Sushmita
-
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. అది మన చేతుల్లోనే ఉంది: నటి
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం తరచుగా వినిపిస్తూనే ఉంటోంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురైన వారు ఇండస్ట్రీలో చాలామందే ఉంటారు. ఇలాంటి చేదు అనుభవాలను అందరూ ధైర్యంగా బయటికి చెప్పలేరు. మరికొందరు తమ కెరీర్లో ఎదుర్కొన్న ఇలాంటి సంఘటనలపై ఓపెన్ అవుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్య సుస్మిత తనకెదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది. ఇటీవల ఆమె 'బాడ్ కాప్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని ఐశ్వర్య సుస్మిత తెలిపింది. అయితే ఈ విషయాన్ని పెద్దది చేయడం ఒక్కటే మార్గం కాదని ఐశ్వర్య అన్నారు. తాను ఎప్పుడూ ఎలాంటి ఆడిషన్స్‌ను మిస్ చేసుకోలేదని పేర్కొంది. తాను విలువల విషయంలో రాజీ పడేది లేదని.. కష్టపడి పనిచేస్తానని చెప్పుకొచ్చింది.ఐశ్వర్య మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఇలాంటివీ చాలా విన్నా. చాలామంది వ్యక్తులు పలు విధాలుగా కథలు చెప్పేవారు. నేను అప్పటికీ మోడల్‌గానే ఉన్నా ఇంకా నటనలోకి అడుగు పెట్టలేదు. మీరు వారితో పడుకోకపోతే మీకు అవకాశాలు రావని నాకు చెప్పేవారు. కానీ పరిశ్రమలోకి రావడానికి ఇది ఒక్కటే మార్గం కాదు. కానీ ఆ సమయంలో కొందరు డైరెక్టర్స్, క్యాస్టింగ్ డైరెక్టర్స్ నన్ను పర్సనల్‌గా కలవమని చెప్పేవారు. కానీ ఇక్కడ మనల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు. వెళ్లాలా? వద్దా? అనేది మన నిర్ణయం. ఇది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. కార్పొరేట్ రంగంలోనూ ఉంది.' అంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది.కాగా.. ఐశ్వర్య సుస్మిత మోడల్‌గా తన కెరీర్‌ని ప్రారంభించింది. 2016లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్‌గా తొలిసారి అవకాశం దక్కించుకుంది. ఆమె మోడలింగ్ నుంచి నటన వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ఓటీటీలో అరంగేట్రం చేసిన ఐశ్వర్య సుస్మిత త్వరలోనే సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధమవుతోంది. -
మెగాస్టార్‌తో సినిమా ప్రకటించిన సుస్మిత
మెగాస్టార్ చిరంజీవి నేడు (ఆగష్టు 22) 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద కూతురు సుస్మిత కొణిదెలకు చెందిన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ నుంచి ఒక శుభవార్తను ఫ్యాన్స్ కోసం వెల్లడించారు. సుష్మిత నిర్మాతగా చిరంజీవి 156వ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సోషల్‌మీడియా ఖాతా ద్వారా తెలిపారు. (ఇదీ చదవండి: రాజకీయాల్లో చిరు ఓడిపోవచ్చేమో కానీ సినిమాల్లో ఎప్పటికీ 'మగధీరుడే') చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందుకు సంబంధిచిన ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే కథ కూడా రెడీ చేసి చిరంజీవికి వినిపించారని టాక్ నడుస్తోంది. ఆ కథను ఆయన ఫైనల్ కూడా చేశారట. ఇకపోతే మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్‌ను ఒక యంగ్ దర్శకుడికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం టాలీవుడ్ నుంచే కాకుండా ఒక తమిళ దర్శకుడు కూడా లైన్లో ఉన్నారని సమాచారం. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ నుంచి ఒక సినిమా ఉంటుందని ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. వారు ఒక పోస్టర్‌ను కూడా తాజాగ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీంతో భోళా శంకర్ తర్వాత ఆయన నుంచి రెండు భారీ ప్రాజెక్ట్‌లు రెడీ అవుతున్నాయి. A legacy of ruling the silver screen for 4 decades! A personality which evokes a plethora of emotions! A man who is celebrated on and off the screen After 155 films, now #MEGA156 will be a MegaRocking entertainer Happy Birthday to @KChiruTweets Garu🤗#HBDMegastarChiranjeevi pic.twitter.com/TnMlon63li — Gold Box Entertainments (@GoldBoxEnt) August 22, 2023 The universe conspires for beautiful things to happen ✨ One man inspires us to achieve the universe itself 💫 Stay tuned to @UV_Creations ❤️ Today at 10.53 AM 🔮#HBDMegastarChiranjeevi pic.twitter.com/v7W9LCB8Ij — UV Creations (@UV_Creations) August 21, 2023 -
మణికేరళం
ఎక్కడి కేరళ? ఎక్కడి మణిపుర్? అయితే మానవత్వానికి భౌగోళిక సరిహద్దులతో పనిలేదు అని నిరూపించే విషయం ఇది. కేరళ కోచిలోని ఆర్సీపీ రెస్టారెంట్లో మణిపుర్‌కు చెందిన సుస్మిత పనిచేస్తుంది. సర్వీస్ స్టాఫ్‌లో ఒకరైన సుస్మిత ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. మూడుసార్లు ‘బెస్ట్ ఎంప్లాయీ’గా అవార్డ్ కూడా అందుకుంది. అలాంటిది... ఓ రోజున సుస్మిత డల్‌గా ఉండడం చూసి ‘ఏమైంది?’ అని అడిగాడు జనరల్ మేనేజర్. తన రాష్ట్రం మణిపుర్లో జరుగుతున్న అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తల్లి, సోదరి గురించి ప్రస్తావిస్తూ ‘వారికేమైనా అవుతుందేమో’ అంటూ భయపడింది. విషయం తెలిసిన చెఫ్ పిళ్లై, అతని టీమ్ మణిపుర్ నుంచి ఆమె తల్లి, సోదరిలను రప్పించి కోచిలో బస ఏర్పాటు చేశారు. సుస్మిత తల్లి ఇబెంచదేవి, సోదరి సర్ఫిదేవిలకు ‘ఆర్సీపీ కోచి కిచెన్’లో ఉపాధి కల్పించారు. ఈ స్టోరీ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. -
ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల
Sushmitha Konidela Latest Interview: మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే బోలెడన్ని సినిమాలు, అద్భుతమైన యాక్టింగ్ గుర్తొస్తుంది. ఆయన కుటుంబం విషయానికొస్తే.. కొడుకు రామ్ చరణ్ ఇప్పటికే గ్లోబల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలోనే ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. గతంలో బాధపడ్డ సందర్భాలని గుర్తుచేసుకుంది. అలానే ఇండస్ట్రీపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ కష్టమే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండటం అంత ఈజీ కాదని చెప్పిన సుస్మిత.. ఇక్కడ ప్రతిరోజూ ఓ యుద్ధంలా ఉంటుందని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమపై బోలెడంత ప్రేమతో పాటు పనిని ఎంజాయ్ చేయగలిగేలా ఉండాలని అప్పుడు ముందుకు వెళ్లగలమని తెలిపింది. కేవలం గ్లామర్ కోసం ఉండాలనుకుంటే మాత్రం చాలా కష్టమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) వాటిని పట్టించుకోకూడదు కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభంలో తనపై వచ్చిన నెగిటివిటీ గురించి కూడా సుస్మిత స్పందించింది. సోషల్ మీడియా, పలు వెబ్‌సైట్స్‌లో వచ్చిన వార్తలు చూసి అప్పట్లో తాను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. వాటిని వింటూ కూర్చుంటే ముందుకెళ్లలేం. కాబట్టి బయట జరుగుతున్న విషయాలు, మాటలు పట్టించుకోకుండా ముందుకుపోతే నెగిటివిటీ గురించి బాధపడం అని చెప్పింది. నచ్చకపోతే ఓకే చేయరు తండ్రి చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడంపైనా సుస్మిత స్పందించింది. 'సైరా' నుంచి ఆయన సినిమాలకు పనిచేస్తున్నాను. ఆయన చేస్తున్న పాత్ర, ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటా, స్టైలింగ్ విషయంలో ఆయన కచ్చితంగా ఉంటారని, ఏ మాత్రం నచ్చకపోయినా నిర్మొహమాటంగా చెప్పేస్తారని సుస్మిత క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో?) -
Sushmita Konidela Marriage Pics: చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత అలనాటి పెళ్లి ఫోటోలు చూశారా?
-
పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు.. అదే జోష్‌లో మాస్ సినిమాలు చేసేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘భోళా శంకర్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం రిలీజైన తర్వాత ఓకేసారి రెండు సినిమాలను అనౌన్స్ చేసేందుకు సిద్ధమయ్యాడట చిరంజీవి. అందులో మొదటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఆ తర్వాత బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో మరో మూవీ చేయబోతున్నాడు. ఇదే క్రమంలో తన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల కెరీర్‌ని కూడా గాడిలో పెట్టేందుకు సిద్దమయ్యారట చిరంజీవి. ఆ మధ్య సుష్మిత నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్‌తో పాటు సంతోష్ శోభన్ హీరోగా ఓ సినిమాను కూడా నిర్మించింది. అయితే ఆ రెండూ కూడా డిజాస్టర్‌గా మిగిలాయి. (చదవండి: భోళా శంకర్ టీజర్: హద్దుల్లేవ్, సరిహద్దుల్లేవ్.. చిరు మాస్ డైలాగ్స్) దీంతో నిర్మాతగా అడుగుపెట్టిన సుష్మితకు ఆదిలోనే అపజయాలు ఎదురయ్యాయి. ఎలాగైన తన కూతురిని నిర్మాతగా నిలబెట్టాలని భావిస్తున్నారట చిరంజీవి. అందుకే తన తదుపరి సినిమాను కూతురి నిర్మాణ సంస్థలోనే చేయనున్నారట. ఇప్పటికే ‘సైరా’తో తన కొడుకు రామ్ చరణ్‌ని నిర్మాతగా పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు కూతురికి కూడా తన సినిమాతో ఓ సూపర్ హిట్ అందించి,పెద్ద ప్రొడ్యూసర్ గా చేయాలని నిర్ణయించుకున్నాడట. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు నటించబోయే సినిమాకు సుష్మితనే నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభించి, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదికి సంకాంత్రికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత వశిష్ట డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు చిరు. -
‘మెగా’ మనువరాళ్లు.. చిరుతో రేర్ ఫోటోలు
-
సివిల్స్‌లో మెరిసిన షాద్‌నగర్ ఆణిముత్యం
షాద్‌నగర్: దేశంలోనే అత్యున్నత సర్వీస్‌గా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో షాద్‌నగర్ విద్యార్థిని సత్తా చాటింది. పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం, లక్ష్మి దంపతుల కూతురు సుష్మిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 384 ర్యాంకు సాధించింది. గతంలో మూడుసార్లు ఇంటర్వ్యూకు చేరుకున్న ఆమె లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. పట్టువదలకుండా నాలుగోసారి శ్రమించి మంచి ర్యాంకు సాధించింది. ఆమె పదో తరగతి వరకు షాద్‌నగర్ పట్టణంలోని హెరిటేజ్ వ్యాలీలో చదివింది. అనంతరం హైదరాబాద్‌లోని పేజ్ కళాశాలలో ఇంటర్, అండర్ గ్రాడ్యుయేషన్‌ను వరంగల్‌లోలోని నిట్‌లో పూర్తి చేసింది. పబ్లిక్ సర్వీస్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె సివిల్స్‌కు సిద్ధమైంది. నాలుగో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకుంది. -
మెగా ఫామిలీ లో మరో బ్యానర్...చరణ్ కు పోటీగా!
-
టీఎస్పీఎస్సీ డీఏవో పరీక్ష పేపర్ కోసం.. ‘ఆడి’ కారు అమ్మి.. అడ్వాన్సు ఇచ్చి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్ష పేపర్ ఖరీదు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మం జంట సాయి లౌకిక్, సాయి సుస్మిత విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరినీ సిట్ అధికారులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని మూడు రోజులపాటు విచారించారు. ఆదివారం ఆ గడువు ముగియడంతో సోమవారం వైద్యపరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. సాయి సుస్మిత గ్రూప్–1 పరీక్ష రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్లో జరిగిన పొరపాట్లు సరి చేసుకోవడానికి కమిషన్‌కు వచ్చిన సందర్భంలో ప్రవీణ్‌కుమార్‌తో పరిచయమైంది. డీఏఓ మాస్టర్ క్వశ్చన్ పేపర్ తన వద్ద ఉందని ఫిబ్రవరి మూడో వారంలో ఈమెతో చెప్పిన ప్రవీణ్ రూ.10 లక్షలకు విక్రయిస్తానన్నాడు. ఈ విషయాన్ని సుస్మిత తన భర్త లౌకిక్‌కు చెప్పింది. అప్పటికప్పుడు అంత డబ్బు లేకపోవడంతో తమ వద్ద ఉన్న రెండు కార్లలో ‘ఆడి’ కారును తన స్నేహితుడికి విక్రయించిన లౌకిక్ అతడి నుంచి అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని ప్రవీణ్‌కు ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన మొత్తం చెల్లింపునకు గడువు కోరాడు. దీంతో భార్యాభర్తల్ని ఎల్బీనగర్ వద్దకు రమ్మని ప్రవీణ్ చెప్పాడు. ‘ఆ పేపర్ మేం ఎవ్వరికీ ఇవ్వలేదు’ ఫిబ్రవరి 23 రాత్రి ఖమ్మం నుంచి నగరానికి వచ్చిన దంపతులు ఎల్బీనగర్లోని డీ మార్ట్ వద్ద ఉండి ప్రవీణ్‌కు సమాచారం ఇచ్చారు. బడంగ్‌పేట్‌లోని మల్లికార్జున కాలనీలో తన ఇంటి నుంచి అక్కడకు వచ్చిన ప్రవీణ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి వెళ్లాడు. ఆ రాత్రి అల్కాపురిలోని లాడ్జిలో బస చేసిన ఈ దంపతులు మరుసటి రోజు ఖమ్మంలోని సమీప బంధువు ఇంటికి వెళ్లారు. అక్కడే రెండు రోజుల ఉండి పరీక్షకు సిద్ధమైన సుస్మిత ఫిబ్రవరి 26న పరీక్ష రాసింది. సిట్ అధికారులు వీరిద్దరినీ తీసుకుని శనివారం ఖమ్మం రాపర్తినగర్‌లోని వారి ఇంట్లో సోదాలు చేశారు. మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు హాల్‌టికెట్ స్వాదీనం చేసుకున్నారు. తాము ఆ ప్రశ్నపత్రాలు మరెవరికీ ఇవ్వలేదని ఇరువురూ సిట్ అధికారులకు తెలిపారు. నేను కష్టపడి చదివా.. మీరు అపోహపడుతున్నారు న్యూజిలాండ్ నుంచి సిట్‌కు ఈ– మెయిల్ చేసిన నిందితుడు ప్రశాంత్ గ్రూప్–1 ప్రశ్నా పత్రాన్ని ప్రధాన నిందితులలో ఒకడైన రాజశేఖర్‌రెడ్డి, న్యూజిలాండ్‌లో ఉన్న తన బావ ప్రశాంత్‌రెడ్డికి పంపించాడు. న్యూజిలాండ్‌లో పరీక్షకు సిద్ధమై, హైదరాబాద్‌కు వచ్చి ప్రశాంత్ గ్రూప్–1 పరీక్ష రాసి వెళ్లాడు. పేపర్ లీకేజీ ఘటన వెలుగులోకి రావడంతో వందకుపైగా మార్కులు వచ్చిన వారిని ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్‌రెడ్డికి వందకుపైగా మార్కులు వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో తన బావకు ప్రశ్న పత్రాన్ని పంపించానని రాజశేఖర్ అంగీకరించాడు. ఈ మేరకు న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా సిట్ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌రెడ్డి సిట్‌కు ఈ మెయిల్ పంపించాడు. ‘నేను కష్టపడి చదివానని, నేను ఎవరి వద్ద నుంచి ప్రశ్నా పత్రం తీసుకోలేదు, నాకు మార్కులు ఎక్కువగా రావడంతో మీరు అపోహపడుతున్నారు’ అని ఈ మెయిల్లో పేర్కొన్నాడు. కాగా ప్రశ్నా పత్రాన్ని న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు రిమోట్‌యాప్ అయిన ఎనీడెస్క్ ద్వారా రాజశేఖర్‌రెడ్డి పంపించిన విషయం విచారణలో వెల్లడైన విషయంతెలిసిందే. -
డీఏఓ పేపరూ అమ్మేశాడు!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) క్వశ్చన్ పేపర్లతో పాటు డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ప్రశ్న పత్రాలనూ సూత్రధారి పి.ప్రవీణ్ కుమార్ విక్రయించినట్లు తాజాగా బయటపడింది. ఈ విషయం గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం ఖమ్మం ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు సాయి సుస్మిత, సాయి లౌకిక్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కమిషన్ నిర్వహించిన, నిర్వహించాల్సిన ఆరు పరీక్షలకు సంబంధించి 15 ప్రశ్న పత్రాలు లీకైనట్లు ఇప్పటికే సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. వీటిలో గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు పంచుకున్నారని, ఏఈ పరీక్షలవి విక్రయించారని, మిగిలినవి ఏ అభ్యర్థుల వద్దకూ వెళ్లలేదని భావించారు. అయితే కమిషన్ కార్యదర్శి అనిత రామ్‌చంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ బ్యాంకు ఖాతాను విశ్లేషించిన అధికారులు డీఏఓ పరీక్ష పత్రాన్ని కూడా ఇతడు విక్రయించాడని గుర్తించారు. సాయి లౌకిక్ ఖమ్మంలో కార్ల వ్యాపారం చేస్తుండగా, ఈయన భార్య సుస్మిత గతంలో హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్–1, డీఏఓ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న సుస్మిత ఉద్యోగం మాని వీటికోసం సిద్ధమయ్యారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసిన ఈమె ఓఎంఆర్ షీట్‌ను రాంగ్ బబ్లింగ్ చేశారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల పెన్నుతో మార్కింగ్ చేశారు. దీంతో ఈమె జవాబు పత్రాన్ని కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అంశంలో తనకు న్యాయం చేయాలని కోరడానికి సుస్మిత పలుమార్లు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి, పలువురు అధికారులను కలిశారు. ఇలా కమిషన్ కార్యదర్శి వద్దకు వచ్చిన సందర్భంలోనే ఈమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో తాను డీఏఓ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు చెప్పింది. జవాబులతో కూడిన మాస్టర్ పేపర్‌నే ఇస్తా.. ఫిబ్రవరి మూడో వారంలో డీఏఓ పేపర్ చేజిక్కించుకున్న ప్రవీణ్ ఆమెను సంప్రదించారు. తన వద్ద డీఏఓ పరీక్ష పత్రం ఉందని, రూ.10 లక్షలకు విక్రయిస్తానని చెప్పాడు. దీంతో ఆమె విషయాన్ని తన భర్త లౌకిక్‌కు చెప్పింది. ఇద్దరూ కలిసి ప్రవీణ్‌ను కలిసి బేరసారాలు చేశారు. తాను ఇచ్చేది జవాబులతో కూడిన మాస్టర్ పేపర్ అని చెప్పిన అతగాడు రేటు తగ్గించడానికి ససేమిరా అన్నాడు. దీంతో అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు ప్రవీణ్ ఖాతాకు బదిలీ చేసిన లౌకిక్ డీఏఓ ప్రశ్నపత్రం ప్రింటెడ్ కాపీ తీసుకున్నాడు. మిగిలిన రూ.4 లక్షలు ఫలితాలు వెలువడిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ ప్రశ్న పత్రం ఆధారంగానే తర్ఫీదు పొందిన సుస్మిత ఫిబ్రవరి 26న డీఏఓ పరీక్ష రాసింది. నాటకీయ పరిణామాల మధ్య గత నెలలో ఈ పేపర్ల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి రావడం, ప్రవీణ్ సహా మొత్తం 15 మంది అరెస్టు కావడం జరిగిపోయాయి. ప్రవీణ్‌ను సిట్ పోలీసులు రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించినా సుస్మిత వ్యవహారం చెప్పలేదు. కేవలం ఏఈ పేపర్లు మాత్రమే విక్రయించానని పదేపదే చెప్తూ సిట్ అధికారులను నమ్మించే ప్రయత్నం చేశాడు. రూ. 6 లక్షలపై తీగ లాగితే... అతడి బ్యాంకు ఖాతాలోకి నగదు లావాదేవీలు పరిశీలించిన అధికారులు రూ.6 లక్షలు ఫిబ్రవరి మూడో వారంలో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆ నగదు లావాదేవీల వివరాలు చెప్పాలంటూ విచారణ సందర్భంలో ప్రవీణ్‌ను తమదైన శైలిలో అడిగారు. తన కారు ఖమ్మంలోని కార్ల వ్యాపారి లౌకిక్‌కు విక్రయించానని, దానికి సంబంధించిన మొత్తమే అది అంటూ తొలుత నమ్మించే ప్రయత్నం చేశాడు. దీనిపై సందేహాలు వ్యక్తం చేసిన సిట్ లౌకిక్‌కు సంబం«దీకులు ఎవరైనా టీఎస్పీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారా? అనే అంశంపై దృష్టి పెట్టారు. కమిషన్ నుంచి తీసుకున్న ఆయా పరీక్షల అభ్యర్థుల జాబితాలోని వివరాలను సరి చూశారు. దీంతో లౌకిక్ భార్య సుస్మిత గ్రూప్–1తో పాటు డీఏఓ పరీక్ష రాసినట్లు వెల్లడైంది. దీంతో భార్యాభర్తలను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. శుక్రవారం ఇరువురినీ అరెస్టు చేసిన సిట్ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. వీరి నుంచి ఈ పేపర్ ఇంకా ఎవరికైనా చేరిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దంపతుల్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. -
చిరు కూతుళ్లు శ్రీజ, సుష్మితలతో అల్లు అర్జున్ వెకేషన్.. ఇది సరిపోదా?
అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇప్పటికే చిరంజీవి, అల్లు అరవింద్ స్పందించినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. రీసెంట్గా రామ్‌చరణ్ బర్త్‌డే పార్టీలో కూడా అల్లు అర్జున్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్ చిరంజీవి నివాసంలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. టాలీవుడ్ ప్రముఖులంతా పార్టీలో సందడి చేసినా అల్లు అర్జున్ మాత్రం రాకపోడంతో నిజంగానే వీరిద్దరి మధ్య స్టార్ వార్ నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ రూమర్స్‌కి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి చెక్ పెట్టింది. అల్లుఅర్జున్, శ్రీజ, సుష్మితలతో పాటు మరికొంత మంది కజిన్స్‌తో వెకేషన్‌కు వెళ్లిన వీడియోను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనికి లవ్ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒకవేళ నిజంగానే బన్నీ-చరణ్‌లకు మధ్య విబేధాలు ఉంటే శ్రీజ, సుష్మితలు బన్నీతో కలిసి వెకేషన్‌కు వెళ్లరు కదా, అయినా సోషల్ మీడియాలో విష్ చేయనంత మాత్రానా కథలు అల్లడమేనా? అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ఓటీటీకి వచ్చేస్తోన్న మెగా డాటర్ సుస్మిత చిత్రం!
నటుడు సంతోష్ శోభన్, నటి గౌరి జి. కిషన్ జంటగా నటించిన ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రం ‘శ్రీదేవి.. శోభన్‌బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా గత నెలలో విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కాగా, తాజాగా ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 30 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా వెల్లడించింది. కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పల్లెటూరులో జరిగిన అందమైన ప్రేమకథాగా నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్ర పోషించారు. హీరోయిన్ శ్రీదేవి ఓ ఫ్యాషన్ డిజైనర్. తన మేనత్తపై ప్రతీకారంతో అరకు వెళ్లిన ఆమె అక్కడ హీరో శోభన్ బాబును కలుసుకుంటుంది. ఆ తర్వాత శ్రీదేవి జీవితం ఎలా మారింది? అత్తపై ఆమె ప్రతీకారం తీర్చుకుందా? గతంలో తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు వంటి ఆసక్తికర సంఘటనలతో ఈ చిత్రం రూపొందింది. Sreedevi Shobhan Babu la entertainment flick March 30 nundi! 🍿🎬#SrideviShobanBabuOnHotstar premieres only on #DisneyPlusHotstar.@santoshsoban @Gourayy @sushkonidela #VishnuLaggishetty @dimmalaprasanth @GoldBoxEnt @NagaBabuOffl @SyedKamran @Saranyapotla pic.twitter.com/pdXiCWOgPj — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) March 15, 2023 -
కూతురికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
వాల్తేరు వీరయ్యతో అభిమానులకు ఫుల్ మీల్స్ అందించాడు మెగాస్టార్ చిరంజీవి. తనను ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుకున్నారో అంతకుమించి మాస్ యాంగిల్లో కనిపించి ట్రీట్ ఇచ్చాడు. దీని వెనకాల చిరు కూతురు సుష్మిత హస్తం కూడా ఉంది. వాల్తేరు వీరయ్యలో బాస్ పవర్‌ఫుల్‌గా కనిపించేందుకు ఆమె ఎంతగానో కష్టపడింది. ఈ సినిమాకు తనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. సుష్మిత అందించిన కాస్ట్యూమ్స్‌లో అటు మాస్ లుక్‌లో, ఇటు పాటల్లో క్లాస్ లుక్‌లో అదరగొట్టేశాడు బాస్. ఇదిలా ఉంటే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూతురికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు చిరంజీవి. బంగారు, వెండి పూత కలగలిపి ఉన్న దుర్గాదేవి ప్రతిమను సుష్మితకు కానుకగా అందించాడు. ఈ సందర్భంగా తండ్రితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సుష్మిత. 'నాకు ఈ బహుమతిచ్చినందుకు థాంక్యూ నాన్న. మహిళను దుర్గాదేవి కంటే శక్తివంతంగా ఇంకెవరు చూపగలరు?' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. కాగా నిర్మాతగా మారిన సుష్మిత ఇటీవలే శ్రీదేవి శోభన్‌బాబు సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే! కానీ ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. View this post on Instagram A post shared by Sushmita (@sushmitakonidela) -
శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ సతీమణి సురేఖ
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టిన రోజు నేడు. మహాశివరాత్రి రోజే ఆమె బర్త్‌డే రావడం విశేషం. ఫిబ్రవరి 18న ఆమె బర్త్‌డే, శివరాత్రిని పురస్కరించుకుని ఇవాళ శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని ఆమె దర్శించుకున్నారు. ఆమెతో పాటు పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కూడా ఉన్నారు. తల్లి సురేఖతో మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న వీడియోను సుష్మిత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక, చిరు దంపతుల పెద్ద కుమార్తె సుష్మిత కాస్టూమ్ డిజైనర్ అనే విషయం తెలిసిందే. తండ్రి చిత్రాలకు ఆమె కాస్టూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. -
మన జీవితాల్లోనివే ఈ సినిమాలో ఉన్నాయి – సుష్మిత కొణిదెల
‘‘మన జీవితంలో మనం అనుభవించే నిజమైన భావోద్వేగాలు, లవ్, ఫెంటాస్టిక్ డ్రామా ‘శ్రీదేవి శోభన్‌బాబు’లో ఉంటాయి. ప్రశాంత్‌తో పాటు యూనిట్ అంతా ఈ సినిమాకి మనసు పెట్టి పని చేశారు’’ అని సుస్మిత కొణిదెల అన్నారు. సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ జంటగా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో సుస్మిత మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి (చిరంజీవి) ఆశీస్సులతో మా ‘శ్రీదేవి శోభన్‌బాబు’ని మీ ‘శ్రీదేవి శోభన్‌బాబు’గా థియేటర్స్‌కి తెస్తున్నాం’’ అన్నారు. ‘‘చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఓ కాఫీ షాప్‌లో సుష్మిత అక్కని కలిసి, ‘నేను చిరంజీవి సార్ అభిమానిని.. డైరెక్టర్ అవుదామని ప్రయతి్నస్తున్నాను’ అన్నాను. అలా చెప్పిన ఐదు రోజులకే అక్క నుంచి కాల్ వచ్చింది.. నాన్న (చిరంజీవి) కథ వింటానన్నారు.. ఇంటికి రమ్మన్నారని అక్క అన్నారు. అక్కడికి వెళ్లగానే చిరంజీవిగారు సొంత మనిలా నన్ను పలకరించారు’’ అన్నారు. ‘‘అచ్చమైన తెలుగు సినిమా ‘శ్రీదేవి శోభన్‌బాబు’’ అన్నారు సంతోష్ శోభన్. ‘‘మా చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు విష్ణు ప్రసాద్. -
ఇది నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా : సుస్మితా కొణిదెల
సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ జంటగా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘1970 నేపథ్యంలో ఓ పల్లెటూరులో జరిగే అందమైన కథ ఇది’’ అన్నారు. ‘‘నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు నిర్మాత సుస్మిత. ‘‘ఈ సినిమా చూసిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటే బావుంటుందనే ఆలోచన వస్తుంది’’ అన్నారు ప్రశాంత్. ఈ కార్యక్రమంలో నటి గౌరి జి.కిషన్, నిర్మాత విష్ణు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య పొట్ల పాల్గొన్నారు. -
సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి వచ్చిన చిరంజీవి కూతుళ్లు
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చేసింది. చిరంజీవి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు(శుక్రవారం)గ్రాండ్‌గా విడుదల అయ్యింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. డప్పులు, డ్యాన్సులతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్ రోడ్డులోని సంథ్య థియేటర్ వద్ద తెల్లవారుజామున 4గంటలకే సినిమా షో పడింది. ఈ థియేటర్లో డైరెక్టర్ బాబీ, దేవీ శ్రీ ప్రసాద్‌లతో పాటు చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజలు వచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
కూతురి కోసం చిరంజీవి ఊహించని బహుమతి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. చిరుతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆయన కూతురు సుష్మిత కొణిదెల కూడా చిరుతో సినిమాతో చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుప్తుంది. చాలాకాంలంగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్న సుష్మిత మొన్నటివరకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా వ్యవహరించారు. చదవండి: రానాను పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల? ఆ హీరోతో లీడర్-2 ఇప్పుడు ఆమె గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ కోసం సుష్మిత ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా డైరెక్టర్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండానే కూతురికి గిఫ్ట్‌లాగా చిరు ఈ సినిమాను చేయాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చదవండి: అనాథ పాపను దత్తత తీసుకోవాలనుకున్నా : స్టార్ హీరోయిన్ -
అద్భుతం.. సేనాపతి మూవీపై మెగాస్టార్ రివ్యూ
Megastar Chiranjeevi Review On Rajendra Prasad Senapathi Movie: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరేశ్ అగస్త్య, హర్ష వర్థన్, జ్ఞానేశ్వరి, సత్య ప్రకాశ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం సేనాపతి. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాకు నిర్మాతగా వ్వవహరించిన సంగతి తెలిసిందే. యువ దర్శకుడు పవన్ సాదినేని రూపొందించిన ఈ సినిమా రెండు రోజుల క్రితం ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ సేనాపతిపై రివ్యూ ఇచ్చాడు. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్ ఈ సినిమాపై చిరు ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. సేనాపతి సినిమా చూశాను. యువ దర్శకుడు పవన్ ఎంతో ఆసక్తికరంగా, అద్భుతంగా తీశాడు. అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉండేలా ఈ మూవీని మలిచాడు. మంచి అభిరుచికి అద్దంపెట్టే చిత్రాన్ని నిర్మించి యువ నిర్మాతలు సుస్మిత కొణిదెల, విష్ణులకు నా ప్రేమాభినందనలు. అన్నింటికీ మించి సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో వినూత్న పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన నటనా ప్రతిభకు ఈ చిత్రం ఓ మచ్చు తనక’ అంటూ మూవీ టీంపై చిరు ప్రశంసలు కురిపించాడు. అంతేగాక ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చదవండి: నాకింగా 29 మాత్రమే, 30 తర్వాత ఆలోచిస్తా: సాయి పల్లవి Hearty Congrats Team #SENAPATHI !! A terrific thriller!#SenapathionAha #DrRajendraPrasad @Pavansadineni #LSVishnuPrasad@sushkonidela @ahavideoIN pic.twitter.com/WJcSBeqhK3 — Chiranjeevi Konidela (@KChiruTweets) January 5, 2022 -
సిస్టర్స్‌కు ట్రీట్ ఇచ్చిన హీరో రామ్‌చరణ్
హీరో రామ్ చరణ్ తన సిస్టర్స్ సుస్మితా కొణిదెల, నిహారిక, శ్రీజ కల్యాణ్‌లకు ఆదివారం లంచ్ ట్రీట్ ఇచ్చారు. రాఖీ పండగ సమయంలో రామ్‌చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూట్‌తో బిజీగా ఉండటం వల్ల తన సిస్టర్స్‌కు ట్రీట్ ఇవ్వలేకపోయారని, ఇప్పుడు టైమ్ దొరకడంతో వారిని లంచ్‌కి తీసుకెళ్లారట. పై ఫోటోలను సుస్మిత, నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. చదవండి :కృష్ణాష్టమి: 'రాధే శ్యామ్' సర్ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ Chiranjeevi: కపిల్ దేవ్‌ను కలిసిన చిరు A lovely afternoon with the favs @AlwaysRamCharan @sushkonidela #Sreeja 💜 pic.twitter.com/1OR7jrcvOc — Niharika Konidela (@IamNiharikaK) August 29, 2021 -
సినిమాల్లోకి మరో మెగా వారసురాలు, యువ హీరోతో..
ప్రస్తుతం టాలీవుడ్లో మెగా హీరోల హవా నడుస్తోంది. దాదాపుగా మెగా వారసులంతా పరిశ్రమలో అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్నారు. తాజాగా చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సైతం హీరోగా పరిచయమైన తన నటనతో మెప్పించాడు. మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టెసి దర్శక నిర్మాత దృష్టిని ఆకర్షించాడు. ఇక చిరంజీవి వారసుడు రామ్ చరణ్, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌లు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. కాగా మెగా కుటుంబ నుంచి ఒకేఒక్క అమ్మాయి నిహరీక సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా వెండితెర ఎంట్రీకి సిద్దమైందట. ఇప్పటికే క్యాస్టూమ్ డిజైనర్‌గా చిరు, చరణ్ చిత్రాలకు పని చేసిన సుస్మిత ఇటీవల తన భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్’ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్లో ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించారు. ఇక ఆమె ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైనట్లు సమచారం.ఇప్పటికే 8 తొట్టకల్ అనే తమిళ సస్సెన్ష్ థ్రిల్లర్ మూవీని తెలుగు రీమేక్ హక్కులకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తన సొంత బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సుస్మిత ఓ కీలక పాత్ర చేయనుందని వినికిడి. ఈ మూవీలో ఆమె ఓ యువ హీరోతో చేయనుందట. కాగా కేసు విచారణలో పోలీసు తన రివాల్వర్ పోగొట్టుకోగా ఇది ఎన్నో పరిణామాలకు దారి తీస్తుంది. ఈ లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాలుగేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కన్నడలోను రీమేక్ కాగా, అక్కడ భారీ హిట్ కొట్టింది. చదవండి: ‘బిల్లా’లో నా బికినీపై మా అమ్మ చేసిన వ్యాఖ్యలకు షాకయ్యా.. మహిళ ఫిర్యాదు.. యాంకర్ శ్యామల భర్త అరెస్ట్ -
‘షూట్–అవుట్ ఎట్ ఆలేరు’ మూవీ మీడియా సమావేశం
-
భర్త విష్ణు ప్రసాద్‌తో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత..
-
నిర్మాతగా మారిన మెగాస్టార్ కుమార్తె
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారారు. ఇప్పటికే సుష్మిత ఫ్యాషన్ డిజైనర్‌గానే కాకుండా, తన తండ్రి చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారి మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుష్మిత తన భర్త విష్ణుతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ మొదటగా ఓ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.(చదవండి : చిరు జుట్టుతో ఆడుకున్న సుష్మిత) కాగా, ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్‌లో జరిగాయి. మెగాస్టార్ సతీమణి సురేఖ చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సుష్మిత.. తన తల్లికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సుష్మితకు బెస్ట్ విషెస్ చెబతున్నారు. (చదవండి : టీవీ నటుడు సుశీల్ ఆత్మహత్య) -
మెగాస్టార్‌కు కటింగ్ చేసిన పెద్ద కూతురు
తండ్రికి భయపడే కూతుర్లు ఉంటారు. తండ్రి దగ్గర గారాలు పోయే పిల్లలూ ఉంటారు. కానీ తండ్రిని ప్రేమించని కూతుళ్లుండరు. నేడు "ఫాదర్స్ డే" సందర్భంగా సుష్మిత కొణిదెల ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బార్బర్ అవతారం ఎత్తింది. అది కూడా తండ్రి కోసం! ఓ చేతిలో కత్తెర, మరో చేతిలో దువ్వెన పట్టుకుని మెగాస్టార్ చిరంజీవికి క్షవరం చేస్తోంది. ప్రస్తుతం ఈ హెయిర్ కటింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే చివర్లో మెగాస్టార్ లుక్ మాత్రం చూపించలేదు. (మా నాన్న మాకు మంచి ఫ్రెండ్) మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా చిన్నప్పుడు తండ్రితో కలిసి దిగిన పాతఫోటోను జతచేసి ‘మా నాన్నతో చిరుత’ అంటూ ఫాదర్ డే శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. చిరంజీవి-సురేఖ దంపతులకు కొడుకు రామ్‌చరణ్‌తోపాటు, ఇద్దరు కూతుర్లు సుష్మిత, శ్రీజ ఉన్నారు. పెద్ద కూతురు సుష్మిత తన తండ్రి నటించిన 'ఖైదీ నంబర్ 150''తో పాటు 'రంగస్థలం', 'సైరా నరసింహారెడ్డి' సినిమాలకు డిజైనర్‌గా పని చేసింది. తక్కువ సినిమాలకే పని చేసినా టాలీవుడ్లో మంచి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పేరు గడించింది. (రోల్ మోడల్ రీల్ ఫాదర్స్) -
మీకేంత ధైర్యం.. విమర్శకులపై సుస్మిత ఫైర్
కోల్కత్తా : క్రికెటర్ మనోజ్ తివారీపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై అతని భార్య సుస్మితా రాయ్ మండిపడ్డారు. తన భర్తను విఫలమైన క్రికెటర్‌గా పేర్కొనడంపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడానికి ఎంత ధైర్యం అంటూ ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. టీమిండియాలో విఫలమైన ఆటగాళ్లు వీళ్లేనంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో ప్రచారంలోకి వచ్చింది. అందులో మనోజ్ తివారీ పేరు కూడా ఉంది. తాజాగా ఈ పోస్ట్‌పై స్పందించిన సుస్మిత అందుకు సంబంధించిన క్లిప్‌ను షేర్ చేశారు. తన భర్త పేరును ఆ జాబితాలో చేర్చడానికి ఎంత ధైర్యం అని ప్రశించారు. ఇటువంటి అర్థం లేని పోస్ట్‌లు క్రియేట్ చేసే ముందు నిజాలు చెక్ చేసుకోవడం మంచిదని హెచ్చరించారు. ఇతరుల గురించి చెడు ప్రచారం చేసే బదులు.. ఏదో ఒక పని చేసుకుంటూ బతకాలని హితవు పలికారు. కాగా, 2008లో టీమిండియాలో స్థానం దక్కించుకున్న తివారీ.. తన కేరీర్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొత్తంగా టీమిండియా తరఫున కేవలం 12 వన్డేలు, 3 టెస్టులు మాత్రమే ఆడారు. మరోవైపు ఐపీఎల్ విషయానికి వస్తే.. 2012లో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించారు. 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో తివారీని పంజాబ్ జట్టు దక్కించుకోగా.. 2019లో మాత్రం అతడికి నిరాశే మిగిలింది. ఇక, దేశవాలీ క్రికెట్‌కు సంబంధించి బెంగాల్ జట్టులో తివారీ కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. ఇటీవల బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరడంలో తివారీ కీలక భూమిక పోషించారు. 11 మ్యాచ్‌ల్లో 707 పరుగులు సాధించారు. మళ్లీ తిరిగి సత్తా చాటడానికి తివారీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. సుస్మిత కూడా తన భర్తకు చాలా మద్దతుగా నిలుస్తున్నారు. (చదవండి : ఏది ఏమైనా వదలడు.. కుంబ్లేపై లక్ష్మణ్ ప్రశంసలు) View this post on Instagram Who so ever created dis profile How dare u bloody dragged my husband’s name in it. U better do ur bloody facts check. Do something in ur shit ugly life rather dan posting shit about people. Go n get a life 👎🏻👊 A post shared by 𝕾𝖚𝖘𝖒𝖎𝖙𝖆𝕽𝖔𝖞𝕿𝖎𝖜𝖆𝖗𝖞 (@roy_susmita7) on May 31, 2020 at 1:01pm PDT -
నాన్న సినిమాకు చేయడం ఛాలెంజింగ్‌గా తీసుకున్నా!
సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ మెగా మూవీ సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఒళ్లు గగుర్పొడిచేలా నటించారు చిరంజీవి. అయితే ఆ సినిమాలో వాడిన కస్టూమ్స్ , జ్యూవెలరీ గురించి సినిమా కాస్టూమ్ డిజైనర్, మెగాస్టార్ చిరంజీవి తనయ సుస్మిత చెప్పిన ముచ్చట్లు అదేవిధంగా ఆమ్రపాలి డైరెక్టర్,సైరా సినిమా కోఆర్డినేటర్ అనిల్ అజ్మీర్ సైరా నరసింహారెడ్డి గురించి చెప్పిన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. -
అది..రాంచరణ్‌నే అడగండి: సుస్మిత
కొత్తదనాన్ని డిజైన్ చెయ్యడానికి విజన్ ఉన్న డిజైనర్ చాలు. పాతదనాన్ని డిజైన్ చెయ్యడానికి మాత్రంఇమేజ్ని, ఇమాజినేషన్ని కలిపే ప్రతిభ ఉండాలి. కళ్లముందు కనిపించే ఇమేజ్‌ని రెండు శతాబ్దాల వెనకటి ఇమాజినేషన్తోమ్యాచ్ చేసిన అమేజింగ్ డిజైనర్ సుస్మిత. చిన్నప్పుడు నాన్న రెడీ చేయించిన ఈ అమ్మాయి కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా ఇప్పుడు నాన్నను ‘సైరా’ కోసం రెడీ చేసింది! నరసింహారెడ్డిలా నాన్నను ఇమాజిన్ చేసిన ఈ ‘ఇమేజింగ్’ డిజైనర్‌తో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ‘రాధే గోవిందా...’ అంటూ అప్పట్లో ‘ఇంద్ర’ సినిమాలో పాటకు మీ నాన్నగారు వేసుకున్న డ్రెస్సులు ట్రెండీగా ఉన్నాయి. మీకది ఫస్ట్ సినిమా కదా? సుస్మిత : అవును. 2002లో ఆ సినిమా వచ్చింది. పదహారేళ్ల క్రితం ట్రెండ్‌కి తగ్గట్టుగా నాన్నగారి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను. ట్రెండ్‌ని మాత్రమే కాదు.. నాన్న స్టైల్‌కి తగ్గట్టు డిజైన్ చేస్తుంటాను. యాక్చువల్‌గా కాస్ట్యూమ్ డిజైనర్‌గా నాకది ఫస్ట్ మూవీ. కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు మీ డాడీకి స్టయిలింగ్ చేస్తున్నారు. చిన్నప్పుడు ఎప్పుడైనా మీ నాన్నగారు మిమ్మల్ని రెడీ చేసిన సందర్భాలున్నాయా? (నవ్వుతూ). నాన్నగారు మా చిన్నప్పుడు ఫుల్ బిజీగా ఉండేవారు. మాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసే వీలు లేకుండా పోయింది. అయితే మమ్మల్ని ఆయన పూర్తిగా రెడీ చేయకపోయినా మా అమ్మగారు రెడీ చేసిన తర్వాత ‘ఇది బావుంది, ఇలా బాలేదు. మార్చు’ అని చెప్పేవారు. అమ్మకి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. మీ స్టయిలింగ్‌పై మీ నాన్న అభిప్రాయం? నాన్నగారి దగ్గర ఉన్న మంచి విషయం ఏంటంటే.. తన కూతురే కదా అని ఏం చేసినా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చేయరు. కాంప్లిమెంట్ ఎంత బాగా ఇస్తారో, మిమర్శ కూడా అలానే చేస్తారు. బాగా లేకపోతే ‘వేరే ఆప్షన్ చూపించు’ అంటారు. అందుకే నాన్నగారితో వర్క్ చేయడం చాలా బావుంటుంది. ఆయన ఇచ్చే విమర్శ కూడా విలువైనదే. ‘సైరా’లో ఒక 45 లుక్స్ ఉంటాయి. అందులో 6–7 సార్లే చిన్న చిన్న మార్పులు కోరారు. చిరంజీవిగారి కోసం ఎన్ని కాస్ట్యూమ్స్ తయారు చేశారు? నాన్నకే సుమారు 100 నుంచి 120 కాస్ట్యూమ్స్ చేశాం. ఇంకా అమితాబ్‌గారు, నయనతార, తమన్నా కూడా ఉన్నారు. సుదీప్, సేతుపతి, జగపతిబాబు, రవికిషన్లకు ఉత్తరా మీనన్ డిజైన్ చేశారు. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్లే సుమారు 50 మందికి పైగా ఉన్నారు. సాధారణంగా కాస్ట్యూమ్స్ సూట్‌కేసుల్లో తీసుకెళ్తాం. ఈ సినిమా కాస్ట్యూమ్స్ మాత్రం పెద్ద పెద్ద ట్రంకు పెట్టెల్లో డీసీఎం వ్యానులో తీసుకెళ్లేవాళ్లం. కొన్ని కాస్ట్యూమ్స్‌ని మడతపెట్టకూడదు. అలాగే హ్యాంగర్‌కి తగిలించి, జాగ్రత్తగా లొకేషన్‌కి తీసుకెళ్లేవాళ్లం. నాన్నగారి లుక్ చూసి మీ అమ్మగారు ఏమన్నారు? నాన్నగారి తలకట్టు, మీసం అయితే అమ్మకు చాలా నచ్చింది. అమ్మకి ఇది స్పెషల్ సినిమా. ఎందుకంటే నాన్న, నేను, చరణ్, ఈ కంపెనీ సీఈఓ మా పెద్దమ్మ వాళ్ల అమ్మాయి విద్య.. ఇలా అందరం ఈ సినిమాకి పని చేశాం. నేను అనుకున్న విధంగా నగలు ఎవరు డిజైన్ చేస్తారనే సందిగ్ధ సమయంలో మా అమ్మ సురేఖ ‘మంగత్రాయ్’ను సంప్రదించమని చెప్పారు. వెంటనే ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ గుప్తాను కలిశా. నేను గీసిన కొన్ని డిజైన్స్ ఇచ్చా. నేను అనుకున్నట్లు నగలు డిజైన్ చేశారు. చిరంజీవిగారి కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ ఒప్పుకున్నాక ఆయనేమో ఆ షూటింగ్‌కి చరణ్ ‘రంగస్థలం’ షూటింగ్‌కి వెళుతుంటే ఆవిడ చాలా హ్యాపీగా ఫీలయ్యారట.. అవును. ‘ఖైదీ నంబర్ 150’ పూర్తవ్వక ముందే రంగస్థలం మొదలైంది. నాన్న, చరణ్, నేను రెడీ అయి వెళుతుంటే అమ్మకి స్పెషల్ మూమెంట్‌లా అనిపించేది. ‘రంగస్థలం’ పూర్తవ్వకముందే ‘సైరా’ స్టార్ట్ అయింది. ఈసారి మేం ముగ్గురం ఒకే సినిమాకి అంటే ఆవిడకి చాలా ఆనందం అనిపించింది. ఖైదీ నంబర్ 150’ కమర్షియల్ ఫార్మట్. ‘రంగస్థలం’ మీకు అలవాటు లేని డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్. అదో చాలెంజ్ అయితే ‘సైరా’ హిస్టారికల్. ఈ సినిమాలో మీరెలా భాగమయ్యారు? చిరంజీవిగారి పర్సనల్ స్టయిలింగ్, బాడీ లాంగ్వేజ్ తెలిసి ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ అయితే బెస్ట్ అనుకున్నారు. డాడీ పర్సనల్ స్టయిలింగ్ డిపార్ట్మెంట్లో నేనెప్పుడూ ఉంటాను. ‘సైరా’ సినిమాకు అంజు మోడీ అనే డిజైనర్‌ని తీసుకున్నారు. సినిమాకు కావాల్సిన మూడ్, కలర్ పాలెట్ అంతా ఆమె డిజైన్ చేశారు. ఆ తర్వాత ఆమెకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో కంటిన్యూ చేయలేకపోయారు. అప్పుడు నరసింహారెడ్డి పాత్రకు సంబంధించిన డిజైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. నేను కొన్ని డిజైన్ చేశాను. ‘మిగతా లీడ్ రోల్స్‌కి (నయనతార, సుదీప్, తమన్నా, అనుష్క) కూడా నువ్వెందుకు చేయకూడదు?’ అని చరణ్ అడిగాడు. సాధారణంగా పెద్ద స్టార్స్ అందరికీ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు. ఈ సినిమాలో కొన్ని లీడ్ పాత్రలన్నీ ఒకే సింక్‌లో ఉండాలి. వేరు వేరు డిజైనర్స్‌ని ఒక చోటుకి రప్పించి అందరితో ఒకలాంటి స్టయిల్లో చేయించడం ప్రాక్టికల్‌గా కుదరదు. ‘నీకు స్టోరీ మొత్తం తెలుసు. కథకు ఏం కావాలో తెలుసు. వాళ్లకి కూడా నువ్వే డిజైన్ చేయి’ అన్నాడు చరణ్. వాళ్లందరూ పెద్ద పెద్ద స్టార్స్. దాంతో నాకు చిన్నపాటి ప్రెషర్ అనిపించింది. కొన్ని డిస్కషన్స్ తర్వాత చేయగలననిపించింది. కంటిన్యూస్‌గా దాదాపు మూడు సమ్మర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాయి.. (నవ్వుతూ). ‘రంగస్థలం’ షూటింగ్‌ని రాజమండ్రిలో మంచి ఎండల్లో చేశాం. దాదాపు అందరం ట్యాన్ అయిపోయాం. కొందరైతే కళ్లు తిరిగి కూడా పడిపోయారు. అలా ఒక సమ్మర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ‘సైరా’కి వచ్చేసరికి రెండు సమ్మర్లు చూశాం. ఫుల్‌గా ఎండలోనే షూటింగ్ చేశాం. ఫ్యాబ్రిక్‌లో ఎక్కువ ఖాదీ, కాటన్, ఖాదీ సిల్క్ ఉపయోగించాం. ఖాదీ స్క్రీన్ మీద బాగా కనిపిస్తుంది. కంటికి సరిగ్గా అర్థం కాకపోయినా స్క్రీన్ మీద అర్థం అవుతుంది. సరిగ్గా చేయకపోతే ఈజీగా దొరికిపోతాం. చాలా జాగ్రత్తగా చేనేత ఫ్యాబ్రిక్స్ వాడాం. ఇది హిస్టారికల్ సినిమా కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకూ సెట్లోనే ఉండాల్సి వచ్చింది. కష్టమే అయినా ఇలాంటి సినిమాలు చేసినప్పుడు సంతృప్తి ఉంటుంది. నరసింహారెడ్డిగారికి సంబంధించి మనకు అందుబాటులో ఉన్న సమాచారం చాలా తక్కువ కదా... చారిత్రాత్మకంగా కరెక్ట్‌గా ఉంటూ, కమర్షియల్ మీటర్‌ను ఆర్టిస్టిక్‌గా ఎలా బ్యాలన్స్ చేశారు? పరిశోధన బాగా చేశాం. నరసింహారెడ్డిగారి మీద ఎక్కువ సమాచారాన్ని ఎవరూ పేపర్ మీద పెట్టలేదు. కొన్నే ఉన్నాయి. మేం చేసిందేంటంటే.. 1800 కాలంలో ప్రజలు ఎలాంటి బట్టలు వేసుకునేవారు? ఎలాంటి రంగులు వాడేవారు? స్త్రీల చీరకట్టు ఎలా ఉండేది? మగవాళ్ల పంచెకట్టు ఏంటి అనే విషయాలను తీసుకొని డిజైన్ చేశాం. స్వాతం త్య్రోద్యమ సమయంలో నాటి ఉద్యమకారుల్ని ఉహించుకుని నరసింహారెడ్డి ఇలా ఉంటారనే విధంగా 400కి పైగా స్కెచ్‌లు వేసుకున్నా. ఫైనల్‌గా 40 స్కెచ్‌లు ఎంపిక చేసుకుని ఆ లుక్ వచ్చేలా శ్రమించా. కమర్షియల్గానూ ఉండాలి. లేదంటే డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది. అక్కడ నా అనుభవం ఉపయోగపడిందని నేను గర్వంగా చెప్పగలను. స్క్రీన్ మీద ఏది బాగా కనిపిస్తుంది, ఏది ఎబ్బెట్టుగా ఉంటుందో నాకు ఐడియా ఉంది. ప్రతి లుక్‌కి ఓ బ్యాకప్ పెట్టుకున్నాను. ఒక షెడ్యూల్లో ఐదు డ్రెస్ చేంజ్‌లు ఉంటే, ఒకటికి మూడు పెట్టుకునేదాన్ని. చరణ్ మిమ్మల్ని నమ్మి ఈ పని అప్పగించారు.. అయితే ప్రాక్టికల్‌గా పని మొదలుపెట్టాకే మనమీద మనకు పూర్తి నమ్మకం కలుగుతుంది కదా... ఆ నమ్మకం మీకెప్పుడు కలిగింది? ఫస్ట్ షెడ్యూల్లో రెండు మూడు సీన్లు చేసేటప్పటికే నేను క్యారెక్టర్ని అర్థం చేసుకుంటున్నానని తెలిసిపోయింది. బాగా చేయగలం అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే అందరికీ ఎలా వస్తుందా అనే డౌట్ ఉండేది. రషెస్ చూశాక నమ్మకం కలిగింది. కాస్ట్యూమ్స్ మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పించారు? ఇందులో వాడినవన్నీ ఎక్కువ మన దేశంలోనివే. అమితాబ్‌గారికి వాడినవాటిలో కొన్నింటిని ఢిల్లీ నుంచి తెప్పించాం. లేడీస్‌కి మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం చీరలు వాడాము. పాత్రల కాస్ట్యూమ్స్ చూస్తే షాప్‌లో నుంచి తీసుకొచ్చి వేసుకున్నట్టు ఉండదు. ఆ పాత్రలు ఎప్పుడూ కట్టుకునే బట్టల్లానే ఉంటాయి. కాస్ట్యూమ్ ఆథెంటిసిటీ ఈ సినిమాలో వందశాతం ఉంటుంది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎంత సంతృప్తికరంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాను. అందరం మనస్ఫూర్తిగా కష్టపడి చేసిన సినిమా ఇది. చారిత్రాత్మక సినిమాలు చేసేటప్పుడు రంగుల్లో కొన్ని పరిమితులు ఉంటాయి కదా? అవును. ఇది వార్ సినిమా కాబట్టి ఒక బ్రౌన్ కలర్ టోన్ ఉంటుంది. అందుకోసం కొన్ని కలర్స్ వాడకూడదు. ఈ సినిమాలో ప్రాథమిక రంగులేవీ వాడలేదు. (రెడ్, బ్లూ, ఎల్లో) ఏవీ వాడలేదు. అవి స్క్రీన్ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కాస్ట్యూమ్స్ ఎప్పుడూ కథలో కలసిపోవాలని నేను నమ్ముతాను. ఈ రంగులు మామూలుæ కమర్షియల్ సినిమాలకైతే ఫర్వాలేదు. ఇలాంటి సినిమాలకు వాడితే కథలో నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ కలిగిస్తాయి. ఆ పాత్ర ఎలాంటి మూడ్‌లో ఉన్నారో కూడా కాస్ట్యూమ్స్ ద్వారా తెలియజేయాలి. కాస్ట్యూమ్స్ అంటే కెమెరా, దర్శకుడు, ఆర్ట్ డిపార్ట్మెంట్తో సమన్వయం ఉండాలి. ఈగోలు ఉండటం సహజం. వాటిని ఎలా పరిష్కరించుకుంటారు? డైరెక్టర్, ఆర్ట్‌డైరెక్టర్, కెమెరామేన్, కాస్ట్యూమ్స్ ఈ నాలుగింటినీ క్రియేటివ్ డిపార్ట్మెంట్ అంటారు. క్రియేటివ్ డిపార్ట్మెంట్ కలసి పని చేయాలి. నేను అందరితో సింక్‌లో ఉండి చేయాలనుకుంటాను. క్రియేటివ్ డిపార్ట్మెంట్లో ఈగోలు కామన్. చరణ్ నన్ను అక్కగా ఈ సినిమా చేయమనలేదు. ఒక నిర్మాతగా నన్ను డిజైనర్‌గా ఈ సినిమాలో భాగమవ్వమన్నాడు. హోమ్ వర్క్ బాగా చేస్తాను. అది తనకి తెలుసు. ‘ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా’ వరుసగా కెమెరామేన్ రత్నవేలుతో మూడో సినిమా. ఆయన సూచనలు ఉపయోగపడ్డాయి. ఒకవేళ సెట్లో ఎవరితో అయినా అభిప్రాయభేదాలు వస్తే అది ఆ రోజు వరకే. ఎందుకంటే అవి వ్యక్తిగత విభేదాలు కావు. కొన్నిసార్లు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికే టైమ్ పడుతుంది. దర్శకుడు మనసులో ఏముందో అర్థం చేసుకుంటే పని సులువు అవుతుంది. ‘సైరా’ శ్రమతో కూడుకున్న సినిమా అన్నారు. ఎందుకు ఒప్పుకున్నానా అనే సందర్భాలు? అలా అనుకుంటే ఈ ఫీల్డ్‌లో ఉండలేం. నేను చిరంజీవిగారి కూతుర్ని కదా నేను పని చేయడమేంటి? మనం పని చేయించుకోవచ్చు కదా అని పని చేస్తే మనల్ని చూసి పని చేసేవాళ్లు కూడా పాడైపోతారు. వాళ్లను కూడా చెడగొట్టినవాళ్లం అవుతాం. వాళ్లతో పని చేయించాలంటే నేనూ అలానే పని చేయాలి. రాత్రి ఎంతైనా సరే నేను వాళ్ల వెనకే ఉండాలి. నేనే ఉన్నానంటే వాళ్లు కూడా ఉండాల్సిందే. అలా పని పూర్తి చేసేదాన్ని. పని చేస్తూ, చేయిస్తూ ఉంటేనే పని జరుగుతుంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా నేను ఈ పనులన్నీ చేస్తున్నానంటే మీరు కూడా చెయొచ్చు అని మా టీమ్‌లో అమ్మాయిలకు చెబుతుంటాను. ఇదే కష్టపడే సమయం.. ఉపయోగించుకోవాలని చెబుతుంటాను. మీ ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు చేశారు. బయట వాళ్లతో చేయాలనుకోవడం లేదా? ఇక్కడ ఇన్ని అవకాశాలు దొరికాయి. ఇంతకంటే ఎక్కువ చేయలేం. నాకు 9 ఏళ్ల పాప, 7 ఏళ్ల పాప ఉన్నారు. పనిని, ఇంటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువ సినిమాలు చేస్తే ఆ బ్యాలెన్స్ ఖచ్చితంగా పోతుంది. ప్రత్యేకంగా ఎవరైనా యాక్టర్‌కి స్టయిలింగ్ చేయాలనుకుంటున్నారా? అమితాబ్గారితోనే మరో సినిమా చేయాలనుంది. ఆయన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆయన స్థాయికి నేను చాలా చిన్న డిజైనర్‌ని. అయినా గౌరవించారు. ‘నువ్వు చిన్నయినా పెద్దయినా నువ్వు ఒక పని చేస్తున్నావు. దానికి గౌరవం ఇస్తాను. నీ పని నీకు బాగా తెలుసు. నువ్వు అనుకున్న కలర్సే తీసుకురా. వేసుకుంటాను’ అని ఆయన అన్నారు. దాంతో సౌకర్యంగా అనిపించేది. ఏదైనా చెప్పినప్పుడు ఓ కొత్త నటుడిలా చాలా శ్రద్ధగా వింటారు. సినిమాలో అమితాబ్‌గారి క్యారెక్టర్ కీలకమైనది. ఆయనకి 15 నుంచి 18 కాస్ట్యూమ్స్ ఉంటాయి. ‘సైరా’ 1800 కాలం. ఈ సినిమా తర్వాత కొరటాల శివగారి డైరెక్షన్లో మీ నాన్నగారు చేయబోతున్నారు. 1800 నుంచి ఇప్పుడు 2020కి మీరు వర్క్ చేయాలి... యస్. ఇంత వేరియేషన్ అంటే చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. నాకు హీరో పాత్ర వరకూ చెప్పారు. నాన్నగారి పాత్ర కాకుండా కొన్ని ముఖ్యమైన పాత్రలకు కూడా లుక్ డిజైన్ చేయమన్నారు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా కోసం మేం ఒక లుక్‌ని డిజైన్ చేశాం. అదే ఫైనల్ కాదు. ఇంకొన్ని లుక్స్ ఉన్నాయి. మీ వృత్తే కాస్ట్యూమ్ డిజైన్ చేయడం. రోజూ ప్రత్యేకంగా రెడీ అవుతారా? ఒక్కోసారి టైమ్ ఉండదు. దొరికింది వేసుకొని షూటింగ్‌కి పరుగు పెట్టడమే (నవ్వుతూ). డిజైనర్‌గా మారడానికి మీ స్పూర్తేంటి? సినిమాయే నా స్ఫూర్తి. చిన్నప్పటి నుంచి సినిమా చూస్తూనే పెరిగాను. గంటలకొద్దీ షూటింగ్‌లు చూసేదాన్ని. అలా చూస్తూ ఉండిపోగలను. సినిమాకి, ఫ్యాషన్‌కి కలిపేది కాస్ట్యూమ్స్. అందుకే దీన్ని ఎంచుకున్నాను. 150 సినిమాల్లో ఎన్నో పాత్రల్లో చిరంజీవి కనిపించారు. ఆయన లుక్స్‌లో మీ ఫేవరెట్ ఏది? ‘కొదమసింహం’. ఆ సినిమాలో కౌబాయ్ లుక్ భలే ఇష్టం. ‘కొండవీటి దొంగ’ కూడా ఇష్టం. ‘చంటబ్బాయి’ సినిమా నా ఫేవరెట్. నిర్మాణ సంస్థ కూడా ఏర్పాటు చేస్తున్నారు? అవును. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో స్టార్ట్ చేశాను. ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ ట్రెండ్ నడుస్తోంది. నేను డిజిటల్ కంటెంట్ బాగా చూస్తుంటాను. మా ఆయన ఊరికే కంప్లయింట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన్నే ఈ బిజినెస్‌లోకి దించేశాను. ఆయన ఫైనాన్స్ చూసుకుంటారు. కాస్ట్యూమ్ డిజైనర్, ఇద్దరి పిల్లలకు అమ్మగా, ఇప్పుడు నిర్మాతగా ఎలా మ్యానేజ్ చేస్తున్నారు.. ఫ్యామిలీని మిస్సవుతున్న ఫీలింగ్? నేను చెన్నైలో ఉంటాను. ‘సైరా’ కోసం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. పిల్లల్ని అక్కడ వదిలి నేనిక్కడ పని చేయడం కుదరదు. పిల్లలతో వచ్చాను. మా ఆయన చెన్నై టు హైదరాబాద్ ట్రావెల్ చేశారు. అది హెల్ప్ అయింది. ప్యాకప్ అయిన తర్వాత పిల్లలతో ఉండేదాన్ని. నైట్ షూటింగ్ అప్పుడు వాళ్లు స్కూల్‌కి వెళ్లే ముందు కనబడేదాన్ని. అలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేశాను. మా అమ్మ, నా భర్త నా పెద్ద సపోర్ట్. పిల్లల్ని చూసుకోవడానికి అమ్మ ఉన్నారు. వర్క్ పరంగా ఇబ్బందిగా ఉంటే మా ఆయన ఉంటారు. మెడిటేషన్ చేయించకుండానే మెడిటేషన్ చేసినట్టు కూల్ చేసేస్తారు. మీరు ఏ పని చేసినా మీ బ్యాక్‌గ్రౌండ్ తాలూకా ప్రెషర్ కచ్చితంగా ఉంటుంది కదా? మేమెలా పెర్ఫార్మ్ చేస్తాం అనే విషయంలో ఎప్పుడూ ఒక ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రెషర్‌తో పని చేయకూడదు. ఈ ఒత్తిడితో పని చేస్తే ఎక్కడో చోట మిస్ అయిపోతాం. అనుకున్న అవుట్‌పుట్ ఇవ్వలేం. అందుకే ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. మమ్మల్ని అలానే పెంచారు. మీరు అదీ ఇదీ అన్నట్టు పెంచలేదు. అందరిలానే. నేనెప్పుడూ సెలబ్రిటీని అనుకోను. నా సొంతంగా నేనేదైనా సాధించినప్పుడు నేను కూడా సెలబ్రిటీయే అని భావిస్తాను. అప్పటి వరకూ నేను కూడా అందరిలానే వర్కింగ్ మామ్నే. కమర్షియల్, పీరియాడిక్, ఇప్పుడు హిస్టారిక్ సినిమా చేశారు. అన్నింట్లో ఏది ఈజీ.. ఏది టఫ్? ‘సైరా’ చాలా శ్రమతో కూడుకున్న సినిమా. అంత శ్రమ ఉంది కాబట్టి అందులో చాలా చాలెంజ్‌లు ఉన్నాయి. చాలెంజ్‌లు ఎదురైనప్పుడు మన పని మీద ఆసక్తి ఇంకా పెరుగుతుంటుంది. షెడ్యూల్స్ ఎంత చాలెంజింగ్‌గా, క్రేజీగా ఉంటేనే అంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు మనకు చాలా నేర్పిస్తాయి. మరి.. రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు? (నవ్వుతూ) చరణ్‌నే అడగండి. ►ఫ్యాషన్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా రెండేళ్లుగా ఎంత కష్టపడ్డాననేది ఈ సినిమా ద్వారా నిరూపితం కానుంది. ‘యాజ్ ఏ ఫ్యాన్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ద మూవీ’ (ఆనంద బాష్పాలతో). నరసింహారెడ్డి ఎలా ఉంటాడో కూడా తెలియని ప్రపంచానికి ఈ సినిమా ద్వారా స్వయానా నేను నాన్నని డిజైన్ చేసి చూపించబోతున్నా. – గౌతమ్ మల్లాది -
నాన్న చిరంజీవికి, తమ్ముడు చరణ్‌కి ఆమె డిజైనర్!
జీవితమంతా కుట్లు అల్లికలే. అలా కుట్టీ.. అల్లీ.. పేరిస్తేనే జీవితం అందంగా కనబడుతుంది. డైరెక్టర్ కథ అల్లుతాడు.. సినిమాటోగ్రాఫర్ కెమెరాతో కథను కూర్చుతాడు. రైటర్ సంభాషణతో ఎంబ్రాయిడరీ చేస్తాడు... ఎడిటర్ సైజ్‌కి కట్ చేస్తాడు. ఇవన్నీ రంగస్థలం మీదకు వచ్చే ముందు హీరోకి క్యారెక్టర్ అన్న దుస్తులు తొడుగుతారు. సుష్మిత... నాన్న చిరంజీవికి, తమ్ముడు చరణ్‌కి క్యారెక్టర్ అన్న దుస్తులు కుడుతుంది. ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ మీ నాన్నగారి (చిరంజీవి)కి, ఇప్పుడు తమ్ముడి (రామ్‌చరణ్)కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మీ ఫీలింగ్? సుష్మిత: ఫ్యాషన్ స్టైలింగ్‌లో స్పెషలైజేషన్ చేశా. మొదట్నుంచీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. డాడీ ‘ఇంద్ర’ సినిమాలో ‘రాధే గోవిందా..’ సాంగ్‌కి స్టైలింగ్ చేశా. ఆ తర్వాత ‘అందరివాడు’. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’కి ఫస్ట్ టైమ్ ఫుల్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశా. అంతకుముందు సాంగ్స్‌పైనే దృష్టి పెట్టేదాన్ని. డాడీ తర్వాత తమ్ముడి సినిమా (‘రంగస్థలం)కి చేయడం చాలా మంచి అనుభవం. ‘రంగస్థలం’ విలేజ్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి సవాల్‌గా అనిపించిందా? డాడీ ‘ఖైదీ నంబర్ 150’కి చరణ్‌తో కలసి సహ నిర్మాతగా చేశా. కానీ, చరణ్ హీరోగా ఉన్నప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేయడం ఇదే ఫస్ట్‌టైమ్. 1985 బ్యాక్‌డ్రాప్ మూవీ కాబట్టి నైన్టీన్ ఎయిటీస్ సినిమాలు చూశాను. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల యాస, కట్టూబొట్టు, వ్యవహార శైలి, సంప్రదాయాల గురించి అవగాహన ఉంది. అయినా బాగా రిసెర్చ్ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ సుకుమార్‌గారు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. దాంతో కొంచెం వర్క్ ఈజీ అయ్యింది. సినిమాకి కావల్సిన ఫ్యాబ్రిక్ ఎక్కడ కొన్నారు? ఎయిటీస్‌లో వాడిన లుంగీలు, చొక్కాలు, ప్రింట్లు ఇప్పుడు లేవు. పెద్ద పెద్ద గళ్లు, డార్క్ కలర్స్ వాడేవాళ్లు. అప్పట్లో వాడిన కొన్ని కలర్స్ ఇప్పుడు లేవు. కొన్ని లుంగీలు, చొక్కాలు ప్రత్యేకంగా ప్రింట్ చేయించాం. తూర్పు గోదావరి జిల్లాలో షూట్ చేసినప్పుడు రాజమండ్రి లోకల్ మార్కెట్స్, పోలవరం మార్కెట్స్‌లో కొన్నాం. హైదరాబాద్‌లోనూ షాపింగ్ చేశాం. ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఎంతకాలం సినిమాలు చేసినా చూస్తారు. కూతురిగా మీ డాడీకి రెస్ట్ కావాలని మీకనిపించదా? అస్సలు లేదు. ఎందుకంటే ఖాళీగా ఉంటే డాడీ అదోలా ఉంటారు. తమ్ముడు కూడా ఆ టైపే. డాడీ ఇంట్లో ఉండటంకన్నా షూటింగ్‌తో బిజీగా ఉండటమే బెటర్. పని చేసిన రోజున చాలా హ్యాపీగా ఉంటారు. అందుకే డాడీ అలా వర్క్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. జనరల్‌గా కొంతమంది డిజైనర్స్ అవసరానికి మించి డ్రెస్సులు కుట్టించేసి, నిర్మాతతో ఖర్చు పెట్టిస్తారట. ‘రంగస్థలం’లో సాదాసీదా బట్టలే కాబట్టి ఎక్కువ ఖర్చు అయ్యుండదేమో? నేను ప్రొడ్యూసర్– ఫ్రెండ్లీ కాస్ట్యూమ్ డిజైనర్‌ని. ముందు కొనేద్దాం. తర్వాత చూసుకుందాం అనుకోను. నేనేదో ఫుల్ పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు కానీ, బాగా ప్లాన్ చేసి చాలా తక్కువ వేస్టేజ్ అయ్యేలా చూసుకుంటా. ఒకవేళ ఏమైనా మిగిలిపోతే అవి కూడా యాజ్ అయ్యేలా ట్రై చేస్తా. ఇన్డోర్ లొకేషన్ అనుకోండి.. ఆ రోజుకి ఏం కావాలో అదే రెడీ చేస్తా. అవుట్డోర్ అప్పుడు సేఫ్టీ కోసం రెండు మూడు డ్రెస్సులు ఎక్స్ట్రా ప్లాన్ చేస్తా. అంతే. చిట్టిబాబు (రామ్‌చరణ్ పాత్ర పేరు) కోసం ఎన్ని లుంగీలు కొన్నారేంటి? సినిమా మొత్తం ఆ గెటప్‌లోనే కనిపిస్తారా? రఫ్‌గా 35 నుంచి 40. చరణ్ విలేజ్ మాస్ కుర్రాడి క్యారెక్టర్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. 85 పర్సెంట్ లుంగీ గెటప్‌లోనే కనిపిస్తాడు. చిట్టిబాబు లుక్ గురించి సుకుమార్‌గారు చెప్పినప్పుడే ఎగై్జట్ అయ్యాను. చాలా స్కెచ్ వర్క్ చేశాం. ఎందుకంటే చరణ్‌ను నేనెప్పుడూ అలా చూడలేదు. ఇంట్లో కూడా అలా ఉండడు. ఇంతకీ చిట్టిబాబు అలియాస్ రామ్‌చరణ్‌కి లుంగీ కట్టుకోవడం వచ్చా? వచ్చా అంటే.. యాక్టర్స్ ఎవరైనా కొత్త విషయాన్ని ఇట్టే నేర్చుకోగలరు. చరణ్ కూడా అలాగే నేర్చుకున్నాడు. లుంగీలు కట్టుకోవడం చరణ్‌కి ఈజీగానే అలవాటైపోయింది. మధ్యలో లాంగ్ గ్యాప్ తీసుకున్నారు.. ‘ఖైదీ నంబర్ 150’తో రీ–ఎంట్రీ అయ్యారు. మళ్లీ ఎంటర్ కావడానికి రీజన్? పిల్లలు పుట్టిన తర్వాత బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దయ్యారు. ‘ఖైదీ నంబర్ 150’కి ముంబయ్ నుంచి షబీనా ఖాన్ అని హై ప్రొఫైల్ డిజైనర్ వచ్చారు. మంచి డిజైన్స్ ఇచ్చారావిడ. ముంబై వాళ్లకు డాడీ ఇమేజ్ తెలియకపోవచ్చు. ఆయన స్టైల్ ఏంటో ‘గ్యాంగ్ లీడర్’లాంటి మూవీస్ చూసినవారికే తెలుస్తుంది. అందుకే ‘నువ్వెందుకు ట్రై చేయకూడదు అక్కా’ అన్నాడు చరణ్. ‘నా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలి’ అన్నాను. దాంతో ‘నాన్నగారి కమ్ బ్యాక్ మూవీ. అక్క డిజైన్ చేస్తే బాగుంటుంది బావగారూ’ అని చరణ్ మా ఆయనతో మాట్లాడాడు. ఆయన ఒప్పుకున్నారు. ‘ఖైదీ నంబర్ 150’ జరుగుతున్నప్పుడు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ స్టార్ట్ అయింది. ఆ షోకు డిజైనింగ్ చేశాను. ఆ తర్వాత ‘రంగస్థలం’ స్టార్ట్ చేశా. ‘నా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలి’ అని తమ్ముడితో అన్నానన్నారు. అంటే అత్తామామల పర్మిషనా? మీ బెటరాఫ్ పర్మిషనా? మా ఆయన పర్మిషనే తీసుకోవాలనుకున్నాను. మా మావయ్య, అత్తయ్య ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. అమ్మాయిలకు పెళ్లైంది కదా అని ఇంట్లో కూర్చోకూడదు. ఏదో ఒక వ్యాపకం ఉండాలంటారు. ఇక్కడ మా నాన్నగారు ఎలానో అక్కడ మా అత్తమ్మవాళ్లు అలా. చిరంజీవిగారి ‘సైరా’కి కూడా చేస్తున్నారు కదా.. అది వెరీ వెరీ చాలెంజింగ్ మూవీ? అవునండి. ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ వైజ్‌గా రిఫరెన్సెస్ ఉండవు. మూడు నెలలు రీసెర్చ్ వర్క్ చేశాం. బిగ్ క్రియేటివ్ టీమ్ కూడా ఉంది. చాలా వరకు రీ–క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడే ‘సైరా’ గురించి మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. ఇంత కష్టపడుతున్నారు. ‘సైరా’ నిర్మాత రామ్‌చరణ్ మీకు ఎంత చెక్ ఇస్తారు? ఆ విషయం తమ్ముణ్ణే అడగండి (నవ్వుతూ). మా మధ్య మనీ టాపిక్ రాదు. డాడీ, తమ్ముడు కాబట్టి ఎక్కువ కేర్ తీసుకుంటాను. నా టార్గెట్ ఒకటే. స్క్రీన్ మీద వాళ్లు అందంగా కనిపించాలి. ఫ్యాన్స్ ఈలలు వేయాలి. ‘రంగస్థలం’ షూట్ రాజమండ్రిలో జరిగినప్పుడు ఎండలకు సమంత కళ్లు తిరిగి పడిపోయారు. మీకేమైనా ఇబ్బంది? ‘రంగస్థలం’ డిజైనింగ్ పరంగా చాలెంజింగ్ అనిపించలేదు కానీ, లొకేషన్లో యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. రాజమండ్రిలో షూట్ చేసినప్పుడు మొబైల్ నెట్వర్క్ లేకపోవడం బెటర్ అయ్యింది. వర్క్ మీద కాన్సంట్రేట్ చేశాం (నవ్వుతూ). ఫోన్‌కాల్స్ లేవు. ఇక వాట్సాప్ సంగతి మర్చిపోయాం. ఏప్రిల్‌లో అక్కడ షూట్ చేశాం. విపరీతమైన ఎండలు. టఫ్ అనిపించింది. కొంతమంది సన్ స్ట్రోక్ బారిన పడ్డారు. లక్కీగా నాకేం కాలేదు. కష్టం తెలియకుండా పెరిగారు.. ఇప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం మీకేంటి? ‘‘మీ టాలెంట్‌ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. మేం కష్టపడింది మిమ్మల్ని కంఫర్టబుల్‌గా ఉంచడానికే. మీరు ఓన్ ఐడెంటిటీ తెచ్చుకోవాలి’’ అని డాడీ అంటుంటారు. అందుకే తమ్ముడు తన ఫీల్డ్‌లో, నేను నా ఫీల్డ్‌లో ప్రూవ్ చేసుకోవడానికి తపనపడుతున్నాం. మా లగ్జరీ లైఫ్ వెనకాల డాడీ పడిన కష్టం తెలుసు. నా పిల్లలకు ఆ కష్టం తెలియజెప్పాలనుకుంటున్నా. అప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. మీ చిన్నప్పటి విశేషాలు.. మీరు, మీ తమ్ముడు, చెల్లెలు శ్రీజ.. మీ ముగ్గురిలో ఎవరు అల్లరి చేసేవారు? నేనే. వాళ్లిద్దరూ కొంచెం క్వైట్. శ్రీజ అంత పబ్లిక్ పర్సన్ కాదు. చరణ్, నేను చిన్నప్పుడు చాలా ఫైట్ చేసేవాళ్లం. మా ఇద్దరికీ అస్సలు పడేది కాదు. ఇంట్లో మా అల్లరి భరించలేక ఇద్దర్నీ వేరు వేరు హాస్టల్స్‌లో పెట్టాలని కూడా ఆలోచించారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కి ఫిల్మ్ ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు నేను టెన్త్ స్టాండర్డ్‌లో ఉన్నాను. అందుకని అక్కడే మా పెద్దమ్మ వాళ్ల ఇంట్లో ఉండి చదువుకున్నాను. తమ్ముణ్ణి హాస్టల్లో పెట్టారు. ఆ సెపరేషన్లో తమ్ముణ్ణి చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ కలిగింది. తనకూ సేమ్ ఫీలింగ్. అప్పటినుంచి కొట్టుకోవడం మానేశాం. ఇప్పుడు మేం బ్రదర్ అండ్ సిస్టర్ అనేకన్నా.. బెస్ట్ ఫ్రెండ్స్ అనొచ్చు. ఇంట్లోకి కొత్త అమ్మాయి వచ్చిన తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య ఏదో గ్యాప్ వచ్చిన ఫీలింగ్ కలగడం సహజం. ఉపాసన మీ ఇంటి కోడలయ్యాక మీకలాంటి ఫీలింగ్? అస్సలు లేదు. ఉపాసన నాకు ముందు నుంచే బాగా తెలుసు. అందర్నీ కలుపుకుని వెళ్లే మనస్తత్వం తనది. ఎవరితో అయినా ఎక్కడైనా తను ఈజీగా మింగిల్ అయిపోతుంది. వెరీ లైవ్లీ పర్సన్. మా ఇంటికి ఓ కొత్తమ్మాయి వచ్చిన ఫీలింగ్ ఏమీ లేదు. మీరు తనని వదినా అని పిలుస్తారా? పెళ్లికి ముందే పరిచయం అన్నాను కదా. ఉపాసన అని పిలవడం అలవాటు. నన్ను సుష్మితా అని పిలిచేది. అలాగే కంటిన్యూ అవుతున్నాం. మీకు వంట వచ్చా.. పిల్లల కోసం ఏమైనా కుక్ చేస్తారా? పిల్లలకు స్వయంగా వండి పెడతాను. ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేస్తే ఎవరికైనా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. టైమ్ ఉన్నప్పుడల్లా కేక్‌లు, బిస్కెట్లు చేస్తాను. పిల్లలు కూడా చేసి పెట్టమని అడుగుతుంటారు. వంట చేయడానికి టైమ్ ఉంటుందా? అంటే.. ఉండకపోవచ్చు.. కానీ, టైమ్ తీసుకోవాలి. ఇంతకీ మీ పెద్ద పాప సమారా, చిన్న పాప సంహితలో మీ డాడ్ ఫ్యాన్ ఎవరు? తమ్ముడు ఫ్యాన్ ఎవరు? పెద్దపాప తాతగారి ఫ్యాన్. చిన్న పాప మావయ్య ఫ్యాన్. ఎప్పుడైనా ఇంట్లో ‘ధృవ, ఖైదీ నంబర్ 150 చూడాలనుకుంటే ఇద్దరికీ గొడవే. చిన్నపాప ‘ధృవ’ అంటుంది. పెద్దపాప ‘ఖైదీ నంబర్ 150’ సినిమా కావాలని పేచీ పెడుతుంది. పిల్లలిద్దరికీ కామన్‌గా ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ ఇష్టం. మనవరాళ్లిద్దరిలో తాతను ఎవరు ఇమిటేట్ చేస్తారు? మా చిన్న పాప డాడీని ఇమిటేట్ చేస్తుంది. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’ సాంగ్ ఉంది కదా. ఆ పాటకు డాడీ డ్యాన్స్ చేసినట్లే చేస్తుంది. మార్క్స్ తక్కువగా వచ్చినప్పుడు మీ డాడీకి చెప్పకుండా దాచేసిన సందర్భాలేమైనా? మా ఇద్దరికన్నా శ్రీజ స్టడీస్‌లో బెస్ట్. మార్కుల విషయంలో తనకు ఏ ప్రాబ్లమ్ లేదు. నాకు, తమ్ముడికి తక్కువ వచ్చేవి. అప్పుడు మేమిద్దరం ‘నువ్వు ఈ వారం ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించు. నేను నెక్ట్స్ వీక్ చూపిస్తా’ అని మాట్లాడుకునేవాళ్లం. అవన్నీ తలచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. మంచి జ్ఞాపకాలు. ఫైనల్లీ.. ఇక్కడ గోల్డెన్ స్పూన్‌తో పెరిగిన మీకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఎలాఉంది? మోస్ట్ కంఫర్టబుల్ ఫ్యామిలీ. మా అత్తమ్మకు గ్లామరస్ ఫీల్డ్ అంటే ఇష్టం. ‘నువ్వెందుకు స్క్రీన్‌పైకి వెళ్లకూడదు’ అంటారు? ‘‘అత్తమ్మా... చాలా లేట్ అయింది. ఇప్పుడు వెళితే బాగుండదు’’ అని సరదాగా అంటుంటాను. అమ్మ ఇంట్లో ఎలా ఉంటానో అత్తమ్మ ఇంట్లోనూ అలానే. ఐయామ్ వెరీ మచ్ బ్లెస్డ్. – డి.జి. భవాని -
చెట్టు కింద పెళ్లి..!
- నేడు పోలీసు ఆంక్షల మధ్య ఒకటవనున్న జంట - ఇంటి స్థలం విషయంలో వివాదం సాక్షి, పెద్దపల్లి: ఇంటి స్థలం విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో తన కూతురి వివాహాన్ని చెట్టు కింద చేయాల్సిన పరిస్థితిని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్వాసి వడ్లకొండ రామలక్ష్మయ్య ఎదుర్కొంటున్నాడు. రామలక్ష్మ య్య గీత కార్మికుడు. సొంతిల్లు కూడా లేదు. భార్య రాజేశ్వరి ఎనిమిదేళ్ల క్రితం చనిపోయింది. ఇద్దరు కూతుళ్లు సుమలత, సుస్మిత. పెద్ద కూతు రు కుట్టుమిషన్‌పై పని చేస్తూ కుటుంబానికి చేదో డువాదోడుగా ఉంటోంది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే.. తండ్రి ఇబ్బంది పడతాడని భావించిన సుమలత.. ఇంటర్ చదువుతున్న సుస్మిత పెళ్లి ముందుగా చేసేందుకు తండ్రిని ఒప్పించింది. దీంతో కరీంనగర్ జిల్లా చింతకుంట వాసి శ్రావణ్ తో సుస్మిత వివాహం నిశ్చయమైంది. 4 గుంటల స్థలంలో గుడిసె వేసుకొని 17 ఏళ్లుగా అక్కడే ఉం టున్నాడు. కూతురి పెళ్లి కావడంతో ఆ స్థానంలో రేకుల షెడ్డు వేసుకుందామనుకుని గుంతలు తీయడం ప్రారంభించాడు. గ్రామానికి చెందిన కొందరు వచ్చి.. రామలక్ష్మయ్య స్థలం అసైన్డ్ భూమి అని.. ఈ స్థలంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కడుతున్నామని అడ్డుకున్నారు. దీంతో ఇటుకలను అడ్డుగోడగా మార్చుకొని.. అక్కడే ఉంటున్నారు. సుస్మిత నిశ్చితార్థమూ చెట్టు కిందే జరిపించారు. విషయం అధికారులకు చేరడంతో తహసీల్దార్ నాగరాజమ్మ అధికారులతో సర్వే చేయించారు. అది పట్టా భూమి అని తేలింది. అయినా.. గ్రామస్తులు వినకుండా వివాదానికి తెరలేపడంతో చుట్టూ ఉన్న వ్యవసాయ భూముల ను సర్వే చేయించాలని నిర్ణయించా రు. ఆ స్థలం కింద స్టేటస్కో మెయిం టైన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సుస్మిత వివాహం జరగాల్సి ఉండగా, సోమవారం తహసీల్దార్, సుల్తానాబాద్ సీఐ వచ్చి రామలక్ష్మయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు. స్థలంలో వివాహం చేస్తే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఉన్నందున అక్కడే ఉన్న చెట్టు కింద పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో చెట్టు కిందే సుస్మిత వివాహం చేయనున్నారు. -
అప్పుడు తండ్రికి ఇప్పుడు తమ్ముడికి
తమ్ముడు రామ్‌చరణ్‌తో కలసి మరో సినిమా చేస్తున్నారు సుస్మిత కొణిదెల. చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమాలో తమ్ముడికి సై్టలింగ్ చేస్తున్నారు సుస్మిత. చరణ్‌తో కలసి ఆమె∙చేస్తున్న రెండో చిత్రమిది. చిరంజీవి హీరోగా చరణ్ నిర్మించిన ‘ఖైదీ నంబర్ 150’లో చిరూ సై్టలింగ్ను దగ్గరుండి చూసుకున్నారామె. అప్పుడు నిర్మాతగా అక్క సై్టలింగ్ చూసి ముచ్చటపడిన చరణ్, తాజా సినిమాకు సుస్మిత చేత డ్రస్సులు డిజైన్ చేయించుకుంటున్నారు. పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి దగ్గరలోని పూడిపల్లిలో నేడు ప్రారంభమైంది. అక్కడ సుమారు నెల రోజుల పాటు చరణ్, ఇతర ముఖ్య తారగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా కోసం చరణ్ బరువు తగ్గి, గడ్డం పెంచారు. ఇందులో చరణ్ మూగ యువకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కెమేరా: రత్నవేలు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీఏం). -
మాయ లేడీ
► మాట్రిమోనియల్ పేరుతో మోసం ► అందమైన యువతి ఫొటోతో ప్రొఫైల్ ► పెళ్లి పేరుతో సిటీకి చెందిన ఇద్దరికి టోకరా ► అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ కాప్స్ సాక్షి, సిటీబ్యూరో: అందమైన ఫొటోలు పెట్టడం... లేని విద్యార్హతలు, ఆస్తుల్ని ఆపాదించుకోవడం... వీటి ఆధారంగా మాట్రిమోనియల్ సైట్లలో ప్రొఫైల్స్ క్రియేట్ చెయ్యడం... ఆకర్షితులైన యువతుల్ని నిలువునా ముంచడం... ఇలాంటి మోసాలకు పాల్పడిన అరెస్టైన యువకుల కేసుల్ని ఇప్పటి వరకు చూశాం. అయితే ఇక్కడ సీన్ రివర్సయ్యింది. బెంగళూరుకు చెందిన ఓ యువతి ఇదే పంథాను అనుసరిస్తూ దేశ వ్యాప్తంగా 2600 మందికి గాలం వేసింది. ఈమె చేతిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులూ మోసపోయారు. దీంతో రంగంలోకి దిగిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సదరు యువతిని బుధవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..బెంగళూరుకు చెందిన శ్రీలత అనే యువతి మాట్రిమోనియల్ సైట్ ఆధారంగా భారీ మోసానికి తెరలేపింది. తన పేరును సుస్మితగా పేర్కొంటూ ఇంటర్నెట్ నుంచి అందమైన యువతి ఫొటో డౌన్లోడ్ చేసుకుంది. వీటిని వినియోగించి ఓ మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకుంది. 2600 మందికి టోకరా ఆ ప్రొఫైల్‌లో తనను హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల యువతిగా పేర్కొన్న శ్రీలత సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని, నెలకు రూ.1.5 లక్షల జీతం వస్తోందని పేర్కొంది. దీంతో ఆమె ప్రొఫైల్‌లో దేశ వ్యాప్తంగా 2600 మంది లైక్ చేయడంతో పాటు వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అలా ఆకర్షితులైన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులూ ఉన్నారు. సిటీకి చెందిన ఓ యువకుడితో కొన్ని రోజుల పాటు ఫోన్లో మాట్లాడిన ‘సుస్మిత’ తనపై నమ్మకం పెంచుకుంది. హఠాత్తుగా ఓ రోజు తన పర్సు పోగొట్టుకున్నానంటూ రూ.40 వేలు అడిగింది. అప్పటికే ఆమెను పూర్తిగా నమ్మిన సదరు యువకుడు నగదు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశాడు. కొన్ని రోజులకు మళ్లీ డబ్బు అడగటంతో అనుమానం వచ్చిన అతను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు డబ్బు డిపాజిట్ అయిన బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. సోదరుడి ఖాతాతో డబ్బు వసూలు ‘సుస్మిత’ డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి తన సోదరుడి ఖాతాను వాడింది. దీన్ని పోలీసులు ఫ్రీజ్ చేయించడంతో కంగుతిన్న అతడు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి డీ–ఫ్రీజ్ చేయాల్సిందిగా కోరాడు. నగర యువకుడితో సంభాషించడానికి సుస్మిత వాడిన ఫోన్ నెంబర్‌ను ఇతడికి చూపించిన అధికారులు ఆరా తీయగా... తన సోదరికి చెందినదిగా పేర్కొంటూ శ్రీలత ఫోటో చూపించాడు. దీన్ని చూసిన బాధితుడు ఒకింత షాక్‌కు లోనయ్యాడు. ఈ దర్యాప్తు సాగుతుండగానే నగరానికి చెందిన మరో ‘సుస్మిత’ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కొంతకాలం మాట్లాడిన ఆమె తన సమీప బంధువు చనిపోయాడంటూ రూ.2 లక్షలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసుల్ని నమోదు చేసుకున్న పోలీసులు బెంగళూరుకు ప్రత్యేక బృందాన్ని పంపారు. బుధవారం శ్రీలతను అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈమె మా ట్రిమోనియల్ ప్రొఫైల్‌పై 2600 మంది ఆకర్షితులు కావడంతో వారిలో ఎందరు బాధితులుగా మారారనేదానిపై ఆరా తీస్తున్నారు. -
గుమ్మడికాయ కొట్టేసిన ఖైదీ
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఖైదీ నంబర్ 150 షూటింగ్ పూర్తయ్యింది. దాదాపు దశాబ్దకాలంగా మెగా అభిమానులను ఊరిస్తున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరు మార్క్ మాస్ యాక్షన్ కామెడీలతో రూపొందిన ఈ సినిమా మెగాస్టార్ స్టామినాను మరో సారి ప్రూవ్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ బుధవారంతో పూర్తయ్యింది. ఈ విషయాన్ని మెగాతనయ, ఖైదీ నంబర్ 150 కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మితా కొణిదల స్వయంగా ప్రకటించారు. తన ట్విట్టర్ పేజ్ లో ఖైదీ నంబర్ 150 షూటింగ్ పూర్తయ్యిందంటూ పోస్ట్ చేసిన సుస్మిత, రత్నవేళు, వినాయక్, దేవీ శ్రీ ప్రసాద్ లతో కలిసి పనిచేయటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో యూనిట్ సభ్యుల నుంచి ఎంతో నేర్చుకున్నానంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది సుస్మిత. It's a wrap on #KhaidiNo150 been a great experience. Best team to work with @KonidelaPro @RathnaveluDop #VVVinay garu @ThisIsDSP — sushmita konidela (@sushkonidela) 14 December 2016 And with the most fun costume team it's been a super journey and lot of learning from everyone @ind_pat @archa_mehta @Gauri_Naidu — sushmita konidela (@sushkonidela) 14 December 2016 -
డాటర్ డిజైనర్... డాడ్ లుక్ సూపర్!
మమ్మీ డాడీ స్టైల్‌గా కనిపించాలని పిల్లలు కోరుకుంటారు. కొన్ని టిప్స్ కూడా ఇస్తుంటారు. వీలైతే వాళ్ల కోసం షాపింగ్ చేస్తారు. అదే డాడీ హీరో అనుకోండి... సినిమాలో ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ బాగుండాలని అనుకుంటారు. ఒకవేళ డిజైనింగ్ మీద అవగాహన ఉంటే, స్వయంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత అదే చేస్తున్నారు. తండ్రి 150వ చిత్రం ‘ఖైదీ నం. 150’కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారామె. డాడీ స్టైలిష్‌గా కనిపించడం కోసం చాలా శ్రద్ధగా డ్రెస్సులు తయారు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు చూసి, చిరంజీవి లుక్ సూపర్ అని అభిమానులు మురిసిపోతున్నారు. అన్నట్లు.. తండ్రికి మాత్రమే కాదు.. సినిమా మొత్తానికి సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే... ప్రస్తుతం ఈ చిత్రబృందం యూరప్ వెళ్లడానికి రెడీ అవుతోంది. అక్కడ పాటలను చిత్రీకరించనున్నారు. స్లోవేనియా, క్రొయేషియా తదితర అందమైన లొకేషన్లలో ఈ చిత్రీకరణ జరగనుందని చిత్ర నిర్మాత రామ్‌చరణ్ తెలిపారు. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తారని చెప్పారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ ప్రత్యేక పాటకు చిరంజీవి సరసన లక్ష్మీరాయ్ కాలు కదిపారు. హిందీ నటుడు తరుణ్ అరోరా విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమేరా: రత్నవేలు, కళ: తోట తరణి. -
పెళ్లంటే..! ఏదో తెలియని భయం!
అబ్బాయి నచ్చినా... పెళ్లి ఇష్టమైనా... కొత్త జీవితాన్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నా... ఏదో తెలియని భయం. మెట్టినింట్లో మసలగలనా? కొత్త బంధువులతో మనగలనా? కట్టు బొట్టు, వంటావార్పు నచ్చుతుందా?! పెళ్లి కూతురుకు అన్నీ భయాలే. అస్సలు భయపడక్కర్లేదు అంటున్నారు పెద్దలు, నిపుణులు. నిశ్చింతగా, ఉత్సాహంగా ఏడడుగులు వేయమంటున్నారు. సుస్మిత బి.టెక్ చేసింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాకేష్‌తో పెళ్లికుదిరింది. పెళ్లికూతురుని చేసిన రోజున విషెస్ చెప్పడానికి వెళితే...‘మంచి సంబంధం, అబ్బాయి కూడా చాలా బాగున్నాడట కదా! అదృష్టవంతురాలివి...’ పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కొక్కరూ అభినందిస్తున్నారు. అదే విషయం చెబితే- ‘‘లోలోపల ఎంత గుబులుగా ఉందో మాటల్లో చెప్పలేను’’ అంది సుస్మిత. ఎందుకని అడిగితే-‘‘ఏమో..! తెలియడం లేదు. రాకేష్ కొన్నాళ్లుగా తెలుసు. సంబంధం కూడా మరీ దూరం కాదు. పెళ్లికి కావల్సినవన్నీ రెండు మూడు నెలలుగా సమకూర్చుతూనే ఉన్నారు అమ్మానాన్న. షాపింగ్ హడావిడిలో, కావల్సినవి సెలక్ట్ చేసుకోవడంలో నాకూ నిన్న మొన్నటి వరకు ఏమీ అనిపించలేదు. కానీ, పెళ్లి ఘడియ దగ్గర పడుతున్నకొద్దీ చెప్పలేనంత టెన్షన్‌గా ఉంది. తెల్లవారితే పెళ్లి. పట్టు బట్టలు, పూల దండలు, పెళ్లిపందిరి, ఫొటోలు, వీడియోలు, బంధువులు, మిత్రుల ఆశీస్సులు, కానుకలు... సంబరంగానే గడిచిపోతుంది. కానీ, ఏంటో భయంగా ఉంది. ఒక చోట పెట్టిన వస్తువు కోసం మరో చోట వెతుకుతున్నాను. అప్పుడప్పుడు పరధ్యానంగా ఉంటున్నానేమో ‘ఏంటలా ఉన్నావు’ అని అమ్మ ఇప్పటికే రెండు మూడు సార్లు అడిగింది. పెళ్లి పనులతో రాత్రుళ్లు అమ్మకు నిద్ర ఉండటంలేదు. పెళ్లి గురించిన ఆలోచనలతో నాకు నిద్ర పట్టడంలేదు..‘ పెళ్లి అంటే ముఖం కళగా వెలిగిపోవాలి కానీ, ఇలా తోటకూరకాడలా వడలిపోయింది.. ఈ పెళ్లి ఇష్టం లేదా ఏంటి?’ అని మా మేనత్త అంది. ఆ మాటలకు ఇంకా భయమేసింది. కానీ, ఈ టైమ్‌లో నా టెన్షన్ ఎలా ఉంటుందో ఆమెకు మాత్రం తెలియదా! ఆ విషయాలేవో నాకు చెబితే.. కొంత ఊరట ఉండేది...’’ అంటుండగా సుస్మిత స్నేహితులు వచ్చారు. వారిని ఆహ్వానించడంలో మునిగిపోయింది సుస్మిత. తెలుగు రాష్ట్రాలలో పెళ్లిళ్ళ హడావిడి మొదలయ్యింది. కోట్ల రూపాయల ఖర్చుతో పెళ్లి పందిళ్లు వెలిగిపోతున్నాయి. సంబరంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోయే పెళ్లికూతుళ్ల టెన్షన్ ఈ సమయంలో అంతా ఇంతా కాదు. అమెరికాలో అయితే ఈ టెన్షన్ తట్టుకోలేక పారిపోయే పెళ్లి కూతుళ్లూ (రన్ అవే బ్రైడ్స్) ఉంటారు. పెళ్లి రోజు ఎలా గుడుస్తుందో.. ఆ తర్వాత రోజులున్నీ ఎలా ఉండబోతున్నాయో.. ఈ ఆలోచన వారిని స్థిమితంగా ఉండనివ్వదు. ఈ విషయం గురించి ఫ్యామిలీ కౌన్సెలర్ వాణీమూర్తి మాట్లాడుతూ- ‘‘బాల్యంలో స్కూల్‌కి, అటు తర్వాత కాలేజీకి వెళ్లినట్టే .. ఒక దశ దాటాక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం అలాంటిదే అనుకోరు అమ్మాయిలు. పెద్దలు కూడా ఈ కొత్త జీవితం గురించి, దిద్దుకునే క్రమం గురించి చెప్పడం చాలా తక్కువ. కొత్తగా కాలేజీలో జాయిన్ అయితే అక్కడ మనకై మనంగా పరిచయాలు ఎలా పెంచుకుంటామో... గుర్తుతెచ్చుకోవాలి. కాలేజీ మొదటి రోజుల్లోనే కొందరు సన్నిహితులు అవుతారు. ఇంకొందరు పరిచయస్తులుగానే ఉండిపోతారు. వైవాహిక బంధం కూడా కొత్త కాలేజీ లాంటిదే! అయినా, ఆ తర్వాత తర్వాత ఆ కుటుంబం మనదే అవుతుంది కాబట్టి మనకు తగిన విధంగా ఎలా మలుచుకోవాలి అనే విషయాలపై అవగాహన పెంచుకుంటే ఎలాంటి ఆందోళనలే ఉండవు’’ అంటున్నారు. పంచభూతాల సాక్షిగా ఏడడుగులు వేసి, కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న నవ వధువులకు మనస్తత్వ నిపుణులు, ఫ్యామిలీ కౌన్సెలర్లు ఇస్తున్న సూచనలు ఇవన్నీ. అంతేకాదు... ‘ప్రేమ, దయ, క్షమ, సహనం, సర్దుబాటు అనే గుణాలతోపాటు బాంధవ్యాలను పదిలం చేసుకోగలను అని మీ మీద మీకు నమ్మకం ఉంటే మీ జీవితాన్ని అందంగా మలుచుకోవడం మీ చేతుల్లోనే ఉంది’ అని కొత్త పెళ్లికూతుళ్లకు వీళ్లు సలహా ఇస్తున్నారు. వివేచనతో దిద్దుబాటు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉత్సాహంగా, ఆహ్లాదంగా మార్చే శక్తి మీకు మాత్రమే ఉంది. పెళ్లి రోజున సంతోషం, సరదా, ఆసక్తి.. మిమ్మల్ని ఆకర్షణీయంగా చూపుతాయి. అత్తింటిలోనూ ఇదే తరహా కొనసాగిస్తే మీ భావి జీవితం ఆనందంగా సాగడానికి ఒక మెట్టు అధిగమించినట్టే. మీ భాగస్వామి అత్యంత ఇష్టత పెంచుకునేది కూడా ఈ సందర్భంలోనే. అలా కాకుండా పుట్టింటి వారినే తలుచుకుని చింతిస్తూ.. మూగబోయి ఉంటే... మీతో పాటు అక్కడంతా నిస్తేజంగా కనిపిస్తుంది. భాగస్వామితోనూ కబుర్లేమీ లేకుండా పలకరింపులకే పరిమితం అయితే.. తర్వాత మీ దాంపత్య జీవితం ఒడిదొడుకులలో పడవచ్చు. అందుకని మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ మీ కొత్త జీవితం ఎలా ఉండాలో నిర్ధారించుకోవాల్సిందే మీరే! ప్రధాన భయాలు ఇవే! ►బాల్యం నుంచి పెళ్లి , వైవాహిక జీవితం, అత్తింటి.. గురించి నెగిటివ్ అంశాలు ఎక్కువ విని ఉంటారు. వాటినే తలుచుకొని భయపడుతుంటారు. ► అప్పటి వరకు జీవితభాగస్వామి పట్ల ఎన్నో కలలు కని ఉంటారు. అవన్నీ నిజం అవుతాయో, లేవో అనే సందేహం. ► పుట్టింటిలో ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అత్తింటిలో ఉండవనే అభిప్రాయం. ►పెళ్లి అయితే ఇంటి పనులు, వంట పనులు.. అందరికీ చాకిరీ చేయాల్సి వస్తుందనుకుంటారు. ►భర్త స్వభావం ఎలా ఉంటుందో.. అతని అలవాట్లు ఏమిటో... అనే అనుమానాలు. ►భవిష్యత్తు గురించి భయాలు. మనసులో చోటు ముఖ్యం అత్తింటిలో ‘లేని నవ్వు తెచ్చి పెట్టుకొని, అందరినీ పలకరించాలి. నలుగురిలో నటిస్తున్నట్టుగా ఉంటుంది. కంఫర్ట్ లేదు... వీటి కన్నా ఒంటరిగా ఉండటమే బెస్ట్’ అని నవ వధువులు అనుకుంటూ ఉంటారు. కంఫర్ట్ అంటే ఉండే చోటు కాదు. నలుగురిలో మనం ఎలా ఉంటున్నామో సరిచూసుకోవాలి. ‘ఒంటరిగా ఉంటే ‘ప్రేమ’ను ఎవరికీ పంచలేను’ అనే నిజం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇప్పటి వరకు సాధించినవాటి కన్నా ఇక ముందు ప్రేమతో సాధించినవే మీకు నిజమైన బహుమతులు అనుకోవాలి. మీరున్న చోటు మీకు ఆనందాన్ని ఇవ్వకపోతే అదే విషయాన్ని మీ శ్రీవారితో చెబుతూ- ‘మీతో ఉంటే చాలా ఆనందంగా ఉంది. కానీ, ఈ ప్లేస్ అంత సౌకర్యంగా లేదు..’ అని సున్నితంగా వివరించండి. పెళ్లి తర్వాతి దశను అర్థం చేసుకోవడానికి ఇదో ప్రాధమిక విద్య. ఉన్న చోటు ముఖ్యమైనదే అయినా ముందు అత్తింటి మనసుల్లో స్థానం సంపాదించాలనుకోండి. అనుకూలమైన వ్యక్తులను ఎంచుకోండి పెళ్లికి ముందు రోజు, పెళ్లి రోజు... ఆ తర్వాత అత్తివారింటిలో అడుగుపెట్టాక కొన్ని రోజుల వరకు మీకు అనుకూలంగా ఉండేవారితో ఉండండి, మీ అవసరాలను గుర్తించేవారు, మీతో మంచిగా ఉండేవారితో సానుకూలంగా ప్రవర్తించండి. కొందరు నెగిటివిటీ నూరిపోసే వ్యక్తులు ఉంటారు. ఎవరు మంచి, ఎవరు చెడు.. విషయాలను ఏకరువు పెడుతుంటారు. వారు చెప్పేవి ఆసక్తి లేనట్టుగా ఉండండి. మీ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత ఉంటే మీ భావి జీవితం అంత ఆనందంగా ఉంటుంది. దాంపత్య జీవితం గురించి అందుకు అర్హత గల పెద్దవాళ్లు చెప్పే సూచనలు మీ భావి జీవితానికి ఉపయోగపడవచ్చు. అందుకని వాటిని శ్రద్ధగా వినండి. - సాక్షి ఫ్యామిలీ -
వేణువై వచ్చారు..
వెదురులోకి ఒదిగిన కుదురులేని గాలి.. హుస్సేన్‌సాగర్ అలల తరంగాలను తాకుతూ గానకేళిగా పల్లవించింది. వేణువై వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో మలయమారుతాల్లా ప్రతిధ్వనించారు. ట్రిబ్యూట్ టు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా పేరిట ట్యాంక్‌బండ్ మెయిన్ రోడ్‌లోని సెయిలింగ్ అనెక్స్‌లో ఆదివారం జరిగిన సుస్మిత, దేవప్రియ చటర్జీ సిస్టర్స్ వేణుగానం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. -
సంగీతం... జీవితం...
బంధానికీ, ప్రేమకూ ఉన్న తేడా ఏంటి? వాటి విలువలు ఎవరికి తెలుస్తాయి? సంగీతానికీ, జీవితానికీ మధ్య ఏమైనా అనుబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ చిత్రం రూపొందుతోంది. డీవీ రాజేందర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీ రాజ్, అరుణ్ కృష్ణ, సాకేత్, సుమిత్, అభిషేక్, సుస్మిత ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. యువతరం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామనీ దర్శకుడు చెప్పారు. విజ్ఞాన్ రత్తయ్య, ఆర్వీఎస్ భరత్, గోపి, రఫీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్, కూర్పు: అనిల్. -
ఆస్తి పంపకానికి అడ్డుగా ఉందని...
మహబూబాబాద్: తన సమస్యలన్నిటికీ కూతురే కారణమని ఆగ్రహంతో ఉన్న ఓ తండ్రి ఆమెను వదిలించుకోజూశాడు. రైల్వే ప్లాట్‌ఫాంపై వదిలి రైలెక్కాడు. అయితే, ప్రయాణీకులు అప్రమత్తం కావటంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఈ ఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎన్.విష్ణువర్దన్, శిల్ప దంపతులకు సుస్మిత అనే కూతురు ఉంది. మూడేళ్ల క్రితం శిల్ప అనారోగ్యంతో మృతి చెందగా విష్ణువర్దన్ మరో వివాహం చేసుకున్నాడు. సుస్మిత కొత్తగూడెంలో రెండో తరగతి చదువుతోంది. విష్ణువర్దన్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి సోదరులతో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఉమ్మడి ఆస్తిని అమ్మి తన వాటా ఇవ్వాలని విష్ణువర్దన్ కోరుతుండగా సోదరులు మాత్రం సుస్మిత కోసం అది అవసర పడుతుందని, అప్పుడే అమ్మేది లేదని అడ్డు చెబుతున్నారు. ఈ నే పథ్యంలో వరంగల్ జిల్లా కురవి మండలం జీ కొత్తూరులో జరిగే ఓ కార్యక్రమానికి విష్ణువర్ధన్ తన కూతురుతో రాగా అతని సోదరులు, బంధువులు కూడా అక్కడ అతనికి కలిశారు. శనివారం తిరుగు ప్రయూణంలో వారంతా మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో చిన్న గొడవ జరిగింది. ఆ సమయంలో ప్యాసింజర్ రైలు స్టేషన్‌కు రాగానే అందరూ రైలు ఎక్కారు. అయితే, ఆగ్రహంతో ఉన్న విష్ణువర్దన్ మాత్రం కూతురును ప్లాట్‌ఫాం పైనే వదిలేసి రైలు ఎక్కాడు. దీంతో ఏడుస్తున్న ఆ బాలికను వెంటనే అదే ఫ్లాట్‌పాంపై ఉండి గమనిస్తున్న హిజ్రాలు ఎత్తుకొని.. కదులుతున్న రైలు వద్దకు పరుగెత్తారు. రైలులో ఉన్న ప్రయాణికులు అది గమనించి చైన్ లాగారు. వెంటనే వారు ఆ బోగీలో ఉన్న తండ్రికి బాలికను అప్పగించారు. కూతుర్ని వదిలేసి వెళ్లడం తగదని అంతా అతనికి హితవు పలికారు. శనివారమే ఆ బాలిక పుట్టిన రోజు కావడం.. ఆ విషయాన్ని ప్రయాణికులందరికీ చెప్పడంతో వారు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్సై రవీందర్ కూతురును, తండ్రిని సబ్‌కంట్రోల్ రూంకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేశారు. ఆ బాలిక ఏడుస్తూ చెప్పిన మాటలకు పోలీసులు చలించిపోయారు. అనంతరం ఎస్సై రవీందర్ కేక్, చాక్లెట్లు తెప్పించి అక్కడే ఆ బాలికతో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. అన్నదమ్ముల గొడవలు సాకుగా చూపి ఆ చిన్నారికి ఇబ్బంది కలగనీయవద్దని, స్థోమత లేకపోతే ప్రభుత్వ హాస్టల్లో చేర్పించి చదివిస్తామని ఎస్సై ఆ బాలిక తండ్రి విష్ణువర్దన్‌కు చెప్పారు. తన తండ్రితో ఉంటానని ఆ బాలిక చెప్పడంతో అతనికి అప్పగించారు. రెండు గంటల పాటు సాగిన ఆ సంఘటనను వందల మంది ఆసక్తిగా చూశారు. ఆ బాలిక ఆనందంగా తండ్రి వద్దకు చేరి అందరికీ టాటా చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.