Sushmita Konidela Responds On Trolling In Latest Interview - Sakshi
Sakshi News home page

Sushmitha Konidela: ఆ వార్త‍లపై చిరంజీవి పెద్ద కూతురు రియాక్షన్

Published Sun, Jul 16 2023 8:45 PM | Last Updated on Mon, Jul 17 2023 9:28 AM

Sushmita Konidela Latest Interview Respond On Trolling - Sakshi

Sushmitha Konidela Latest Interview: మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే బోలెడన్ని సినిమాలు, అద్భుతమైన యాక్టింగ్ గుర్తొస్తుంది. ఆయన కుటుంబం విషయానికొస్తే.. కొడుకు రామ్ చరణ్ ఇప్పటికే గ్లోబల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలోనే ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. గతంలో బాధపడ్డ సందర్భాలని గుర్తుచేసుకుంది. అలానే ఇండస్ట్రీపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇక్కడ కష్టమే
ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉండటం అంత ఈజీ కాదని చెప్పిన సుస్మిత..  ఇక్కడ ప్రతిరోజూ ఓ యుద్ధంలా ఉంటుందని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమపై బోలెడంత ప్రేమతో పాటు పనిని ఎంజాయ్ చేయగలిగేలా ఉండాలని అప్పుడు ముందుకు వెళ్లగలమని తెలిపింది. కేవలం గ్లామర్ కోసం ఉండాలనుకుంటే మాత్రం చాలా కష్టమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 

(ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

వాటిని పట్టించుకోకూడదు
కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభంలో తనపై వచ్చిన నెగిటివిటీ గురించి కూడా సుస్మిత స్పందించింది. సోషల్ మీడియా, పలు వెబ్‌సైట్స్‌లో వచ్చిన వార్తలు చూసి అప్పట్లో తాను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. వాటిని వింటూ కూర్చుంటే ముందుకెళ్లలేం. కాబట్టి బయట జరుగుతున్న విషయాలు, మాటలు పట్టించుకోకుండా ముందుకుపోతే నెగిటివిటీ గురించి బాధపడం అని చెప్పింది.

నచ్చకపోతే ఓకే చేయరు
తండ్రి చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడంపైనా సుస్మిత స్పందించింది. 'సైరా' నుంచి ఆయన సినిమాలకు పనిచేస్తున్నాను. ఆయన చేస్తున్న పాత్ర, ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటా, స్టైలింగ్ విషయంలో ఆయన కచ్చితంగా ఉంటారని, ఏ మాత్రం నచ్చకపోయినా నిర్మొహమాటంగా చెప్పేస్తారని సుస్మిత క్లారిటీ ఇచ్చింది. 

(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement