సాక్షి, వరంగల్ రూరల్: పరకాల నుంచి కొండా సురేఖ, వరంగల్ తూర్పు నుంచి తమ కుమార్తె సుస్మితా పటేల్ బరిలో ఉంటారని కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చెప్పినట్లు తెలిసింది. సోమవారం కొండా దంపతులు హన్మకొండకు వచ్చారు. వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి వచ్చిన అభిమానులతో మురళీధర్‌రావు సమావేశమయ్యారు. మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ నెల 23న ఆత్మకూరులో బహిరంగ సభ పెడదామని చెప్పినట్లు తెలిసింది.
నేడు బహిరంగ లేఖ!
ఈ నెల 8న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌కు కొండా దంపతులు పలు డిమాండ్లు చేశారు. ఈ డిమాండ్లకు సమాధానం చెప్పకపోతే కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాస్తామని ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో ఈ లేఖను విడుదల చేయనున్నారని తెలిసింది.
పరకాలకు సురేఖ.. తూర్పు నుంచి సుస్మితా!
Published Tue, Sep 11 2018 2:52 AM | Last Updated on Tue, Sep 11 2018 8:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment