లెజెండరీ క్రికెటర్తో అల్లు అర్జున్ | allu arjun meets indian cricket legend kapildev | Sakshi
Sakshi News home page

లెజెండరీ క్రికెటర్తో అల్లు అర్జున్

Published Thu, Oct 1 2015 10:02 AM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

లెజెండరీ క్రికెటర్తో అల్లు అర్జున్

లెజెండరీ క్రికెటర్తో అల్లు అర్జున్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ను కలుసుకున్నారు. అల్లు అర్జున్తో పాటు ఆయన భార్య స్నేహరెడ్డి కపిల్దేవ్తో కలిసి దిగిన ఫొటోను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు బన్నీ.

'గ్రేట్ ఇండియన్ కెప్టెన్ కపిల్దేవ్ను కలిశాం. ఆయన నా సినిమాలు చూస్తానని చెప్పటం నాకు ఆశ్యర్చాన్ని కలిగించింది. రేసుగుర్రం సినిమాలో నా పెర్ఫార్మెన్సును ఆయన అభినందించారు' అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2016 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement