ముంబై : కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులే అవుతోంది. దీంతో రాధే సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యారు సల్లూ భాయ్. ప్రభుదువా దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఇందులో సల్మాన్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సాదారణంగా ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉండే సల్మాన్.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 32 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క హీరోయిన్‌తోనూ ముద్దు సీన్‌లో నటించలేదు. అలాంటిది రాధే ట్రైలర్‌లో హీరోయిన్ దిశా పటానీతో సల్మాన్ లిప్‌లాక్ సీన్ చూసిన ఆయన ఫ్యాన్స్ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
గతంలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు..తనకు ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇబ్బందిగా అనిపిస్తుందని సల్మాన్ బదులిచ్చాడు. దీంతో సల్మాన్ ఇవన్నీ ఆఫ్-స్క్రీన్‌లో చేస్తుంటాడు కాబట్టి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అవసరం లేదని ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 33 ఏళ్లుగా ఉన్న కండీషన్స్‌ని దిశా కోసం సల్మాన్ పక్కన పెట్టేశారా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి : అల్లు అర్జున్‌ను కాపీ కొట్టిన సల్మాన్.. సేమ్ టు సేమ్!
జిమ్ ట్రైనర్‌తో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న నటి
Comments
Please login to add a commentAdd a comment