ప్రతి ఆడపిల్ల పెళ్లి తర్వాత జీవతం గురించి ఎన్నో కలలు కంటుంది. అందరికి మెట్టినిల్లు పుట్టినిల్లులా ఉండకపోవచ్చు. కొందరికి అది ముళ్లమీద సాగుతున్న జీవితంలా ఉండొచ్చు. అయినప్పటికి పుట్టింటి గౌరవం కాపాడేందుకు అన్నింటిని ఓర్చుకుంటుంది. కానీ అది హద్దు దాటి ఆమె ఆత్మగౌరవాన్నే కించే పరిచలే చేస్తే తట్టుకోలేదు. అదికూడ కట్టుకున్నవాడే తన ఉనికినే సహించలేనంటే.. ఆ మహిళ పరిస్థితి మాటలకందని వేదన అని చెప్పొచ్చు. అలాంటివి అధిగమించి తానెంటో ప్రూవ్ చేసుకున్న ఓ ధీర వనిత గాథ ఇది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళ స్ఫూర్తి కథేంటో చూద్దామా!.
32 ఏళ్ల సుస్మితా దాస్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అందరి ఆడపిల్లలా పెళ్లి గురించి ఎన్నో కలలు కంది. ఎంతో ఆనందంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తమ ప్రేమకు గుర్తుగా పండంటి బాబుని కంది. అదే ఆమె పాలిట శాపంగా మారి వైవాహిక జీవితాన్ని నిలువునా కూలుస్తుందని ఊహించలేదు. సాధారణంగా ప్రసవానంతరం వచ్చే మహిళల్లో చాలా మార్పులు వస్తాయి. కొందరూ బాగా లావవ్వడం జరుగుతుంది. పిల్లలు ఎదిగే క్రమంలో కొందరూ తగ్గుతారు, మరికొందరూ కాస్త శరీరంపై దృష్టిపెట్టి తగ్గించుకోవడం వంటివి చేస్తారు.
అలానే సుస్మిత డెలివరీ తర్వాత ఊహించిన విధంగా బరువు పెరిగింది. ఈ శరీర మార్పులను అంగీకరించకపోగా బాషీ షేమింగ్‌తో ఇబ్బంది పెట్టేవాడు. లావుగా ఉన్న నీతో కాపురం చేయలేను అని బిడ్డతో సహా ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మానసికంగా కుంగిపోయింది. ఏం చేయాలో ఎలా లైప్ లీడ్ చేయాలో తెలియని అగమ్య గోచరంలా కనిపించింది కళ్లముందున్న జీవితం. తల్లిదండ్రులు సుస్మితను అక్కున చేరుకుని భరోసా ఇచ్చారు. అది ఆమెలో కొండంత ధైర్యం ఇచ్చింది. ఏ బాడీ షేమింగ్ కారణంగా తన జీవితాన్ని కోల్పోయానో దాని మీద దృష్టిపెట్టి మంచి ఫిట్‌నెస్‌గా ఉండాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది.
ఫిట్‌నెస్ కమ్యూనిటీలో ఓ మెంబర్‌గా నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. ఏ ఒక్క రోజు వర్కౌట్‌లు మిస్సవ్వదు. అందరికంటే ఎక్కువ బరువులు అలవోక ఎత్తేయగలదు. పైగా తాను పెళ్లి కారణంగా మధ్యలోనే ఆపేసిన ఎంబీఏని చదువుని పూర్తి చేయడమే గాక మంచి కార్పోరేట కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించడమే గాకు తన కుంటుంబాన్ని పోషించుకుంటోంది. అంతేగాదు తనలా బాడీషేమింగ్‌తో బాధపడే మహిళలకు మంచి ఫిట్‌నెస్ గురువుగా సలహలిస్తూ వారిని మంచి టోన్డ్ బాడీగా మార్చుకునేలా సాయం చేస్తోంది. అలా మహిళలను కించపరచడం తప్పని నిరూపించడమేగాక వారు తమను తాము ప్రేమించుకుంటేనే ధైర్యంగా నిలబడగలరని ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment