టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో హనుమాన్ ఒకటి. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్లో.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 11 భాషల్లో భారీ బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అదే రోజు మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీకి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
(ఇది చదవండి: 'హనుమాన్'కు అడ్డంకులు.. ప్రభాస్ సాయం కోరుతున్న చిత్ర యూనిట్)
ఈ నేపథ్యంలో ఇప్పటికే హనుమాన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్రాన్ని చూసి తన రివ్యూను వెల్లడించారు. ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైనర్‌ను అందించాడని అన్నారు. కథ, భావోద్వేగాలు, విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే గూస్‌బంప్స్ ఖాయమంటున్నారు.
ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. హనుమాన్ చిత్రంలో విఎఫ్‌ఎక్స్ కీలక పాత్ర పోషించిందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. అంతే కాకుండా ఈ చిత్రానికి ఆయన 3.5 రేటింగ్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ఈ మూవీని హిందీలో చూసిన ఆయన తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
#OneWordReview...#HanuMan: FASCINATING.
Rating: ⭐️⭐️⭐️½
Director #PrasanthVarma crafts a solid entertainer… #HanuMan is ambitious and exciting - packs drama, emotions, VFX and mythology skilfully… Loaded with goosebump moments + extraordinary finale… Recommended!… pic.twitter.com/7M2RKk2zkd— taran adarsh (@taran_adarsh) January 11, 2024
Comments
Please login to add a commentAdd a comment