కర్నూల్: కార్తీక సోమవారం సందర్భంగా పలు శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇందులో భాగంగా.. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైల క్షేత్రంలో వెయ్యికి పైగా అభిషేకాలు చేయనున్నారు. ఉచిత దర్శనానికి 6 గంటలు, శీఘ్రదర్శనానికి 4 గంటలు, అతి శ్రీఘ్రదర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది.