Susmita
-
లావుగా ఉన్నావంటూ బిడ్డతో సహా భార్యను వదిలేశాడు..కానీ ఆమె..!
ప్రతి ఆడపిల్ల పెళ్లి తర్వాత జీవతం గురించి ఎన్నో కలలు కంటుంది. అందరికి మెట్టినిల్లు పుట్టినిల్లులా ఉండకపోవచ్చు. కొందరికి అది ముళ్లమీద సాగుతున్న జీవితంలా ఉండొచ్చు. అయినప్పటికి పుట్టింటి గౌరవం కాపాడేందుకు అన్నింటిని ఓర్చుకుంటుంది. కానీ అది హద్దు దాటి ఆమె ఆత్మగౌరవాన్నే కించే పరిచలే చేస్తే తట్టుకోలేదు. అదికూడ కట్టుకున్నవాడే తన ఉనికినే సహించలేనంటే.. ఆ మహిళ పరిస్థితి మాటలకందని వేదన అని చెప్పొచ్చు. అలాంటివి అధిగమించి తానెంటో ప్రూవ్ చేసుకున్న ఓ ధీర వనిత గాథ ఇది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళ స్ఫూర్తి కథేంటో చూద్దామా!. 32 ఏళ్ల సుస్మితా దాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందరి ఆడపిల్లలా పెళ్లి గురించి ఎన్నో కలలు కంది. ఎంతో ఆనందంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తమ ప్రేమకు గుర్తుగా పండంటి బాబుని కంది. అదే ఆమె పాలిట శాపంగా మారి వైవాహిక జీవితాన్ని నిలువునా కూలుస్తుందని ఊహించలేదు. సాధారణంగా ప్రసవానంతరం వచ్చే మహిళల్లో చాలా మార్పులు వస్తాయి. కొందరూ బాగా లావవ్వడం జరుగుతుంది. పిల్లలు ఎదిగే క్రమంలో కొందరూ తగ్గుతారు, మరికొందరూ కాస్త శరీరంపై దృష్టిపెట్టి తగ్గించుకోవడం వంటివి చేస్తారు. అలానే సుస్మిత డెలివరీ తర్వాత ఊహించిన విధంగా బరువు పెరిగింది. ఈ శరీర మార్పులను అంగీకరించకపోగా బాషీ షేమింగ్‌తో ఇబ్బంది పెట్టేవాడు. లావుగా ఉన్న నీతో కాపురం చేయలేను అని బిడ్డతో సహా ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మానసికంగా కుంగిపోయింది. ఏం చేయాలో ఎలా లైప్ లీడ్ చేయాలో తెలియని అగమ్య గోచరంలా కనిపించింది కళ్లముందున్న జీవితం. తల్లిదండ్రులు సుస్మితను అక్కున చేరుకుని భరోసా ఇచ్చారు. అది ఆమెలో కొండంత ధైర్యం ఇచ్చింది. ఏ బాడీ షేమింగ్ కారణంగా తన జీవితాన్ని కోల్పోయానో దాని మీద దృష్టిపెట్టి మంచి ఫిట్నెస్గా ఉండాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. ఫిట్నెస్ కమ్యూనిటీలో ఓ మెంబర్‌గా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఏ ఒక్క రోజు వర్కౌట్లు మిస్సవ్వదు. అందరికంటే ఎక్కువ బరువులు అలవోక ఎత్తేయగలదు. పైగా తాను పెళ్లి కారణంగా మధ్యలోనే ఆపేసిన ఎంబీఏని చదువుని పూర్తి చేయడమే గాక మంచి కార్పోరేట కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించడమే గాకు తన కుంటుంబాన్ని పోషించుకుంటోంది. అంతేగాదు తనలా బాడీషేమింగ్‌తో బాధపడే మహిళలకు మంచి ఫిట్నెస్ గురువుగా సలహలిస్తూ వారిని మంచి టోన్డ్ బాడీగా మార్చుకునేలా సాయం చేస్తోంది. అలా మహిళలను కించపరచడం తప్పని నిరూపించడమేగాక వారు తమను తాము ప్రేమించుకుంటేనే ధైర్యంగా నిలబడగలరని ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. (చదవండి: మహిళా దినోత్సవం: మహిళల ప్రాతినిథ్యం ఎలా ఉంది?) -
చిన్న సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న యంగ్ లేడీ ప్రొడ్యూసర్స్
-
నటిని కావాలనుకోలేదు, సమంతతో పోలుస్తున్నారు: గౌరి
‘‘శ్రీదేవి శోభన్‌బాబు’లో నేను చేసిన జాను పాత్ర మోడ్రన్‌గా ఉంటుంది’’ అని హీరోయిన్ గౌరి జి. కిషన్ అన్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ జంటగా రూపొందిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గౌరి జి. కిషన్ మాట్లాడుతూ– ‘‘నేను నటిని కావాలనుకోలేదు. జర్నలిస్ట్ అవుదామనుకున్నా. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తమిళ మూవీ ‘96’ ఆడిషన్స్‌కి వెళ్లి సెలక్ట్ అయ్యాను. తెలుగులో నా తొలి చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ‘ఏమాయ చేసావె’ టైమ్‌లో సమంత ఎలా ఉన్నారో ఇప్పుడు నేను అలా ఉన్నానని చాలామంది అన్నారు. ఆమెలా నాకూ అన్ని భాషల్లో నటించాలనుంది. ఇండస్ట్రీలో మహిళా రచయితలు తక్కువగా ఉన్నారు.. ఎక్కువమంది రావాలి. నేను కూడా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అన్నారు. -
మాకు ఇది స్పెషల్ సంక్రాంతి!
‘‘బాబీగారు ‘వాల్తేరు వీరయ్య’ కథ చెప్పినప్పుడే వీరయ్య (చిరంజీవి పాత్ర పేరు) క్యారెక్టర్‌కి ఇలాంటి కాస్ట్యూమ్స్ అయితే బాగుంటుందనుకున్నాను. నా ఆలోచన, బాబీగారి ఐడియాలు చాలావరకూ మ్యాచ్ అయ్యాయి. నాన్నగారూ సలహాలు చెప్పారు’’ అన్నారు సుష్మిత కొణిదెల. చిరంజీవి, శ్రుతీహాసన్ జంటగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలక పాత్ర చేశారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఇందులో చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసిన ఆయన కుమార్తె సుష్మిత చెప్పిన విశేషాలు. ► బాబీగారు ‘వాల్తేరు వీరయ్య’ కథ చెప్పినప్పుడు వింటేజ్ చిరంజీవిగారిని చూపించాలన్నారు. అంటే.. అప్పటి ‘గ్యాంగ్ లీడర్’ టైమ్ అన్నమాట. ఈ సినిమాలో ఆయనది ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్. సో.. కథ విన్నప్పుడే కాస్ట్యూమ్స్‌ని ఊహించేశా. నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి వింటేజ్ లుక్‌లో చూపించడానికి పెద్దగా కష్టపడలేదు. కానీ యూత్‌కి కూడా నచ్చాలి కాబట్టి ఇప్పటి ట్రెండ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశాను. ► ‘రంగస్థలం’లో నా తమ్ముడు రామ్‌చరణ్‌కి నేనే డిజైన్ చేశాను. ఇప్పుడు నాన్నగారివి కూడా అలాంటి డ్రెస్సులే. కానీ చరణ్‌కంటే నాన్నగారే ఈ మాస్ కాస్ట్యూమ్స్‌లో సూపర్. అయితే చరణ్‌ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే తను సిటీలో పెరిగాడు. అయినప్పటికీ ‘రంగస్థలం’లో ఆ కాస్ట్యూమ్స్‌లో బాగా ఒదిగిపోయాడు. నాన్నగారి అభిమానులుగా మేం మిగతా అభిమానులతో పాటు ఈలలు వేస్తూ, గోల చేస్తూ శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు థియేటర్లో ‘వాల్తేరు వీరయ్య’ టీమ్‌తో కలిసి సినిమా చూశాం. ► ప్రస్తుతం నాన్న ‘బోళా శంకర్’కి డిజైన్ చేస్తున్నాను. ఇంకా రెండు వెబ్ సిరీస్‌లపై వర్క్ చేస్తున్నాం. మేం నిర్మించిన ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. మా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్పై నాన్నగారితో సినిమా నిర్మించాలని ఉంది. అందరి నిర్మాతలకు చెప్పినట్లే ఆయన ‘మంచి కథతో రా’ అన్నారు. మేం కూడా ఆ వేటలోనే ఉన్నాం. ► ఈ సంక్రాంతి స్పెషల్ అంటే.. మా తమ్ముడు తండ్రి కానుండటం. ఈ సమయం కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాం. సో.. మాకిది స్పెషల్ సంక్రాంతి. ఉపాసనది డాక్టర్స్ ఫ్యామిలీ కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏం ఆహారం తీసుకోవాలి? అనేది తనకు బాగా తెలుసు. మావైపు నుంచి మేం ఆమెను వీలైనంత హ్యాపీగా ఉంచుతున్నాం. పాప అయినా, బాబు అయినా మాకు ఓకే. కానీ నాకు, శ్రీజకు ఆడపిల్లలే. ఇంట్లో గర్ల్ పవర్ ఎక్కువైంది (నవ్వుతూ). అందుకే బాబు అయితే బాగుంటుందనుకుంటున్నాను. -
కూతురి కోసం చిరంజీవి ఊహించని బహుమతి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. చిరుతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆయన కూతురు సుష్మిత కొణిదెల కూడా చిరుతో సినిమాతో చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుప్తుంది. చాలాకాంలంగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్న సుష్మిత మొన్నటివరకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా వ్యవహరించారు. చదవండి: రానాను పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల? ఆ హీరోతో లీడర్-2 ఇప్పుడు ఆమె గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ కోసం సుష్మిత ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా డైరెక్టర్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండానే కూతురికి గిఫ్ట్‌లాగా చిరు ఈ సినిమాను చేయాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చదవండి: అనాథ పాపను దత్తత తీసుకోవాలనుకున్నా : స్టార్ హీరోయిన్ -
పరకాలకు సురేఖ.. తూర్పు నుంచి సుస్మితా!
సాక్షి, వరంగల్ రూరల్: పరకాల నుంచి కొండా సురేఖ, వరంగల్ తూర్పు నుంచి తమ కుమార్తె సుస్మితా పటేల్ బరిలో ఉంటారని కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చెప్పినట్లు తెలిసింది. సోమవారం కొండా దంపతులు హన్మకొండకు వచ్చారు. వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి వచ్చిన అభిమానులతో మురళీధర్‌రావు సమావేశమయ్యారు. మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ నెల 23న ఆత్మకూరులో బహిరంగ సభ పెడదామని చెప్పినట్లు తెలిసింది. నేడు బహిరంగ లేఖ! ఈ నెల 8న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌కు కొండా దంపతులు పలు డిమాండ్లు చేశారు. ఈ డిమాండ్లకు సమాధానం చెప్పకపోతే కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాస్తామని ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో ఈ లేఖను విడుదల చేయనున్నారని తెలిసింది. -
మూఢనమ్మకాలు హాంఫట్!
చేతుల్లో వస్తువులు మాయం చేసి మస్కా కొడుతూ తాను భగవత్ స్వరూపునిగా అభివర్ణించుకుంటుంటారు కొందరు. నిమ్మకాయ కోసి రక్తం చూపి తమను తాము దైవాంశ సంభూతులమనుకొమ్మంటారు మరికొందరు. చేతబడులకు తిరుగుబడి చేస్తే జ్వరాలు తగ్గుతాయంటూ కోళ్లు, కానుకలు దండుకుంటుంటారు ఇంకొందరు. ముఖ్యంగా గిరిజనుల అమాయకత్వం, నిరక్షరాస్యత అడ్డం పెట్టుకుని కొందరు స్వాములు పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి వారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఇంద్రజాలాన్ని అస్త్రంగా వాడుతున్నారా ముగ్గురు. వారే మ్యాజిక్ సిస్టర్స్ అయిన మౌనిక, సుస్మిత. వారి తండ్రి జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి (చారి). మ్యాజిక్ సహోదరీమణుల ఆ ద్వయం... తమ తండ్రితో కలిసి త్రయంగా ఏర్పడి... మూఢనమ్మకాలు తొలగించాలని పడుతున్న తాపత్రయం వారిది. వాళ్ల జీవిత‘ఆదర్శం’ ఆ అక్కాచెల్లెళ్ల మాటల్లోనే... ఇంద్రజాలంతో ఎందరో మోసగాళ్లు అమాయకులను మోసం చేస్తుంటారు. అదే ఇంద్రజాలంతో మోసాన్ని మాయం చేస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు... మా నాన్న పేరు జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి (చారి). విజయనగరం పట్టణంలోని గంటస్థంభం దగ్గర కానుకుర్తివారివీధిలో నివాసం. నాన్న న్యాయస్థానంలో జూనియర్ అసిస్టెంట్. బీవీ పట్టాభిరామ్ వంటి ప్రముఖుల షోలు చూసి తానూ మ్యాజిక్ నేర్చుకొని ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టారు నాన్న. తన పదహారేళ్ల వయసులో తొలి ప్రదర్శనను తాను ఇంటర్మీడియెట్ చదువుతున్న ఎమ్మార్ కళాశాలో ఇచ్చారు. అప్పటి నుంచి గత 32 ఏళ్లుగా ఆయన దాదాపు 10 వేల ప్రదర్శనలిచ్చారు. మా అమ్మ పేరు రమణి. పెళ్లి తర్వాత ఆమె సహకారంతో తన ప్రవృత్తికి మరింత పదును పెట్టి మూఢనమ్మకాలపై కత్తి దూశారు. కొరడా ఝుళిపించారు. మేమింకా మ్యాజిక్ యవనికపైకి అడుగుపెట్టకముందే ఒక ఇంద్రజాలికునిగా పది వేలకు పైగా ప్రదర్శనలిచ్చి జాతీయ అవార్డు అందుకున్నారు మా తండ్రి. మాది సమాజం హర్షించే మాయ అవును... మేమూ మాయ చేస్తున్నాం. కాకపోతే మాది సమాజం హర్షించే మాయ. నిజం చెప్పాలంటే మా మాయతో మేము మూఢనమ్మకాలను మాయం చేస్తున్నాం. అంధ విశ్వాసాలను అంతం చేస్తున్నాం. మాయలతో మోసపుచ్చే మాయగాళ్ల గారడీ చేతబడికి తిరుగుబడి చేస్తున్నాం. ఇందుకు తగిన కారణమూ, నేపథ్యమూ ఉంది. మా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమూ, అక్కడ అమాయక గిరిజనులు ఎక్కువ. అప్పట్లో క్యాన్సర్, గుండె జబ్బు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా మరణిస్తే ప్రజలకు వాటి గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల చేతబడి, చిల్లంగి, బాణామతి వంటి క్షుద్ర ప్రయోగం వల్ల చనిపోయి ఉంటారని అపోహ పడేవారు. అవన్నీ కేవలం మూఢనమ్మకాలంటూ మేము మ్యాజిక్ సాయంతో నిరూపిస్తున్నాం. విజయనగరం జిల్లాలోని సాలూరు, పి కోనవలస, నీలకంఠాపురం, మొండెంకళ్లు, చినమేరంగి, కురుపాం, మక్కువ, కూనేరు, పార్వతీపురం, పెదబొండపల్లి, పాచిపెంట, మామిడిపల్లి, గుమ్మలక్ష్మీపురం, ఇంగిలాపల్లి, బొద్దాం, అలమండ, కొత్తవలస, కొట్యాడ, ఎస్‌కోట ప్రాంతాల్లో మూఢనమ్మకాలపై చైతన్యం తీసుకొచ్చేందుకు అనేక ప్రదర్శనలిచ్చాం. మాయను మాయతోనే ఎలా ఛేదిస్తామంటే... మా ప్రాంతంలోని మాయలోళ్లు అమాయకులను బుట్టలో వేసుకోడానికి రకరకాల ప్రదర్శలను ఇస్తుంటారు. వాటి సాయంతో తమకు మహిమలున్నాయని చెప్పుకుంటుంటారు. మహిమల పేరు చెప్పి వారు చేసేవన్నీ మేమూ చేస్తాం. నిమ్మకాయ నుంచి రక్తం రావడం, కొబ్బరి కాయలో నుంచి పువ్వులు, రక్తం రావడం, నాలుకపై త్రిశూలం గుచ్చుకోవడం, నోట్లో బ్లేడులు వేసుకుని నమిలి, మింగిన తర్వాత తోరణంగా వాటిని బయటకు తీయడం, విభూది సృష్టించడం, మెడలో కత్తి గుచ్చుకోవడం, తాడుమీద కొబ్బరికాయను అటూ ఇటూ నడిపించడం, దయ్యాలు, భూతాలపై భయాన్ని పోగొట్టేందుకు మనిషిని హిప్నటైజ్ చేసి తలపై మంటపెట్టి పాలు, నీరు మరిగించడం వంటి విద్యలను ప్రదర్శిస్తాం. అవి కేవలం సైంటిఫిక్‌గా ప్రదర్శించే విద్యలే తప్ప మహిమలు కాదని చాటి చెబుతాం. ఊరూరా కేవలం ఈ ప్రదర్శనలే కాకుండా కళ్లకు గంతలు కట్టుకుని రోడ్లపై మోటార్ సైకిల్ నడిపి ప్రజల్లో మూఢనమ్మకాలను పారద్రోలే ప్రయత్నాలూ మా ప్రదర్శనలో భాగంగా ఉంటాయి. మాది సఫల ప్రయత్నం.. అందుకు ఇదీ ఉదాహరణ! మా ప్రదర్శనలు ఎంతో విజ్ఞానవంతమైనవి. మరింత చైతన్యపరిచేవి. మా ప్రయత్నం ఎంత సఫలమో చెప్పేందుకు ఉదాహరణ ఒకటుంది. మా నాన్నగారు మ్యాజిక్ చేస్తుండగా విజయనగరం జిల్లాలోని జియమ్మవలస మండలంలోని చినమేరంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మా నాన్న దగ్గరికి వచ్చాడు. తాను చిల్లంగి చేస్తున్నాననే నెపంతో కొందరు తన భార్యను పొట్టనబెట్టుకున్నారట. తననూ చంపేస్తామంటున్నారంటూ బోరున విలపించాడు. ఇవే ప్రదర్శనలు తమ గ్రామంలో ఇచ్చి తన ప్రాణాలు నిలపమంటూ నాన్నను ప్రాధేయపడ్డాడు. నాన్న కారణంగా తన ప్రాణం దక్కుతుందంటూ కన్నీళ్లతో నమస్కరించాడు. ఇలా మా ప్రదర్శనలతో ప్రజలు చైతన్యవంతం కావడమే కాదు... చాలామంది ప్రాణాలూ నిలిచాయి. కొన్ని జీవితాల్లో మార్పులూ వచ్చాయి. వినోదంతో పాటు సామాజిక బాధ్యత మా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో శిశుమరణాలు ఎక్కువ. గర్భిణీ ఆరోగ్యం విషయంలో వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సరైన మందులు, వైద్యం కూడా అందదు. ఇక పుట్టిన పిల్లలకు పౌష్టికాహారం కూడా ఉండదు. ఈ కారణంగా బిడ్డలు పౌష్టికాహార లోపంతో చిన్న వయసులోనే మృత్యువాత పడుతుంటారు. కనీసం వారికి తల్లిపాలైనా సరిగ్గా ఇస్తే కొంతమందినైనా బతికించుకోవచ్చు. ఈ నేపథ్యంలో తల్లిపాల విశిష్టత, శిశువులకు పౌష్టికాహార ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. గిరిజనులు తమ పిల్లలను బడికి పంపకుండా, కూలీ పనులకు పంపిస్తుంటారు. అలా చేయడం వల్ల వారి జీవితాల్లో వెలుగులు ఎన్నటికీ రావంటూ, విద్య ఆవశ్యకతపైనా ప్రదర్శనలిస్తుంటాం. ఆడపిల్లను చంపుకుంటే ఇంటి లక్ష్మిని చంపుకున్నట్టేనంటూ మా ఇద్దరినీ ఉదాహరణగా చూపిస్తూ.. భ్రూణహత్యలు, స్త్రీ శిశు హత్యలకు వ్యతిరేకంగా చైతన్యం తెస్తుంటారు నాన్న. చిన్నారి పొన్నారి చిరు వయసు నుంచే... మా ఇద్దరిలో మూడున్నర ఏళ్ల వయసప్పుడు నాచేత ప్రదర్శన ఇప్పించారు నాన్న. నన్ను చూసి చెల్లెలు రెండున్నర ఏళ్లున్నప్పుడే వేదిక ఎక్కడానికి ఉత్సాహం చూపింది. తాను అంత చిన్న వయసు నుంచే మ్యాజిక్ మొదలుపెట్టింది. అలా నాన్నతో పాటు మేమిద్దరమూ 28కి పైగా జాతీయ, రాష్ట్రీయ అవార్డులు ఎన్నో పురస్కారాలు గెలుచుకున్నాం. మాది ఒక్కటే కోరిక. సమాజంలోని మూఢనమ్మకాలు అంతమైపోవాలి. అందుకు మా మ్యాజిక్ ఉపయోగపడి... అది మూఢనమ్మకాలను మాయం చేసేస్తే మాకు అంతకంటే ఏం కావాలి? జాతీయ స్థాయి గుర్తింపు ఇంద్రజాల ప్రదర్శనలో ప్రతిభకు వచ్చిన జాతీయ అవార్డు అందుకోవడానికి 2006లో మా అక్కాచెల్లెళ్లమిద్దరమూ ఢిల్లీకి వెళ్లాం. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ నుంచి అవార్డు తీసుకుంటుండగా మా విజిటింగ్ కార్డును ప్రధానికి ఇచ్చి ‘హమారా ఐడెంటిటీ కార్డ్’ అన్నాం. వెంటనే స్పందించిన మన్మోహన్సింగ్ ‘తుమ్హారా ఐడెంటిటీకార్డ్!’ అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్నట్లు ముఖం పెట్టి ఆయన ఫక్కున నవ్వేశారు. విజిటింగ్ కార్డుకి ఐడెంటిటీ కార్డుకీ తేడా తెలియని వయసులో ఇంద్రజాలంలో జాతీయ అవార్డు అందుకున్నాం మేం. బహుశా ఇలా అక్కాచెల్లెళ్లిద్దరూ ఇంద్రజాలం ప్రదర్శించే మ్యాజిక్ సిస్టర్స్ మేమే కాబోలు. లాయర్ని అవుతా నాన్న కోర్టులో జూనియర్ అసిస్టెంట్ కావడంతో తరచుగా అక్కడికి తీసుకువెళ్లేవారు. దాంతో న్యాయవాద వృత్తిని చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. మరి కొద్ది నెలల్లో ఎల్ఎల్బి పట్టా అందుకోబోతున్నాను. ఆటబొమ్మల బదులు మ్యాజిక్ వస్తువులు ఇచ్చి నాన్న ఆడుకోమనేవారు. ఆలా ఇంద్రజాలాన్ని ఉగ్గుపాలతోనే అలవాటు చేశారు. చెల్లి కూడా నాతో జతకలిసిన తర్వాత ఏ ప్రదర్శన చేసినా ఇద్దరం కలిసే చేస్తున్నాం. – మౌనిక, ఇంద్రజాలికురాలు, విజయనగరం షార్ట్ ఫిల్మ్స్‌కు ఎడిటర్‌గా చేస్తున్నా మానవ వనరులను సబ్జెక్ట్‌గా తీసుకుని డిగ్రీ చదువుతున్నాను. యానిమేషన్‌పై ఇష్టంతో అదీ నేర్చుకుని ఫ్రెండ్స్ ఫిల్మ్స్ అనే యూ ట్యూబ్ చానెల్ ద్వారా స్నేహితులతో కలిసి తీస్తున్న షార్ట్ ఫిల్మ్స్‌కి ఎడిటర్‌గా కూడా చేస్తున్నాను. చిన్నప్పుడు అక్క మ్యాజిక్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టడం చూసి నాకూ మ్యాజిక్ చేయాలనిపించింది. నాన్న అక్కకూ, నాకూ దానిలో మెళకువలు నేర్చించారు. ఒకప్పుడు మేం చేస్తుంటే విమర్శించిన వారు ఇప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. – సుష్మిత, ఇంద్రజాలికురాలు, విజయనగరం చాలా విమర్శలు ఎదుర్కొన్నా ఆడపిల్లల ముఖానికి రంగేసి తిప్పుతున్నానని, పెళ్లి చేయకుండా ఈ గారడీ ప్రదర్శనలేంటని బంధువర్గంలో సూటిపోటి మాటలు బాధించేవి. మ్యాజిక్‌ను చాలా చులకనగా చూసేవారు. ఒకానొక దశలో క్షుద్ర విద్యలు నేర్పుతున్నాననేవారు. ఇది క్షుద్రవిద్య కాదని, ఇంద్రజాలం అనేది ఓ కళ అని నమ్మిన నేను ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంతగా నిరుత్సాహ పరిచినా వెనుదిరిగి చూడలేదు. వాళ్లన్న క్షుద్ర విద్యలు, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా ప్రదర్శనలిస్తున్నాం. – జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి, తండ్రి, ఇంద్రజాలికుడు, విజయనగరం – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
సుష్మితా సేన్