
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. చిరుతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆయన కూతురు సుష్మిత కొణిదెల కూడా చిరుతో సినిమాతో చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుప్తుంది. చాలాకాంలంగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్న సుష్మిత మొన్నటివరకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా వ్యవహరించారు. చదవండి: రానాను పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల? ఆ హీరోతో లీడర్-2
ఇప్పుడు ఆమె గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ కోసం సుష్మిత ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా డైరెక్టర్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండానే కూతురికి గిఫ్ట్‌లాగా చిరు ఈ సినిమాను చేయాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చదవండి: అనాథ పాపను దత్తత తీసుకోవాలనుకున్నా : స్టార్ హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment