
అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇప్పటికే చిరంజీవి, అల్లు అరవింద్ స్పందించినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. రీసెంట్‌గా రామ్‌చరణ్ బర్త్‌డే పార్టీలో కూడా అల్లు అర్జున్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్ చిరంజీవి నివాసంలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
టాలీవుడ్ ప్రముఖులంతా పార్టీలో సందడి చేసినా అల్లు అర్జున్ మాత్రం రాకపోడంతో నిజంగానే వీరిద్దరి మధ్య స్టార్ వార్ నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ రూమర్స్‌కి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి చెక్ పెట్టింది. అల్లుఅర్జున్, శ్రీజ, సుష్మితలతో పాటు మరికొంత మంది కజిన్స్‌తో వెకేషన్‌కు వెళ్లిన వీడియోను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
దీనికి లవ్ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒకవేళ నిజంగానే బన్నీ-చరణ్‌లకు మధ్య విబేధాలు ఉంటే శ్రీజ, సుష్మితలు బన్నీతో కలిసి వెకేషన్‌కు వెళ్లరు కదా, అయినా సోషల్ మీడియాలో విష్ చేయనంత మాత్రానా కథలు అల్లడమేనా? అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment