తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్ విజేతగా నిఖిల్ ట్రోఫితో పాటు ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సీజన్ రన్నరప్‌గా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గౌతమ్ నిలిచాడు. చాలా వరకు ఆడియన్స్ గౌతమ్ గెలుస్తాడని ముందే ఊహించారు. కానీ అనూహ్యంగా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ గ్రాండ్ ఫినాలేకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతకు ట్రోఫీని అందజేశారు.
(ఇది చదవండి: షో అయిపోగానే కావ్య దగ్గర వాలిపోతానన్న నిఖిల్.. ఇప్పుడేమో!)
అయితే గ్రాండ్ ఫినాలేలో రామ్ చరణ్ అన్నను కలవడం సంతోషంగా ఉందని గౌతమ్ అన్నారు. అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్ అని రామ్ చరణ్ నాతో అన్నాడని తెలిపాడు. ప్రతి రోజు బిగ్‌బాస్ చూసి నాకు నీ గురించి చెబుతూ ఉంటుందని చరణ్ అన్న చెప్పాడు. నేనే విన్నర్ అవుతానని సురేఖ అమ్మగారు చెప్పారని చరణ్ అన్న నాతో అన్నారు. నువ్వు ఏం ఫీలవ్వకు.. నీకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారని చరణ్ అన్న చెప్పడం నా జీవితంలో గర్వించదగిన సందర్భమని గౌతమ్ వెల్లడించారు. నేను గెలవలేదని ఫీలవుతుంటే.. నువ్వు కచ్చితంగా నిలబడతావ్.. అంటూ చరణ్ అన్న నాకు ధైర్యం చెప్పాడని గౌతమ్ ఎమోషనల్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment