'పదేళ్లలో ప్రియాంక చోప్రాకు విడాకులు తథ్యం' | Prediction On Priyanka Chopra And Nick Jonas Divorce: KRK Shocking Post Viral | Sakshi
Sakshi News home page

Kamaal R Khan: మరో పదేళ్లలో ప్రియాంక పెళ్లి కూడా పెటాకులే!

Published Mon, Jul 12 2021 1:22 PM | Last Updated on Mon, Jul 12 2021 1:49 PM

Prediction On Priyanka Chopra And Nick Jonas Divorce: KRK Shocking Post Viral - Sakshi

ప్రియాంకకు ఆమె భర్త నిక్‌ జోనస్‌ మరో 10 ఏళ్లలో విడాకులు ఇవ్వడం తథ్యం" అని చెప్తూ కేఆర్‌కే ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు..

Priyanka Chopra - Nick Jonas: పెళ్లి పెటాలకువడం మనకు పెద్ద మాటేమో కానీ ఇండస్ట్రీలో మాత్రం అది చాలా మామూలు విషయం. హాలీవుడ్‌, బాలీవుడ్‌.. చివరికి టాలీవుడ్‌లో అయినా విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌, ఆమీర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, సంజయ్‌ దత్‌.. ఇలా ఎంతోమంది విడాకుల ట్రాక్‌ ఎక్కినవాళ్లే.. ఒకరికొకరు నచ్చకపోయినా జీవితాంతం అడ్జస్ట్‌ అయి కలిసుండటం కన్నా ఎవరి దారి వారి చూసుకోవడం బెటర్‌ అన్నది వారి సిద్ధాంతం. అయితే రానున్న కాలంలో ప్రియాంక చోప్రా కూడా ఇదే రూట్‌లో నడుస్తుందంటున్నాడు సినీ విశ్లేషకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌.

"ప్రియాంకకు ఆమె భర్త నిక్‌ జోనస్‌ మరో 10 ఏళ్లలో విడాకులు ఇవ్వడం తథ్యం" అని చెప్తూ కేఆర్‌కే ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అతడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు విడిపోవాలని కోరుకునే హక్కు నీకెక్కడిదని మండిపడుతున్నారు. స్టార్ల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోతేనే మంచిదని సూచిస్తున్నారు. 'ప్రిడిక్షన్‌: అందరి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే కేఆర్‌కేను పబ్లిక్‌లో చితక్కొడుతారు', 'మంచి కోరుకోకున్నా పర్లేదు కానీ చెడుగా మాట్లాడకు', 'మీరు ప్రతిదాంట్లో తలదూర్చడం మానేస్తే బెటర్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సెలబ్రిటీల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించే కేఆర్‌కే మరికొన్ని విషయాల్లోనూ జోస్యం చెప్పుకొచ్చాడు. సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ల సంతానానికి సరైన పేరు పెట్టనందున వాళ్లు భవిష్యత్తులో మంచి నటులుగా రాణించలేరని తెలిపాడు. బాలీవుడ్‌లో ఓ నటుడికి అతడి తండ్రి మరణించాకే సరైన గుర్తింపు దక్కుతుందని జోస్యం పలికాడు. అయితే ఆ నటుడెవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement