శునకానికి సేవలందిస్తున్న భక్తుడు
ఆత్మకూరురూరల్: మల్లికార్జున స్వామి దర్శనం కోసం వందలాది కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలానికి రావడం భక్తులకు అలవాటే. పాదయాత్రలో అవసరం మేరకు గుర్రాలు, ఎద్దులు పాలుపంచుకోవడం పరిపాటే. అయితే ఓ గ్రామ సింహం అదీ ఎవరి పెంపకంలో లేనిది శ్రీశైలానికి పాదయాత్రికులతో పాటు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సింధనూరు నియోజకవర్గం అంభామట్ గ్రామానికి చెందిన శివభక్తుల వెంట అదే గ్రామానికి చెందిన ఒక వీధి శునకం నడక మొదలు పెట్టింది. కాస్త దూరం నడిచి వెనుదిరుగుతుందని అందరు భావించారు. అయితే అది భక్త బృందంతో పాటు వారం రోజులు నడుస్తూనే ఉంది. శుక్రవారం ఆత్మకూరు పట్టణానికి భక్త బృందం చేరుకుని స్థానిక శ్రీశైల జగద్గురు మఠంలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా ఈ శునకం వ్యవహారం తెలిసింది. శునకం పాదాలు పచ్చిపుళ్లు కావడంతో భక్త బృందం సభ్యుడొకరు ప్రథమ చికిత్స చేస్తూ కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment