శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో జడేజా 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఈ క్రమంలో జడేజా టెస్టు క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఏడో స్ధానంలో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. అంతకుముందు కపిల్ దేవ్ 1986లో శ్రీలంకపై 7వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి 163 పరుగులు సాధించాడు. 175 పరుగులు చేసిన జడేజా కపిల్ దేవ్ రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. అఏ విధంగా పంత్ 159 పరుగులతో మూడో స్ధానంలో ఉన్నాడు.
ఇక టీమిండియా మాజీ కెప్టెన్ 7 స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి దక్షిణాఫ్రికాపై 144 పరుగులు సాధించాడు. కాగా గాయం తర్వాత తిరిగొచ్చిన తొలి మ్యాచ్‌లోనే జడేజా సెంచరీ సాధించడం విశేషం. ఏడో స్ధానంలో వచ్చి అద్భుతమైన సెంచరీ సాధించిన జడేజాపై ప్రశంసల వర్షం కురిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 572/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో జడేజా(175),పంత్(96), అశ్విన్(61) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. ఇక శ్రీలంక బౌలర్లలో లక్మల్,ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దేనియా చెరో రెండు వికెట్లు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment