srishailam
-
శ్రీశైలం వెళ్తున్నారా.. ఎస్పీ విజ్ఞప్తి ఇదే
నాగర్ కర్నూలు, సాక్షి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో అక్కడక్కడ డ్యామేజ్ అయింది. దీంతో వాహనాలు వెళ్ళడానికి అవకాశం లేకుండా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వివిధ జిల్లాల నుంచి వయా కల్వకుర్తి, అచ్చంపేట మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు కొన్ని రోజులపాటు తాత్కాలికంగా తమ దర్శన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను వెళ్దండ మండలం కోట్రా జంక్షన్ వద్ద, వంగూరు మండలం కొనేటిపురం టోల్ ప్లాజా దగ్గర ఆపివేయడం జగురుతుందని తెలిపారు. కాబట్టి శ్రీశైలం వెళ్లే భక్తులు, వాహనదారులు ఈ విషయంలో పోలీసువారికి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.మరోవైపు.. భారీ వర్షాలతో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనులు కల్వర్ట్ దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్స్ తకిఖాన్, రాము కాపాడారు. జిల్లాలోని కోడెర్లో భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలిపోయింది. ఇంటిలో ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బిజినపల్లి మండలం లట్టుపల్లి సమీపంలో కేఎల్ఐ కాలువ తెగటంతో వందలాది ఎకరాల పంటలు నీట మునిగింది. -
శివనామస్మరణతో మారుమోగుతున్న నల్లమల అభయారణ్యం
-
ఇద్దరి స్నేహితుల ప్రాణాలను తీసిన.. విద్యార్థుల రాష్ డ్రైవింగ్!
సాక్షి, రంగారెడ్డి: ఇద్దరు మిత్రుల ఐదేళ్ల ప్రయాణం విద్యార్థుల రాష్ డ్రైవింగ్‌తో ఆగిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఇరువురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన బుధవారం మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం మండల పరిధిలోని జనవాడకు చెందిన బ్యాగరి రాజు(40) శేరిలింగంపల్లిలోని ఓ కంపెనీలో సూపర్వైజర్, మోత్కుపల్లి శ్రీశైలం(31) ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. రోజు మాదిరిగానే వారు బైక్‌పై విధులకు బయలుదేరారు. గ్రామ శివారులోకి కొల్లూరు రోడ్డులో ఇక్ఫాయి కళాశాల విద్యార్థులు అతివేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో రాజు ఘటనాస్థలిలోనే మృతి చెందగా.. శ్రీశైలంను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు. రాజుకు భార్య మమత, ముగ్గురు సంతానం. శ్రీశైలంకు ఏడాదిన్నర క్రితం సంధ్యతో వివాహమైంది. మృతదేహాలను చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇద్దరు మిత్రుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కళాశాల ఎదుట ధర్నా.. మృతుల కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని.. ప్రమాదానికి కారణమైన విద్యార్థులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలోనూ శంకర్పల్లి–హైదరాబాద్ ప్రధాన రహదారిపై కార్ రేసింగ్ నిర్వహించి ఓ మహిళ ప్రాణాలను బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు గంజాయి, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆరోపించారు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోకిల సీఐ నరేశ్, శంకర్పల్లి సీఐ వినాయకరెడ్డి కళాశాల వద్దకు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ సతీమణి సురేఖ
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టిన రోజు నేడు. మహాశివరాత్రి రోజే ఆమె బర్త్‌డే రావడం విశేషం. ఫిబ్రవరి 18న ఆమె బర్త్‌డే, శివరాత్రిని పురస్కరించుకుని ఇవాళ శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని ఆమె దర్శించుకున్నారు. ఆమెతో పాటు పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కూడా ఉన్నారు. తల్లి సురేఖతో మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న వీడియోను సుష్మిత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక, చిరు దంపతుల పెద్ద కుమార్తె సుష్మిత కాస్టూమ్ డిజైనర్ అనే విషయం తెలిసిందే. తండ్రి చిత్రాలకు ఆమె కాస్టూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. -
Srisailam temple: దుకాణాల వేలంలో అందరూ పాల్గొనవచ్చు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలంలోగల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ దుకాణాలు, దుకాణ సముదాయాల వేలంలో హిందుయేతరులూ పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వేలంలో హిందూయేతరులు పాల్గొనరాదంటూ 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ జీవోను పలువురు హైకోర్టులో సవాల్ చేశారు. ఆ జీవోను సమర్థిస్తూ 2019లో ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు గతేడాది జనవరిలో స్టే ఇచ్చింది. సుప్రీం ఆదేశాలు అమలు చేయలేదంటూ జానీబాషా, టీఎం రబ్బానీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్ , జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. చదవండి: 2018 డీఎస్సీలో భర్తీ కాని ఖాళీల నియామకాలకు షెడ్యూల్ మతం, విశ్వాసం ప్రాతిపదికన ఆలయ దుకాణాల వేలంలో హిందూయేతరులు పాల్గొనడాన్ని నిరాకరించడం సబబుకాదని పేర్కొంది. ఆలయ ప్రాంగణాల్లో మత విశ్వాసాలకు విఘాతం కలిగించే మద్యం, గ్యాంబ్లింగ్ వంటివి అనుమతించరాదుగానీ పూలు, పళ్లు, చిన్నపిల్లల ఆటబొమ్మలకు సంబంధించిన దుకాణాల వేలంలో హిందూయేతరులను అనుమతించకపోవడం సరికాదని జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. శ్రీశైలం భ్రమరాంబ మలికార్జునస్వామి ఆలయ దుకాణాలు, దుకాణ సముదాయాల వేలంలో హిందుయేతరులనూ అనుమతించాలని స్పష్టం చేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. -
నాగర్ కర్నూల్: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
-
దారుణం: ఎంత పని చేశావు తల్లీ!
శ్రీశైలం: భర్త మందలించాడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ.. కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీశైలంలో చోటుచేసుకుంది. శ్రీశైలం దేవస్థానం అన్నదాన సెక్షన్లో పనిచేస్తున్న మేకల బండ చెంచూగూడెంకు చెందిన తోకల నాగమ్మ పెద్ద కుమార్తె శ్రావణి(28)ని అదే గూడేనికి చెందిన నిమ్మల నాగమ్మకు ఇచ్చి 2014లో వివాహం చేశారు. వీరికి లోహిత్ చంద్ర, రోషీనీ, శివతరుణ్(ఒకటిన్నర సంవత్సరాలు) సంతానం, శ్రావణి కూడా దేవస్థానంలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈమె మూడు రోజుల క్రితం బంధువుల పెళ్లికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో వరుసకు బావ అయిన వ్యక్తితో కలిసి బైక్‌పై వచ్చింది. ఈ విషయంలో భర్త నాగన్నతోపాటు బంధువులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైంది. సోమవారం ఉదయం శివతరుణ్‌ను తీసుకొని వెళ్లి.. సారంగధర మకం వద్ద ఉన్న బావిలో కుమారిడితో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది. వారి కోసం కుటుంబీకులు గాలిస్తున్న క్రమంలో మంగళవారం మధ్యాహ్నం బావిలో మృతదేహాలు తేలియాడుతూ కనింపించాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: దుర్గ హత్య కేసు: అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు -
శ్రీగిరి.. భక్త జన ఝరి
శ్రీశైలం/శ్రీకాళహస్తి(రేణిగుంట)/నరసరావుపేట: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో కిటకిటలాడుతోంది. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడే మహాశివరాత్రి పర్వదినం కూడా రావడంతో భ్రమరాంబ సమేత మల్లికార్జునుడి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఆదివారం రాత్రే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నల్లమల మీదుగా పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్నారు. భక్తులందరికీ 24 గంటలూ మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలకు అంతరాయం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్లన్న సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నెల ఏడు వరకు ఇదే తరహాలో అనుమతిస్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు పోటెత్తడంతో స్నానఘట్టాలు కిక్కిరిశాయి. గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీశైలేశుడు శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆదివారం రాత్రి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేయించి.. ప్రధానాలయ రాజగోపురం గుండా రథశాలకు చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం ప్రధాన మాడ వీధిలోని అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగింది. కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్సింగ్, ఈఓ శ్రీరామచంద్రమూర్తి, చైర్మన్ వంగాల శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం రాత్రి 10గంటల నుంచి శ్రీమల్లికార్జునస్వామి వార్లకు 11 మంది రుత్వికులు వేదమంత్రోచ్ఛారణతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ప్రారంభిస్తారు. ఒకవైపు అభిషేకం జరుగుతుండగానే.. మరోవైపు మల్లన్న వరుడయ్యే శుభముహూర్తం రాత్రి 10.30 నుంచి ఆరంభమవుతుంది. గర్భాలయ కలశవిమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉన్న నవనందులను కలుపుతూ అతిసుందరంగా పాగాను అలంకరిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట సమీపంలో అత్యంత శోభాయమానంగా అలంకరించిన కల్యాణవేదికపై శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల బ్రహ్మోత్సవ కల్యాణం ఆగమ శాస్త్రానుసారం జరిపిస్తారు హంసవాహనంపై విహరించిన ఆదిదేవుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంసవాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చిలుక వాహనంపై విహరించారు. రాత్రి హాలాహలాన్ని సేవించిన నీలకంఠుడు మగతనిద్రలోకి జారుకోగా ఆయనను మేల్కొలిపేందుకు నాగులు నిర్వహించే ఉత్సవమే నాగరాత్రి. ఉదయం హంస–చిలుక వాహనాల్లో పార్వతీపరమేశ్వర్లు పురవీధుల్లో విహరించారు. అలాగే రాత్రి కైలాసపతి శేష వాహనంపై చిద్విలాసంతో భక్తులకు ఆభయ ప్రధానం చేశారు. తల్లి జ్ఞానప్రసూనాంబ యాళి వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఈవో పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మహాశివరాత్రి సందర్భంగా రాహుకేతు పూజలను సోమవారం రద్దు చేశారు. నేడు కోటప్పకొండ తిరునాళ్లు మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో సోమవారం మహా తిరునాళ్ళు జరగనున్నాయి. ఈ తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని భావిస్తున్నారు. త్రికోటేశ్వరుడిని సోమవారం తెల్లవారు జాము నుంచే భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు త్రికోటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మొక్కుబడి కింద విద్యుత్ ప్రభలు, పెద్దా, చిన్న తడికె ప్రభలు నిర్మించి తీసుకురానున్నారు. అధికారులు తిరునాళ్లకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేశారు. కోటప్పకొండకు నరసరావుపేట డిపో నుంచి 255 ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేయగా, చిలకలూరిపేట, అద్దంకి, వినుకొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పుతున్నారు. ఈ తిరునాళ్లను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర పండుగగా ప్రకటించారు. శ్రీకాళహస్తిలో నేడు నందిసేవ – లింగోద్భవ అభిషేకం చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి రోజున శివుడు నంది వాహనంపై ఊరేగడం ఆనవాయితీ. ధర్మానికి ప్రతీకగా ఉన్న నందిపై ఊరేగుతున్న పరమశివుని దర్శిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకోసం భక్తులు భారీ సంఖ్యలో శ్రీ కాళహస్తికి తరలి వస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవ దర్శనం ఇక్కడ మరో ప్రధానఘట్టం. విషప్రభావంతో ఉన్న శివుడు తిరిగి మేల్కొనడాన్ని లింగోద్భవంగా పిలుస్తారు. మహాశివరాత్రి రోజు రాత్రి నంది వాహనంపై స్వామి ఊరేగింపునకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి పూజారులు 10 రకాల అభిషేకాలను నిర్వహిస్తారు. గర్భాలయంలో మూలమూర్తి వెనుకభాగంలో ఉన్న లింగోద్భవ మూర్తికి 11వ అభిషేకం (లింగోద్భవ అభిషేకం) శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ అభిషేకం కేవలం మహాశివ రాత్రి రోజున మాత్రమే నిర్వహిస్తారు. వేకువజామున రెండుగంటల సమయంలో జరిగే ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తిని కనబరుస్తారు. -
సింధనూరు టు శ్రీశైలం
ఆత్మకూరురూరల్: మల్లికార్జున స్వామి దర్శనం కోసం వందలాది కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలానికి రావడం భక్తులకు అలవాటే. పాదయాత్రలో అవసరం మేరకు గుర్రాలు, ఎద్దులు పాలుపంచుకోవడం పరిపాటే. అయితే ఓ గ్రామ సింహం అదీ ఎవరి పెంపకంలో లేనిది శ్రీశైలానికి పాదయాత్రికులతో పాటు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సింధనూరు నియోజకవర్గం అంభామట్ గ్రామానికి చెందిన శివభక్తుల వెంట అదే గ్రామానికి చెందిన ఒక వీధి శునకం నడక మొదలు పెట్టింది. కాస్త దూరం నడిచి వెనుదిరుగుతుందని అందరు భావించారు. అయితే అది భక్త బృందంతో పాటు వారం రోజులు నడుస్తూనే ఉంది. శుక్రవారం ఆత్మకూరు పట్టణానికి భక్త బృందం చేరుకుని స్థానిక శ్రీశైల జగద్గురు మఠంలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా ఈ శునకం వ్యవహారం తెలిసింది. శునకం పాదాలు పచ్చిపుళ్లు కావడంతో భక్త బృందం సభ్యుడొకరు ప్రథమ చికిత్స చేస్తూ కనిపించాడు. -
గుండెపోటుతో నూతన ఉపసర్పంచ్ మృతి
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నూతనంగా ఉపసర్పంచ్‌గా ఎన్నికైన శ్రీశైలం గుండెపోటుతో మృతి చెందారు. ఉపసర్పంచ్‌గా శ్రీశైలం గెలుపొందిన ఆనందం నుంచి బయటకు రాకముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి శ్రీశైలం మృతి పట్ల ప్రగాఢసానుభూతి తెలిపారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీఇచ్చారు. -
అటవీ అధికారిపై దాడి..
శ్రీశైలం ప్రాజెక్ట్: మద్యం మత్తులో హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు రెచ్చిపోయారు. అటవీశాఖ శ్రీశైలం సెక్షన్ ఆఫీసర్ జ్యోతిస్వరూప్పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఘటన కర్నూలు జిల్లా శ్రీశైలం పరిధిలోని సున్నిపెంటలో చోటుచేసు కుంది. మంగళవారం రాత్రి సున్నిపెంటలోని అటవీ శాఖ కార్యాలయం సమీపంలో ఆరుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ శ్రీశైలానికి వచ్చే, పోయే వారికి ఆటంకం కల్గించారు. అక్కడ విధుల్లో ఉన్న జ్యోతిస్వరూప్ గమనించి.. ఇది టైగర్‌జోన్ అని, బహిరంగం గా మద్యపానం చేయొద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవా లని వారికి సూచించారు. దీంతో వారు రెచ్చిపోయా రు. అధికారిపై దుర్భాషలాడుతూ చెంపలపై కొట్టా రు. వారిలో ఓ వ్యక్తి.. ‘నేనెవరో తెలుసా? ఎమ్మెల్సీ రంగారెడ్డి కొడుకును. కాళ్లు పట్టుకుంటే వదిలేస్తాం నా కొడకా’ అంటూ దౌర్జన్యం చేస్తూ తీవ్రంగా కొట్టా రు. భయపడిన జ్యోతిస్వరూప్ వారి నుంచి రక్షించుకునేందుకు వాళ్ల కాళ్లను పట్టుకోవాల్సి వచ్చింది. ఇదంతా వారు సెల్ఫోన్లో రికార్డు చేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న జ్యోతిస్వరూప్ దాడి విషయా న్ని పై అధికారులకు తెలియజేశారు. నిందితులు వీరే.. అటవీ అధికారిపై దాడి చేసిన వారిని గౌడ్ ఉప్పల్‌లో ఉన్న గోల్డెన్ ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ యజ మాని శ్రీనివాసగౌడ్, బాబునగర్‌కు చెందిన బయో డీజిల్ ఫ్యాక్టరీ యజమాని నాగం అభినయరెడ్డి, డ్రైవర్ దయానంద్, చింతల్‌కు చెందిన ఎంఎస్ఎంఈ లో క్లర్క్‌గా పనిచేస్తున్న మొగల్కౌతర్, చందానగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పిల్లిమడుగుల అశోక్‌కుమార్, ఫతేనగర్‌కు చెందిన సివిల్ సూపర్వైజర్ రాజుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
మల్లన్న పూజా వేళల్లో మార్పు
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా రద్దీ రోజుల్లో మల్లన్న పూజావేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈవో నారాయణ భరత్‌గుప్త శుక్రవారం చెప్పారు. ఇందులో భాగంగా నవంబర్ 18లోపు ప్రతి కార్తీక శని, ఆది, సోమవారాలతో పాటు కార్తీక శుద్ధ ఏకాదశి, కార్తీక పౌర్ణమి, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఆలయ పూజా వేళల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. ఆయా రోజుల్లో వేకువజామున 2.30 గంటలకు మంగళవాయిద్యాలు, 2.45కు సుప్రభాత సేవ, 3 గంటలకు మహామంగళ హారతి, 3.30 గంటల నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. రద్దీ రోజుల్లో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించేందుకు స్వామి, అమ్మవార్ల సుప్రభాత, మహామంగళహారతి సేవల ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఈవో ప్రకటించారు. కార్తీకమాసం సందర్భంగా ఈ ఏడాది రద్దీ రోజుల్లోనూ ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. శ్రీశైలం ఆలయ వెబ్సైట్ www.srisailamonline.com ద్వారా ముందస్తు టికెట్లను భక్తులు కొనుగోలు చేయవచ్చని సూచించారు. -
భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
కర్నూల్: కార్తీక సోమవారం సందర్భంగా పలు శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇందులో భాగంగా.. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైల క్షేత్రంలో వెయ్యికి పైగా అభిషేకాలు చేయనున్నారు. ఉచిత దర్శనానికి 6 గంటలు, శీఘ్రదర్శనానికి 4 గంటలు, అతి శ్రీఘ్రదర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. -
శ్రీగిరిలోసంక్రాంతి
శ్రీశైలం, న్యూస్‌లైన్: మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీశైలాయం సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఆదివారం పంచాహ్నిక దీక్షతో ఆరంభమైన ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9.15 గంటలకు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ఆజాద్ దంపతులు, ఆలయ అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి గణపతి, కంకణ, తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాలలో లోక కల్యాణార్థం చేపట్టిన విశేష పూజల సందర్భంగా చండీశ్వరునికి కంకణధారణ చేశారు. దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలని సంకల్పం చెప్పారు. అనంతరం దీక్షావస్త్రాలకు విశేష పూజలను చేసి ఉత్సవాల్లోపాల్గొనే వేదపండితులు, అర్చకులు భజంత్రీలకు, సంబంధిత ఆలయ సిబ్బందికి ఈవో అందజేశారు. రాత్రి 7 గంటల నుంచి భేరిపూజ, భేరితాండన, సకల దేవతాహ్వానా పూర్వక ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంతవైభవంగా చేపట్టారు. మకర సంక్రమణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 8.15 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ చేశారు. అంతకుముందు ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరున్ని పల్లకీలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు చేర్చారు. అక్కడ వేదమంత్రోచ్ఛారణలతో భేరి, సన్నాయిలకు వేదపండితులు, అర్చకులు విశేషపూజలు చేశారు. ధ్వజారోహణలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆధ్వర్యం వహించాల్సిందిగా బ్రహ్మదేవున్ని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రాజశేఖర్, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.