Kapildev
-
'కోహ్లి, గంభీర్ అలా చేస్తారనుకోలేదు.. చాలా బాధ కలిగించింది'
ఐపీఎల్-2023లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మధ్య తీవ్ర వాగ్వదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల మధ్య కరచాలనం చేసుకునే సమయంలో వీరిద్దరి మధ్య మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో వీరిద్దరికి ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా కూడా విధించారు. అదే విధంగా గౌతీ, విరాట్ ప్రవర్తనపై మాజీ ఆటగాళ్లు విమర్శల వర్షం కురిపించారు. తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. మైదానంలో కోహ్లి, గంభీర్ ప్రవర్తన తనను చాలా బాధ కలిగించిందని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. "బీసీసీఐ క్రికెటర్లను మంచి ఆటగాళ్ల గానే కాదు, మంచి పౌరులుగా కూడా తీర్చిదిద్దాలి. మైదానంలో ఎలా ప్రవర్తించుకోవాలో నెర్పించాలి. ఐపీఎల్లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ ప్రవర్తన నన్ను చాలా బాధ కలిగించింది. ఇద్దరూ లెజెండరీ క్రికెటర్లు. విరాట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతుండగా.. గౌతీ చాలా ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు తన సేవలను అందించాడు. అంతేకాకుండా గంభీర్ ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా కూడా ఉన్నాడు. అటువంటిది వీరిద్దరూ బహిరంగంగా అలా ఎలా ప్రవర్తిస్తారు. కానీ క్రీడాకారులు ఎదో ఒక సమయంలో తమ సహనాన్ని కోల్పోతారు. బ్రాడ్‌మన్, పీలే వంటి దిగ్గజాలు కూడా ఈ కోవకు చెందిన వారే" అని ది వీక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు. చదవండి: Ashes 5th Test: మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధం.. -
35 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన జడేజా.. తొలి భారత ఆటగాడిగా!
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో జడేజా 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఈ క్రమంలో జడేజా టెస్టు క్రికెట్లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఏడో స్ధానంలో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. అంతకుముందు కపిల్ దేవ్ 1986లో శ్రీలంకపై 7వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి 163 పరుగులు సాధించాడు. 175 పరుగులు చేసిన జడేజా కపిల్ దేవ్ రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. అఏ విధంగా పంత్ 159 పరుగులతో మూడో స్ధానంలో ఉన్నాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ 7 స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి దక్షిణాఫ్రికాపై 144 పరుగులు సాధించాడు. కాగా గాయం తర్వాత తిరిగొచ్చిన తొలి మ్యాచ్‌లోనే జడేజా సెంచరీ సాధించడం విశేషం. ఏడో స్ధానంలో వచ్చి అద్భుతమైన సెంచరీ సాధించిన జడేజాపై ప్రశంసల వర్షం కురిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 572/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో జడేజా(175),పంత్(96), అశ్విన్(61) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక శ్రీలంక బౌలర్లలో లక్మల్,ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దేనియా చెరో రెండు వికెట్లు సాధించారు. చదవండి: Ravindra Jadeja: అరె జడేజా ఎన్నాళ్లకెన్నాళ్లకు.. -
రన్వీర్ ‘83’ థియేటర్లలోనే..
కరోనావైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని చిత్రపరిశ్రమల్లో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. అయితే లాక్డౌన్ సమయంలో కొన్ని సినిమాలను ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్లాట్‌ఫాం ద్వారా విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న‘83’ సినిమా మాత్రం థియేటర్లలోనే విడుదల అవుతుందని ప్రముఖ సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘83’మూవీ ముందుగా థియేటర్లలోనే విడుదల అవుతుంది. ఈ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా ఈ సినిమాని విడుదల చేయటం లేదు’ అని ఈయన ట్విట్ చేశారు. (అయ్యో ! రణ్వీర్ ఎంత పని జరిగే..) బాలీవుడ్ హీరో రన్వీర్సింగ్ ప్రధాన పాత్రలో ‘83’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రన్వీర్ భాతర మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ పాత్రలో నటించారు. ‘83’ సినిమాను చిత్రయూనిట్ తొలుత ఏప్రిల్ 10న విడుదల చేయాలని నిర్ణయించుకుంది. కోవిడ్-19 ప్రభావంతో విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రన్వీర్సింగ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించారు. ‘83’చిత్రంలో కపిల్‌దేవ్ భార్య రోమీగా రన్వీర్సింగ్ భార్య దీపికాపదుకోన్ నటించారు. ఇక ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే వరకు వేచిచూడాల్సిందే మరీ. (ఆట వాయిదా) #Xclusiv: #83TheFilm will release in theatres first, as and when the time is appropriate... WON'T release on #OTT platform first... #Clarification #OfficialNews#83TheFilm stars #RanveerSingh as #KapilDev. pic.twitter.com/AbdwBoNwcg — taran adarsh (@taran_adarsh) April 27, 2020 -
సీఏసీకి కపిల్ రాజీనామా
న్యూఢిల్లీ: భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలోనే ఆయన కూడా వైదొలిగారు. ఈ ప్రయోజనాల బాటలో పదవిని వదులుకున్న నాలుగో క్రికెట్ దిగ్గజం కపిల్. ఇదివరకే గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లు తప్పుకున్నారు. ఆయన రాజీనామా నిజమేనని బోర్డు వర్గాలు ధ్రువీకరించాయి. క్రికెట్ పాలక కమిటీ (సీఓఏ) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. కపిల్, అన్షుమన్ గైక్వాడ్‌లతో పాటు కమిటీలో ఉన్న శాంతా రంగస్వామి కూడా ఈ విరుద్ధ ప్రయోజనాలతోనే ఇటీవల రాజీనామా చేశారు. -
కోహ్లి తన అభిప్రాయం చెప్పవచ్చు కానీ...
న్యూఢిల్లీ: ఓవైపు టీమిండియా ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియ సాగుతుండగా... ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రిని కొనసాగిస్తే బాగుంటుందంటూ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందనలు కొనసాగుతున్నాయి. కోచ్ ఎంపిక కమిటీ బాధ్యతను చూస్తున్న క్రికెట్ సలహా మండలి (సీఏసీ) సభ్యులు, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్, శాంత రంగస్వామి దీనిపై గురువారం వేర్వేరు చోట్ల మాట్లాడారు. తమ కర్తవ్యాన్ని శక్తిమేర నిర్వర్తిస్తా మని పేర్కొన్న కపిల్... కోహ్లి వ్యాఖ్యలపై మాట్లాడుతూ ‘అది అతడి అభిప్రాయం. మేం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలి’ అని స్పష్టం చేశారు. కెప్టెన్‌గా అభిప్రాయం చెప్పే హక్కు కోహ్లికి ఉందంటూనే, తమ కమిటీ సమష్టి నిర్ణయంతో కోచ్‌ను ఎంపిక చేస్తుందని శాంత రంగస్వామి అన్నారు. అనుభవం, సామర్థ్యం, వ్యూహ నైపుణ్యాలను తాము ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పారు. మరోవైపు కోహ్లి వ్యాఖ్యలు కోచ్ ఎంపికపై ప్రభావం చూపవని, ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్య్రాన్ని ఎవరూ అడ్డుకోలేరని క్రికెట్ పాలకుల మండలి (సీవోఏ) సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. కోహ్లి కెప్టెనే అయినా, ఎంపికకు ఒక కమిటీని నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. -
విశాఖ అభిమానానికి క్లీన్ బౌల్డ్
విశాఖ స్పోర్ట్స్: ‘విశాఖలో క్రికెట్ అంటే ఇంత అభిమానం ఉన్నందుకు, ఇంత ఘనంగా ఓ టోర్నమెంట్ నిర్వహించినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేనంటే ఇంత ప్రేమానురాగాలు మీలో ఉన్నందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియకుండా ఉంది.’ అని చాంపియన్లకు చాంపియన్, 1983 క్రికెట్ ప్రపంచకప్ హీరో కపిల్‌దేవ్ అన్నారు. తన పట్ల ఇంత గౌరవం చూపిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖలో అద్వితీయ రీతిలో జరిగిన ఎంవీవీ టీ10 క్రికెట్ చాంపియన్‌షిప్ బహుమతి ప్రదానోత్సవానికి కపిల్‌దేవ్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందించారు. ఆయనతోపాటు నిర్వాహకులు ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహాకాల్ని బహుకరించారు. గురజాడ కళాక్షేత్రలో మంగళవారం వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ ఆ«ధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు, అధ్యక్షులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అవకాశాలు అందుకోండి నలభై రోజుల పాటు అద్భుతంగా నిర్వహించిన టీ10 క్రికెట్ టోర్నీని కపిల్ ఎంతగానో మెచ్చుకున్నారు. నిర్వాహకుల కృషితో 400కు పైగా జట్లు పోటీలో తలపడ్డ సంగతిని ఆయన ప్రస్తావంచారు. ఈ పోటీలో పాల్గొన్న ఆటగాళ్లు అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమ ప్రారంభంలో వేదికపైకి వస్తున్న కపిల్‌దేవ్‌కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వస్తూన్నే క్రీడాభిమానులకు అభివాదం చేస్తూ ‘నేనేం మిమ్మల్మి ఓట్లు ఆడిగేందుకు రాలేదు. రాజకీయ నాయకుడిని కాదు.’ అని ఛలోక్తి విసిరారు. క్రీడల పట్ల ఇంత అభిమానం చూపిస్తున్న వారందరికీ దన్యవాదాలు తెలిపారు. క్రీడాభిమానుల్ని పలుకరించేందుకే విశాఖ వచ్చానన్నారు. ఇలాంటి మీట్ చేయడానికి పూనుకున్న ఎంవీవీకి ధన్యవాదాలు తెలపాలంటూ సభికులను కోరారు. చారిత్రాత్మక విజయం ఆస్ట్రేలియాను వారిగడ్డ మీదే ఓడించి సిరీస్‌ను గెలుచుకున్న భారత జట్టును కపిల్ ఎంతగానో ప్రశంసించారు. 