
అప్పుడు తండ్రికి ఇప్పుడు తమ్ముడికి
తమ్ముడు రామ్‌చరణ్‌తో కలసి మరో సినిమా చేస్తున్నారు సుస్మిత కొణిదెల. చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమాలో తమ్ముడికి సై్టలింగ్ చేస్తున్నారు సుస్మిత. చరణ్‌తో కలసి ఆమె∙చేస్తున్న రెండో చిత్రమిది. చిరంజీవి హీరోగా చరణ్ నిర్మించిన ‘ఖైదీ నంబర్ 150’లో చిరూ సై్టలింగ్‌ను దగ్గరుండి చూసుకున్నారామె. అప్పుడు నిర్మాతగా అక్క సై్టలింగ్ చూసి ముచ్చటపడిన చరణ్, తాజా సినిమాకు సుస్మిత చేత డ్రస్సులు డిజైన్ చేయించుకుంటున్నారు.
పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి దగ్గరలోని పూడిపల్లిలో నేడు ప్రారంభమైంది. అక్కడ సుమారు నెల రోజుల పాటు చరణ్, ఇతర ముఖ్య తారగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా కోసం చరణ్ బరువు తగ్గి, గడ్డం పెంచారు. ఇందులో చరణ్ మూగ యువకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కెమేరా: రత్నవేలు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీఏం).