శ్రీశైలం: భర్త మందలించాడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ.. కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీశైలంలో చోటుచేసుకుంది. శ్రీశైలం దేవస్థానం అన్నదాన సెక్షన్‌లో పనిచేస్తున్న మేకల బండ చెంచూగూడెంకు చెందిన తోకల నాగమ్మ పెద్ద కుమార్తె శ్రావణి(28)ని అదే గూడేనికి చెందిన నిమ్మల నాగమ్మకు ఇచ్చి 2014లో వివాహం చేశారు. వీరికి లోహిత్ చంద్ర, రోషీనీ, శివతరుణ్(ఒకటిన్నర సంవత్సరాలు) సంతానం, శ్రావణి కూడా దేవస్థానంలో స్వీపర్‌గా పనిచేస్తోంది.
ఈమె మూడు రోజుల క్రితం బంధువుల పెళ్లికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో వరుసకు బావ అయిన వ్యక్తితో కలిసి బైక్‌పై వచ్చింది. ఈ విషయంలో భర్త నాగన్నతోపాటు బంధువులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైంది. సోమవారం ఉదయం శివతరుణ్‌ను తీసుకొని వెళ్లి.. సారంగధర మకం వద్ద ఉన్న బావిలో కుమారిడితో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది. వారి కోసం కుటుంబీకులు గాలిస్తున్న క్రమంలో మంగళవారం మధ్యాహ్నం బావిలో మృతదేహాలు తేలియాడుతూ కనింపించాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment