derogatory remarks
-
నితీశ్ సిగ్గుపడాలి: ప్రధాని నరేంద్ర మోదీ
దమోహ్/గుణ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాక్షాత్తూ అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహిళలను దారుణంగా అగౌరవపర్చినా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరు విప్పడం లేదని, కనీసం ఖండించడం లేదని తప్పుపట్టారు. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పట్ల నితీశ్ సిగ్గుపడాలని అన్నారు. తల్లులు, అక్కచెల్లెమ్మల పట్ల ఏమాత్రం గౌరవం లేని నాయకులతో ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. మహిళలను చిన్నచూపు చూసే వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు మోదీ సూచించారు. మహిళల గౌరవాన్ని కాపాడడానికి తాను చేయాల్సిందంతా చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని దమోహ్, గుణ పట్టణాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తనకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఏ కోర్టుకు వెళ్లినా సరే ఉచిత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. ప్రతి ఇంట్లోనూ సౌర విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇంట్లో వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి పౌరుడూ విద్యుత్ ఉత్పత్తిదారుడే అవుతారని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడంతో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ రూ.80 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. ‘ఉచిత రేషన్’ పొడిగింపుపై కాంగ్రెస్ అక్కసు పేదల ప్రజలకు ఉచిత రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తామంటూ తాను హామీ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీరి్ణంచుకోలేకపోతున్నారని, అందుకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వారిని ఆ పాపం చేయనిద్దామని అన్నారు. తాను మాత్రం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటానని చెప్పారు. 80 కోట్ల మందికి వచ్చే ఏదేళ్లపాటు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వబోతున్నామని తెలిపారు. తనను చాలామంది ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, అయిప్పటికీ అవినీతిపై పోరాటం ఆపబోనని తేల్చిచెప్పారు. ఎవరెంత తిట్టుకున్నా తాను లెక్కచేయనని అన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రులు బెట్టింగ్‌ల్లో భాగస్వాములవుతున్నారని, నల్లధనం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం తాము 2014లో అధికారంలోకి వచ్చాక ఐదో స్థానానికి చేరుకుందని, 200 ఏళ్లపాటు మన దేశాన్ని పరిపాలించిన ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టేశామని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచమంతా సంభ్రమాశ్చర్యాలతో మనవైపు చూస్తోందని అన్నారు. తాను మూడోసారి ప్రధానమంత్రి కావడం తథ్యమని, భారత్‌ను ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘85 శాతం కమిషన్ వ్యవస్థ’ మళ్లీ అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. -
వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు
గౌహతి: మతపరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అఫ్తాబ్ ఉద్దీన్ మొల్లా(Aftab Uddin Mollah)ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గౌహతిలో ఎమ్మెల్యే వాజెద్ అలీ చౌదరి నివాసం నుంచి మొల్లాను అరెస్టు చేశారు. Assam Police has arrested Congress MLA Aftabuddin Mollah for allegedly making derogatory remarks about the priests, namgharias and saints. A case has been registered at Dispur police station under sections 295(a)/ 153A(1)(b)/505(2) IPC), confirms DGP GP Singh More details… — ANI (@ANI) November 8, 2023 గోల్పారా జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో హిందువులు, పూజారులపై మొల్లా తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మొల్లాకు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చింది. మొల్లా అభ్యంతకర వ్యాఖ్యలపై డిస్పూర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత కౌష్టవ్ బాగ్చీని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం 3:30 గంటల సమయంలో ఆయన నివాసంపై రైడ్లు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని బర్రాక్పోర్ నివాసంలోనే బాగ్చీని అరెస్టు చేసినట్లు బెంగాల్ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలిపేందుకు మాత్రం నిరాకరించారు. సాగర్‌డిగీ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరిపై మమతా బెనర్జీ వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌష్టవ్ బాగ్చీ.. మమతా బెనర్జీని కించపరిచేలా శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కౌష్టవ్ బాగ్చీ బెంగాల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వృత్తిరీత్యా లాయర్. ఈయన అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనలకు దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చదవండి: ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే? -
ఐదుగురు భర్తలకు ఒకే భార్య.. టీఎంసీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం..
కోల్‌కతా: నోటి దురుసుతో తరచూ వార్తల్లో నిలిచే టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారు. భారత సంస్కృతిలో ఒక భార్యను ఐదుగురు పురుషులు పంచుకోవచ్చని వ్యాఖ్యానించారు. మహాభారతంలో ద్రౌపదిని పరోక్షంగా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలుపై కేంద్ర విద్యా శాఖ బృందం సమీక్ష నిర్వహించింది. ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఐదుగురు వంట సిబ్బందికి కేటాయించిన నిధులను ప్రభుత్వం ఏడుగురికి సమానంగా ఇస్తోందని కనిపెట్టారు. దీనిపై వ్యంగ్యంగా స్పందించిన మదన్ మిత్రా.. భారత సంస్కృతిలో ఐదుగురు కలిసి ఒకే భార్యను పంచుకుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తుందో తెలిపేందుకు మదన్ వ్యాఖ్యలే నిదర్శనం అని కమలం పార్టీ ఎమ్మెల్యే, నటి అగ్నిమిత్ర పాల్ ధ్వజమెత్తారు. టీఎంసీ నాయకులు అందుకే అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు. సొంత టీఎంసీ పార్టీ కూడా మదన్ మిత్రా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సూచించారు. మిత్రా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత ఇతిహాసాల గురించి తప్పుగా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదన్నారు. చదవండి: వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే! -
కావాలనే అలా మాట్లాడా.. భైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు!
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప స్వామి పుట్టుకను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్.. ఉద్దేశ్యపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ ద్వారా తేలింది. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలతో హిందూ సంఘాలు, అయ్యప్ప మాలధారుల ఆగ్రహానికి గురయ్యాడు ఓయూ స్టూడెంట్ భైరి నరేష్. అయితే కేసులు నమోదు కావడంతో అతన్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇక రిమాండ్‌లో ఉన్న భైరి నరేష్ పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్నాడు. కావాలనే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడతను. అలాగే.. నరేష్‌ను తాను ఉద్దేశ్యపూర్వకంగానే ఆ కార్యక్రమానికి పిలిచినట్లు మరో నిందితుడు, సభను నిర్వహించిన హనుమంతు పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చాడు. మరోవైపు భైరి నరేష్‌పై గతంలోనూ పలు కేసులు నమోదు అయ్యాయని కొడంగల్ పోలీసులు కోర్టుకు వెల్లడించినట్లు రిమాండ్ కాపీలో ఉంది. మత విద్వేషాలకు పాల్పడే ఉద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశాడని పోలీసులు కొడంగల్ స్థానిక కోర్టుకు తెలిపారు. హనుమకొండలో రెండు, నవాబ్‌పేట పోలీస్ స్టేషన్లోనూ భైరి నరేష్‌పై కేసులు ఉన్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. ప్రస్తుత కేసుపై అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. డిసెంబర్19వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కొడంగల్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంలో ప్రసంగించిన భైరి నరేష్ ఈ క్రమంలోనే హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఉమాపతి గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. సాక్షి చేతిలో బైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్ -
‘రాష్ట్రపతిపై వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం’.. ఆ మంత్రిపై టీఎంసీ ఫైర్
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. అంటూ ఆయన చేసిన కామెంట్ల తాలుకా వీడియో వివాదాస్పదమైన నేపథ్యంలో విపక్షాలు అధికార టీఎంసీ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో మంత్రి వ్యాఖ్యలపై స్పందించింది తృణమూల్ కాంగ్రెస్. ఆయన తీరు బాధ్యతారాహిత్యమేనని, ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పూర్తిగా వ్యక్తిగతమని స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎంసీ అధికార ప్రతిని సాకెత్ గోఖలే ట్వీట్ చేశారు. ‘ఇది బాధ్యతారాహిత్యంగా చేసిన కామెంట్. ఆ వ్యాఖ్యలతో టీఎంసీకి ఎలాంటి సంబంధం లేదు. మేము భారత రాష్ట్రపతి పట్ల ఎంతో గర్వపడుతున్నాం. మేము ఆమెను, ఆమె పదవిని అత్యున్నతంగా చూస్తాం.’ అని తెలిపారు టీఎంసీ అధికార ప్రతినిధి సాకెత్ గోఖలే. Statement: This is an irresponsible comment & does NOT represent the views of @AITCofficial. We are extremely proud of the President of India & hold her & her office in the highest regard. https://t.co/v571435Snv — Saket Gokhale (@SaketGokhale) November 12, 2022 మంత్రి క్షమాపణలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన క్రమంలో క్షమాపణలు చెప్పారు టీఎంసీ మంత్రి అఖిల్ గిరి. ‘రాష్ట్రపతిని నేను చాలా గౌరవిస్తాను. సువేందు అధికారికి సమాధానం చెప్పేందుకు పదవిని చూపిస్తూ వ్యాఖ్యానించా. ఎవరి పేరును చెప్పలేదు. ఆయన అఖిల్ గిరి చాలా అంద వికారంగా ఉంటారని చెప్పారు. నేను ఒక మంత్రిని. నాగురించే ఏదైనా చెడుగా చెబితే.. అది రాజ్యాంగానికే అవమానం. నేను రాష్ట్రపతి అని సంబోధించాను కానీ, ఎవరి పేరు చెప్పలేదు. దీనిని భారత రాష్ట్రపతి అవమానంగా భావిస్తే.. క్షమాపణలు చెబుతున్నా. నేను చెప్పినదానికి పశ్చాతాపపడుతున్నా.’ అని పేర్కొన్నారు మంత్రి అఖిల్ గిరి. I respect President. I mentioned the post&made a comparison to respond to Suvendu Adhikari,I didn't take any name. He had said Akhil Giri looks bad in his appearance. I'm a min,took oath to office. If something is said against me, it's an insult to Constitution: WB Min Akhil Giri pic.twitter.com/9w1oY2BuZA — ANI (@ANI) November 12, 2022 ఇదీ చదవండి: వీడియో: మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. ముర్ముపై మంత్రి వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్ -
రాష్ట్రపతి ముర్ముపై మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు! వైరల్
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నందిగ్రామ్‌లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. రాజకీయ విమర్శలకు కారణం అయ్యాయి. మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. అంటూ ఆయన చేసిన కామెంట్ల తాలుకా వీడియో ఒకటి వివాదాస్పదంగా మారింది. ‘‘ఆయన(బీజేపీ నేత సువేందు అధికారి).. నేను (అఖిల్ గిరి) చూడడానికి బాగోలేను అన్నాడు. మరి ఆయనెంత అందంగా ఉన్నాడు?. ఒకరిని అప్పీయరెన్స్ బట్టి అలా నిర్ణయించకూడదు. అంతెందుకు మనం మన రాష్ట్రపతి కుర్చీకి గౌరవం ఇస్తాం. మరి ఆ రాష్ట్రపతి చూడానికి ఎలా ఉంటారు?’’ అని అఖిల్ గిరి అక్కడ ఉన్న కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడున్న వాళ్లు ఈలలు, చప్పట్లతో అఖిల్‌ను మరింత ప్రొత్సహించారు. President Droupadi Murmu, hails from the Tribal community. Akhil Giri, TMC Minister of Correctional Homes made objectionable comments about her in the presence of Shashi Panja, another minister from the women’s welfare department Mamata Banerjee and TMC are anti-tribal. pic.twitter.com/vJNiZ7nBLM — BJP Bengal (@BJP4Bengal) November 11, 2022 ఇక టీఎంసీ నేత చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ప్రతిపక్ష బీజేపీ.. టీఎంసీ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. గిరిజనులకు మమతా బెనర్జీ, ఆమె నేతృత్వంలోని టీఎంసీ పార్టీ వ్యతిరేకమని విమర్శించింది. మరో మంత్రి.. అదీ మహిళా సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా సమక్షంలో అఖిల్ గిరి ఈ వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ హైలెట్ చేసింది. Akhil Giri, minister in Mamata Banerjee’s cabinet, insults the President, says, “We don't care about looks. But how does your President look?" Mamata Banerjee has always been anti-Tribals, didn’t support President Murmu for the office and now this. Shameful level of discourse… pic.twitter.com/DwixV4I9Iw — Amit Malviya (@amitmalviya) November 11, 2022 బీజేపీ నేత అమిత్ మాలవియా.. టీఎంసీ నేతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మమతా బెనర్జీ కేబినెట్లోని అఖిల్ గిరి.. రాష్ట్రపతిని ఘోరంగా అవమానించారు. అప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ముర్ముకు మమతా బెనర్జీ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇలా అవమానించడాన్ని ప్రొత్సహిస్తున్నారు అంటూ ట్వీట్ చేశారాయన. BJP MP Saumitra Khan writes to National Commission for Women (NCW), requesting them to "immediately arrest" Akhil Giri and take appropriate action against him and "try to dismiss him from the MLA post also" over his objectionable remark on President Droupadi Murmu. https://t.co/DJqIQ6uTFt pic.twitter.com/K4HnVBtHrT — ANI (@ANI) November 12, 2022 ఇదీ చదవండి: కేజ్రీవాల్ ఎంట్రీతో మారిన హిమాచల్ సీన్ -
నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం
సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి తదితరాలను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50 జారీ చేశారు. ఆగస్టు 7న జారీ చేసిన ఈ జీవో బుధవారం వెలుగులోకి వచ్చింది. సర్వత్రా హర్షం కులదూషణను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పుతున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జీవో ఎంఎస్ 50ను విస్తృతంగా ప్రచారం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. (క్లిక్: ఏదినిజం.. గోబెల్స్‌ను మించిన రామోజీ!) తెలంగాణలోనూ అమలు చేయండి నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలను ఏపీ ప్రభుత్వం నిషేధించడం పట్ల తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తెలంగాణలోనూ ఇటువంటి జీవో తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. (క్లిక్: గోరంట్ల మాధవ్ పేరిట వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు) -
పవార్‌పై అనుచిత పోస్ట్.. 20 కేసులతో జైల్లోనే నటి
ముంబై: మహారాష్ట్ర సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ షేరింగ్ చేసిన వ్యవహారంలో నటికి ఊరట దొరకడం లేదు. బెయిల్ దొరికినా.. మరాఠీ నటి కేతకి చిటలే(29) ఇంకా జైల్లోనే ఉన్నారు. అందుకు కారణం.. ఆమెపై ఏకంగా 20 దాకా కేసులు నమోదు కావడం. మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే.. పవార్‌ను కించపరిచేలా ఉన్న పోస్ట్ ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్‌ను నటి కేతకి షేర్ చేశారు. దీనిపై ఎన్సీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని థానే పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న థానే పోలీసులు.. మే 14వ తేదీన ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మధ్యలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించింది కోర్టు. ఇది జరిగి నెల కావొస్తోంది. అయితే.. థానే కోర్టు తాజాగా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆమె ఇంకా జైల్లోనే ఉంది. అనుచిత పోస్ట్ షేరింగ్ విషయంలో ఆమెపై 20 కేసులు నమోదు అయ్యాయని, అందుకే ఆమె రిలీజ్ కుదరదని జైళ్ల శాఖ తెలిపింది. మరోవైపు బెయిల్ కోసం ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వచ్చే వారం పిటిషన్ విచారణకు రానుంది. అదే విధంగా ఆయా కేసుల్లో విచారణపై స్టే విధించాలంటూ మరో పిటిషన్‌ను వేయగా.. ఆ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉంది. మరోవైపు.. కేతకి చిటలేతో పాటు పవార్ వ్యతిరేక పోస్టును ట్విటర్లో షేర్ చేసిన నిఖిల్ భర్మే(23) అనే ఫార్మసీ స్టూడెంట్ సైతం అరెస్ట్ అయ్యాడు. నిఖిల్‌పై సైతం ఆరు కేసులు నమోదుకాగా, నెలపైనే జైల్లో ఉన్నాడు. మరాఠీలో ఉన్న సదరు పోస్ట్‌లో నేరుగా ఎన్సీపీ ఛీఫ్ పేరును ప్రస్తావించకపోయినా.. ఆయన ఇంటి పేరును, వయసును ప్రస్తావించారు. ‘‘బ్రహ్మణులను ద్వేషిస్తున్న నీ కోసం నరకం ఎదురు చూస్తోందంటూ’’ పవార్‌ను ఉద్దేశిస్తూ ఆ పోస్టులో రాశారు. -
శరద్ పవార్‌పై అనుచిత పోస్ట్.. నటిపై కేసు
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌పై అనుచిత పోస్ట్ షేర్ చేసినందుకు నటిపై కేసు నమోదు అయ్యింది. మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే మీద శనివారం థానే పోలీసులు కేసు నమోదు చేశారు. పవార్‌ను కించపరిచేలా ఉన్న పోస్ట్ ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ చేయగా.. శుక్రవారం ఆ పోస్ట్‌ను నటి కేతకి షేర్ చేశారు. దీనిపై ఎన్సీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె చర్యలు తీసుకోవాలని థానే పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో.. ఆమెపై కేసు నమోదు అయ్యింది. మరాఠీలో ఉన్న సదరు పోస్ట్‌లో నేరుగా ఎన్సీపీ ఛీఫ్ పేరును ప్రస్తావించకపోయినా.. ఆయన ఇంటి పేరును, వయసును ప్రస్తావించారు. ‘‘బ్రహ్మణులను ద్వేషిస్తున్న నీ కోసం నరకం ఎదురు చూస్తోందంటూ’’ పవార్‌ను ఉద్దేశిస్తూ ఆ పోస్టులో రాశారు. ఈ పోస్ట్‌ను నటి చిటలే పోస్ట్‌చేయడంతో ఐపీసీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు థానేలోని కాల్వా పోలీసులు. ఇదిలా ఉండగా.. ఈ పోస్ట్ వెనుక బీజేపీ, ఆర్సెస్ ప్రమేయం ఉందని ఎన్సీపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, శివ సేనతో ఎస్పీపీ జట్టుకట్టడం బీజేపీకి సహించడం లేదని, ఈ క్రమంలోనే తమ పార్టీ, అధినేత శరద్ పవార్‌పై అభ్యంతర ప్రచారం సోషల్ మీడియాలో చేస్తోందని అంటున్నారు. చదవండి: గుడ్ బై.. గుడ్ లక్.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన పీసీసీ మాజీ చీఫ్ -
Disha Patani టార్గెట్‌గా సెటైర్లు.. వెంటనే ఫొటోలు డెలీట్!
ముంబై: దేశంలోని అన్ని భాషల అగ్ర హీరోలను టార్గెట్ చేస్తూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుంటాడు సినీ నటుడు, విమర్శకుడు కమాల్ ఖాన్ అలియాస్ కేఆర్కే. రాధే సినిమా, హీరో సల్మాన్ ఖాన్‌పై అనుచిత కామెంట్లు చేసి కోర్టు నోటీసుల దాకా పరిస్థితి తెచ్చుకున్నాడు. అయితే ఇంత జరుగుతున్నా తగ్గేది లేదంటున్నాడు కేఆర్కే. తాజాగా రాధే హీరోయిన్ దిశాపటానీని టార్గెట్ చేసి వెటకారపు కామెంట్లు చేశాడు. నటి దిశా పటానీ ఒకప్పుడు ఆర్టిస్ట్ పార్థ్ సమథాన్‌తో సన్నిహితంగా ఉండేది. దీంతో వాళ్లిద్దరూ డేటింగ్ చేసినట్లు పుకార్లు నడిచాయి. అయితే మీడియాకు చిక్కని వాళ్ల క్లోజ్ ఫొటోలను కొన్నింటిని కేఆర్కే సంపాదించాడు. వాటిని తన ట్విట్టర్లో పోస్ట్ చేసి ‘దిశ బ్రదర్’ అంటూ వెటకారపు కామెంట్స్ చేశాడు. అయితే వెంటనే ఆ ఫొటోలను డిలీట్ చేశాడు కమాల్. కొందరు నాకీ ఫొటోలు పంపారు. ఆమె దిశకి బ్రదర్ అని చెప్పారు. నాకీ ఫొటోలు నచ్చి పోస్ట్ చేశా. కొందరు కుక్కల్లా మొరుగుతుంటారు. ఆమె అతనికి బ్రదరో కాదో తెలియదు. అందుకే ఆ ఫొటోలు డిలీట్ చేశా. అని మరో పోస్ట్ పెట్టాడు కేఆర్కే. Someone did send me some photos on Twitter only and he said that he is #DishaPatani brother with her. I liked photos, so I posted with good caption. But people were barking like DOGS. I deleted photos because I don’t know that boy and I am not sure if he is really her brother. — KRK (@kamaalrkhan) June 2, 2021 పరోక్షంగా సల్లూభాయ్‌పై.. ఇక పనిలో పనిగా సల్మాన్ ఖాన్‌పై పరోక్ష వ్యాఖ్యలతో కేఆర్కే విరుచుకుపడ్డాడు. నువ్వేం బాలీవుడ్ గుండా భాయ్వి. నీకు ఒక్క బాలీవుడ్ యాక్టర్ కూడా సపోర్ట్ రావట్లేదంటూ సల్మాన్‌కే కౌంటర్ ఇచ్చేలా రెండు రూపాయల ఆర్టిస్ట్ వంటూ ఒక ట్వీట్ చేశాడు కేఆర్కే. ఇక షారూఖ్‌పై తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. షారూఖ్ తనకు సోదరుడు లాంటి వాడని, అతన్ని ఏనాడూ అలాంటి కామెంట్లు చేయబోనని కేఆర్కే మరో ట్వీట్ చేశాడు. చదవండి: కారులో షికారు.. పోలీసుల ఎంట్రీ Aur Tu Ek Baat Bata Yaar, Tu Kaisa Bollywood Ka Maalik Gunda Bhai Hai, Ki Ek Bollywood Wala Teri Support Main Nahi Aaya! Tujhe Inn Chirkut #BiggBoss Ke Nallon Ko Apne Support Main Laana Pada! Hahaha! Kaya Izzat Hai Teri Bollywood Main Yar? You are real #2RsPerson of Bollywood. — KRK (@kamaalrkhan) June 1, 2021 -
డర్టీ కామెంట్స్: చిక్కుల్లో రణ్‌దీప్ హుడా
ముంబై: కులాల్ని కించపరిచేలా కామెంట్లు చేస్తూ సెలబ్రిటీలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. మున్మున్ దత్తా, యూవికా చౌదరి కామెంట్లపై రచ్చ.. ఆపై వాళ్లు దిగొచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్‌లో రణ్‌దీప్ హుడాను చేర్చారు నెటిజన్స్. బాలీవుడ్లో ఫైనెస్ట్ ఆర్టిస్ట్‌గా పేరున్న రణ్‌దీప్.. యూపీ మాజీ సీఎం మాయావతిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డాడు. అయితే రణ్‌దీప్ ఆ కామెంట్లు చేసి చాలా కాలం అవుతుండడం విశేషం. డర్టీ కామెంట్లు గతంలో ఓ ఈవెంట్లో పాల్గొన్న రణ్‌దీప్ హుడా.. యూపీ మాజీ సీఎం మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘మీకిప్పుడు ఒక డర్టీ జోక్ చెప్పబోతున్నా’.. అంటూ.. మాయావతి వేషధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు వరుసగా వివాదాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. రణ్‌దీప్ హుడా వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ క్షమాపణలు చెపాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఒక మాజీ మహిళా సీఎం, ఆమె సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడాడంటూ రణ్‌దీప్‌పై మండిపడుతున్నారు. ఆడవాళ్ల పట్ల అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని వదలకూడదని చెబుతూ.. #ArrrestRandeepHooda హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై రణ్‌దీప్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు రణ్‌దీప్‌కు కులగజ్జి ఉందని, మానవత్వం లేనోడంటూ కామెంట్లు పెడుతున్నారు. అతని సినిమాల్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై రణ్‌దీప్ రియాక్ట్ కావాల్సి ఉంది. ఇక 2012లో మాయావతిపై అభ్యంతరకర ట్వీట్ చేసిన స్టాండప్ కమెడియన్ అభిష్ మాథ్యూ.. రీసెంట్గా నెటిజన్స్ ఆగ్రహంతో క్షమాపణలు చెప్పాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
తమిళ సింగర్ అరెస్ట్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను అవమానిస్తూ పాట రాశారనే ఆరోపణతో జానపద గాయకుడు ఎస్ శివదాస్ అలియాస్ కొవన్(45)ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చి సమీపంలోని మారుతంద కురిచిలో శుక్రవారం తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆయనను మద్రాస్ కు తరలించారు. విప్లవ సంస్థ 'మక్కల్ కళై ఇలక్కియ కజగమ్'తో ఆయనకు సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. జయలలితకు వ్యతిరేకంగా పాట రాసినందుకు ఆయనను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న లిక్కర్ షాపులకు మూసివేయాలని రాసిన పాటలో 'అమ్మ'ను అవమానించే పదాలున్నాయన్న ఆరోపణలతో శివదాస్ ను అరెస్ట్ చేశారు. ఈ వీడియో పాటను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు. రాజద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద శివదాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శివదాస్ ను కలిసేందుకు పోలీసులు అనుమతించలేదని లాయర్ జిమ్ రాజ్ మిల్టన్ తెలిపారు. దీనిపై మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్టు చెప్పారు. -
రాహుల్‌కు కోర్టు సమన్లు
చండీగఢ్: చండీగఢ్‌లోని స్థానిక కోర్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మంగళవారం సమన్లు జారీ చేసింది. రెండేళ్ల కిందట బీహార్, ఉత్తరప్రదేశ్‌వాసులను కించపరిచేలా ఒక ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారని స్థానిక న్యాయవాది దాఖలుచేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో 2011 నవంబర్ 14న ఎన్నికల ర్యాలీలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్‌కు వచ్చిన రాహుల్.. పంజాబ్, ఢిల్లీలో పనికోసం ఇంకా ఎంతకాలం వెళ్తారు... మహారాష్ట్రలో పనికావాలని ఎందుకు అడుక్కుంటారంటూ ఉత్తరప్రదేశ్, బీహార్ వాసులను కించపరిచేలా మాట్లాడారని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జస్విందర్‌సింగ్ సెప్టెంబర్ 19 లోపు కోర్టుకు హాజరుకావాలంటూ రాహుల్‌కు సమన్లు జారీచేశారు.