
గుమ్మడికాయ కొట్టేసిన ఖైదీ
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఖైదీ నంబర్ 150 షూటింగ్ పూర్తయ్యింది. దాదాపు దశాబ్దకాలంగా మెగా అభిమానులను ఊరిస్తున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరు మార్క్ మాస్ యాక్షన్ కామెడీలతో రూపొందిన ఈ సినిమా మెగాస్టార్ స్టామినాను మరో సారి ప్రూవ్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ బుధవారంతో పూర్తయ్యింది. ఈ విషయాన్ని మెగాతనయ, ఖైదీ నంబర్ 150 కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మితా కొణిదల స్వయంగా ప్రకటించారు. తన ట్విట్టర్ పేజ్ లో ఖైదీ నంబర్ 150 షూటింగ్ పూర్తయ్యిందంటూ పోస్ట్ చేసిన సుస్మిత, రత్నవేళు, వినాయక్, దేవీ శ్రీ ప్రసాద్ లతో కలిసి పనిచేయటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో యూనిట్ సభ్యుల నుంచి ఎంతో నేర్చుకున్నానంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది సుస్మిత.
It's a wrap on #KhaidiNo150 been a great experience. Best team to work with @KonidelaPro @RathnaveluDop #VVVinay garu @ThisIsDSP
— sushmita konidela (@sushkonidela) 14 December 2016
And with the most fun costume team it's been a super journey and lot of learning from everyone @ind_pat @archa_mehta @Gauri_Naidu
— sushmita konidela (@sushkonidela) 14 December 2016