సాక్షి, రుద్రవరం(కర్నూలు): అండగా ఉంటామని నమ్మించిన వారే మోసం చేయడంతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. తన బిడ్డలను మంచిగా చదివించమని తల్లిదండ్రులకు లేఖ రాసింది. శుక్రవారం రుద్రవరంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు.. రుద్రవరానికి చెందిన లక్ష్మీ నరసమ్మ, తాటిరెడ్డి దంపతులు తమ కుమార్తె జయలక్ష్మీ దేవి(29)ని 12ఏళ్ల క్రితం ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన తువ్వపల్లె వెంకటాద్రికి ఇచ్చివివాహం చేశారు. తొమ్మిది ఏళ్ల పాటు వారి జీవనం అన్యోన్యంగా సాగింది. వారికి హర్షిత, నీరజ్ అనే ఇద్దరు సంతానం కలిగారు. కొన్నాళ్ల క్రితం ఆళ్లగడ్డలో వలంటీర్‌గా విధుల్లో చేరింది. ఈ తరుణంలో భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తి వేరయ్యారు.
వెంటనే జయలక్ష్మీదేవి తన కూమార్తెను ఆళ్లగడ్డ మండలంలోని ఓ వసతి గృహంలో చేర్పించి కుమారుడితో కలిసి పుట్టినిల్లు చేరుకుంది. అక్కడి నుంచే ఆళ్లగడ్డకు వెళ్లి వలంటీర్ విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పట్టణంలోని ఓ గ్రామ సచివాలయంలో పని చేస్తున్న వీఆర్వోతో పరిచయం ఏర్పడింది. అతను పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. తర్వాత ఆ వీఆర్వోకు ఇదివరకే వివాహమైందని తెలియడంతో వెళ్లి నిలదీసింది. పెళ్లి చేసుకోనని అతడు చెప్పడంతో తీవ్రం మనస్థాపం చెంది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలోలేఖ రాసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
చదవండి: ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. వైద్య విద్యార్థిని అలా చేస్తూ..
బడికి వెళ్లిన కుమారుడు ఇంటికి వచ్చి చూడగా తల్లి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే విషయం అవ్వాతాతలకు చెప్పడంతో వారు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి కూతురిని కిందకు దించి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మీనరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment