
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. రామ్‌చరణ్ ఎంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినా తన తల్లి సురేఖకు మాత్రం పిల్లవాడే! నేడు (మార్చి 27) చరణ్ పుట్టినరోజు. కుమారుడి బర్త్‌డే అంటే పేరెంట్స్‌కు ఎంత ఆనందమో! ఆ సంతోషాన్ని నలుగురికి పంచాలనుకున్నారు సురేఖ. అన్నింటిలోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని ఆశ్రయించారు. ఆలోచన వచ్చిందే తడవు.. ఒకరోజు ముందే అన్నదానం నిర్వహించారు.
"చినజీయర్ స్వామి ఆశీస్సులతో అపోలో ఆవరణలోని ఆలయ పుష్కరోత్సవాల్లో 500 మందికి అన్నదానం చేశాం" అంటూ అత్తమ్మాస్ కిచెన్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా గత నెలలో ఉపాసన సాయంతో సురేఖ అత్తమ్మాస్ కిచెన్ పేరిట ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. సురేఖ బర్త్‌డే రోజే ఈ వ్యాపారాన్ని లాంచ్ చేశారు. కమ్మటి ఇంటి వంటను అందరికీ అందజేయడమే దీని ఉద్దేశమని సురేఖ పేర్కొన్నారు.
చదవండి: తెలుగు హీరోయిన్‌ను పెళ్లాడిన సిద్దార్థ్.. ఇద్దరికీ రెండోదే!
Comments
Please login to add a commentAdd a comment