళ్లకు విడాకులు తీసుకుంటారని జోస్యం పలికాడు. బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, టబు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గానే మిగిలిపోతారని తెలిపాడు. వీరికి జీవితంలో పెళ్లి భాగ్యమే లేదని తేల్చి చెప్పాడు. అయితే ఇతడి అంచనాలు, అభిప్రాయాలు నెటిజన్లకు అస్సలు నచ్చడం లేదు. 'ఎప్పుడూ ఏదో చెడు జరుగుతుందనే ఎందుకు ఊహిస్తావు?' అని ప్రశ్నిస్తున్నారు. 'నోటి నుంచి మంచి మాటలే రావా?' అని తిట్టిపోస్తున్నారు. 'ఇంకా నయం, రణ్‌బీర్ అసలు అలియాను పెళ్లే చేసుకోడు అని చెప్పలేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. Prediction 08- Ranbir Kapoor and Alia Bhatt will get married max till end of 2022. But Ranbir Kapoor will divorce her within 15 years after marriage! — KRK (@kamaalrkhan) July 13, 2021 -
'పదేళ్లలో ప్రియాంక చోప్రాకు విడాకులు తథ్యం'
Priyanka Chopra - Nick Jonas: పెళ్లి పెటాలకువడం మనకు పెద్ద మాటేమో కానీ ఇండస్ట్రీలో మాత్రం అది చాలా మామూలు విషయం. హాలీవుడ్, బాలీవుడ్.. చివరికి టాలీవుడ్లో అయినా విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. బాలీవుడ్లో హృతిక్ రోషన్, ఆమీర్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్.. ఇలా ఎంతోమంది విడాకుల ట్రాక్ ఎక్కినవాళ్లే.. ఒకరికొకరు నచ్చకపోయినా జీవితాంతం అడ్జస్ట్ అయి కలిసుండటం కన్నా ఎవరి దారి వారి చూసుకోవడం బెటర్ అన్నది వారి సిద్ధాంతం. అయితే రానున్న కాలంలో ప్రియాంక చోప్రా కూడా ఇదే రూట్లో నడుస్తుందంటున్నాడు సినీ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్. "ప్రియాంకకు ఆమె భర్త నిక్ జోనస్ మరో 10 ఏళ్లలో విడాకులు ఇవ్వడం తథ్యం" అని చెప్తూ కేఆర్కే ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అతడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు విడిపోవాలని కోరుకునే హక్కు నీకెక్కడిదని మండిపడుతున్నారు. స్టార్ల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోతేనే మంచిదని సూచిస్తున్నారు. 'ప్రిడిక్షన్: అందరి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే కేఆర్కేను పబ్లిక్‌లో చితక్కొడుతారు', 'మంచి కోరుకోకున్నా పర్లేదు కానీ చెడుగా మాట్లాడకు', 'మీరు ప్రతిదాంట్లో తలదూర్చడం మానేస్తే బెటర్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. Prediction 03- Nick Jonas will divorce #PriyankaChopra within next 10 years! — KRK (@kamaalrkhan) July 10, 2021 సెలబ్రిటీల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించే కేఆర్కే మరికొన్ని విషయాల్లోనూ జోస్యం చెప్పుకొచ్చాడు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల సంతానానికి సరైన పేరు పెట్టనందున వాళ్లు భవిష్యత్తులో మంచి నటులుగా రాణించలేరని తెలిపాడు. బాలీవుడ్లో ఓ నటుడికి అతడి తండ్రి మరణించాకే సరైన గుర్తింపు దక్కుతుందని జోస్యం పలికాడు. అయితే ఆ నటుడెవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. Prediction 04- This actor will become a big star but after death of his father only! — KRK (@kamaalrkhan) July 10, 2021 -
Disha Patani టార్గెట్‌గా సెటైర్లు.. వెంటనే ఫొటోలు డెలీట్!
ముంబై: దేశంలోని అన్ని భాషల అగ్ర హీరోలను టార్గెట్ చేస్తూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుంటాడు సినీ నటుడు, విమర్శకుడు కమాల్ ఖాన్ అలియాస్ కేఆర్కే. రాధే సినిమా, హీరో సల్మాన్ ఖాన్‌పై అనుచిత కామెంట్లు చేసి కోర్టు నోటీసుల దాకా పరిస్థితి తెచ్చుకున్నాడు. అయితే ఇంత జరుగుతున్నా తగ్గేది లేదంటున్నాడు కేఆర్కే. తాజాగా రాధే హీరోయిన్ దిశాపటానీని టార్గెట్ చేసి వెటకారపు కామెంట్లు చేశాడు. నటి దిశా పటానీ ఒకప్పుడు ఆర్టిస్ట్ పార్థ్ సమథాన్‌తో సన్నిహితంగా ఉండేది. దీంతో వాళ్లిద్దరూ డేటింగ్ చేసినట్లు పుకార్లు నడిచాయి. అయితే మీడియాకు చిక్కని వాళ్ల క్లోజ్ ఫొటోలను కొన్నింటిని కేఆర్కే సంపాదించాడు. వాటిని తన ట్విట్టర్లో పోస్ట్ చేసి ‘దిశ బ్రదర్’ అంటూ వెటకారపు కామెంట్స్ చేశాడు. అయితే వెంటనే ఆ ఫొటోలను డిలీట్ చేశాడు కమాల్. కొందరు నాకీ ఫొటోలు పంపారు. ఆమె దిశకి బ్రదర్ అని చెప్పారు. నాకీ ఫొటోలు నచ్చి పోస్ట్ చేశా. కొందరు కుక్కల్లా మొరుగుతుంటారు. ఆమె అతనికి బ్రదరో కాదో తెలియదు. అందుకే ఆ ఫొటోలు డిలీట్ చేశా. అని మరో పోస్ట్ పెట్టాడు కేఆర్కే. Someone did send me some photos on Twitter only and he said that he is #DishaPatani brother with her. I liked photos, so I posted with good caption. But people were barking like DOGS. I deleted photos because I don’t know that boy and I am not sure if he is really her brother. — KRK (@kamaalrkhan) June 2, 2021 పరోక్షంగా సల్లూభాయ్‌పై.. ఇక పనిలో పనిగా సల్మాన్ ఖాన్‌పై పరోక్ష వ్యాఖ్యలతో కేఆర్కే విరుచుకుపడ్డాడు. నువ్వేం బాలీవుడ్ గుండా భాయ్వి. నీకు ఒక్క బాలీవుడ్ యాక్టర్ కూడా సపోర్ట్ రావట్లేదంటూ సల్మాన్‌కే కౌంటర్ ఇచ్చేలా రెండు రూపాయల ఆర్టిస్ట్ వంటూ ఒక ట్వీట్ చేశాడు కేఆర్కే. ఇక షారూఖ్‌పై తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. షారూఖ్ తనకు సోదరుడు లాంటి వాడని, అతన్ని ఏనాడూ అలాంటి కామెంట్లు చేయబోనని కేఆర్కే మరో ట్వీట్ చేశాడు. చదవండి: కారులో షికారు.. పోలీసుల ఎంట్రీ Aur Tu Ek Baat Bata Yaar, Tu Kaisa Bollywood Ka Maalik Gunda Bhai Hai, Ki Ek Bollywood Wala Teri Support Main Nahi Aaya! Tujhe Inn Chirkut #BiggBoss Ke Nallon Ko Apne Support Main Laana Pada! Hahaha! Kaya Izzat Hai Teri Bollywood Main Yar? You are real #2RsPerson of Bollywood. — KRK (@kamaalrkhan) June 1, 2021 -
సూసైడ్ చేసుకుంటా.. కేఆర్కే వార్నింగ్!
తనను తాను విమర్శకుడిగా చెప్పుకుంటూ.. నిత్యం సినీ ప్రముఖులపై నోరుపారేసుకునే కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కేకు ఇటీవల గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలపై విరుచుకుపడే కేఆర్కేకు ట్విట్టర్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పెద్దసంఖ్యలో అభిమానులూ ఉన్నారు. అయితే, ఇటీవల వచ్చిన ఆమిర్‌ఖాన్ సినిమా ’సీక్రెట్ సూపర్‌స్టార్’పై కేఆర్కే తనదైన శైలిలో నోరుపారేసుకున్నాడు. ఈ సినిమాను సమీక్షిస్తూ.. ఏకంగా క్లైమాక్స్‌ను వెల్లడించాడు. అంతేకాకుండా ఆమిర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశాడు. ’నువ్వు మంచి తండ్రివి కాకపోయినంతమాత్రాన లేదా, నువ్వు గౌరవించని నీ తండ్రి మంచి నాన్న కాకపోయినంత మాత్రాన మేం పిల్లలను ప్రేమించమని చెప్పకు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత కేఆర్కేకు గట్టి షాక్ తగిలింది. ఆయన ట్విట్టర్ ఖాతా రద్దయిపోయింది. ఆమిర్ ఖాన్ ఫిర్యాదు కారణంగానే ట్విట్టర్ ఆయన ఖాతాను తొలగించిందని ఆరోపణలు వచ్చాయి. తాజాగా కేఆర్కే ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. 15 రోజుల్లో ట్విట్టర్లో తన ఖాతాను పునరుద్ధరించకపోతే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. ’15 రోజుల్లో నా ఖాతాను పునరుద్ధరించాల్సిందిగా ట్విట్టర్ ఇండియా, ట్విట్టర్ సిబ్బంది అయిన మహిమ కౌల్, విరాల్ జాని, తరణ్‌జీత్ సింఘ్తోలకు విజ్ఞప్తి చేస్తున్నా. మొదట నా మీద వారు మిలియన్లకొద్దీ డబ్బును చార్జ్ చేశారు. తర్వాత నా ఖాతాను సస్పెండ్ చేశారు. వారు నన్ను మోసం చేయడంతో నేను కుంగిపోయాను. నా ఖాతాను పునరుద్ధరించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా మృతికి వీరే కారణం. ఇట్లు ఒత్తిడిలో ఉన్న కేఆర్కే’ అంటూ ఆయన ప్రతిక ప్రకటనను విడుదల చేశారు. -
అమీర్ ఫ్యాన్స్ దెబ్బ, కమల్ అబ్బా..
సాక్షి: కమల్ ఖాన్ బాలీవుడ్లో సెలబ్రిటీ. ఎల్లప్పుడూ వివాదాల్లో ఉంటాడు. హీరోలను విమర్శించడం ఆపై అభిమానుల నుంచి చివాట్లు తినడం ఆయనకు అలవాటు. అయినా తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోరు. వివాదాలను ఇంటి చూట్టు తిప్పుకుంటా నేను ఇంతే అనే రేంజ్లో ఫీల్ అవుతారు. కానీ సెలబ్రిటీకి కూడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమీర్‌ఖాన్ అభిమానుల దెబ్బకు ఖంగుతున్నాడు. తమ అభిమాన నటుడిపై విమర్శలు చేసినందుకు ఏకంగా కమల్‌ఖాన్ ట్వట్టర్ అకౌంట్‌నే బ్లాక్ చేశారు. వివరాల్లోకి వెళ్తే అమీర్ ఖాన్ తాజాగా నటించిన సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమా క్లైమాక్స్‌ను రివీల్ చేస్తూ ఓ సమీక్ష రాశాడు. అయితే ఇంకా విడుదల కాకుముందే కథను సోషల్ మీడియాలో చెప్పడంతో అమీర్‌ఖాన్ అభిమానులకు కోపం వచ్చింది. దీంతో కమల్ ఖాన్ అకౌంట్‌పై ట్వట్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్‌ఖాన్ అకౌంట్ ఆగిపోయింది. గతంలో కమల్ బాహుబలి సినిమా, మహేష్ బాబు, పవన్‌కల్యాణ్‌పై కూడా విమర్శలు చేశారు. దీనిపై కమల్‌ఖాన్ మీడియాకు ఓలేఖ రాశాడు. కేవలం సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాయడం వల్లే తన ట్విట్టర్ ఖాతా కోల్పోయాననని తెలిపాడు. గత నాలుగేళ్లలో ఎంతో డబ్బు సినిమాలకు ఖర్చుపెట్టానని, తన ఖాతాకు 6మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని పేర్కొన్నాడు. అంతేకాడు అమీర్‌ఖాన్‌పై విమర్శలు ఎక్కుపెట్టాడు. 'అమీర్ నన్ను ట్విట్టర్లో ఉండనీయాలనుకోవట్లేదు. ఎందుకంటే ట్విట్టర్‌కు యజమాని అమీర్ కాబట్టి నేను మరో కొత్త ఖాతా తెరవాలనుకోవట్లేదు అంటూ విమర్శించాడు. -
అల్లు అర్జున్‌పై నోరు పారేసుకున్నాడు..!
స్టార్ హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పబ్లిసిటీ పొందాలనుకునే బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్. ఇప్పటికే తెలుగు స్టార్స్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, రానా వంటి వారిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేఆర్కే మరో తెలుగు హీరోపై నోరు పారేసుకున్నాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుస సక్సెలు సాధిస్తుండటంతో పాటు పలు సంస్థలకు ప్రచార కర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు బన్నీ సినిమాలు హిందీలోకి డబ్ అయి యూట్యూబ్ సంచలనాలుగా మారుతున్నాయి. దీంతో కేఆర్కే బన్నీని టార్గెట్ చేశాడు. ' ఈ రోజు నాకు ఎవరో చెప్పారు.. ఈ లుక్కా లుకింగ్ ఆలూ తెలుగులో పెద్ద స్టార్ అని.. బ్రో నీవు చిన్న రోల్స్ చేయాలనుకుంటే బాలీవుడ్ కి రా.' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. Today someone told me that this Lukkha looking Aaloo is big star of Telugu. Bro you come to Bollywood if you want to do small small roles. pic.twitter.com/j5VMs1lgHn — KRK (@kamaalrkhan) 2 July 2017 -
కోహ్లిపై ఫిక్సింగ్ ఆరోపణలు
ముంబై: వివాదాలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) మరోసారి రెచ్చిపోయాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై విషం కక్కాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఘోరంగా ఓడిపోవడంతో కేఆర్కే తీవ్ర ఆరోపణలు, వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపించాడు. అతడిని జైలుకు పంపాలని అన్నాడు. భారత, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులంతా కలిసి అతడిని వెళ్లగొట్టాలని వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించాలని బీసీసీఐకు సూచించాడు. ‘సోదరా కోహ్లి.. నీవు ఇచ్చిన క్యాచ్ పాకిస్తాన్ ఫీల్డర్లు వదిలేశారు. తర్వాతి బంతికే సులువైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యావు. నువ్వు ఫిక్సింగ్‌కు పాల్పడ్డావని క్లియర్‌గా అర్థమవుతోంది. 130 కోట్ల మంది భారతీయుల ప్రతిష్టను పాకిస్తాన్‌కు అమ్మేసిన విరాట్ కోహ్లిపై జీవితకాల నిషేధం విధించాలి. అతడిని జైలుకు పంపాలి. కోహ్లితో పాటు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని కూడా ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. మీరందరూ ఫిక్సర్లు. ప్రజలను మోసం చేయడం మానుకోవాల’ని ట్వీట్ చేశాడు. నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసిన కేఆర్కేపై టీమిండియా, పాకిస్తాన్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఆటను ఆటలా చూడాలని, అనవసర ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. టీమిండియా మేటి జట్లను ఓడించి ఫైనల్ చేరిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కోహ్లి నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ అని గుర్తుచేశారు. -
బాలీవుడ్ బ్యూటీ ఆమేనట
చెన్నై: బాలీవుడ్లో కత్రినాకైఫ్, ప్రియాంకచోప్రా, దీపికాపడుకొనే లాంటి ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అయితే వారందనీ వెనక్కునెట్టి బాలీవుడ్ బ్యూటీ క్రెడిట్‌ను మాత్రం శ్రుతీహాసన్ కొట్టేశారు. ఈమెకు అందాలరాశి పట్టం కట్టింది ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు, నటుడు కేఆర్కే(కమాల్ ఆర్ ఖాన్). సినిమాలను సీన్ బై సీన్ తన విమర్శలతో చీల్చి చండాడే ఈయన సాధారణంగా ఎవరినీ ప్రశంసించరట. అలాంటిది తనకు నచ్చిన బాలీవుడ్ హీరోయిన్ శ్రుతీహాసన్ అనీ, ఆమె చాలా అందగత్తె అనీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే శ్రుతిలో చిన్న లోపాన్ని కూడా కేఆర్కే వెల్లడించారు. ఆమెకు మంచి చిత్రాలను ఎంపిక చేసుకోవడం తెలియడం లేదని అన్నారు. ఆయన శ్రుతీహాసన్‌ను బాలీవుడ్ బ్యూటీగా పేర్కొనడం అక్కడి ప్రముఖులను సైతం విస్మయానికి గురి చేసిందట. ఇక కేఆర్కే ట్వీట్‌కు అభిమానులు బాగానే రియాక్ట్ అవుతున్నారు. ఒక అభిమాని స్పందిస్తూ.. ‘శ్రుతీహాసన్ బాలీవుడ్ బ్యూటీ అనడాన్ని ఆహ్వానిస్తున్నా, అయితే ఆమెకు మంచి చిత్రాలను ఎంచుకోవడం తెలియదనడాన్ని అంగీకరించబోమ’ని అన్నారు. ఈ నెల 9వ తేదీన విడుదల కానున్న బీహెటీ(బెహాన్ హోగి తేరి) చిత్రం చూసిన తరువాత కేఆర్కే కచ్చితంగా తన అభిప్రాయాన్ని మార్చుకుంటారని అన్నాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ అన్న విషయాన్ని చాలా మంది అభిమానులు అంగీకరిస్తున్నారు. మొత్తం మీద ఈ అందగత్తె ఇటీవల సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగి పతాక శీర్షికల్లో నిలిచారు. -
బాహుబలి 2 అద్భుతం : మాట మార్చిన కేఆర్కే
సౌత్ నార్త్ అన్న తేడాలేకుండా పెద్ద చిత్రాలు ఏవి రిలీజ్ అయిన నెగెటివ్ ట్వీట్ లతో హల్ చల్ చేస్తుంటాడు బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమాల్, బాహుబలి 2 రిలీజ్ సమయంలోనే అదే స్థాయిలో నోరు పారేసుకున్నాడు. ప్రభాస్ ను జిరాఫీతో పోల్చిన కమాల్, రాజమౌళిపై కూడా అలాంటి కామెంట్సే చేశాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో బాహుబలి 2 సాధిస్తున్న కలెక్షన్లు చూసి ఈ ఎనలిస్ట్ కమ్ క్రిటిక్ మాట మార్చాడు. 'బాహుబలి 2 ఓ సినిమా కాదు.. ఉద్యమం. ప్రతి ఒక్కరు ఆ సినిమాలో భాగం కావాలని కోరుకుంటారు. బాహుబలి 2 సాధించిన విజయాన్ని రిపీట్ చేయటం రానున్న 30 ఏళ్లలో సాధ్యం కాదు. మూడో ఆదివారం కూడా బాహుబలి 2(హిందీ వర్షన్) 20 కోట్లకు పైగా వసూళు చేసింది. ఇది సాదారణ విషయం కాదు. రాజమౌళికి దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం' అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు బాహుబలి 2 యూనిట్ కు క్షమాపణలు కూడా చెప్పాడు. తప్పుడు రివ్యూ ఇచ్చినందుకు క్షమించండి. నాకు నచ్చకపోయినా ప్రజలకు నచ్చింది. క్షమించండి రాజమౌళి' అంటూ ట్వీట్ చేశాడు. I m very sorry for my wrong review of #Baahubali2! I didn't like it but ppl like it n Janta Ki Awaaz means Nakkare Khuda. Sorry @ssrajamouli — KRK (@kamaalrkhan) 14 May 2017 #Baahubali2 is not a film anymor. It's a movement n evrybody wants to becom part of it. It will not happen again with any film in next 30Yrs — KRK (@kamaalrkhan) 15 May 2017 Hindi #Baahubali2 collected approx 20Cr on 3rd Sunday n definitely it's not a normal business. It's blessing of the GOD for @ssrajamouli — KRK (@kamaalrkhan) 15 May 2017 -
రానాపై నోరు పారేసుకున్న బాలీవుడ్ క్రిటిక్
బాహుబలి 2 సినిమాకు ప్రపంచమంతా బ్రహ్మరథం పడుతుంటే కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఆ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ లో చిన్న సినిమాల విషయంలో కూడా స్పందించే కొంత మంది స్టార్స్, ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన బాహుబలి 2పై స్పందించకపోవటం పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే తనకు తాను క్రిటిక్ అని చెప్పుకునే ఓ కమాల్ ఆర్ ఖాన్ మరో అడుగు ముందుకేసి బాహుబలి 2 యూనిట్ సభ్యులపై విమర్శలకు దిగుతున్నాడు. రానా ట్విట్టర్ పేజ్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కమాల్ ఆర్ ఖాన్. 'నేను ఈ ఇడియట్ ని ఎప్పుడు ఫాలో అవులేదు. ఈ రోజు వరకు అతని గురించి ట్వీట్ కూడా చేయలేదు. అయినా తను మెదడు లేని వాడిగా ప్రూవ్ చేసుకునేందుకు నన్ను బ్లాక్ చేశాడు' అంటూ ట్వీట్ చేశాడు. కమాల్ ట్వీట్ పై జాతీయ మీడియాలో వార్తలు రావడంతో రానా స్పందించాడు. 'ఆ మొరటు వ్యక్తిని ఏడాది కిందటే బ్లాక్ చేశాను' అంటూ రిప్లై ఇచ్చాడు రానా. మరి రానా స్పందన పై కేఆర్ కే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. I never followed this idiot neither tweeted about him till date. Still he blocked me to prove that he is brainless. pic.twitter.com/W93uhUOPuo — KRK (@kamaalrkhan) 2 May 2017 Blocked that bloke almost a year ago!!https://t.co/26IySsZtqU — Rana Daggubati (@RanaDaggubati) 2 May 2017 -
హీరోకు క్షమాపణ చెప్పిన కేఆర్కే
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌పై చేసిన వ్యాఖ్యలకు విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్(కేఆర్కే) క్షమాపణ చెప్పాడు. ఆయన గురించి తెలియక అనుచిత వ్యాఖ్యలు చేశానని లెంపలేసుకున్నాడు. ‘సర్ మిమ్మల్ని ఛోటా భీమ్ అన్నందుకు క్షమించమని అడుగుతున్నా. ఎందుకంటే మీ గురించి నాకు పెద్దగా తెలియదు. మలయాళ సినిమాల్లో మీరు సూపర్ స్టార్ ఇప్పుడు తెలుసుకున్నాన’ని ట్వీట్ చేశాడు. తనకు తాను విమర్శకుడిగా చెప్పుకునే కేఆర్కే నిత్యం బాలీవుడ్ నటులపై దుమ్మెత్తిపోస్తుంటాడు. రూ. వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో దుబాయ్ బిలియనీర్ బీఆర్ శెట్టీ తీయనున్న మహాభారతం చిత్రంలో మోహన్‌లాల్ భీముడి పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడికావడంతో ఆయనపై కూడా నోరు పారేసుకున్నాడు. ఛోటా భీమ్లా కనిపించే మోహన్‌లాల్ మహాభారతంలోని భీముడి పాత్రను పోషించడమా అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. భీముడి ఆయుధమంతా కూడా ఉండని మోహన్‌లాల్ భీముడి పాత్ర పోషించాలనుకోవడం సరికాదని ఎకసెక్కమాడాడు. నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరకు క్షమాపణ చెప్పాడు. -
పవన్ కళ్యాణ్ జోకర్, కార్టూన్: కమాల్ రషీద్
వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్, టాలీవుడ్ పవర్ స్టార్ మీద నోరు పారేసుకున్నాడు. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ ప్రముఖుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమాల్, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ ఫాలోయింగ్ ఉన్న పవన్‌ను విమర్శించి ఇక్కడకూడా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ పవర్ స్టార్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశాడు కమాల్. 'పవన్ కళ్యాణ్ లాంటి వాడే హీరో అయితే ప్రపంచంలో ఎవరైనా సూపర్ స్టార్ కావొచ్చు. అసలు దక్షిణాది ప్రేక్షకులకు ఏమైంది? ఇలాంటి కార్టూన్ని వాళ్లు హీరోగా ఎలా అంగీకరిస్తున్నారు..? వాళ్ల ఛాయిస్ అస్సలు బాలేదు. పవన్ కళ్యాణ్ లాంటి జోకర్, కార్టూన్ హీరో సినిమాలు చూసే కన్నా, నేను రాజ్ పాల్ యాదవ్ సినిమాలు చూడటానికి ఇష్టపడతాను' అంటూ కమాల్ ట్వీట్ చేశాడు. అయితే, పవన్ మీద వ్యాఖ్యలు చేసిన అతడికి.. పవన్ పూర్తిపేరు కూడా సరిగా తెలియదు. 'పవన్ కళ్యాణ్ సింగ్' అని పవన్ పేరును ప్రస్తావించాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పవన్‌ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తుండగా ఇప్పుడు అదే లిస్ట్‌లో కమాల్ రషీద్ ఖాన్ కూడా చేరిపోయాడు. కమాల్ ట్వీట్లపై పవర్ స్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కమాల్ చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రఛారం లభిస్తోంది. If this Lukkha Pawan Kalyan singh is also a hero then anybody in the world can be a super star. pic.twitter.com/d1CdjHyueY — KRK (@kamaalrkhan) March 17, 2016 What's wrong with South Indian ppl? How can they watch this cartoon in the films as a hero? Really very bad choice! pic.twitter.com/dd0lZ5Z2O7 — KRK (@kamaalrkhan) March 17, 2016 I will prefer to watch Rajpal Yadav film instead of the joker, the cartoon, the Maha Sada Huwa hero, Pawan Kalyan pic.twitter.com/H1VwtG89TV — KRK (@kamaalrkhan) March 17, 2016 -
ట్విట్టరెక్కి తిట్టుకున్న హీరో-నటుడు
ముంబై: సెలబ్రిటీ సినీ తారలు తమ అభిప్రాయలు పంచుకోవడానికే కాదు.. అప్పుడప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడానికి కూడా ట్విట్టర్ వేదికగా మారుతోంది. తాజాగా బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా- నటుడు కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్లో తిట్టిపోసుకున్నారు. 'వోగ్' తాజా ఎడిషన్‌లో అలియా భట్ తో కలిసి బీచ్ దుస్తుల్లో పోజిచ్చిన సిద్ధార్థ మల్హోత్రా ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ ఫొటోపై బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ దురుసు వ్యాఖ్యలు చేశారు. అలియా ఇంకా చిన్నపిల్ల (బచ్చి)లాగే ఉందంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఆగ్రహించిన సిద్ధార్థ్ కాస్తా 'నోరు మూస్తారా' ఘాటుగా బదులిచ్చాడు. 'సర్. మేం కూడా మీ నోరు మూయించడానికి చాలానే కష్టపడుతున్నాం. కానీ మీరు ట్వీట్ చేస్తూనే ఉన్నారు' అని పేర్కొన్నారు. దీనికి బదులిచ్చిన కమల్ ఆర్ ఖాన్ 'యాక్టింగ్ మానేయమని మీకు చెప్పడానికి 130 కోట్లమంది ప్రజలు కూడా ప్రయత్నిస్తున్నారు. అయినా మీరు సినిమాల్లో నటిస్తూ వారిని సతాయిస్తూనే ఉన్నారు' అన బదులిచ్చాడు. అయితే తన ట్వీట్‌ను కమల్ ఆర్ ఖాన్ సరిగ్గా అర్థం చేసుకోలేదని, ఆయన ఇంగ్లిష్ పాఠాలు చెప్పించుకుంటే మేలని 'బ్రదర్స్' స్టార్ సిద్ధార్థ మరో సెటైర్ వేశాడు. 'దేశద్రోహి' సినిమాలో నటించి ఫేమస్ అయిన కమల్ ఆర్ ఖాన్‌కు ట్విట్టర్లో సెలబ్రిటీలతో తగవులు పెట్టుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఆయన గతంలోనూ రాంగోపాల్ వర్మ, సోనాక్షి సిన్హా, కరణ్ జోహర్, కపిల్ శర్మతో ఇలాగే గొడవలు పడ్డాడు. -
సన్నీ లియోన్ పాటకు కోటి ఆఫర్
బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌పై నటుడు కమల్ ఆర్ ఖాన్ మరోసారి కించపరిచే కామెంట్ చేశాడు. సన్నీ లియోన్ నగ్నంగా డాన్స్ చేస్తే కోటి రూపాయాలు ఇస్తానంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దిగ్విజయ్ సింగ్ పెళ్లిలో సన్నీ లియోన్ అందాలు ఆరబోతకు సిద్దపడితే కోటి రూపాయలు ఇచ్చేందుకు తాను సిద్దమని ప్రకటించాడు. 'దిగ్విజయ్ సింగ్ గారూ మీ వివాహోత్సవంలో సన్నీ లియోన్ నగ్న ప్రదర్శన చేస్తే కాంగ్రెస్ పార్టీ ఫండ్‌కు కోటి రూపాయలు ఇస్తా' అంటూ కమల్ ఆర్ ఖాన్ ట్విటర్లో పేర్కొన్నారు. తనను కించపరిచే వ్యాఖ్యలు చేసిన కమల్ ఆర్ ఖాన్‌పై పోలీసులకు సన్నీ లియోన్ ఫిర్యాదు చేసింది. అత్యాచారం అనేది నేరం కాదని, అది ఆశ్చర్యకరమైన శృంగారమని సన్నీ లియోన్ అన్నట్టుగా ఖాన్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేయడంతో గతేడాది ఫిబ్రవరిలో కూడా అతడిపై కేసు పెట్టింది. కాగా, రాజ్యసభ టీవీ వ్యాఖ్యాత అమృతారాయ్‌ను విడాకులు తీసుకున్నాక పెళ్లాడనున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇటీవల ప్రకటించి సంచలనం రేపారు.