
సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కారణం బన్నీ కూతురు అర్హ ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇవ్వడమే. శాకుంతల-దుష్యంత మహారాజు కొడుకు భరతుడి పాత్రలో అర్హ కనిపించనుంది.
ఇక ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన సమంత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీబిజీగా గడిపేస్తుంది. తాజాగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత అల్లు అర్హ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. 'అల్లు అర్హ చాలా క్యూట్ గా ఉంటుంది. తనకి అసలు ఇంగ్లీష్ రాదు. హాయ్ కూడా నార్మల్‌గానే చెప్తుంది.
ఈ జనరేషన్ పిల్లలకి అంత బాగా తెలుగు నేర్పించినందుకు వాళ్లు పేరెంట్స్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి. సెట్‌లో కూడా ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా భయపడకుండా బాగా చెప్పింది. అల్లు అర్జున్ ఇప్పుడు స్టార్ అయితే, అర్హ పుట్టకతోనే స్టార్' అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.
Comments
Please login to add a commentAdd a comment