ట్విట్టరెక్కి తిట్టుకున్న హీరో-నటుడు | Sidharth Malhotra, KRK fight on Twitter | Sakshi
Sakshi News home page

ట్విట్టరెక్కి తిట్టుకున్న హీరో-నటుడు

Published Sat, Feb 27 2016 4:38 PM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

ట్విట్టరెక్కి తిట్టుకున్న హీరో-నటుడు

ట్విట్టరెక్కి తిట్టుకున్న హీరో-నటుడు

ముంబై: సెలబ్రిటీ సినీ తారలు తమ అభిప్రాయలు పంచుకోవడానికే కాదు.. అప్పుడప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడానికి కూడా ట్విట్టర్ వేదికగా మారుతోంది. తాజాగా బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా- నటుడు కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్‌లో తిట్టిపోసుకున్నారు. 'వోగ్‌' తాజా ఎడిషన్‌లో అలియా భట్‌ తో కలిసి బీచ్‌ దుస్తుల్లో పోజిచ్చిన సిద్ధార్థ మల్హోత్రా ఈ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ ఫొటోపై బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ దురుసు వ్యాఖ్యలు చేశారు. అలియా ఇంకా చిన్నపిల్ల (బచ్చి)లాగే ఉందంటూ వ్యాఖ్యానించాడు.

దీంతో ఆగ్రహించిన సిద్ధార్థ్‌ కాస్తా 'నోరు మూస్తారా' ఘాటుగా బదులిచ్చాడు. 'సర్‌. మేం కూడా మీ నోరు మూయించడానికి చాలానే కష్టపడుతున్నాం. కానీ మీరు ట్వీట్ చేస్తూనే ఉన్నారు' అని పేర్కొన్నారు. దీనికి బదులిచ్చిన కమల్ ఆర్ ఖాన్ 'యాక్టింగ్ మానేయమని మీకు చెప్పడానికి 130 కోట్లమంది ప్రజలు కూడా ప్రయత్నిస్తున్నారు. అయినా మీరు సినిమాల్లో నటిస్తూ వారిని సతాయిస్తూనే ఉన్నారు' అన బదులిచ్చాడు.

అయితే తన ట్వీట్‌ను కమల్‌ ఆర్ ఖాన్ సరిగ్గా అర్థం చేసుకోలేదని, ఆయన ఇంగ్లిష్ పాఠాలు చెప్పించుకుంటే మేలని 'బ్రదర్స్' స్టార్ సిద్ధార్థ మరో సెటైర్ వేశాడు. 'దేశద్రోహి' సినిమాలో నటించి ఫేమస్ అయిన కమల్ ఆర్ ఖాన్‌కు ట్విట్టర్‌లో సెలబ్రిటీలతో తగవులు పెట్టుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఆయన గతంలోనూ రాంగోపాల్ వర్మ, సోనాక్షి సిన్హా, కరణ్ జోహర్, కపిల్ శర్మతో ఇలాగే గొడవలు పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement