ముంబై: కులాల్ని కించపరిచేలా కామెంట్లు చేస్తూ సెలబ్రిటీలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. మున్మున్ దత్తా, యూవికా చౌదరి కామెంట్లపై రచ్చ.. ఆపై వాళ్లు దిగొచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్‌లో రణ్‌దీప్ హుడాను చేర్చారు నెటిజన్స్. బాలీవుడ్లో ఫైనెస్ట్ ఆర్టిస్ట్‌గా పేరున్న రణ్‌దీప్.. యూపీ మాజీ సీఎం మాయావతిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డాడు. అయితే రణ్‌దీప్ ఆ కామెంట్లు చేసి చాలా కాలం అవుతుండడం విశేషం.
డర్టీ కామెంట్లు
గతంలో ఓ ఈవెంట్లో పాల్గొన్న రణ్‌దీప్ హుడా.. యూపీ మాజీ సీఎం మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘మీకిప్పుడు ఒక డర్టీ జోక్ చెప్పబోతున్నా’.. అంటూ.. మాయావతి వేషధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు వరుసగా వివాదాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. రణ్‌దీప్ హుడా వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ క్షమాపణలు చెపాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఒక మాజీ మహిళా సీఎం, ఆమె సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడాడంటూ రణ్‌దీప్‌పై మండిపడుతున్నారు. ఆడవాళ్ల పట్ల అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని వదలకూడదని చెబుతూ.. #ArrrestRandeepHooda హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై రణ్‌దీప్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
మరికొందరు రణ్‌దీప్‌కు కులగజ్జి ఉందని, మానవత్వం లేనోడంటూ కామెంట్లు పెడుతున్నారు. అతని సినిమాల్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై రణ్‌దీప్ రియాక్ట్ కావాల్సి ఉంది. ఇక 2012లో మాయావతిపై అభ్యంతరకర ట్వీట్ చేసిన స్టాండప్ కమెడియన్ అభిష్ మాథ్యూ.. రీసెంట్గా నెటిజన్స్ ఆగ్రహంతో క్షమాపణలు చెప్పాడు.
మాయావతిపై కామెంట్స్: రణ్‌దీప్ అరెస్ట్‌కి డిమాండ్
Published Fri, May 28 2021 12:16 PM | Last Updated on Fri, May 28 2021 1:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment