
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టిన రోజు నేడు. మహాశివరాత్రి రోజే ఆమె బర్త్‌డే రావడం విశేషం. ఫిబ్రవరి 18న ఆమె బర్త్‌డే, శివరాత్రిని పురస్కరించుకుని ఇవాళ శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని ఆమె దర్శించుకున్నారు. ఆమెతో పాటు పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కూడా ఉన్నారు.
తల్లి సురేఖతో మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న వీడియోను సుష్మిత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక, చిరు దంపతుల పెద్ద కుమార్తె సుష్మిత కాస్టూమ్ డిజైనర్ అనే విషయం తెలిసిందే. తండ్రి చిత్రాలకు ఆమె కాస్టూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment