taran adarsh twitter
-
Hanuman Movie: హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. గూస్బంప్స్ ఖాయం!
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో హనుమాన్ ఒకటి. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్లో.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 11 భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అదే రోజు మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీకి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇది చదవండి: 'హనుమాన్'కు అడ్డంకులు.. ప్రభాస్ సాయం కోరుతున్న చిత్ర యూనిట్) ఈ నేపథ్యంలో ఇప్పటికే హనుమాన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్రాన్ని చూసి తన రివ్యూను వెల్లడించారు. ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైనర్ను అందించాడని అన్నారు. కథ, భావోద్వేగాలు, విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే గూస్బంప్స్ ఖాయమంటున్నారు. ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. హనుమాన్ చిత్రంలో విఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించిందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. అంతే కాకుండా ఈ చిత్రానికి ఆయన 3.5 రేటింగ్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ఈ మూవీని హిందీలో చూసిన ఆయన తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. #OneWordReview...#HanuMan: FASCINATING. Rating: ⭐️⭐️⭐️½ Director #PrasanthVarma crafts a solid entertainer… #HanuMan is ambitious and exciting - packs drama, emotions, VFX and mythology skilfully… Loaded with goosebump moments + extraordinary finale… Recommended!… pic.twitter.com/7M2RKk2zkd — taran adarsh (@taran_adarsh) January 11, 2024 -
కాంతార ప్రభంజనం.. కేజీఎఫ్-2 రికార్డ్ బ్రేక్
బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన మూవీ 'కాంతార'. భాషతో సంబంధం లేకుండా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలై 50 రోజులు అయినా థియేటర్లలో క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా వసూళ్ల పరంగా మరో రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల (గ్రాస్) వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో కేజీయఫ్-2 రికార్డును అధిగమించి రూ.168.50 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. (చదవండి: ఓటీటీకి 'కాంతార'.. ఆ వివాదం వల్లే ఆలస్యమవుతోందా ?) తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో 19.20 కోట్లు, ఓవర్సీస్లో రూ.44.50 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో అయితే ఇప్పటివరకూ రూ.96 కోట్లు వచ్చినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అందరూ ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో డబ్ అయి, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో నిలిచింది. మొదటి స్థానంలో ‘కేజీయఫ్2’ రూ.185 కోట్ల టాప్‌లో ఉండగా, ఆ తర్వాత 2.ఓ (రూ.100కోట్లు), రోబో (రూ.72కోట్లు), కాంతార (రూ.60) ఐ (రూ.57కోట్లు) ఉన్నాయి. ‘KANTARA’ CROSSES ₹ 400 CR WORLDWIDE… #Kantara territory-wise breakup… Note: GROSS BOC… ⭐️ #Karnataka: ₹ 168.50 cr ⭐️ #Andhra / #Telangana: ₹ 60 cr ⭐️ #TamilNadu: ₹ 12.70 cr ⭐️ #Kerala: ₹ 19.20 cr ⭐️ #Overseas: ₹ 44.50 cr ⭐️ #NorthIndia: ₹ 96 cr ⭐️ Total: ₹ 400.90 cr pic.twitter.com/CmBQbLrZvf — taran adarsh (@taran_adarsh) November 22, 2022 -
Afghan: ఆఫ్గన్ రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా బాలీవుడ్ మూవీ
ఆఫ్గానిస్తాన్ని తాలిబన్లు పూర్తి స్థాయిలో ఆక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఎన్నో దేశాలు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి తమ పౌరులను విమానాల్లో తరలించాయి. ఇండియా సైతం భారతీయులతోపాటు ఎంతోమంది ఆఫ్గానీయులను రెస్క్యూ చేసి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ ఆధారంగా బాలీవుడ్లో ‘గరుడ్’ పేరుతో సినిమా తెరక్కెనుంది. జాన్ అబ్రహం హీరోగా ‘ఎటాక్’ సినిమా నిర్మాత అజయ్‌కపూర్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలిపాడు. చిత్ర మోషన్ పోస్టర్ని బుధవారం (సెప్టెంబర్ 15న) విడుదల చేశాడు. ఈ మూవీకి మరో నిర్మాతగా సుభాష్ కాలే వ్యవహరించనున్నారు. ఈ సినిమా డైరెక్టర్, నటీనటుల, ఇతర క్యాస్టింగ్ ఫైనలైజ్ కాలేదని, ఆ వివరాలు త్వరలోనే చెబుతామని ఆయన వెల్లడించాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రత్యేక వింగ్ గరుడ్ కమాండో ఫోర్స్‌లోని ఓ అధికారి చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సుభాష్ కాలే కథ అందిస్తుండగా, కేజీఎఫ్ సినిమాలకు పనిచేసిన రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. కాగా జాన్ అబ్రహం కథనాయకుడిగా నటిస్తున్న ఎటాక్ సినిమాని డిజిటల్ ప్లాట్ఫామ్లో కాకుండా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ఇటీవల ప్రకటించింది. FILM ON AFGHAN RESCUE CRISIS... #AjayKapoor - currently producing #Attack [#JohnAbraham] - collaborates with #SubhashKale for #Garud... Based on #Afghan rescue crisis... Director + cast to be announced... Music by #RaviBasrur [#KGF, #KGF2]... 15 Aug 2022 release #IndependenceDay. pic.twitter.com/SQN7wJvKEj — taran adarsh (@taran_adarsh) September 15, 2021 -
రన్వీర్ ‘83’ థియేటర్లలోనే..
కరోనావైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని చిత్రపరిశ్రమల్లో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. అయితే లాక్డౌన్ సమయంలో కొన్ని సినిమాలను ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్లాట్‌ఫాం ద్వారా విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న‘83’ సినిమా మాత్రం థియేటర్లలోనే విడుదల అవుతుందని ప్రముఖ సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘83’మూవీ ముందుగా థియేటర్లలోనే విడుదల అవుతుంది. ఈ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా ఈ సినిమాని విడుదల చేయటం లేదు’ అని ఈయన ట్విట్ చేశారు. (అయ్యో ! రణ్వీర్ ఎంత పని జరిగే..) బాలీవుడ్ హీరో రన్వీర్సింగ్ ప్రధాన పాత్రలో ‘83’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రన్వీర్ భాతర మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ పాత్రలో నటించారు. ‘83’ సినిమాను చిత్రయూనిట్ తొలుత ఏప్రిల్ 10న విడుదల చేయాలని నిర్ణయించుకుంది. కోవిడ్-19 ప్రభావంతో విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రన్వీర్సింగ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించారు. ‘83’చిత్రంలో కపిల్‌దేవ్ భార్య రోమీగా రన్వీర్సింగ్ భార్య దీపికాపదుకోన్ నటించారు. ఇక ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే వరకు వేచిచూడాల్సిందే మరీ. (ఆట వాయిదా) #Xclusiv: #83TheFilm will release in theatres first, as and when the time is appropriate... WON'T release on #OTT platform first... #Clarification #OfficialNews#83TheFilm stars #RanveerSingh as #KapilDev. pic.twitter.com/AbdwBoNwcg — taran adarsh (@taran_adarsh) April 27, 2020 -
బ్లాక్ బస్టర్‌గా రాజీ సినిమా
ముంబై : అలియా భట్ తాజా చిత్రం ‘రాజీ’ విమర్శకుల ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపిస్తోంది. వంద కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రెండు వారాల్లో రూ. 91.63 కోట్ల వసూళ్లు రాబట్టింది. మొదటి వారంలో రూ. 56.59 కోట్లు, రెండో వారంలో 35.04 కోట్ల కలెక్షన్లు తెచ్చుకున్నట్టు ప్రముఖ సినీ విమర్శకుడు, వాణిజ్య విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఒక సైనికుడి తల్లి నిజ జీవిత కథ ఆధారంగా ఇండియన్ నేవీ మాజీ లెఫ్టినెంట్ కమాండర్ హరీందర్ ఎస్ సిక్కా రాసిన ‘‘కాలింగ్ సెహమత్’’ నవల ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కించారు. అలియా భట్ సరసన విక్కీ కౌశల్ నటించారు. ఈ సినిమాలో అలియా భట్ నటనకు అన్నివైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. -
బాహుబలి ట్విట్టర్ రివ్యూ
ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రెండు సంవత్సరాలకు పైగా తీసిన బాహుబలి సినిమాపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అయితే.. ‘‘రాజమౌళి భారతదేశంలో ఉన్న దర్శకులందరికీ బాబు లాంటి వాడు!!!!! మన కాలంలో వచ్చిన అద్భుతమైన మాస్టర్ పీస్ లో ఒక భాగం అయినందుకు చాలా గర్వంగాను, గౌరవంగాను ఉంది!!!’’ అని ట్వీట్ చేశారు. ఇక హిందీలో ఈ సినిమాను చూసిన ప్రముఖ సినిమా ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ కూడా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయనేమన్నారో ఆయన ట్వీట్లలోనే.. ఎస్ఎస్ రాజమౌళి తన ఊహలను తెరకెక్కించినట్లుగా ఏ కథకుడూ అంత దగ్గరకు రాలేరు. బాహుబలి నిజంగా మా-స్ట-ర్-పీ-స్. బాహుబలి సినిమాలో ప్రతి ఫ్రేము, ప్రతి సీక్వెన్సు కూడా అద్భుతమే. హాలీవుడ్ లో ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ సినిమాలతో దీన్ని సులభంగా పోల్చుకోవచ్చు. ఒక మేధావి బుర్ర నుంచి వచ్చిన ముద్ర దీనికి ఉంది. అత్యంత భారీగా ఉన్న సెట్లు, వీఎఫ్ఎక్స్, సౌండు, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ... అన్నింటికంటే ముఖ్యంగా వాటర్ టైట్ స్క్రీన్ ప్లే ఇవన్నీ అద్భుతం కంటే కూడా చాలా ఎక్కువ. బాహుబలి పాత్రధారులు పూర్తి పర్ ఫెక్టుగా ఉన్నారు. ప్రతి నటుడు తమతమ పాత్రల్లో మెరిసిపోయారు. ప్రభాస్, రానా.. మిమ్మల్నిద్దరినీ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. ఔట్ స్టాండింగ్! బాహుబలి లాంటి సినిమా మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది. భారతీయ దర్శక నిర్మాతలు ఇలాంటి కల కనడానికి, దాని ఫలితం కోసం చూసేందుకు చాలా ధైర్యం చేయాలి. మనం ఓ పెద్ద దూకు దూకాం. బాహుబలిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. ఈవాళ చెప్పాలంటే అది ‘బాక్సాఫీసు బ్లాక్ బస్టర్’. రేపు ఇది ఒక క్లాసిక్ గా అందరికీ గుర్తుండిపోతుంది. తారాగణం: ప్రభాస్, అనుష్కాశెట్టి, తమన్నా భాటియా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుదీప్, అడివి శేష్, రాకేష్ వర్రే, మేకా రామకృష్ణ కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సమర్పణ: కె.రాఘవేంద్రరావు సంగీతం: ఎంఎం కీరవాణి @ssrajamouli is the BAAP of all directors in india!!!!! Am proud and honored to be a part of a masterpiece of our times!!! #Baahubali — Karan Johar (@karanjohar) July 9, 2015 Now watching SS Rajamouli's #Baahubali [Hindi version]... — taran adarsh (@taran_adarsh) July 9, 2015 No storyteller comes close to what SS Rajamouli envisions and executes on screen. #Baahubali is truly a M-A-S-T-E-R-P-I-E-C-E. — taran adarsh (@taran_adarsh) July 9, 2015 Every frame, every sequence of #Baahubali is a marvel. Can easily be compared to the best of Hollywood. Has the stamp of a genius. — taran adarsh (@taran_adarsh) July 9, 2015 The grandiose sets, VFX, sound, edit, cinematography... most importantly, the watertight screenplay of #Baahubali is beyond fantastic. — taran adarsh (@taran_adarsh) July 9, 2015 #Baahubali casting just perfect. Every actor shines in their respective parts. Prabhas and Rana, special mention for you both. Outstanding! — taran adarsh (@taran_adarsh) July 9, 2015 A film like #Baahubali makes you proud. An Indian filmmaker dared to dream and the results are for all to see. We take a giant leap. — taran adarsh (@taran_adarsh) July 9, 2015 #Baahubali is NOT TO BE MISSED. Today, you may call it a BOX-OFFICE BLOCKBUSTER. Tomorrow, it will be remembered as a CLASSIC. — taran adarsh (@taran_adarsh) July 9, 2015