Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్ | Allu Arjun With His Wife Sneha Reddy Spotted In Dhaba, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun Sneha Reddy Dhaba Photo: బన్నీ ఇంత సింపుల్‌గా ఉన్నాడేంటి? అక్కడ అలా

Published Tue, May 21 2024 12:45 PM | Last Updated on Tue, May 21 2024 12:53 PM

Allu Arjun With His Wife Sneha Spotted In Dhaba

హీరో అల్లు అర్జున్ ఈ మధ్య లేనిపోని వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడంతో బన్నీని ఉద్దేశిస్తూ నాగబాబు రెచ్చగొట్టే ట్వీట్ చేయడం.. ఇలా అనుకోని విధంగా వార్తల్లో నిలిచాడు. అయితే అదంతా సైలెంట్ అయిపోయింది. ఇక తాజాగా బన్నీ నుంచి ఊహించని ఫొటో ఒకటి బయటకొచ్చింది. ఇందులో భార్యతో కలిసి ఓ డాబాలో భోజనం చేస్తున్నాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?)

'పుష్ప' మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్.. బయట ఎక్కడ కనిపించినా సరే జనాలు బాగానే వస్తారు. అలాంటిది సింపుల్‌గా ఓ దాబాలో భోజనం చేస్తూ కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది. ఎన్నికల్లో నిలబడ్డ ఫ్రెండ్‌కి సపోర్ట్ చేసేందుకు నంద్యాల వెళ్లిన బన్నీ.. తిరిగొచ్చే క్రమంలోనే దాబాలో లంచ్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్.. 'పుష్ప 2' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల ముందు తొలి లిరికల్ సాంగ్ రిలీజ్ కాగా, బన్నీ స్టైల్-స్టెప్పులతో ఆకట్టుకుంటోంది. 

(ఇదీ చదవండి: నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement