అల్లు అర్జున్పై నోరు పారేసుకున్నాడు..! | Kamaal R Khan Comments on Allu Arjun | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్పై నోరు పారేసుకున్నాడు..!

Published Tue, Jul 4 2017 10:42 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

అల్లు అర్జున్పై నోరు పారేసుకున్నాడు..!

అల్లు అర్జున్పై నోరు పారేసుకున్నాడు..!

స్టార్ హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పబ్లిసిటీ పొందాలనుకునే బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్. ఇప్పటికే తెలుగు స్టార్స్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, రానా వంటి వారిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేఆర్కే మరో తెలుగు హీరోపై నోరు పారేసుకున్నాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుస సక్సెలు సాధిస్తుండటంతో పాటు పలు సంస్థలకు ప్రచార కర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు.

అంతేకాదు బన్నీ సినిమాలు హిందీలోకి డబ్ అయి యూట్యూబ్ సంచలనాలుగా మారుతున్నాయి. దీంతో కేఆర్కే బన్నీని టార్గెట్ చేశాడు. ' ఈ రోజు నాకు ఎవరో చెప్పారు.. ఈ లుక్కా లుకింగ్ ఆలూ తెలుగులో పెద్ద స్టార్ అని.. బ్రో నీవు చిన్న రోల్స్ చేయాలనుకుంటే బాలీవుడ్ కి రా.' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement