రన్‌వీర్‌‌ ‘83’ థియేటర్లలోనే.. | Ranveer Singh 83 Movie Release On Theatres First | Sakshi
Sakshi News home page

రన్‌వీర్‌‌ ‘83’ థియేటర్లలోనే..

Published Tue, Apr 28 2020 11:25 AM | Last Updated on Tue, Apr 28 2020 12:27 PM

Ranveer Singh 83 Movie Release On Theatres First - Sakshi

కరోనావైరస్‌ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని చిత్రపరిశ్రమల్లో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. అయితే లాక్‌డౌన్‌ సమయంలో కొన్ని సినిమాలను ఓవర్‌ ద టాప్‌(ఓటీటీ) ప్లాట్‌ఫాం ద్వారా విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న‘83’ సినిమా మాత్రం థియేటర్లలోనే విడుదల అవుతుందని ప్రముఖ సినీ ట్రేడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘83’మూవీ ముందుగా థియేటర్లలోనే విడుదల అవుతుంది. ఈ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా ఈ సినిమాని విడుదల చేయటం లేదు’ అని ఈయన ట్విట్‌ చేశారు. (అయ్యో ! ర‌ణ్‌వీర్ ఎంత ప‌ని జ‌రిగే..)

బాలీవుడ్‌ హీరో రన్‌వీర్‌‌సింగ్‌ ప్రధాన పాత్రలో ‘83’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రన్‌వీర్‌‌ భాతర మాజీ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ పాత్రలో నటించారు. ‘83’ సినిమాను చిత్రయూనిట్‌ తొలుత ఏప్రిల్‌ 10న విడుదల చేయాలని నిర్ణయించుకుంది. కోవిడ్‌-19 ప్రభావంతో విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రన్‌వీర్‌‌సింగ్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించారు. ‘83’చిత్రంలో కపిల్‌దేవ్‌ భార్య రోమీగా రన్‌వీర్‌‌సింగ్‌ భార్య దీపికాపదుకోన్‌ నటించారు. ఇక ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే వరకు వేచిచూడాల్సిందే మరీ. (ఆట వాయిదా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement