Disha Patani టార్గెట్​గా సెటైర్లు.. వెంటనే ఫొటోలు డెలీట్‌! | KRK Satires On Disha Patani And Salman Khan | Sakshi
Sakshi News home page

దిశా మాజీ ప్రియుడి​ ఫొటోలు​.. సల్మాన్ 2 రూపాయల ఆర్టిస్ట్​!

Published Thu, Jun 3 2021 8:38 AM | Last Updated on Thu, Jun 3 2021 11:03 AM

KRK Satires On Disha Patani And Salman Khan - Sakshi

ముంబై: దేశంలోని అన్ని భాషల అగ్ర హీరోలను టార్గెట్ చేస్తూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుంటాడు సినీ నటుడు,  విమర్శకుడు కమాల్​ ఖాన్​ అలియాస్ కేఆర్​కే. రాధే సినిమా, హీరో సల్మాన్​ ఖాన్​పై అనుచిత కామెంట్లు చేసి కోర్టు నోటీసుల దాకా పరిస్థితి తెచ్చుకున్నాడు. అయితే ఇంత జరుగుతున్నా తగ్గేది లేదంటున్నాడు కేఆర్​కే. తాజాగా రాధే హీరోయిన్​ దిశాపటానీని టార్గెట్​ చేసి వెటకారపు కామెంట్లు చేశాడు.


నటి దిశా పటానీ ఒకప్పుడు ఆర్టిస్ట్​ పార్థ్​ సమథాన్​తో సన్నిహితంగా ఉండేది. దీంతో వాళ్లిద్దరూ డేటింగ్ చేసినట్లు పుకార్లు నడిచాయి. అయితే మీడియాకు చిక్కని వాళ్ల క్లోజ్​ ఫొటోలను కొన్నింటిని కేఆర్​కే సంపాదించాడు. వాటిని తన ట్విట్టర్​లో పోస్ట్​ చేసి ‘దిశ బ్రదర్​’ అంటూ వెటకారపు కామెంట్స్ చేశాడు. అయితే వెంటనే ఆ ఫొటోలను డిలీట్ చేశాడు కమాల్​. కొందరు నాకీ ఫొటోలు పంపారు. ఆమె దిశకి బ్రదర్​ అని చెప్పారు. నాకీ ఫొటోలు నచ్చి పోస్ట్ చేశా. కొందరు కుక్కల్లా మొరుగుతుంటారు. ఆమె అతనికి బ్రదరో కాదో తెలియదు. అందుకే ఆ ఫొటోలు డిలీట్ చేశా. అని మరో పోస్ట్ పెట్టాడు కేఆర్​కే.

పరోక్షంగా సల్లూభాయ్​పై..
ఇక పనిలో పనిగా సల్మాన్​ ఖాన్​పై పరోక్ష వ్యాఖ్యలతో కేఆర్​కే విరుచుకుపడ్డాడు. నువ్వేం బాలీవుడ్​ గుండా భాయ్​వి. నీకు ఒక్క బాలీవుడ్​ యాక్టర్ కూడా సపోర్ట్​ రావట్లేదంటూ సల్మాన్​కే కౌంటర్​ ఇచ్చేలా రెండు రూపాయల ఆర్టిస్ట్ వంటూ ఒక ట్వీట్​ చేశాడు కేఆర్​కే. ఇక షారూఖ్​పై తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. షారూఖ్​ తనకు సోదరుడు లాంటి వాడని, అతన్ని ఏనాడూ అలాంటి కామెంట్లు చేయబోనని కేఆర్​కే మరో ట్వీట్ చేశాడు. చదవండి: కారులో షికారు.. పోలీసుల ఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement