![heavy rains in nagar kurnool sp instructions to srisailam devotees](/styles/webp/s3/article_images/2024/09/1/sp_0.jpg.webp?itok=Ewb1H7Ce)
నాగర్ కర్నూలు, సాక్షి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో అక్కడక్కడ డ్యామేజ్ అయింది. దీంతో వాహనాలు వెళ్ళడానికి అవకాశం లేకుండా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వివిధ జిల్లాల నుంచి వయా కల్వకుర్తి, అచ్చంపేట మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు కొన్ని రోజులపాటు తాత్కాలికంగా తమ దర్శన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు.
హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను వెళ్దండ మండలం కోట్రా జంక్షన్ వద్ద, వంగూరు మండలం కొనేటిపురం టోల్ ప్లాజా దగ్గర ఆపివేయడం జగురుతుందని తెలిపారు. కాబట్టి శ్రీశైలం వెళ్లే భక్తులు, వాహనదారులు ఈ విషయంలో పోలీసువారికి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. భారీ వర్షాలతో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనులు కల్వర్ట్ దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్స్ తకిఖాన్, రాము కాపాడారు. జిల్లాలోని కోడెర్‌లో భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలిపోయింది. ఇంటిలో ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బిజినపల్లి మండలం లట్టుపల్లి సమీపంలో కేఎల్ఐ కాలువ తెగటంతో వందలాది ఎకరాల పంటలు నీట మునిగింది.
Comments
Please login to add a commentAdd a comment