డాటర్ డిజైనర్... డాడ్ లుక్ సూపర్! | Sushmita is Costumes Designer to Chiranjeevi | Sakshi
Sakshi News home page

డాటర్ డిజైనర్... డాడ్ లుక్ సూపర్!

Published Thu, Nov 10 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

డాటర్ డిజైనర్... డాడ్ లుక్ సూపర్!

డాటర్ డిజైనర్... డాడ్ లుక్ సూపర్!

మమ్మీ డాడీ స్టైల్‌గా కనిపించాలని పిల్లలు కోరుకుంటారు. కొన్ని టిప్స్ కూడా ఇస్తుంటారు. వీలైతే వాళ్ల కోసం షాపింగ్ చేస్తారు. అదే డాడీ హీరో అనుకోండి... సినిమాలో ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ బాగుండాలని అనుకుంటారు. ఒకవేళ డిజైనింగ్ మీద అవగాహన ఉంటే, స్వయంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత అదే చేస్తున్నారు. తండ్రి 150వ చిత్రం ‘ఖైదీ నం. 150’కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారామె. డాడీ స్టైలిష్‌గా కనిపించడం కోసం చాలా శ్రద్ధగా డ్రెస్సులు తయారు చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు చూసి, చిరంజీవి లుక్ సూపర్ అని అభిమానులు మురిసిపోతున్నారు. అన్నట్లు.. తండ్రికి మాత్రమే కాదు.. సినిమా మొత్తానికి సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే... ప్రస్తుతం ఈ చిత్రబృందం యూరప్ వెళ్లడానికి రెడీ అవుతోంది. అక్కడ పాటలను చిత్రీకరించనున్నారు. స్లోవేనియా, క్రొయేషియా తదితర అందమైన లొకేషన్లలో ఈ చిత్రీకరణ జరగనుందని చిత్ర నిర్మాత రామ్‌చరణ్ తెలిపారు. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తారని చెప్పారు.

వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ ప్రత్యేక పాటకు చిరంజీవి సరసన లక్ష్మీరాయ్ కాలు కదిపారు. హిందీ నటుడు తరుణ్ అరోరా విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమేరా: రత్నవేలు, కళ: తోట తరణి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement