'Mega 156': Sushmita Konidela Announced On Chiranjeevi's Special Day - Sakshi
Sakshi News home page

Chiranjeevi Movie With Sushmita: మెగాస్టార్‌తో సినిమా ప్రకటించిన సుస్మిత

Published Tue, Aug 22 2023 10:32 AM | Last Updated on Tue, Aug 22 2023 10:46 AM

ś Announced Chiranjeevi 156 Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నేడు (ఆగష్టు 22) 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద కూతురు సుస్మిత కొణిదెలకు చెందిన  ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్’ నుంచి ఒక శుభవార్తను ఫ్యాన్స్‌ కోసం వెల్లడించారు.  సుష్మిత నిర్మాతగా చిరంజీవి 156వ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని  గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ సోషల్‌మీడియా ఖాతా ద్వారా తెలిపారు.

(ఇదీ చదవండి: రాజ‌కీయాల్లో చిరు ఓడిపోవ‌చ్చేమో కానీ సినిమాల్లో ఎప్పటికీ 'మగధీరుడే')

చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందుకు సంబంధిచిన ఒక ఫోటోను షేర్‌ చేశారు. ఈ మెగా ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే కథ కూడా రెడీ చేసి చిరంజీవికి వినిపించారని టాక్‌ నడుస్తోంది. ఆ కథను ఆయన ఫైనల్‌ కూడా చేశారట. ఇకపోతే  మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ను ఒక యంగ్‌ దర్శకుడికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం టాలీవుడ్‌ నుంచే కాకుండా ఒక తమిళ దర్శకుడు కూడా లైన్‌లో ఉన్నారని సమాచారం.

ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌ నుంచి ఒక సినిమా ఉంటుందని ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. వారు ఒక పోస్టర్‌ను కూడా తాజాగ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. దీంతో భోళా శంకర్‌ తర్వాత ఆయన నుంచి రెండు భారీ ప్రాజెక్ట్‌లు రెడీ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement