ఆఫ్గానిస్తాన్‌ని తాలిబన్లు పూర్తి స్థాయిలో ఆక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఎన్నో దేశాలు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి తమ పౌరులను విమానాల్లో తరలించాయి. ఇండియా సైతం భారతీయులతోపాటు ఎంతోమంది ఆఫ్గానీయులను రెస్క్యూ చేసి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ ఆధారంగా బాలీవుడ్‌లో ‘గరుడ్’ పేరుతో సినిమా తెరక్కెనుంది.
జాన్ అబ్రహం హీరోగా ‘ఎటాక్’ సినిమా నిర్మాత అజయ్‌కపూర్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలిపాడు. చిత్ర మోషన్ పోస్టర్‌ని బుధవారం (సెప్టెంబర్ 15న) విడుదల చేశాడు. ఈ మూవీకి మరో నిర్మాతగా సుభాష్ కాలే వ్యవహరించనున్నారు. ఈ సినిమా డైరెక్టర్, నటీనటుల, ఇతర క్యాస్టింగ్ ఫైనలైజ్ కాలేదని, ఆ వివరాలు త్వరలోనే చెబుతామని ఆయన వెల్లడించాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రత్యేక వింగ్ గరుడ్ కమాండో ఫోర్స్‌లోని ఓ అధికారి చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సుభాష్ కాలే కథ అందిస్తుండగా, కేజీఎఫ్ సినిమాలకు పనిచేసిన రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు.
ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. కాగా జాన్ అబ్రహం కథనాయకుడిగా నటిస్తున్న ఎటాక్ సినిమాని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కాకుండా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ఇటీవల ప్రకటించింది.
FILM ON AFGHAN RESCUE CRISIS... #AjayKapoor - currently producing #Attack [#JohnAbraham] - collaborates with #SubhashKale for #Garud... Based on #Afghan rescue crisis... Director + cast to be announced... Music by #RaviBasrur [#KGF, #KGF2]... 15 Aug 2022 release #IndependenceDay. pic.twitter.com/SQN7wJvKEj
— taran adarsh (@taran_adarsh) September 15, 2021
Comments
Please login to add a commentAdd a comment