1983లో భారత్ ప్రపంచ కప్ సాధించడమే ఒక అద్భుతమని అన్నారు. క్రికెట్ ఓ వర్ణనాతీత ఆనందమని, దానిని తాను ఆస్వాదించానని చెప్పారు. 1983లో వరల్డ్ కప్ సాధించిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారు. దక్షిణ భారతదేశం అంటే తనకు ఎంతో ఇష్టమంటూనే విశాఖ చక్కటి నగరం అంటూ కితాబును ఇచ్చారు. షష్టిపూర్తి ఘట్టం జనవరి ఆరో తేదీతో ఈ హర్యానా హరికేన్ 59 ఏళ్లు పూర్తిచేసుకుని 60వ వసంతంలోకి ఆడుగుపెట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన చేత ప్రత్యేక కేకును కట్ చేయించారు. గజమాలతో సత్కరించారు. దుశ్శాలువ కప్పి కపిల్‌దేవ్‌తో ఫోటో తీయించుకునేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు సైతం పోటీపడ్డారు. సాంస్కృతిక కార్యక్రమాలు రసవత్తరం అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు సభికులను అలరించారు. శాస్త్రీయ నృత్యాలతో మైమరపించారు. తొలుత కపిల్‌దేవ్‌తో సహా వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు, అధ్యక్షులు, సమన్వయకర్తల జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడాకారుల ప్రోత్సాహానికే.. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ పోటీలు నిర్వహించామన్నారు. సహకరించిన సమన్వయకర్తలందరికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ల విజయ్‌ప్రసాద్, తైనాలవిజయ్‌కుమార్, గుడివాడ అమర్నాథ్, వంశీకృష్ణ, నాగిరెడ్డి, కేకేరాజు, శ్రీనివాసరావు, కోలాగురువులు, నర్సగౌడ్, సిద్ధపాండే, కొండారాజీవ్, వెంకటలక్ష్మి, జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే ఎంవివి టీ10 క్రికెట్ చాంపియన్‌షిప్‌ను వంశీకృష్ణ ఎలెవెన్(తూర్పు) జట్టు కైవసం చేసుకుంది. రన్నర్సప్‌గా న్యూకాలనీ ఎలెవెన్ (ఉత్తర) జట్టు నిలిచింది. తృతీయ స్థానంలో ఉప్పాడ వారియర్స్ (భీమిలి), నాలుగో స్థానంలో కార్తీక్ ఎలెవెన్(గాజువాక) నిలిచాయి. బెస్ట్ ఫైటింగ్ టీమ్‌గా టాప్ స్టార్స్, ఎస్‌కోట జట్టు అవార్డు అందుకుంది. టోర్నీలో చక్కటి ప్రతిభ కనబరిచిన అనిల్‌కుమార్ (ఉత్తర) మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకోగా బెస్ట్ ఆల్‌రౌండర్‌గా పీవీ శ్యాంప్రసాద్ (తూర్పు) నిలిచాడు. బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా సిహెచ్ వేణు (తూర్పు), బెస్ట్ బౌలర్‌గా బి.ప్రశాంత్ (ఉత్తర), బెస్ట్ కీపర్‌గా డి.వినోద్‌కుమార్(ఉత్తర) నిలిచారు. విజేత జట్టుకు వంశీకృష్ణ, రన్నరప్‌కు కేకేరాజు, సెమీ లూజర్స్కు గుడివాడ ఆమర్నాథ్ ట్రోఫీలు, నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. విజేత జట్టుకు రెండు లక్షల నగదు ప్రోత్సాహకాన్ని క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్‌తో పాటు ఎంవీవీ సత్యనారాయణ అందించగా రన్నర్సప్కు లక్ష, సెకండ్ రన్నర్సప్కు ఆరలక్ష, నాలుగోస్థానంలో నిలిచిన జట్టుకు పాతికవేలను నగదు ప్రోత్సాహకంగా అందించారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు పదివేలు, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లలో ఉత్తమ ప్రతిభ చూసిన వారికి మూడేసి వేల వంతున బహుకరించారు. బెస్ట్ ఫైటింగ్ జట్టుకు ఐదువేలు అందించారు. -
ముందు గెస్ట్‌గా?
కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండకు సంబంధించి ఒకే టాపిక్ గురించి డిస్కషన్ నడుస్తోంది. తన బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? అన్నదే ఆ టాపిక్. జాన్వీ కపూర్‌తో చేసే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తారని, విజయ్‌ని కరణ్ జోహార్ పరిచయం చేస్తారని ప్రచారంలో ఉన్న వార్తలు. అయితే తాజాగా ‘83’ చిత్రం ద్వారా విజయ్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తారని టాక్. 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా కబీర్ ఖాన్ రూపొందించనున్న చిత్రం ‘83’. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సౌత్ ఇండియన్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రను పోషిస్తారని టాక్. ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపిస్తారని సమాచారం. ఇదే నిజమైతే బాలీవుడ్‌కి ముందు గెస్ట్‌గా వెళ్లి, ఆ తర్వాత హీరోగానూ చేస్తారని ఊహించవచ్చు. ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. రీసెంట్గా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారాయన రన్నింగ్ ట్రైన్ ఎక్కే సన్నివేశాల్లో స్లిప్ అవ్వడంతో విజయ్ చేతికి చిన్నపాటి గాయమైంది. -
బాలీవుడ్‌కి బన్నీ?
అల్లు అర్జున్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత బన్నీ నటించనున్న చిత్రంపై ఎటువంటి క్లారిటీ లేదు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తారని టాక్. ఇప్పుడు మరో టాక్ ఏంటంటే.. మాజీ భారత కెప్టెన్ కపిల్‌దేవ్ బయోపిక్ ‘83’ చిత్రంలో అల్లు అర్జున్ నటించనున్నారట. కపిల్‌దేవ్ సారథ్యంలో 1983లో భారత్ క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ‘83’లో కపిల్‌దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ చేస్తున్నారు. ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రకు చిత్రవర్గాలు అల్లు అర్జున్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాలీవుడ్లో ఆయన చేసే మొదటి చిత్రం ఇదే అవుతుంది. -
పాండ్యా బ్యాటింగ్‌లో మెరుగుపడాలి
మొనాకో: ప్రస్తుత టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుపడాలని మాజీ ఆల్‌రౌండర్, భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సూచించారు. ‘పాండ్యాలో ప్రతిభ, సామర్థ్యాలకు కొదవలేదు. కొన్ని మ్యాచ్‌ల్లో వాటిని చూపించాడు కూడా. వేరొకరితో పోల్చినపుడు అతడిపై ఒత్తిడి పెరుగుతుందనే మాట నిజమే. దానికి బదులు అతడు సహజ సిద్ధమైన ఆట ఆడితే బాగుంటుంది. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి మరింత మెరుగుపడితే మంచిది. ఆల్‌రౌండర్లు కూడా రెండింటిలో ఏదైనా ఒక విభాగంలో అత్యుత్తమంగా ఉండాల్సిందే ఎందుకంటే నా దృష్టిలో పాండ్యా బ్యాటింగ్ ఆల్‌రౌండర్. నేను అతడిని అలాగే చూడాలనుకుంటున్నా.’ అని అన్నారు. పాండ్యా నుంచి ఎక్కువ ఆశిస్తున్నామా అనే ప్రశ్నకు బదులిస్తూ... ‘మనం అతడి నుంచి ఎక్కువగా ఆశిస్తు న్న మాట వాస్తవమే... కానీ ఆ సామర్థ్యం పాండ్యాలో ఉంది. ప్రస్తుత జట్టులో అతడో ఉత్తమ అథ్లెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని అన్నారు. మరో వైపు 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజయావకాశాల గురించి మాట్లాడుతూ...‘కోహ్లి దూకు డు, ధోని ప్రశాంతత కలగలిస్తే మన జట్టుకు మంచి చాన్స్ ఉంటుంది’ అని కపిల్ అభిప్రాయపడ్డారు. -
అట్టహాసంగా వెంకటస్వామి స్మారక టీ20 లీగ్
సాక్షి, హైదరాబాద్ : వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 (టీటీఎల్) లీగ్ శనివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారత దిగ్గజ ఆటగాళ్లు కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు సినీతారలు వెంకటేశ్, శ్రీకాంత్, నిర్మాత డి. సురేశ్‌బాబు, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి. వివేకానంద్, 10 జిల్లా జట్ల యజమానులు పాల్గొన్నారు. తొలి మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్, మెదక్ మావేరిక్స్ తలపడ్డాయి. ఈ నెల 25న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. -
గోల్కొండ ఖిల్లా దగ్గర గోల్ఫ్ సందడి
-
ధోని స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు..?
సాక్షి, పుణే: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనిని టీ20ల నుంచి తప్పుకోవాలనే వ్యాఖ్యలను మాజీ కెప్టన్ కపిల్‌దేవ్ తప్పుబట్టాడు. ధోని తప్పుకుంటే అతని స్థానం ఎవరు భర్తీ చేయగలరని విమర్శకులను ప్రశ్నించారు. పుణేలో జరిగిన ఓ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ 2020 టీ20 వరల్డ్ కప్‌లో ధోని కీలక పాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘కొన్నిమ్యాచ్ల ధోని బ్యాటింగ్ యావరేజ్‌ను ప్రస్తావిస్తు కొందరూ ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్ధం కావట్లేదు. ఈ విమర్శలకు వయసు ఎంత మాత్రం కారణం కాదు. సచిన్ 38వ ఏట భారత్ ప్రపంచకప్ గెలిచింది. దీనిపై ఎవరూ మాట్లాడరూ.. ఒకవేళ ధోనిపై వేటు వేస్తే అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? ధోని ఓ అద్బుత ఆటగాడని అతని స్థానం ఎవరు భర్తీ చేయలేరని కపిల్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ధోని రాణించలేకపోయినా కెప్టెన్ కోహ్లిని వెనుకుండి నడిపించాడన్నాడు. ఇక హర్దీక్పాండ్యాను అతని టాలెంటే నాకన్న గొప్ప క్రికెటర్‌ను చేస్తుందని కితాబిచ్చాడు. అశ్విన్, జడేజాల గురించి ప్రస్తావిస్తూ.. భారత జట్టులో సీనియారిటీకి ప్రాధాన్యత లేదు. ప్రదర్శనను బట్టే జట్టు ఎంపిక ఉంటుంది. కుల్దీప్, చాహల్ విషయంలో కూడా అదే జరిగింది. లిమిటెడ్ ఫార్మట్‌లో ఈ ఇద్దరూ అద్బుతంగా రాణిస్తున్నారని కపిల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌లు ధోనికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. -
36 ఏళ్ల తర్వాత!
లండన్.. లార్డ్స్ క్రికెట్ స్టేడియం.. జూన్ 25, 1983. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మరచిపోలేని రోజు అది. కపిల్‌దేవ్ సారథ్యంలో ఇండియా క్రికెట్ టీమ్ ఫస్ట్ టైమ్ వరల్డ్‌కప్ సాధించింది. అప్పటి ఆ మధుర క్షణాలను అందరూ చూసి ఉండకపోవచ్చు. మువ్వన్నెల జెండాని రెపరెపలాడించిన ఆ క్షణాలను 36 ఏళ్ల తర్వాత వెండితెరపై చూడబోతున్నాం. ఈ కథాంశంతో హిందీలో ‘1983’ పేరుతో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘ఏక్తా టైగర్, భజరంగీ భాయిజాన్’ వంటి హిట్ చిత్రాలను అందించిన కబీర్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కపిల్‌దేవ్ పాత్రలో రణవీర్‌సింగ్ నటించనున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై విజృంభించే తారలకు ప్లే గ్రౌండ్లో రెచ్చిపోవడం అంటే కష్టమే. అందుకే, బెస్ట్ అవుట్‌పుట్ వచ్చేందుకు రియల్ 1983 ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్‌తో రీల్ ప్లేయర్స్‌కు ట్రైనింగ్ ఇప్పించనున్నారట డైరెక్టర్ కబీర్‌ఖాన్. ఈ చిత్రం రూపొందనుందనే సంగతి బయటికొచ్చింది. కానీ, విడుదల తేదీ ప్రకటించలేదు. 2019 ఏప్రిల్ 5న విడుదల చేస్తామని అఫిషియల్‌గా ఇప్పుడు అనౌన్స్ చేశారు. -
‘పాండ్యాను ఇప్పుడే కపిల్‌తో పోల్చవద్దు’..
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఇప్పుడే లెజెండ్ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్‌తో పోల్చవద్దని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాండ్యా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ తో పాటు అభిమానుల, మాజీ క్రికెటర్ల ప్రశంసలందుకుంటున్న విషయం తెలిసిందే. కొందరు ఔత్సాహికులు అయితే పాండ్యాను కపిల్‌తో పొలుస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. ‘పాండ్యా ప్రదర్శరనతో కోహ్లిసేన విజయం సాధించవచ్చు.కానీ 15 ఏళ్లు రాణించిన గొప్ప చాంపియన్ కపిల్‌దేవ్‌తో ఇప్పుడే పోల్చడం సరికాదు. పాండ్యా ఇప్పుడిప్పుడే రాణిస్తున్నాడు. పాండ్యా ఓ మంచి క్రికెటర్, తన ఆటను ఆస్వాదించనివ్వండి. ఇలానే భవిష్యత్తులో రాణించాలని ఆశిస్తున్నా అని’ గంగూలీ పేర్కొన్నారు. ఇక టీ20 మ్యాచ్‌లకు సీనియర్ ఆటగాడైన ఆశిష్ నెహ్రా ఎంపిక చేయడం పట్ల దాదా సెలక్టర్లను ప్రశంసించారు. వయస్సుతో సంబంధం లేకుండా నెహ్రాను ఎంపిక చేయడం భారత క్రికెట్‌కు మంచి పరిణామమన్నారు. నెహ్రా అనుభవం ఉన్న టీ20 బౌలర్ అని చెప్పుకొచ్చిన దాదా అతని సత్తా ఏమిటో గత టీ20 వరల్డ్‌కప్‌లో చూశామన్నారు. అతను ఏడమ చేతి బౌలర్ అని, దీంతో భిన్న కోణాల్లో బంతులు విసరగలడని తెలిపారు. ఈ సిరీస్‌లో అతను అద్భుతంగా రాణిస్తాడని దాదా ధీమా వ్యక్తం చేశారు. -
అశ్విన్ అరుదైన ఘనతలు..
గ్రాస్ ఐలెట్: వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ మెరుపులు మెరిపిస్తున్న అశ్విన్ తాజాగా అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. ఒక సిరీస్‌లో రెండు సార్లు ఐదు వికెట్లకు పైగా తీయడంతో పాటు, రెండు సార్లు 50కు పైగా పరుగులు నమోదు చేసిన మూడో భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఈ ఫీట్ ను కపిల్ దేవ్ రెండు సార్లు, భువనేశ్వర్ కుమార్ ఒకసారి సాధించారు.1979-80లో పాకిస్తాన్‌పై, 1981-82లో ఇంగ్లండ్‌పై కపిల్ దేవ్ ఈ ఘనతను నమోదు చేయగా, రెండు సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ లో భువనే్శ్వర్ కుమార్ రెండుసార్లు ఐదేసి వికెట్లను, 50కు పైగా స్కోరును రెండు సార్లు సాధించాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో సెంచరీ చేయడంతో పాటు ఏడు వికెట్లు సాధించిన అశ్విన్.. రెండో టెస్టులో (మొత్తం ఆరువి కెట్లు) తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు. మరోవైపు మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో మెరిశాడు. ఈ క్రమంలో అశ్విన్ తన టెస్టు కెరీర్ లో సాధించిన నాల్గో శతకం కూడా విండీస్ పైనే రావడం మరో విశేషం. దీంతో భారత ఆటగాళ్ల ప్రతిష్టాత్మక క్లబ్లో అశ్విన్ కు చోటు దక్కింది. అంతకుముందు సునీల్ గవాస్కర్(13 సెంచరీలు), దిలీప్ వెంగసర్కార్ (ఆరు సెంచరీలు), రాహుల్ ద్రవిడ్ (ఐదు సెంచరీలు) మాత్రమే విండీస్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు నమోదు చేశారు. మూడో టెస్టులో అశ్విన్ (297 బంతుల్లో 118; 6 ఫోర్లు; 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (227 బంతుల్లో 104; 13 ఫోర్లు) శతకాలతో ఆదుకున్నారు. దీంతో కోహ్లిసేన తొలి ఇన్నింగ్స్‌లో 129.4 ఓవర్లలో 353 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. -
సచిన్-కోహ్లిల మధ్య పోలిక ఎందుకు?
కోల్‌కతా: మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లిని పోల్చడం ఎంతమాత్రం సరికాదని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేర్కొన్నాడు. అసలు సచిన్‌తో విరాట్‌ను పోల్చాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించాడు. 'సచిన్ ఒక లెజండ్ ఆటగాడు. విరాట్ ఇంకా ఆరంభంలోనే ఉన్నాడు. అటువంటప్పుడు వారి మధ్య పోలిక అనవసరం' అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ టీ 20లో భారత్‌ను ఫైనల్ కు చేర్చడంలో విఫలమైన మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగొతేనే మంచిదని భావిస్తున్నారా?అన్న ప్రశ్నకు కపిల్ దేవ్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. కెప్టెన్ ను మార్చాలన్నది సెలక్టర్ల నిర్ణయమన్నాడు. ఒకవేళ వారు మార్చాలనుకుంటూ మార్పు ఉంటుందన్నాడు. అయితే ధోని అనేకసార్లు విజయవంతమైన కెప్టెన్ గా నిరూపించుకున్న సంగతిని మరువకూడదని కపిల్ ఈ సందర్భంగా తెలిపాడు. -
లెజెండరీ క్రికెటర్‌తో అల్లు అర్జున్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్‌ను కలుసుకున్నారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన భార్య స్నేహరెడ్డి కపిల్‌దేవ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు బన్నీ. 'గ్రేట్ ఇండియన్ కెప్టెన్ కపిల్‌దేవ్‌ను కలిశాం. ఆయన నా సినిమాలు చూస్తానని చెప్పటం నాకు ఆశ్యర్చాన్ని కలిగించింది. రేసుగుర్రం సినిమాలో నా పెర్ఫార్మెన్సును ఆయన అభినందించారు' అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2016 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
ఆజన్మం: ఇలాంటి కొన్ని పిచ్చులు కూడా...
ఏ రోజు పేపర్లో కపిల్ ఫొటో కనబడితే, ఆ రోజు చించడం, అతికించడం! నోటుబుక్కు అయిపోయేసరికి పొట్ట ఉబ్బిపోయి, మూస్తే విచిత్రంగా కనిపించేది. కీసరగుట్ట స్కూల్లో ఎయిత్లో ఉన్నప్పుడు ఐ.శ్రీనుగానికీ అరవింద్‌కూ నాకూ పోటీ; క్రికెట్‌కు సంబంధించిన పేపర్ కటింగ్స్ సంపాదించడంలో! ఐ.శ్రీను ఎందుకంటే, బి.శ్రీను, సి.శ్రీను, డి.శ్రీను, జె.శ్రీను, కె.శ్రీను... ఇంతమందుండేవారు. నేను ప్రత్యేకంగా కపిల్‌దేవ్ బొమ్మలను సేకరించేవాడిని. ఒక నోటు బుక్కులో ఏ రోజు పేపర్లో కపిల్ ఫొటో కనబడితే, ఆ రోజు చించడం, అతికించడం! నోటుబుక్కు అయిపోయేసరికి దాని పొట్ట ఉబ్బిపోయి, మూస్తే విచిత్రంగా కనిపించేది. కొంతకాలానికి ఈ అలవాటు ఎలాగో ఎగిరిపోయింది. ఇప్పుడు నా జీవితంలో క్రికెట్‌కే స్థానం లేదు. ఇది నైన్త్ ఆ ప్రాంతంలో ఉండేది. రోడ్డుమీద కనబడే బోర్డుల్లో ఏ ఇంగ్లీషు పదాన్ని చూసినా, అందులో ఎన్ని ‘జడ్’లు ఉండగలవో లెక్కిస్తూ ఉండేవాణ్ని. మనసులోనే దానికి సంబంధించిన క్యాల్కులేషన్ జరుగుతూ ఉండేది. ‘వై’కు ‘ఎ’ కలిపితే ఒక జడ్ అవుతుంది. ఉదాహరణకు: అఓఏఐ అంటే ఎస్+ఎ= టి; టి+కె= జడ్(1)+ఇ; ఇ+ఎస్=ఎక్స్, ఎక్స్+హెచ్=జడ్(2)+ఎఫ్, ఎఫ్+ఐ=ఒ; ఫైనల్‌గా 2 జడ్‌లు, ఒక ‘ఒ’. ఈ లెక్కలను సింప్లిఫై చేసుకోవడానికి నాకు నేనే కనిపెట్టుకున్న కొన్ని సమీకరణాలు ఉన్నాయి. రెండు ‘ఎం’లు కలిస్తే ఒక జడ్. ‘ఆర్’కు ‘హెచ్’ కలిపినా జడ్ అవుతుంది. టి+ఎఫ్= జడ్. ఎస్+టి+ఎం కలిపితే రెండు జడ్‌లు వస్తాయి. పై పెదవి చివర్లను కొంచెం లోనికి వంచి, నె.మ్మ.ది.గా జారవిడుస్తుంటే అదో రకంగా ఉంటుంది. పెదవి అంచు హోల్డ్ కావాలంటే, కొద్దిగా పొడిగా ఉండాలి. ఇక చూడు, పెదవి ముడవడం, నెమ్మదిగా జారవిడవడం. నిజంగా నేను ఏం చేసేదీ కరెక్టుగా ఇక్కడ రాయనూలేనూ, బొమ్మ గీసి చూపనూ లేనుగానీ అదొక పిచ్చిలా తయారయ్యింది కొన్నాళ్లు. తరచూ చేయడం వల్ల, ఆ రాపిడికి పై పెదవి అంచు మధ్యభాగం నల్లబడిపోయేది. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు విడుదలయ్యుంటాయి? ఎంతమంది దర్శకులు ఉండివుంటారు? ఎంత మంది సినిమా పాటలు రాసివుంటారు? నిర్మాతలు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, రచయితలు, గాయనీగాయకులు, ఎడిటర్లు... ఫైట్ మాస్టర్లను కూడా వదలకుండా నోటుబుక్కులో గీతలు కొట్టి పేర్లు నమోదు చేస్తూ పోయేవాడిని. ఎక్కడ కొత్త పేరు కనబడినా అందులో చేర్చేవాణ్ని. సినిమాను మినహాయించిన ప్రపంచం ఉంటుందంటే నమ్మని రోజుల్లో... నా వ్యక్తిగత ప్రపంచాన్ని రసమయం చేసినవాళ్లందరికీ అది నేనిచ్చిన నివాళి కావొచ్చు! మొన్న మా గోపాల్‌రావుపల్లె అత్తమ్మ వాళ్ల మనవడి గురించి దుఃఖపడుతూ, ‘‘డాక్టర్ ఏదిజెప్పినా మారుత్తరం ఇయ్యకుండా అచ్చుడేగదారా,’’ అంది. ఆమెనూ ఆమెతోపాటు మమ్మల్నీ దుఃఖపెట్టే ఆ కారణం ఇక్కడ అసందర్భం. కాకపోతే, చదువుకోని ఆ అత్తమ్మ నోట పలికిన ‘మారుత్తరం’ అనే మాట నాకు కొత్తది. దీన్ని ఎందుకు సందర్భం చేస్తున్నానంటే, ఇలాంటి పదాల్ని సేకరించే పిచ్చి కూడా కొంతకాలం కొనసాగించాను. కనీసం ఒక వెయ్యి పదాలు! బస్సులో వెళ్తున్నప్పుడో, ఆడవాళ్లు పిండి విసురుతూ ముచ్చట్లు పెడుతున్నప్పుడో, మా పెద్దమ్మ ఉన్నట్టుండి ఏ సామెతో విసిరినప్పుడో... అరే ఇది దొరికింది, అది దొరికింది, అని గబగబా రాసుకోవడం! ఆరేడేళ్ల తర్వాత అదేపనిని ‘తెలంగాణ పదకోశం’గా నలిమెల భాస్కర్ సార్ మరింత అర్థవంతంగా తలకెత్తుకుంటారని అప్పుడు తెలీదు. క్రికెట్ ఫొటోల స్థానంలో న్యూస్పేపర్లో నచ్చేవి కట్ చేసి అతికించే పిచ్చి కొన్ని రోజులు కొనసాగింది. చాలావరకు ఉద్వేగాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ సేకరించేవాడిని. దానికి సమాంతరంగా ‘బుక్ క్రికెట్’లో ప్రపంచకప్ నిర్వహిస్తుండేవాణ్ని; కనబడిన ప్రతిమనిషి పేరూ రాసుకోవాలని కొంతకాలం ఆరాటపడ్డాను; భూమ్మీద ఉన్నందరినీ వీడియో తీయాలని కొంతకాలం ఆలోచించాను; ‘భరనభభరవ’ తెలిసిన రోజుల్లో గురువులు, లఘువుల సాక్షిగా ‘అసురోత్పలమాల’ పద్యం రాసే పనిలోపడ్డాను; కొన్ని నెలలు సినిమా పాటలు రాసి కాల్చేశాను; కొంతకాలం నవలలు మొదలుపెట్టి మూలన పడేశాను. కారణం: ఎక్కడో ‘వ్యాట్ 69’ అని చదువుతాం. ఇక నా నవల్లో విలన్‌కు అది తాగే సీన్ పెట్టాలి! కానీ అదేమిటో నాకే తెలియకుండా నా పాత్రను ఎలా రుచి చూడనిచ్చేది? మన ఖాళీ సమయాల్ని పూరించిన కొన్ని పిచ్చి విషయాలు, అప్పుడు పిచ్చివిగా కనబడక జీవితం హాయిగా గడిచిపోయింది. వాటిని పిచ్చి అని గుర్తించడం మొదలెట్టాక, అవి తొలగిపోయాయిగానీ, వాటిని భర్తీ చేసే మంచి పిచ్చులేవో జొరబడక ఆ శూన్యం అలా కొనసాగుతూ వస్తోంది. - పూడూరి రాజిరెడ్డి