costume designer
-
అవకాశానికే అవకాశం ఇచ్చింది
కొంతమంది గురించి చెప్పడానికి మాటలు అక్కర్లేదు. వాళ్ల పని చూస్తే చాలు! అలాంటి ప్రతిభావంతురాలే థెమిస్ వెనెస్సా! అవకాశాలను ఆమె వెదుక్కోలేదు.. అవకాశాలే థెమిస్ని వెదుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన ప్రతి అవకాశంతో మరో చాన్స్‌ని క్రియేట్ చేసింది ఆమె విలక్షణమైన స్టయిలింగ్!థెమిస్ స్వస్థలం చెన్నై. చిన్నప్పుడే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్‌కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని! అనుకున్నట్టుగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక బెంగళూరులోని ఓ ఫ్యాషన్ మేగజీన్‌లో చేరింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయిన అర్చా మెహతాను కలిసింది. ఆమె దగ్గర ఇంటర్న్‌గా చేరింది. తర్వాత తమిళ చిత్రం ‘రెమో’తో ఫ్రీలాన్స్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా సినీ ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె విలక్షణ శైలికి సినీ ఇండస్ట్రీ ముచ్చటపడి అవకాశాలను అందిచ్చింది. వాటిల్లో ‘ద రోడ్’, ‘మారా’, ‘వేలైక్కారన్’, ‘పొన్నియిన్ సెల్వన్ ’ వంటి సినిమాలున్నాయి. వాటికి ఆమె అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా చేసింది. ఎన్నో ఫొటో షూట్స్, యాడ్స్‌కూ పనిచేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ ప్రాజెక్ట్ వచ్చినా.. పర్సనాలిటీని హైలైట్ చేసే స్టయిలింగ్‌తో వారిని గ్లోబల్ స్టార్స్‌లా చూపింది. ఆ సిగ్నేచర్ స్టయిల్ ఎంతోమంది స్టార్స్‌కి నచ్చింది. శ్రీనిధి, త్రిష, శోభితా ధూళిపాళ, శ్రద్ధా శ్రీకాంత్, చిన్మయిలతో పాటు శివ కార్తికేయన్, విజయ్, జయం రవిలాంటి మేల్ సెలబ్రిటీలకూ స్టయిలింగ్ చేసింది థెమిస్. -
ద స్టయిల్ ఎలివేటర్
ఈశా అమీన్.. కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్! స్వస్థలం మంగళూరు అయినా ముంబైలో స్థిరపడిన కుటుంబం ఆమెది. ఇష్టాయిష్టాలు, అభిరుచులు ఏర్పడుతున్న వయసులో ఫ్యాషన్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. తగ్గట్టుగానే నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. యూరోపియన్ ఎక్స్పోర్ట్ హౌస్‌లో డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. అందులో పనిచేస్తున్నప్పుడే డిజైన్‌కి సంబంధించి పలు బ్రాండ్లతో సమావేశమవడానికి తరచుగా యూరప్‌కి ప్రయాణం చేసేది. ఆ సమయంలోనే వివిధ కంపెనీల యాడ్ షూట్స్నీ పర్యవేక్షించాల్సి వచ్చేది. అప్పుడే అక్కడ స్టయిలింగ్ ట్రెండ్‌ని గమనించి, అవసరమైనప్పుడు షూట్స్‌లో మోడల్స్‌కి స్టయిలింగ్ కూడా చేసేది. దాంతో స్టయిలింగ్నీ కెరీర్‌గా మలచుకోవచ్చనుకుంది. వెంటనే రంగంలోకి దిగింది. ఓ వైపు డిజైనర్‌గా పనిచేస్తూనే, వీలుచిక్కినప్పుడల్లా స్టయిలింగ్ ప్రాజెక్ట్స్నీ తీసుకోవడం స్టార్ట్ చేసింది. అలా ఆమె తొలిసారి స్టయిలింగ్ చేసిన సెలబ్రిటీ.. స్పోర్ట్స్ స్టార్ సానియా మీర్జా. ఓ అవార్డ్ ఫంక్షన్ కోసం సానియాకు స్టయిలింగ్ చేసి గ్లామర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దృష్టిలో పడింది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పోటీదారులకు స్టయిలింగ్ చేసే ఆఫర్ వచ్చింది. ఆ అసైన్‌మెంట్‌లో ఉన్నప్పుడే ఫిల్మ్‌ఫేర్, ఫోర్బ్స్, ఫెమినా, స్టార్‌డస్ట్, ఎగ్జిబిట్ లాంటి పత్రికల ముఖచిత్రాల మోడల్స్కీ కాస్ట్యూమ్ డిజైన్, స్టయిలింగ్ చేసే చాన్స్ దొరికింది. ఇక అక్కడి నుంచి ఈశాకు వెనక్కి మళ్లే అగత్యమే రాలేదు. ఆమె పనితీరుకు బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ముచ్చటపడ్డాయి. సింగ్ ఈజ్ బ్లింగ్, ఆదత్, మణిదన్, బోగన్ లాంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా ఆమెకు టైటిల్ కార్డ్ ఇచ్చాయి. ఇంకోవైపు ఎండార్స్మెంట్స్, అవార్డ్ ఫంక్షన్స్, మ్యారేజ్ ఈవెంట్స్ కోసం సెలబ్రిటీలకు డ్రెస్ డిజైన్‌తో పాటు స్టయిలింగ్ చేసే అవకాశాలూ రాసాగాయి. హెవీ కాస్ట్యూమ్స్, ఊపిరి సలపని యాక్ససరీస్‌తో కాకుండా లైట్ వెయిట్.. కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, మినిమమ్ యాక్ససరీస్‌తో కంఫర్ట్‌గా ఉండే ఆమె డిజైన్స్ అండ్ స్టయిలింగ్కి బాలీవుడ్ తారలు ఇంప్రెస్ అయ్యారు. కరిశ్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, ఆలియా భట్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, లారా దత్తా, బిపాశా బసు, చిత్రాంగదా సింగ్, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసూజా, నీరజ్ చోప్రా, ఇషాన్ ఖట్టర్, వరుణ్ ధవన్, అమీ జాక్సన్, పూజా హెగ్డే, కార్తిక్ ఆర్యన్, నర్గిస్ ఫఖ్రీ, కల్కి కొచ్లిన్, తమన్నా, రియా చక్రవర్తి, సంజనా సంఘీ, అనుప్రియా గోయెంకా, కరిశ్మా తన్నా లాంటి తారలు ఆమెను తమ డ్రెస్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. సెలబ్రిటీలకు ఈశా.. స్టయిలింగ్ చేసే కంటే ముందు వాళ్ల వ్యక్తిత్వాన్ని, వాళ్లకున్న ఇమేజ్‌ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత వాళ్ల శరీరాకృతి, కలర్ టోన్, వాళ్ల వైబ్.. సౌకర్యం వంటివన్నీ పరిశీలించి, తదనుగుణంగానే డ్రెస్ డిజైనింగ్ గానీ.. స్టయిలింగ్ గానీ చేస్తుంది. ఇంత ఎఫర్ట్ పెడుతుంది కాబట్టే సెలబ్రిటీల దృష్టిలో ఆమె పర్ఫెక్ట్ స్టయిలిస్ట్ అయింది. తన పనికి ప్రేరణ, స్ఫూర్తి ప్రయాణాలే అని చెబుతుంది. మహిళల కంఫర్ట్ వేర్ కోసం ‘ఈశా అమీన్’ పేరుతోనే ఒక లేబుల్‌ని లాంచ్ చేసింది. లగ్జరీ వెడ్డింగ్ స్టయిల్ కోసం ‘ద స్టయిల్ ఎలివేటర్’ అనే కన్సల్టెన్సీనీ స్థాపించింది. పెటా వీగన్ ఫ్యాషన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్న ఏకైక ఇండియన్ స్టయిలిస్ట్‌గా గౌరవం దక్కించుకుంది.స్టయిల్ అంటే నా దృష్టిలో ఒక ఫామ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సెలబ్రిటీస్‌లో సైఫ్ అలీ ఖాన్‌కి స్టయిలింగ్ చేయడాన్ని చాలా ఇష్టపడతాను. ఆయనతో వర్క్ అంటే భలే సరదాగా ఉంటుంది. సైఫ్.. క్లాసియెస్ట్ అండ్ నైసెస్ట్ పర్సన్!– ఈశా అమీన్ -
ఆ డైరెక్టర్ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు..
మలయాళ దర్శకుడు రథీశ్ బాలకృష్ణ తనను మొదటినుంచీ ఇబ్బందిపెడుతూనే ఉన్నాడంది కాస్ట్యూమ్ డిజైనర్ లిజి ప్రేమన్. తనను ఒక ఆర్టిస్టుగా కాకుండా పనిమనిషిగా చూశాడని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిజి మాట్లాడుతూ.. సురేశంతియం సుమలతయుదేయమ్: హృదయహరియయ ప్రణయకథ అనే సినిమాకు నేను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశాను. 35రోజులు పని ఉంటుందన్నారు. అందుకుగానూ రెండున్నర లక్షలు అడిగాను. సరేనంటూ లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఎన్నో ఇబ్బందులు..ఈ సినిమా ప్రీపొడక్షన్ దగ్గరి నుంచి షూటింగ్ వరకు దాదాపు 110 రోజులు పని చేశాను. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ రథీశ్‌కు ఇగో ఎక్కువ. నన్ను ఒక పనిమనిషిలా చూశాడు. అతడి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. అందరిముందు చులకన చేసి మాట్లాడేవాడు. ఆయన వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించాను. తన టార్చర్ భరించలేక చివర్లో ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాను. నాకు క్రెడిట్ ఇవ్వలేదుతీరా చూస్తే సినిమా క్రెడిట్స్‌లో నా పేరు వేయలేదు. అసిస్టెంట్ అని రాశారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా మరో వ్యక్తికి క్రెడిట్ ఇచ్చారు. ఇది నన్ను అవమానించడం కాకపోతే ఇంకేమవుతుంది. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు పూర్తిగా ముట్టజెప్పలేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాపై ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టిన వారిని ఊరికే వదిలిపెట్టను. నా వల్ల సినిమాకు ఇబ్బంది ఉండకూడదనే రిలీజ్ అయ్యేవరకు ఆగాను. ఓటీటీలో అయినా..ఇప్పుడు న్యాయపోరాటం చేస్తాను. కనీసం ఓటీటీలో విడుదల చేసేటప్పుడైనా కాస్ట్యూమ్ డిజైనర్‌గా సినిమాలో నా పేరు వేయాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే నా పట్ల దురుసుగా ప్రవర్తించినందుకుగానూ డైరెక్టర్ నాకు సారీ చెప్పాలి. మానసిక వేధింపులకు గురి చేసినందుకు పరిహారం చెల్లించాలి. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అని లిజి పేర్కొంది.చదవండి: గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే! -
Tanya Ghavri: స్టయిలింగ్‌లో తనతో పోటీ అంటే.. కొంచెం కష్టమే!
స్టయిలింగ్‌లో తాన్యా ఘావ్రీతో పోటీ అంటే కొంచెం కష్టమే! శాంపుల్‌కి జాన్వీ కపూర్, అనన్య పాండేలను చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది! అందుకే తాన్యాను ఇండియన్ స్టయిలింగ్ ఇండస్ట్రీ డ్రైవింగ్ ఫోర్స్‌గా కొనియాడుతుంటారు.తాన్యా ఘావ్రీ.. మాజీ టెస్ట్ క్రికెటర్ కర్షణ్ ఘావ్రీ కూతురు. ముంబైలో పుట్టిపెరిగింది. ఇంటర్ అయిపోయాక.. చాలామంది విద్యార్థుల్లాగే తాన్యా కూడా చదువుల చౌరస్తాలో నిలబడిపోయింది అయోమయంగా.. ఏ దారిన వెళ్లాలో తెలియక! తన బలాబలాలను బేరీజువేసుకుందోసారి. తనకు క్రియేటివ్ బోన్ ఉన్నట్లు అర్థమైంది. అందుకే ఫ్యాషన్ వైపు మళ్లింది. న్యూయార్క్, పార్సన్స్ ఆఫ్ స్కూల్లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది.ఇండియా తిరిగొచ్చాక ఎస్ఎన్డీటీ (శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాకర్సీ) యూనివర్సిటీలో దుస్తుల తయారీ డిజైన్‌కి దరఖాస్తు పెట్టుకుంది. ఆ కోర్స్ అయిపోగానే అవకాశాలు క్యూ కడతాయనే ఉద్దేశంతో! కానీ చదువైపోయిన రెండున్నరేళ్లకు వచ్చింది ఒక చాన్స్.. ‘ఆయశా’ అనే హిందీ సినిమాకు అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా! ఆ చిత్రానికి స్టయిలిస్ట్ పర్నియా కురేశీ. ఆమెకు సహకారం అందించడమే తాన్యా పని. దానికి ముందు ఆ రెండున్నరేళ్లు.. ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్లో, స్టయిలిస్ట్‌లు అనాయితా ష్రాఫ్, అర్చనా వాలావల్కర్లాంటి వాళ్ల దగ్గర ఇంటర్న్‌షిప్ చేసింది.ఆమె స్టయిలింగ్ జర్నీ మొదలైంది మాత్రం ‘ఆయశా’ సినిమాతోనే! అందులోని కథానాయిక సోనమ్ కపూర్‌కి తాన్యా పనితనం నచ్చింది. తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది. తాన్యా స్టయిలింగ్‌తో సోనమ్ ఫ్యాషన్ ఐకాన్ అయింది. అది గమనించిన ఐశ్వర్యా రాయ్ బచన్.. తనకూ స్టయిలింగ్ చేసిపెట్టమని తాన్యాను కోరింది. ఆ అపురూప సౌందర్యరాశికి అప్ టు డేట్ ఫ్యాషన్‌ని టచప్ చేసి.. అక్కాచెల్లెళ్లు కరిష్మా, కరీనా కపూర్ల దృష్టిలో పడింది తాన్యా. వాళ్ల నుంచీ సేమ్ రిక్వెస్ట్ అందుకుంది. ఫిజిక్‌ని బట్టే ఫ్యాషన్, సౌకర్యాన్ని బట్టే స్టయిల్ అని నమ్మే తాన్యా ఆ సూత్రాన్నే అప్లయ్ చేసి కపూర్ సిస్టర్స్ అపియరెన్స్నే మార్చేసింది.వాళ్ల వయసులో చెరో పదేళ్లు తగ్గించేసింది. ఆశ్చర్యపోయింది కరిష్మా, కరీనాల ఆప్తురాలు మలైకా అరోరా! సీక్రేట్ ఏంటని అడిగింది. తాన్యా అడ్రస్ చెప్పారు వాళ్లు. వెళ్లి వాలింది మలైకా! తాన్యాకు మారు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా తన వెంట రమ్మంది. అప్పటి నుంచి మలైకాకూ స్టయిలింగ్ సర్వీస్ ఇవ్వడం మొదలుపెట్టింది తాన్యా. ఆ డిమాండ్‌ను కత్రినా కైఫ్ కూడా గుర్తించింది. ఉఫ్.. ఇలా చెప్పుకుంటూ పోతే మాధురీ దీక్షిత్, సారా అలీఖాన్, జాన్వీ కపూర్, అనన్యా పాండే, దిశా పాట్నీ, శ్రద్ధా కపూర్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఫ్రీదా పింటోలూ చేరి ఆ జాబితా పెరిగిపోతుంది.తాను ఎస్ఎన్డీటీలో జాయిన్ అయ్యేముందు ఊహించుకున్నట్టే తనను అవకాశాల వెల్లువ ముంచెత్తుతోంది. ఈ అచీవ్మెంట్ వయసు పదిహేనేళ్లు. స్టార్స్‌కి మెరుగులు అద్దుతూనే అంట్రప్రెన్యూర్‌షిప్ గురించీ ఆలోచించింది. పెళ్లిళ్లు, పేరంటాలు, పండగలు, పబ్బాలకు డిజైనర్ దుస్తులను అందించే ‘ధూమ్ ధామ్ వెడ్డింగ్స్’ అనే కంపెనీనీ స్థాపించి అంట్రప్రెన్యూర్గానూ మారింది."నా వర్క్‌ని రొటీన్‌గా ఎప్పుడూ ఫీలవను. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చినట్టు భావిస్తాను. అందుకే వర్క్‌ని బాగా ఎంజాయ్ చేస్తాను. నేనెప్పటికీ మరచిపోలేని ఈవెంట్.. ఆస్కార్ పార్టీ కోసం ఫ్రీదా పింటోకి స్టయిల్ చేయడం. నా పర్సనల్ స్టయిల్ విషయానికి వస్తే జీన్స్, స్కర్ట్స్, షర్ట్స్, బ్లౌజెస్.. ఏ డ్రెస్ అయినా నాకు ఓకే. అయితే ఏదైనా ఓవర్ సైజ్డ్ స్టఫ్నే ఇష్టపడతా. నేను షార్ట్‌గా ఉంటాను కాబట్టి.. షార్ట్ డ్రెస్‌లు వేసుకుని ఓవర్ సైజ్డ్ షర్ట్‌తో కానీ జాకెట్‌తో కానీ నా హైట్‌ని బ్యాలెన్స్ చేస్తా"! – తాన్యా ఘావ్రీ -
మాకు ఇది స్పెషల్ సంక్రాంతి!
‘‘బాబీగారు ‘వాల్తేరు వీరయ్య’ కథ చెప్పినప్పుడే వీరయ్య (చిరంజీవి పాత్ర పేరు) క్యారెక్టర్‌కి ఇలాంటి కాస్ట్యూమ్స్ అయితే బాగుంటుందనుకున్నాను. నా ఆలోచన, బాబీగారి ఐడియాలు చాలావరకూ మ్యాచ్ అయ్యాయి. నాన్నగారూ సలహాలు చెప్పారు’’ అన్నారు సుష్మిత కొణిదెల. చిరంజీవి, శ్రుతీహాసన్ జంటగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలక పాత్ర చేశారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఇందులో చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసిన ఆయన కుమార్తె సుష్మిత చెప్పిన విశేషాలు. ► బాబీగారు ‘వాల్తేరు వీరయ్య’ కథ చెప్పినప్పుడు వింటేజ్ చిరంజీవిగారిని చూపించాలన్నారు. అంటే.. అప్పటి ‘గ్యాంగ్ లీడర్’ టైమ్ అన్నమాట. ఈ సినిమాలో ఆయనది ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్. సో.. కథ విన్నప్పుడే కాస్ట్యూమ్స్‌ని ఊహించేశా. నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి వింటేజ్ లుక్‌లో చూపించడానికి పెద్దగా కష్టపడలేదు. కానీ యూత్‌కి కూడా నచ్చాలి కాబట్టి ఇప్పటి ట్రెండ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశాను. ► ‘రంగస్థలం’లో నా తమ్ముడు రామ్‌చరణ్‌కి నేనే డిజైన్ చేశాను. ఇప్పుడు నాన్నగారివి కూడా అలాంటి డ్రెస్సులే. కానీ చరణ్‌కంటే నాన్నగారే ఈ మాస్ కాస్ట్యూమ్స్‌లో సూపర్. అయితే చరణ్‌ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే తను సిటీలో పెరిగాడు. అయినప్పటికీ ‘రంగస్థలం’లో ఆ కాస్ట్యూమ్స్‌లో బాగా ఒదిగిపోయాడు. నాన్నగారి అభిమానులుగా మేం మిగతా అభిమానులతో పాటు ఈలలు వేస్తూ, గోల చేస్తూ శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు థియేటర్లో ‘వాల్తేరు వీరయ్య’ టీమ్‌తో కలిసి సినిమా చూశాం. ► ప్రస్తుతం నాన్న ‘బోళా శంకర్’కి డిజైన్ చేస్తున్నాను. ఇంకా రెండు వెబ్ సిరీస్‌లపై వర్క్ చేస్తున్నాం. మేం నిర్మించిన ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. మా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్పై నాన్నగారితో సినిమా నిర్మించాలని ఉంది. అందరి నిర్మాతలకు చెప్పినట్లే ఆయన ‘మంచి కథతో రా’ అన్నారు. మేం కూడా ఆ వేటలోనే ఉన్నాం. ► ఈ సంక్రాంతి స్పెషల్ అంటే.. మా తమ్ముడు తండ్రి కానుండటం. ఈ సమయం కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాం. సో.. మాకిది స్పెషల్ సంక్రాంతి. ఉపాసనది డాక్టర్స్ ఫ్యామిలీ కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏం ఆహారం తీసుకోవాలి? అనేది తనకు బాగా తెలుసు. మావైపు నుంచి మేం ఆమెను వీలైనంత హ్యాపీగా ఉంచుతున్నాం. పాప అయినా, బాబు అయినా మాకు ఓకే. కానీ నాకు, శ్రీజకు ఆడపిల్లలే. ఇంట్లో గర్ల్ పవర్ ఎక్కువైంది (నవ్వుతూ). అందుకే బాబు అయితే బాగుంటుందనుకుంటున్నాను. -
Sonakshi Sinha: నా బ్యూటీ సీక్రెట్ అదే! ఇలా చేస్తే మచ్చలు, మొటిమలు మాయం!
కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ఆరంభించింది సోనాక్షి సిన్హా. మేరా దిల్ లేకే దేఖోతో సినిమాకు డిజైనర్‌గా పనిచేసింది. ఇక ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ స్టార్ కిడ్. అందం, అభినయంతో ఆకట్టుకుని తొలి సినిమాకే ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. ఇక సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తున్న 35 ఏళ్ల సొనాక్షి తన సౌందర్యానికి అమ్మ చెప్పిన సహజమైన చిట్కాలే కారణం అంటోంది. నా బ్యూటీ సీక్రెట్ అదే! ‘‘నా చిన్నప్పుడు చూసేదాన్ని అమ్మ తన మొహానికి అలోవెరా రాసుకోవడం. ఆ ఆకు జిగురును అలా ఎందుకు రాసుకుంటుందో అప్పుడు అర్థం కాలేదు కానీ సినిమాల్లోకి వచ్చాక అర్థమైంది. ప్లస్ ఆమ్మ గ్లోయింగ్ స్కిన్ రహస్యమేంటో కూడా తెలిసింది. నా బ్యూటీ సీక్రెట్ కూడా అదే. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా రోజుకు రెండు సార్లు మొహానికి అలోవెరా రాసుకుంటాను. అప్లయ్ చేసుకున్నాక ఇరవై నిమిషాలకు చల్లటి నీళ్లతో మొహం కడుక్కోవాలి. ఈ అలవాటును దినచర్యలో భాగం చేసుకుంటే మొటిమలు, మచ్చలు, ట్యాన్, పిగ్మెంటేషన్ ఎట్సెట్రా జీవితంలో దరిచేరవు’’ అని చెప్పింది సోనాక్షి సిన్హా. చదవండి: Actress Poorna: ‘పర్ఫెక్ట్ బ్రాండ్’... పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు! ప్రత్యేకత ఏమిటంటే! Radhika Madan: నా చర్మ సౌందర్య రహస్యం ఇదే.. వారానికోసారి ఇలా చేశారంటే.. -
Nalini Jameela: అందుకే ‘సెక్స్ వర్కర్’గా మారింది.. కానీ ఇప్పుడు
Nalini Jameela Gets Kerala Film Award: నళినీ జమీలా తన ఆత్మకథ రాసి సంచలనం రేపింది కేరళలో.ఎందుకంటే ఆమె జీవితం ‘సెక్స్ వర్కర్’గా గడిచింది. ‘ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ’గా వచ్చిన ఆ పుస్తకం ఎన్నో భాషల్లో అనువాదం అయ్యింది. ఆ తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న నళిని తాజాగా ఒక సినిమా కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. ఆమె ఎంత బాగా పని చేసిందంటే 2020 సంవత్సరానికి గాను శనివారం కేరళ ప్రభుత్వం ప్రత్యేక అవార్డు ప్రకటించింది. నిజంగానే ఆమెది ఒక చిత్రమైన ప్రయాణం.. సెక్స్‌వర్కర్‌గా జీవించడంలో ఆత్మగౌరవాన్ని కోల్పోవడం, సమాజాన్ని ఎదుర్కొనడం కంటే పోలీసుల హింసని, విటుల దాష్టీకాన్ని భరించడం కష్టం. 2005లో కేరళలోని త్రిశూర్ జిల్లాలోని కల్లూర్ అనే చిన్న ఊరి నుంచి నళినీ జమీలా 52 ఏళ్ల వయసులో తన జీవితం ఆధారంగా ‘ఒక సెక్స్‌వర్కర్ ఆత్మకథ’ పేరుతో పుస్తకం రాసి దేశంలో ఒక రకమైన సంచలనం రేపింది. ఆ పుస్తకం స్త్రీలు గతిలేని స్థితుల్లో ఎలా సెక్స్ వర్కర్లుగా మారుతారో చెప్పడమే కాదు పోలీసులు, సంఘంలోని పెద్ద మనుషులు, కుటుంబం ఎలా సెక్స్‌వర్కర్లను కీలుబొమ్మలుగా చేస్తారో కూడా చెప్పింది. అంతే కాదు... మగవారి ప్రవర్తన మీద లోతైన పరిశీలనలు చేసింది. దేశంలోని అనేక భాషలతో పాటు తెలుగులో కూడా వెలువడ్డ ఈ పుస్తకం (హెచ్‌బిటి ముద్రణ) పెద్ద చర్చను లేవదీసింది. ఇప్పుడు ఆ నళినీ జమీలా తన 67వ ఏట ఒక సినిమా కాస్ట్యూమ్ డిజైనర్‌గా కేరళ ప్రభుత్వ ప్రత్యేక అవార్డు పొందడం పెద్ద విశేషంగా మారింది. నళినీ జమీలాను ఒక విశేష వ్యక్తిగా మళ్లీ చర్చకు తెచ్చింది. భర్త మరణించాక నళినీ జమీలా బాల్యం ఏమీ సౌకర్యంగా నడవలేదు. తండ్రి పిల్లల్ని దగ్గరకు తీసేవాడు కాదు. పెళ్లయ్యాక ఇద్దరు అమ్మాయిలు పుట్టాక భర్త కేన్సర్‌తో మరణిస్తే జరుగుబాటు చాలా కష్టమైంది. కొన్నాళ్లు ఇంటి పనులు వెతుక్కున్న జమీలాకు ఒక స్నేహితురాలు వ్యభిచార వృత్తి గురించి చెప్పింది. ఆమే జమీలాను ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరకు పంపింది. ఆ గెస్ట్‌హౌస్ నుంచి తెల్లవారుజామున ఇంటికి వెళుతుంటే పోలీసులు ఆమెను పట్టుకుని హింసించడంతో జమీలా సెక్స్‌వర్కర్ జీవితం మొదలవుతుంది. ఆ లైఫ్‌లో ఆమె ఎందరో పోలీసుల, విటుల, గూండాల టార్చర్‌ను అనుభవించింది. అయినా సరే కూతుళ్ల కోసం రాటుదేలుతూ వృత్తిలో కొనసాగింది. దాని నుంచి బయట పడ్డాక కొందరు మిత్రుల సూచన మేరకు ఆత్మకథ రాసి సంచలనం రేపింది. ఆ పుస్తకం తెచ్చిన పేరుతో మరో మూడు నాలుగు పుస్తకాలు వెలువరించింది. రచయిత్రిగా, సెక్స్‌వర్కర్ల విముక్తికి పని చేసే యాక్టివిస్ట్, రిలేషన్స్ కౌన్సిలర్‌గా పని చేస్తూ వస్తున్న జమీలాకు ఇంత పేరు ఉన్నా ఆమెను ఆమె గతం వెంటాడుతూనే ఉంది. ‘సెక్స్‌వర్కర్లకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వరు. నేను ఇంటి కోసం ఎన్ని బాధలు పడుతున్నానో నాకే తెలుసు. ఒకరకంగా నేను ఇప్పటికీ నా మొఖం దాచుకుని దొంగబతుకు బతకాల్సి వస్తోంది’ అంటుంది జమీలా. ‘సెక్స్‌వర్కర్ల పట్ల కేరళలో దారుణమైన చిన్నచూపు ఉంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కొంచెమైనా వారితో మెరుగ్గా ప్రవర్తిస్తారు. సెక్స్‌వర్కర్లు పొట్టకూటి కోసం ఆ పని చేస్తారు. ఆడపిల్లలను ఆ వృత్తిలో దింపే ట్రాఫికర్స్ దుర్మార్గులు. ఆ తేడాను నేను సమాజానికి పదే పదే తెలియచేస్తున్నాను’ అంటుందామె. కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తమ్ముడు సంజీవ్ శివన్ జమీలా జీవితం మీద ‘సెక్స్, లైస్ అండ్ ఏ బుక్’ అనే డాక్యుమెంటరీ తీశాడు. తన జీవితం ఆధారం గా ఒక సినిమా రావాలని జమీలాకు ఉందికాని అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈలోపు ఇటీవల ‘భరతపుజా’ అనే సినిమాకు ఆమెకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసే అవకాశం వచ్చింది. ‘ఆ సినిమా దర్శకుడు మణిలాల్ నాకు చాలాకాలం నుంచి తెలుసు. ఆ కథ కూడా ఒక సెక్స్‌వర్కర్ జీవితానికి సంబంధించిందే. అందుకని మీరు ఆమె కాస్ట్యూమ్స్ చూడండి అని కోరాడు. సరేనన్నాను. మధ్య వయసులో ఉన్న ఆ హీరోయిన్ (నటి సిజి ప్రదీప్) బట్టలను నేను ఆ వయసులో ఎలాంటి బట్టలు కడుతూ వచ్చానో ఎలా కనిపించానో దాని ఆధారంగా డిజైన్ చేశాను. 13 చీరలు మాత్రమే కొన్నాను. వాటిలో పూనమ్ చీరలే ఎక్కువ. మరో రెండు ఆ తర్వాత కొనాల్సి వచ్చింది. రాత్రిళ్లు గాఢమైన రంగుల చీరలను, పగలు తేలిక రంగుల చీరలను హీరోయిన్ కోసం ఉపయోగించాను. యూనిట్‌తో పాటు నేనూ ఉన్నాను. ఆ సినిమాకు కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా నాకు అవార్డు ఇవ్వడం ఊహించలేకపోతున్నాను. నా జీవితంలో ఇది నాకు గొప్ప ఘనత’ అంది జమీలా. వృద్ధ సెక్స్‌వర్కర్ల కోసం ‘ఒకప్పుడు విమానం ఎక్కితే చాలనుకున్నాను. కాని అనేక దేశాలు తిరిగి చూడగలిగాను. ఇప్పుడు నా కోరిక ఒక్కటే. వృద్ధ సెక్స్‌వర్కర్ల కోసం ఒక హోమ్ కట్టాలి. వారికి జరుగుబాటు లేక భిక్షాటన చేస్తున్నారు. వారిని ఆదుకోవాలి.’ అంది జమీలా. 1970–2000 సంవత్సరాల మధ్య 8 మంది విటులతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని ‘రొమాంటిక్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ఎ సెక్స్‌వర్కర్’ పేరుతో 8 కథలుగా రాసిన జమీలా పుస్తకం ఇంకా తెలుగులో రావాల్సి ఉంది. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! -
ప్రేమించి పెళ్లి, భార్య వేలు కట్‌చేసి పారిపోయిన భర్త
బంజారాహిల్స్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అదనపు కట్నం కోసం భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబైలో నివసించే హసి (22), జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరికి చెందిన రవి నాయక్ ఫేస్బుక్లో పరిచయమయ్యారు. రవి నాయక్ ఇటీవల ఆమెను పెళ్లి చేసుకొని నగరానికి తీసుకొచ్చాడు. హసి బ్యూటీషియన్‌గా పని చేస్తుండగా రవినాయక్ ఖాళీగా ఉన్నాడు. ఈ నెల 10వ తేదీన తనకు రూ. 50 వేలు కావాలంటూ రవి నాయక్ భార్యను అడగగా లేదనడంతో తీవ్రంగా కొట్టి కత్తితో ఓ వేలిని కట్ చేసి పారిపోయాడు. మరోసటి రోజు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రవి నాయక్‌పై కేసు నమోదు చేశారు. మద్యానికి బానిసై ఆత్మహత్య సినీ పరిశ్రమలో క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్ సమీపంలోని సింధు టిఫిన్ సెంటర్ సమీపంలో అద్దెకుంటున్న తారకేశ్వర్రావు (42), సినీ క్యాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసై డబ్బుల కోసం భార్యతో గొడవ పడుతుండేవాడు రెండ్రోజుల క్రితం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కర్కశ తల్లి లక్ష్మీ అనూష అరెస్టు.. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే -
కంగనాను అలా చూసి నిర్ఘాంతపోయిన వృద్ధురాలు..
జయలలితకు కాస్ట్యూమ్స్ కుట్టాలి. ఇప్పటివా? 1960లవి, 70లవి, 80లవి. ఆమె లేదు. కాని ఆమెలా చేయనున్న కంగనాకు ఆ తళుకు తేవాలి. బెళుకు కలిగించాలి. మాయా ప్రతిబింబం నిలబెట్టాలి. ఎవరు దీనికి సరైనవారు? నీతా లుల్లా పేరు అందరూ చెప్పారు. ‘తలైవి’కి అద్భుతంగా పని చేసివిడుదలకు ముందే అందరి ప్రశంసలు పొందుతున్ననీతా లుల్లా ఈ సినిమా కోసం పడిన శ్రమను తెలిపే కథనం...వస్త్ర నాయిక జయలలిత పేరు చెప్తే తెలుగు ప్రేక్షకులు తెలుగులో ఆమె చేసిన సినిమాలు గుర్తుకొస్తాయి. అక్కినేనితో ‘అయ్యయ్యో బ్రహ్మయ్య... అన్యాయం చేసేవేమయ్యా’ (అదృష్టవంతులు), ఎన్.టి.ఆర్తో ‘విన్నారా... అలనాటి వేణుగానం’ (దేవుడు చేసిన మనుషులు)... వెండి తెర మీద ఆమె నిండైన రూపం ఎవరు మర్చిపోగలరు. కాని తమిళులకు ఆమె ‘అమ్మ’, ‘విప్లవ వనిత’, ‘విప్లవ నాయకురాలు’. దాంతో పాటు తమ అభిమాన నటుడు, నాయకుడైన ఎం.జి.ఆర్కు సరిజోడి. అంతేనా?... తమ సామాజిక, రాజకీయ చరిత్రలో ఆమె ఒక అవిభాజ్యమైన భాగం. సౌత్‌లో సినిమా రంగం నుంచి ముఖ్యమంత్రులైన నటులు ముగ్గురే. ఎం.జి.ఆర్, ఎన్.టి.ఆర్, జయలలిత. (కరుణానిధి నటుడు కాదు). ఎన్.టి.ఆర్ బయోపిక్‌ను తెలుగులో రెండు భాగాలుగా తీశారు. ఇప్పుడు జయలలిత బయోపిక్ ప్రతిష్టాత్మకంగా తయారవుతోంది. సినిమా పేరు ‘తలైవి’. కంగనా రనౌత్ హీరోయిన్. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోందని చెప్పవచ్చు. ఈ సినిమాలో కంగన అచ్చు జయలలిత లానే కనిపిస్తోందని ప్రశంసలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన నీతా లుల్లా. మిగిలిన సినిమాలకు పని చేయడం వేరు... ఈ సినిమాకు పని చేయడం వేరు అంటోందామె. ఆ కాలం... ఆ రూపం ‘తలైవి’ సినిమా కోసం కంగనా రనౌత్‌ను జయలలితగా చూపించడం ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన నీతా లుల్లాకు సవాలుగా నిలిచింది. ‘ఇందుకు కారణం ఆమె రూపం, సినిమాలు, పాటలు, తెర మీద, తెర బయటి ఆహార్యాలు ప్రజల దృష్టిపథం నుంచి ఇంకా చెరిగిపోకపోవడమే. జయలలిత ఈ సినిమా తెర మీద నటిగా కనిపిస్తారు. ఆ తర్వాత రాజకీయ వేత్తగా, ఆ తర్వాత సి.పిగా రకరకాల దశల్లో కనిపిస్తారు. ప్రతిసారి ఆమె రూపం మారింది. ఆహార్యం మారింది. కాస్ట్యూమ్స్ మారాయి. వాటిని యథాతథంగా మళ్లీ చూపించడానికి నేను చాలా శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది’ అంటారు నీతా లుల్లా. ‘జయలలిత ఫ్యాషన్స్‌ను సినిమాల్లో చాలా ఫాలో అయ్యారు. ఆమె బట్టలు, ఆభరణాల్లో ప్రత్యేకత ఉంది. వాటిని మళ్లీ చూపడానికి ఆమె పాటలు, సినిమాలు లెక్కలేనన్నిసార్లు చూడాల్సి వచ్చింది’ అంటారు నీతా లుల్లా. కంగనా కోరిక మీద బాలీవుడ్లో ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ అయిన నీతా లుల్లా కంగనా నటించిన ‘మణికర్ణిక’కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. దాంతో ‘తలైవి’కి కూడా పని చేయమని కంగనా ఆమెను కోరింది. ‘నా పని మొదలయ్యాక ఎం.జి.ఆర్గా నటిస్తున్న అరవింద్ స్వామికి కూడా కాస్ట్యూమ్స్ చేయమని కోరారు. ఆ పని కూడా సంతోషంగా చేశాను’ అంటుంది నీతా లుల్లా. ఈ సినిమాలో ఆ కాలపు చీరల కోసం ఫ్రెండ్స్ అమ్మమ్మలు, నాయనమ్మలను బతిమిలాడి సంపాదించడం దగ్గరి నుంచి, కంచిలో మళ్లీ నాటి చీరల్లాంటివి తిరిగి నేయించడం దగ్గరి నుంచి, నాటి డ్రస్సులను, చెప్పులను, ఆఖరకు నాటి బ్రాలను కూడా స్టడీ చేయాల్సి వచ్చిందని నీతా అంటారు. ‘ఏ డిటైల్‌ను మిస్ కాలేదు’ అంటారామె. గెటప్ టెస్ట్ కంగనాను ఈ సినిమా కోసం తలైవిగా తయారు చేశాక, అంటే సి.ఎం గెటప్ వేశాక ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ఆమెను తీసుకుని కారులో చెన్నై బిజీ దారిలో తీసుకెళ్లి దించింది నీతా. కారులో నుంచి దిగిన కంగనాను ఒక ముసలామె చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. ఆ వెంటనే వచ్చి చుట్టేసుకుంటూ ‘అమ్మా.. అమ్మా’ అని జయలలితను చూసి పులకించినట్టే పులకించింది. ‘అది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది నాకు’ అంటుంది నీతా లుల్లా. ‘చాందిని’, ‘తాళ్’, ‘జోధా అక్బర్’, ‘దేవదాస్’ వంటి భారీ సినిమాలకు కాస్ట్యూమ్స్ చేసిన నీతా ప్రస్తుతం తెలుగులో భారీగా మొదలైన ‘శాకుంతలం’కు కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు. మహిళా కాస్టూమ్ డిజైనర్‌గా ఇప్పటికి నాలుగుసార్లు జాతీయ అవార్డులు పొందిన నీతా ఎందరికో స్ఫూర్తి. విజయాన్ని ఆమె ఇలాగే పర్ఫెక్ట్గా కుట్టుకుంటూ వెళ్లాలని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ చదవండి: 'తలైవి' రిలీజ్‌కు కరోనా షాక్ -
ఆసక్తికర విషయాలు వెల్లడించిన పవన్ స్టైలిష్ట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో ‘హరిహర వీరమల్లు’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో పవన్ పోరాటయోధుడి దుస్తుల్లో కొత్తగా కనిపించాడు. దీంతో పవన్ కొత్త లుక్ చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వైరల్‌గా మారింది. ఓ ఇంటర్వ్యూలో ‘హరిహర వీరమల్లు’లో పవన్ కల్యాణ్‌కు స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్న ఐశ్వర్య రాజేష్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘హరిహర వీరమల్లు’లో పవన్ 3 డిఫరెంట్ లుక్స్‌తో, దాదాపు 30 రకాల కాస్ట్యూమ్స్ ధరించనున్నాడని ఆమె చెప్పింది. ఇక పవన్ మూవీ కోసం రెండు రకాల కాస్ట్యూమ్స్ మాత్రమే ట్రయల్ చేసి మిగతా కాస్ట్యూమ్స్‌కు ఓకే చెప్పడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ మూవీలో ఆయన చేతికి ధరించిన బ్రేస్లేట్ (కడియం), ఇతరత్రాల ఆభరణాలను తన బృందమే తయారు చేసిందని, ఇక కాస్ట్యూమ్స్‌ను కూడా ఆయన కోసం స్పెషల్‌గా తయారు చేసినట్లు పేర్కొన్నారు. 17 శతాబ్దం నాటి మొఘల్స్ కతుబ్ షాహిల కాలం నాటి బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కనున్నందున ఆనాటి వస్రాధారణకు ఏమాత్రం తీసిపోకుండా ఉండేందుకు దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్నారు. ఇందుకోసం తాము దేశంలోని పలు ప్రాంతాలు సందర్శించి పవన్ కల్యాణ్ అవుట్ ఫిట్స్ కోసం దాదాపు 1000 థాన్ల ఫ్యాబ్రిక్ తీసుకున్నట్లు ఆమె వివరించారు. కాగా ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: సర్ప్రైజ్: pspk27 టైటిల్, ఫస్ట్‌లుక్ వచ్చేసింది పవన్ కల్యాణ్ న్యూలుక్.. షాకవుతున్న ఫ్యాన్స్ -
స్టైలిష్‌గా కాబోయే అమ్మ ..
అమ్మాయిలకు డిజైన్ వేర్ తప్పనిసరి. అమ్మలకూ డ్రెస్ డిజైన్స్‌లో బోలెడన్ని ఎంపికలు ఉన్నాయి. కాబోయే అమ్మలకు సౌకర్యవంతమైన, స్టైలిష్ డిజైనర్ వేర్ ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించుకున్నారు ఢిల్లీలో ఉంటున్న ఇద్దరు సోదరీమణులు. ఆంచల్ జౌరా, ఆష్నా అనే అక్కాచెల్లెళ్ళిద్దరూ గర్భిణులకు అందమైన దుస్తుల రూపకల్పన చేస్తూ అందరి మెప్పు పొందుతున్నారు. తమ బ్రాండ్ దుస్తులకు బాలీవుడ్ నటి కరీనాకపూర్‌ను బ్రాండ్ ఎంబాసిడర్‌గా తీసుకున్నారు. మాస్టర్స్ డిగ్రీ చేసిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ దారిని కాబోయే తల్లులవైపుగా ఎందుకు మళ్లించుకున్నారో వారినే అడిగితే ఎన్నో ఆసిక్తకర విషయాలు తెలుస్తాయి. తక్కువ ఖర్చుతో డిజైనింగ్ ఆంచల్ జౌరా, ఆష్నా షా ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు ‘చిక్ మామ్జ్’ అనే పేరుతో ప్రసూతి వేర్‌ను రూపొందించారు. గర్భధారణలో ఉన్న కరీనా కపూర్ వాటిని ధరించి, మెరిసిపోయారు. ఆంచల్ మాట్లాడుతూ– ‘కరీనా కపూర్‌కు దుస్తులను డిజైన్ చేయడానికి మాకు అవకాశం లభించడం చాలా పెద్ద విషయం, ఇదంతా మా అమ్మ అందించిన స్ఫూర్తిగానే మేం భావిస్తున్నాం’ అని తెలియచేసింది. వీరిద్దరూ గర్భిణీ స్త్రీలకు సౌకర్యవంతమైన, స్టైలిష్, తక్కువ ఖర్చుతో ప్రసూతి దుస్తులను డిజైన్ చేస్తారు. ఆంచల్, అష్నా ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్పూర్లో ఉండేవారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత ముంబైలోని ఐబిఎస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. కంప్యూటర్ సై¯Œ ్సలో ఇంజనీరింగ్ చేసిన అష్నా ఇంగ్లాండ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. గర్భిణులకు తక్కువ డ్రెస్సులు ఉండేవి అష్నా మాట్లాడుతూ ‘నేను గర్భవతిగా ఉన్నప్పుడు చాలా వదులుగా ఉండే దుస్తులు కావాలనుకునేదాన్ని. అందుకు నా భర్త టీ షర్టు, కుర్తా ధరించేదాన్ని. ఆఫీసుకు వెళ్లడానికి చాలా తక్కువ డ్రెస్సులు ఉండేవి. మార్కెట్లో నేను చూసిన అన్ని ప్రసూతి దుస్తులు చాలా ఖరీదైనవి. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నా పొట్టను స్టైలిష్ లుక్‌లో ఆత్మవిశ్వాసంతో చూపించాలనుకునేదాన్ని. నా పొట్టను దాచాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, అందుకు సరైన దుస్తులు ఉండేవి కావు. చాలా ఇబ్బందిగా అనిపించేది. అందుకే ఈ ఇబ్బందిని గమనించి గర్భవతుల కోసం స్టైలిష్ దుస్తులను తీసుకువచ్చాం’ అని తెలిపింది. -
ఆస్కార్ అవార్డు గ్రహీత భాను అతైయా ఇక లేరు
భారతదేశం తరఫున తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతైయా (91) ఇక లేరు. గురువారం ముంబైలోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా భాను అతైయా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిద్రలోనే ఆమె చనిపోయినట్లు భాను కుమార్తె రాధికా గుప్తా తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు మెదడులో ఓ ట్యూమర్ ఉన్నట్టు కనుగొన్నారు. మూడేళ్లుగా ఆమె శరీరంలో సగభాగం చచ్చుబడిపోవడంతో మంచానికే పరిమితం అయ్యారు. మహారాష్ట్రలోని కొల్హాపూరులో 1929 ఏప్రిల్ 28న జన్మించారు భాను అతైయా. 1983లో వచ్చిన గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గాంధీ’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారామె. ఆ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాన్ మోలోతో కలసి ఆస్కార్ అందుకున్నారు భాను. గురుదత్ తెరకెక్కించిన ‘సీఐడీ’ (1956)తో కెరీర్ ప్రారంభించి సుమారు వంద సినిమాలకు పైనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ‘ఆమ్రపాలి’ చిత్రానికి వైజయంతి మాలకు, ‘గైడ్’లో వహీదా రెహమాన్‌కు, ‘సత్యం శివం సుందరం’లో జీనత్ అమన్‌కు ఆమె చేసిన కాస్ట్యూమ్స్‌కి బాగా పేరొచ్చింది. ‘లేకిన్, లగాన్’ చిత్రాలకు జాతీయ అవార్డులను అందుకున్నారు భాను. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో ఇలా మాట్లాడారామె... ‘‘ఆస్కార్ వేడుకలో కూర్చున్నప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్లు ‘అవార్డు మీకే వస్తుంది’ అన్నారు. కానీ నేను మాత్రం నా పని నేను సరిగ్గా చేశాను. గాంధీజీ పేరుకి, స్వాతంత్య్ర ఉద్యమానికి న్యాయం చేశాను. అది చాలు అని మాత్రమే అనుకున్నాను. అవార్డు అందుకోవడం ఓ గొప్ప అనుభూతి’’ అని ఆ ఇంటర్వ్యూల్లో చెప్పారు భాను. 2012లో అవార్డును భద్రపరచడానికి ఆస్కార్ అవార్డు అకాడమీకే అవార్డును తిరిగి ఇచ్చారు భాను. ఆమె రచించిన ‘ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్’ పుస్తకం విడుదల సమయంలో ‘‘సినిమాకు కాస్ట్యూమ్స్ చాలా ప్రధానం. కానీ భారతీయ సినిమా కాస్ట్యూమ్స్‌కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు’’ అన్నారు భాను. దాదాపు 50 ఏళ్ల పాటు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వందకు పైగా సినిమాలు చేశారు భాను అతైయా. 2004లో ‘స్వదేశ్’ తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. భాను మృతి పట్ల పలువురు సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భాను అతైయా అంత్యక్రియలు ముంబైలోని చందన్ వాడీ స్మశాన వాటికలో జరిగాయి. -
తొలి భారతీయ ఆస్కార్ విజేత కన్నుమూత
సాక్షి,ముంబై: భారతదేశానికి తొలి ఆస్కార్ అవార్డును అందించిన ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియా (91) ఇక లేరు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె రాధిక గుప్తా ధృవీకరించారు. ఎనిమిది సంవత్సరాల క్రితం, మెదడులో కణితి కారణంగా గత మూడేళ్లుగా, ఆమె మంచానికే పరిమితయ్యారని తెలిపారు. చివరకు గురువారం తెల్లవారు ఝామున నిద్రలోనే కన్నుమూసినట్టు ఆమె చెప్పారు. దక్షిణ ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో తమ తల్లి అంత్యక్రియలను పూర్తి చేసినట్టు రాధిక ప్రకటించారు. 1982లో గాంధీ చిత్రానికి దుస్తుల రూపకల్పనలో ఆమె కృషికి గాను కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. తద్వారా ఆస్కార్ అకాడమీ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయురాలిగా అథియా ఘనత దక్కించుకున్నారు. కొల్లాపూర్‌లో జన్మించిన అథియా ఈవ్స్ వీక్లీ సహా బొంబాయిలోని వివిధ మహిళా పత్రికలకు ఫ్రీలాన్స్ రచయితగావృత్తిని ప్రారంభించారు. పత్రిక ఎడిటర్ కోరిక మేరకు దుస్తులను డిజైన్ చేసిన భాను క్రమంగా తనలోని నైపుణ్యానికి పదును పెట్టి డిజైనర్‌గా రాణించారు. అలా ఆమె కెరీర్ గురుదత్ సూపర్ హిట్ మూవీ సీఐడీ (1956)లో ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్‌గా కరియర్ ప్రారంభించారు. పాయసా (1957), చౌద్విన్ కా చాంద్ (1960) సాహిబ్ బీబీ ఔర్ గులాం (1962) తదితర గురుదత్ చిత్రాలకు పనిచేసి ఖ్యాతి గడించారు. ఆ తరువాత 1991లో, లగాన్ (2002) చిత్రానికి రెండు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 50 సంవత్సరాల కెరీర్లో 100 చిత్రాలు, అనేక అవార్డులను అథియా అందుకున్నారు. తన మరణం తరువాత తన కుటుంబం ట్రోఫీని జాగ్రత్తగా చూసుకోలేదని భావించి తన అకాడమీ అవార్డును ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.15 డిసెంబర్ 2012 న, ట్రోఫీని అకాడమీకి తిరిగి ఇచ్చారు. అంతేకాదు ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె రాశారు. -
మళ్లీ యంగ్ రజనీ
‘పాతికేళ్ల క్రితం నాటి రజనీకాంత్‌ని చూస్తున్నట్లుంది’...‘పేట’ సినిమాలో రజనీ లుక్స్, గెటప్‌ను చూసి ఆయన అభిమానులు ఇలానే మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రజనీకాంత్ కాస్ట్యూమ్స్ భలేగా కుదిరాయి. రజనీని యంగ్ అండ్ స్టైలిష్‌గా చూపించడానికి ‘పేట’ చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అదే మేజిక్ రిపీట్ కాబోతుంది. ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా ‘పేట’ సినిమాకు వర్క్ చేసిన నిహారిక భాసిన్నే తీసుకున్నారు టీమ్. ‘‘సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాకు మళ్లీ వర్క్ చేయబోతుండటం చాలా సంతోషంగా ఉంది. హాలిడే ట్రిప్‌కి గోవాకి వెళుతున్నాను. ట్రిప్ ఎంజాయ్ చేయక ముందే సంతోషపడటానికి కారణం దొరికింది. అదే రజనీకాంత్ సినిమా’’ అని పేర్కొన్నారు నిహారిక. గోవా నుంచి వచ్చాక రజనీ కాస్ట్యూమ్స్‌ని రెడీ చేశారట. అలాగే ‘పేట’ సినిమాకు సంగీతం అందించిన అనిరు«ద్నే ఈ సినిమాకు వర్క్ చేయనున్నారు. ఇందులో కథానాయికగా నయనతార నటించబోతున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో రజనీకాంత్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. -
ఝాన్సీ రాణి టైలర్
రెండు దశాబ్దాలుగా చారిత్రక చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు నీతా లుల్లా! ఖుదా గవా, చాందినీ, లమ్హే, దేవ్‌దాస్, జోధా అక్బర్.. ఇంకా ఎన్నో సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకున్నారు నీతా. 2016లో అషుతోష్ తీసిన ‘మొహెంజదారో’ చిత్రం తరవాత ఇప్పుడు ‘మణికర్ణిక’ చిత్రంలో ఝాన్సీరాణిగా నటిస్తున్న కంగనా రనౌత్‌కి డిజైనర్‌గా పని^ ó శారు. నీతా రూపొందించిన దుస్తులలో కంగనా ఝాన్సీరాణిలాగ ఎంతో సాహసోపేతంగా కనిపించడం ఇప్పటికే ట్రైలర్లలో, టీజర్లలో మీరు చూసే ఉంటారు. జనవరి 25న విడుదల కానున్న ఈ చిత్రానికి కంగనే డైరెక్టర్. నీతా తన టీమ్‌తో కలిసి ఝాన్సీరాణి వస్త్రాల మీద బాగా పరిశోధన చేశారు. నాలుగు మాసాల పాటు తయారు చేసిన వస్త్రాలు రాణి పాత్రకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని పరీక్షించారు. ‘‘అంతకు ముందే ఈ అంశం మీద చిత్రాలు తీద్దామనుకున్న కొందరు వ్యక్తులు నన్ను కలిశారు. అందువల్ల ఈ చిత్రం తీసే నాటికి నాకు ఈ పాత్రకు తగ్గ ఆహార్యం మీద అవగాహన కలిగింది. మణికర్ణిక కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఫ్రెష్ మైండ్‌తో పని ప్రారంభించాను’’ అంటారు నీతా లుల్లా. గ్రంథాలయాలు, మ్యూజియమ్లు గాలించి, మణికర్ణిక వస్త్రాలకు సంబంధించిన సమాచారం సేకరించారు నీతా. అంత లోతుగా పరిశీలించడం వల్ల ఝాన్సీలక్ష్మీబాయిని ఎంత శక్తిమంతంగా చూపాలో నీతాకి అర్థమైంది. ఎక్కడెక్కడివో పెయింటింగ్స్, ఇలస్ట్రేషన్స్, ఫ్యాబ్రిక్ శాంపుల్స్ కూడ పరిశీలించారు. దానితో రాజరికాన్ని ఏ విధంగా ప్రతిబింబించాలో తెలుసుకున్నారు. సందర్భానికో వస్త్రధారణ ‘‘యుద్ధవీరురాలికి వస్త్రాలు తయారు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీ బాయి వేసిన రకరకాల వేషాలకు సంబంధించిన వస్త్రాలను డ్రామా కంపెనీల దగ్గరకు వెళ్లి తెలుసుకున్నాను. లక్ష్మీబాయి లేదా మణికర్ణిక.. యవ్వనంలో ఉండగా ఆమెను ఒక యోధురాలిగా, పెళ్లికూతురిగా, రాణిగా, విధవరాలిగా చూపాలి. చివరగా ఆమెను ఒక విప్లవ నాయకురాలిగా చూపాలి. ప్రతి దశలోను రకరకాల రంగులను ఉపయోగించాను. తొమ్మిది గజాల ఎమరాల్డ్ గ్రీన్ చీరలో రనౌత్‌ను చూస్తుంటే పోరాటయోధురాలు ఝాన్సీలక్ష్మీబాయి కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఆకుపచ్చ రంగు సిరిసంపదలకు, విశాల హృదయానికి ప్రతీక’’ అంటారు నీతా. కంగన కూడా ఆ వస్త్రాలకు దీటైన నటన కోసం శ్రమించారు. ‘‘ఈ పాత్రకు సంబంధించి రకరకాల భావాలు ప్రదర్శించడం చాలా కష్టంగా ఉందని, కాని ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నానని కంగనా అనేవారని’’ చెబుతున్నారు నీతా. యుద్ధంలో అంగ్రఖా కుర్తా రాచరికం ప్రతిబింబించేలా హ్యాండ్‌స్పన్ ఫ్యాబ్రిక్, ఖాదీ వస్త్రాల మీద సహజ రంగులతో డిజైన్ చేశారు నీతా. రాణిగా లక్ష్మీబాయి పాత్రకు రిచ్ రెడ్ కలర్, ఆరెంజ్, గ్రీన్ రంగులను ఉపయోగించారు. ఆమెలోని విషాదాన్ని చూపడానికి లేత రంగులను ఉపయోగించారు. యుద్ధరంగంలో ఉన్న సమయంలో రనౌత్ ‘అంగ్రఖా కుర్తా’ వేసుకున్నారు. మరాఠా వీరులకు సంబంధించిన బొమ్మలను, తెల్లటి వస్త్రాల మీద బంగారు, ఎరుపు రంగులలో చిత్రించారు. కవచాన్ని లెదర్‌తో రూపొందించారు. అది కూడా చేతితో చేయించారు. కాస్ట్యూమ్స్ కోసం నీతా ఇంత కృషి చేసిన విధంగానే నగల ఎంపికకు మరో విభాగం పెద్ద అధ్యయనమే చేసింది. మణికర్ణిక మరాఠా మహారాణి కావడంతో వివాహానికి ముందు ధరించే నగల విషయంలో ప్రత్యేకత చూపారు. ముక్కుకి నత్తు, కంఠానికి తుషీ చోకర్ తయారుచేశారు. వివాహం అయ్యాక ఆవిడ కుందన్స్, ముత్యాలు ధరించేలా నగలు తయారుచేశారు. పెద్ద పాపిడి బిళ్ల, చేతులకు కంకణాలు, నెక్లేస్.. ఉపయోగించారు. వీటన్నిటినీ త్వరలోనే మనం తెర మీద కళ్లారా చూడొచ్చు. – జయంతి ఇంతలా ఎప్పుడూ శ్రమించలేదు నేను 12 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. నాకు చరిత్ర గురించి అస్సలు తెలియదు. సంప్రదాయ చదువుల పట్ల నాకు ఆసక్తి లేదు. ఇప్పటికి 100 కు పైగా చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశాను. నిరంతరం ఏదో ఒకటి కొత్తగా చే యడం మీద నాకు ఆసక్తి ఎక్కువ. మణికర్ణికలో నేను రనౌత్‌కి చేసిన కాస్ట్యూమ్స్‌కి ఎప్పుడూ లేనంతగా శ్రమించాన. ఆమె శిరస్సు కోసం చేసిన అలంకారాలు, రనౌత్‌కు కొత్త అందాలు తీసుకువచ్చాయి. ఆవిడ జీవితంలో ఆ మేకప్ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. – నీతా లుల్లా -
అలనాటి తార.. అందాల చీర
సాక్షి, సిటీబ్యూరో: తెరమీద పరుచుకున్న అనిర్వచనీయ అందం ఆమె... అతిరథ మహారథులు మెచ్చుకున్న అనితరసాధ్య అభినయం ఆమె... ఎందరో నటీమణులున్నా మహానటి తాను ఒక్కరేనని నిరూపించుకున్న అలనాటి తార సావిత్రి.. తెలుగు తెరపైఒకనాటి వెలుగు ధార. ఆమె కట్టూబొట్టూ అన్నీ అప్పట్లో అమ్మాయిలకు అనుసరణీయాలే. ఆ దిగ్గజ నటి జీవితాన్నితెర మీద ఆవిష్కరించబోతున్న సినిమా ‘మహానటి’. ఇందులో సావిత్రి పాత్రలో జీవించింది కీర్తి సురేష్. ఈ పాత్రను సజీవంగా మలిచిన అనేక మంది శిల్పుల్లో సిటీకి చెందిన టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్‌షా ఒకరు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన షాకు... ఇదే తొలి చిత్రం కావడం విశేషం. మే 9న విడుదల కానున్న ఈ చిత్ర కాస్ట్యూమ్స్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పరిశోధించి.. పరిశ్రమించి.. అలనాటి సావిత్రి దుస్తులన్నీ సింప్లిసిటీకి, హుందాతనానికి ప్రతీకలుగా అనిపిస్తాయి. అందుకే ఆమె లుక్ గురించి పరిశోధనలో భాగంగా సినీ పరిశ్రమ పెద్దలనూ సంప్రదించారు గౌరంగ్. ఆనాటి టెక్స్టైల్స్ పునఃసృష్టి కోసం ఆయన బృందం తరచూ మ్యూజియమ్లను కూడా సందర్శించింది. అప్పటి టెక్స్టైల్, డిజైన్, టెక్చర్, కలర్లలోని ప్రతి విశేషాన్ని క్షుణ్నంగా పరిశీలించి, దాని ప్రకారం నేత కళాకారులకు మార్గదర్శకత్వం చేశారు. 6నెలలకు పైగా పరిశోధన సాగితే... వీవింగ్, టెక్చరింగ్, కలరింగ్‌కు మరో ఏడాది పట్టిందని చెప్పారు. ఇక సరైన టెక్స్టైల్, నేత, టెక్చరింగ్, కలరింగ్లను ఉపయోగించి నటి సావిత్రి వాస్తవ రూపాన్ని గుర్తుతెచ్చే ప్రయత్నం చేశామన్నారు గౌరంగ్. ఈ చిత్రంలోని కాస్ట్యూమ్స్ కోసం 100 మందికి పైగా చేనేత కళాకారులు నిర్విరామంగా పనిచేశారని చెప్పారు. ఈ సినిమాలో నేటి సావిత్రి ధరించే ప్రతీ కాస్ట్యూమ్... వాస్తవికంగా ఉండేందుకు గాను దేశంలోని కంచిపురం, బెనారస్ తదితర ప్రాంతాల నుంచి భారీ పట్టు ఫ్యాబ్రిక్స్‌ను సేకరించారు. వీటికి కోట, మంగళగిరి, బ్లాక్ ప్రింట్స్‌లతో లూమ్స్‌లో అదనపు సొబగులు అద్దారు. టాక్ ఆఫ్ ది సినీ కంట్రీ అనిపించుకున్న దేవదాస్, పద్మావతి... లాంటి బాలీవుడ్ సినిమాల్లోని కాస్ట్యూమ్స్ మంచి పేరొచ్చింది. ఆయా సినిమాల్లో తారల వస్త్రధారణను తీర్చిదిద్దిన డిజైనర్లు కూడా కొంతకాలం వార్తల్లో నిలిచారు. అయితే అలాంటి ఘనత ఇప్పటి వరకు నగరానికి చెందిన ఏ డిజైనర్‌కూ దక్కలేదు. అంతేకాదు.. భారీ చిత్రాలకు కాస్ట్యూమ్స్ ఇచ్చిన దాఖలాలూ... సదరు చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న సందర్భాలూ దాదాపు లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో సిటీ టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్ షా దీనికి శ్రీకారం చుట్టారు. ‘మహానటి’ సినిమాకు ఆయన అందించిన కాస్ట్యూమ్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. జామ్దానీని ఉపయోగించి వైవిధ్యభరితమైన ఫ్యాబ్రిక్స్, టెక్చర్స్ల మేళవింపులతో చీరల సృష్టికి చిరునామాగా నిలిచే ఈ డిజైనర్... వింటేజ్ ఫ్యాషన్ ట్రెండ్స్‌కు సిటీలో పేరొందారు. విద్యాబాలన్, షర్మిలా ఠాగూర్లతో పాటు మరెందరో బాలీవుడ్ తారలు ఆయన డిజైన్స్ ధరించారు. జీవనయానం.. వస్త్రవైభవం ఆనాటి మహిళ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా... అప్పటి ప్రసిద్ధ రంగులతో వీటిని బ్యాలెన్స్ చేశామన్నారు. బాల్యం నుంచి చివరి దశ వరకు ఆమె జీవన ప్రయాణంలోని ప్రతి సందర్భాన్నీ దృష్టిలో పెట్టుకొని వస్త్రధారణను తీర్చిదిద్దారు. ఎదిగే వయసులోని సావిత్రిని ప్రతిబింబించేందుకు మంగళగిరి, కోటా ప్రింట్స్‌ను... స్వర్ణయుగం లాంటి సినీ దశను అనుభవించిన సమయంలో సావిత్రిని చూపించేందుకు హెవీ బ్రొకేడ్స్, సిల్క్సŠ, ఆర్గంజా, చేతితో నేసిన శాటిన్స్, షిఫాన్స్లను వినియోగించారు. అదే విధంగా ఆమె చరమాంకానికి తగ్గట్టూ వస్త్రశైలుల్ని రూపొందించారు. ‘సినిమాలో కొన్ని ప్రత్యేకమైన సీన్ల కోసం శాటిన్స్ను అందించమన్నారు. అయితే ఆమె లుక్స్ పూర్తిగా స్వచ్ఛమైన చేనేతలతోనే ఉండాలని కోరుకున్నాను. దాంతో హ్యాండ్లూమ్స్ మీదనే శాటిన్స్ని రీక్రియేట్ చేశాను. భారీ కాంజీవరమ్ లెహంగా, బ్లౌజ్, ఆర్గంజా దుపట్టాతో ఉండే మాయాబజార్లోని సావిత్రిని గుర్తు తెచ్చేందుకు కలర్, డిజైన్, దుస్తుల నేతతో కూడిన లుక్ కోసం మాకు 3 నెలలు సమయం పట్టింద’ని చెప్పారు గౌరంగ్. బ్యూటీఫుల్ జర్నీ... ప్రారంభం నుంచీ ఇదొక చాలెంజ్ లాంటిది నాకు. భారతీయ చీరల వైభవాన్ని పూర్తి స్థాయిలో వెండి తెరపై ప్రదర్శించడానికి దక్కిన అద్భుతమైన అవకాశం కూడా. ఈ సినిమాకు సంబంధించిన విభిన్న సందర్భాలు, ఘట్టాలను దగ్గర ఉండి పరిశీలిస్తూ పనిచేశాం. మా బృందానికి ఇదొక అందమైన ప్రయాణం. అలనాటి దిగ్గజ నటి జీవనశైలికి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్ శైలులను, టెక్చర్స్‌ను తీర్చిదిద్దడం, ఆమె సున్నిత మనోభావాలకు అనుగుణంగా చీరలను సృష్టించడం అనేది ఒక టెక్స్టైల్ డిజైనర్‌గా నాకు అత్యంత తృప్తిని అందించింది. – గౌరంగ్ షా, టెక్స్టైల్ డిజైనర్ -
కాపురాలు కూలిస్తే.. తస్మాత్ జాగ్రత్త!
‘‘కొందరు హీరోయిన్స్ కుటుంబాలను నాశనం చేస్తున్నారు. వాళ్లు సెక్స్ వర్కర్స్ కంటే దారుణంగా తయారయ్యారు’’ అంటూ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీలకు బంధువు అవుతారు జ్ఞానవేల్ రాజా. సూర్య హీరోగా జ్ఞానవేల్ నిర్మించిన ‘సింగం 3’ సినిమాకు నేహా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. కొందరి హీరోయిన్ల ధోర ణిపై ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ – ‘‘అందర్నీ జన్రలైజ్ చేయటమో లేదా ఫ్రొఫెషనల్‌గా ఉండేవాళ్లను హర్ట్ చేయటానికో ఈ విషయం ప్రస్తావించట్లేదు. హీరోయిన్లను ఇండస్ట్రీలో అడ్జస్ట్ అవ్వమని అడుగుతారో లేదో తెలీదు కానీ కొందరు మాత్రం ‘బెడ్ రెడీ’ అన్నట్లు ఉంటారు. పెళ్లయిన వాళ్లను వెంబడిస్తుంటారు. ఒకవేళ అడ్జస్ట్ అవ్వమని ఇండస్ట్రీ అడిగితే ‘నో’ చెప్పి వెళ్లిపోలేరా? పెద్ద హీరోయిన్ అయిపోదామని, డబ్బులు సంపాదించే ప్రక్రియలో, లైమ్ లైట్లో ఉందామని చేసే ప్రయత్నమే ఇదంతా. మనమంతా ఫెమినిజమ్, స్త్రీ సాధికారత గురించి మాట్లాడుకుంటుంటాం. కానీ అసలైన నిజం ఏంటంటే ఆడదానికి ఆడదే శత్రువు. కొన్నిసార్లు ఓ స్త్రీ ఇంకో స్త్రీ జీవితం నాశనానికి కారణమవుతుంది. అవును.. కథకు రెండు వైపులా మాట్లాడాలి. కొందరు మగవాళ్లే వాళ్ల ఆటలు సాగనిచ్చి, వాళ్ల కుటుంబంలోకి వచ్చేదాకా చేస్తున్నారు. మనందరం ఇలా ఇళ్లను కూల్చేవాళ్లందరినీ బయటపెట్టి ఓపెన్ వార్నింగ్ ఇవ్వాలి. అమ్మాయిని మోసం చేసిన మగాడిని ఎలా శిక్షిస్తామో వీళ్లనూ అలానే దండించాలి. అవును... మగాళ్లు ఏమీ పసి పిల్లలు కాదు. కొందరు మగాళ్లు వీళ్లను లిమిట్లో ఉంచినా కూడా వీళ్లు హద్దులు దాటుతుంటారు. ఎమోషనల్ డ్రామాతో కట్టేస్తుంటారు. మొగుడిని కంట్రోల్ చేయటం, శిక్షించటమే కాదు.. భార్యల డ్యూటీ. ఇలాంటివాళ్లను హద్దుల్లో పెట్టడం కూడా. పబ్లిక్‌లో కుక్కని కొట్టినట్టు కొట్టాలి. కొందరు హీరోయిన్లను ఇలాంటి చర్యలను ఆపమని బతిమాలా. కానీ మారేలా లేరు. వాళ్లను కచ్చితంగా రోడ్డుకి ఈడుస్తాను. (అలాంటివాళ్లను హీరోయిన్స్ కాదు.. వ్యభిచారులు అనాలేమో).ఈ రేంజ్లో మాటల తూటాలు వదిలిన నేహా ఆ తర్వాత ఆ ట్వీట్ మొత్తాన్ని తీసేశారు. ‘‘నాకు,నా భర్తకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నా చుట్టూ జరిగిన సంఘటనలు చూసి స్పందించాను. ఏదో డ్రామా క్రియేట్ చేయాలనో, ఇతరుల దృష్టి ఆకర్షించాలనో రాయలేదు. ఇక్కడ స్పందించటం వల్ల ఉపయోగం లేదని అర్థం అయింది. అందుకని తీసేశాను’’ అని నేహా పేర్కొన్నారు. -
అక్కతో కలిసి..
తమిళసినిమా: నటుడు శరత్‌కుమార్ రెండో కూతురు కూడా చిత్రరంగ ప్రవేశం చేసింది. శరత్‌కుమార్ పెద్ద కూతురు వరలక్ష్మీ నటిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. పోడా పోడీ చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసిన వరలక్ష్మి బాలా దర్శకత్వం వహించిన తారైతప్పట్టై చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మహిళల రక్షణ కోసం సేవ్ శక్తి అనే స్వచ్ఛంద సం స్థను ప్రారంభించన వరలక్ష్మి తాజాగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం గా రూపొందుతున్న శక్తి అనే చిత్రం లో నటిస్తున్నారు. దర్శకుడు మిష్కిన్ శిష్యురాలు ప్రియదర్శని తొలిసారిగా మోగాఫోన్ పడుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి పోలీస్ అధికారిణిగా నటిస్తున్నారట. దీని గురించి ఆమె చెబుతూ ఇది పోలీస్ అధికారిణికి విలన్‌కు మధ్య జరిగే పోరు ఇతివృత్తంగా తెరకెక్కిస్తు న్న యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ద్వారా తన చెల్లెలు పూజ కాస్ట్యూం డిజైనర్‌గా పరిచయం అవుతోందని తెలిపా రు. చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, వచ్చే ఏడాది మార్చిలో శక్తి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వరలక్ష్మి తెలిపారు. -
సెలెక్షన్ పరేషాన్
ధృవ సినిమాలో రకుల్ ‘ప్యార్‌లో పడిపోతే పరేషాన్ రా!’ పాట అందరికీ గుర్తున్నదే! అందమైన రకుల్ వేసుకున్న ఇన్ని అందమైన డ్రెస్సుల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నా పరేషానే కదా! అది సెలెక్షన్ పరేషాన్!! ►జయ జానకి నాయక ప్రమోషన్ సందర్భంగా డిజైన్ చేసిన జేడ్ బ్లూ కలర్ లాంగ్ అనార్కలీ ఫ్రాక్ ఇది. ఎంతమందిలో ఉన్నా చాలా బ్రైట్‌గా స్పెషల్‌గా కనిపించేలా చేస్తుంది. సంప్రదాయ వేడుకలకు ఈ స్టైల్ డ్రెస్ బాగా నప్పుతుంది. ►నారింజ, పసుపు రంగుల కాంబినేషన్‌తో రాజస్థానీ వర్క్‌తో ఆకట్టుకుంటున్న ఈ లంగావోణీ రితుకుమార్ డిజైన్ చేసింది. హాఫ్ శారీని ‘రారండోయ్’ ప్రమెషన్ కోసం వాడాం. అన్నిరకాల ప్రమోషన్స్‌కి హాఫ్ శారీస్‌నే వాడాం. ►సింగిల్ షోల్డర్ కేప్‌ని జయంతీరెడ్డి డిజైన్ చేశారు. దీనికి ధోతీ ప్యాంట్ బాటమ్‌గా వాడాం. విన్నర్ మూవీ ప్రమోషన్ సమయంలో ఎంపిక చేసిన డ్రెస్ ఇది. ఎథ్నిక్ టచ్ ఉండాలి, అదే సమయంలో వెరైటీగా అనిపించాలనుకున్నాం. హెయిర్‌స్టైల్ కూడా మార్చాం. దీంతో ఇండోవెస్ట్రన్ లుక్‌తో అట్రాక్ట్ చేసింది. చెవులకు హ్యాంగింగ్స్ తప్ప ఇతరత్రా ఆభరణాలేవీ ఉపయోగించలేదు. ►విన్నర్ సినిమాలో ఒక పాట కోసం 22 మీటర్ల ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన వెస్ట్రన్ గౌన్ ఇది. పువ్వుల ప్రింట్లు, సింగిల్ షోల్డర్ డిజైన్, దీనికి పొడవాటి పల్లూ ఉపయోగించడంతో హైలైట్ అయ్యింది. ►కాటన్ క్లాత్ మీద బ్లాక్ ప్రింట్స్ అనుశ్రీ లేబుల్ లాంగ్ ఫ్రాక్ ఇది. జయ జానకి నాయక సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ డ్రెస్‌ను ఎంచుకున్నాం. ►విన్నర్ సినిమాలో ఒక పాట కోసం ఈ లెహంగా బ్లౌజ్‌ని ఎంచుకున్నాం. బ్లౌజ్‌కి, లెహంగాకి మిర్రర్ వర్క్ ప్లాన్ చేశాం. ఇది సినిమాలో బాగా హైలైట్ అయ్యింది. టీనేజ్ అమ్మాయిలు సంప్రదాయ వేడుకులలో ధరించడానికి బాగుంటుంది. ►ఎస్‌విఎ డిజైనర్ చేసిన లంగావోణీ కాంబినేషన్ ఇది. ‘రారండోయ్ వేడుకచూద్దాం’ ఆడియోలాంచ్కి ఈ కాన్సెప్ట్ అనుకున్నాం. ఆడియోలాంచ్ సాధారణంగా నైట్‌టైమ్ ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ డ్రెస్ ఎక్కువగా లంగాఓణీలే! అదే కాన్సెప్ట్‌లో లంగాఓణీలో బ్రైట్‌గా కనిపించాలనుకున్నాం. అందుకు లైట్ క్రీమ్‌కలర్ లంగా ఓణీని ఎంపిక చేశాం. ఈ డ్రెస్‌కు పూర్తిగా బీడ్ వర్క్ చేయడంతో మరింత ప్లెజెంట్లుక్ వచ్చింది. అలంకరణలో ఆభరణాలు ఉపయోగించలేదు. ఈ డ్రెస్‌లో చుక్కల్లో చందమామలా వెలిగిపోయింది రకుల్! ► విశాల్ సినిమా ఆడియోలాంచ్ సందర్భంగా రుచి డిజైన్ చేసిన శారీ ఇది. లెదర్బ్లౌజ్, మింట్ బ్లష్ ప్రీ డ్రేప్డ్ శారీ ఇది. దీనికి కొంగును జత చేసి స్టైలిష్‌లుక్ వచ్చేలా చేశాం. దీంతో వేడుకలో హైలైట్ అయ్యింది. బ్లాక్ కలర్ ఎప్పుడూ స్పెషల్‌గా ఉంటుంది. అయితే టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ ధరించినప్పుడు సింపుల్‌గానూ, స్టైలిష్‌గానూ కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఇది సియాన్ గ్రీన్ కలర్ జంప్ సూట్. చీకటి రాజ్యం సినిమాకు వెళ్లడానికి ఈ క్యాజువల్ ఔట్‌ఫిట్‌ని ఎంపిక చేశాం. ఈ జంప్‌సూట్‌ని రితుకుమార్ డిజైన్ చేశారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు, సినిమాలకు, గెట్ టుగెదర్ వంటి పార్టీలకూ ఈ తరహా డ్రెస్ బాగా నప్పుతుంది. ►‘విన్నర్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం స్పెషల్‌గా ఎంచుకున్న స్టైల్ ఇది. తరుణ్ తహ్లియాన్ డిజైన్ శారీకి స్పెషల్ అట్రాక్షన్ ఫ్యాషన్బెల్ట్, నెక్‌పీస్. నటి రకుల్‌తో నీరజ కోన సినీ తారల డ్రెస్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ -
సప్త సమంత
సినిమాలో.. సన్నివేశానికో డ్రెస్! వేదికల మీద.. సందర్భానికో డ్రెస్!! ఏ వేడుకైనా.. ‘తార’లా వెలిగిపోవాలంటే ధరించే డ్రెస్సులు వైవిధ్యంగా ఉండాలి. అభిమానుల మదిని కొల్లగొట్టాలి. ఆహూతుల కితాబులు అందుకోవాలి సమ్‌థింగ్ సమ్‌థింగ్ ‘సమంత’ అనిపించాలి. స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజకోన స్టార్ హీరోయిన్ సమంత కోసం ఎంపిక చేసిన డిజైన్ల గురించి వివరించారు. ఇలాంటి డిజైన్స్‌లో మన ఎంపిక ఎలా ఉండాలో సూచనలు ఇస్తున్నారు. ‘అ ఆ’ సినిమా ఆడియో లాంచ్ వేడుకకు శ్రియాసోం డిజైన్ చేసిన డ్రెస్ ఇది. ఆర్గాంజా క్లాత్ మీద పువ్వులను ఎంబ్రాయిడరీ చేశారు. బ్లౌజ్‌కి సిల్వర్ బీడ్ వర్క్ చేశారు. పెద్ద ఈవెంట్ అనుకున్నప్పుడు, స్టైలిష్‌గా కనిపించాలంటే ఇలా ఇండోవెస్ట్రన్ డిజైన్ బాగా నప్పుతుంది. మీడియా ఇంటర్వూ కోసం పాయల్ ఖండ్వాలా డిజైన్ చేసిన డ్రెస్‌ని ఎంపిక చేశాం. రెడ్ బ్రొకేడ్ బ్లౌజ్ రా సిల్క్ పలాజో ప్యాంట్మీదకు చక్కగా అమరింది. ఈ కలర్, కాంబినేషన్‌ని చూస్తే ఇటు ట్రెడిషనల్ పార్టీలకు అటు గెట్ టుగెదర్ పార్టీలకు స్టైలిష్‌గా ఉంటుంది. ఆమ్రపాలి డిజైన్ చేసిన యాంటిక్ గోల్డ్ ఫినిష్డ్ నెక్లెస్ తప్ప మరే ఆభరణమూ ఈ అలంకరణలో ఉపయోగించలేదు. మెరుపులీనే మేకప్, కోరల్ లిప్‌కలర్, హెయిర్ స్టైల్ ఈ డ్రెస్‌కి బాగా అమరాయి. జైపూర్‌కే ప్రత్యేకమైన హ్యాండ్లూమ్ శారీ విత్ లాంగ్ జాకెట్ ఇది. ఈ గెటప్‌కి ఎత్నిక్ టచ్ తీసుకురావాలని అనుకున్నాం. ఇందుకు జైపూర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించాం. బ్రాస్ నెక్‌పీస్‌ను తీసుకున్నాం. దీంతో కళ పూర్తిగా మారిపోయింది. తమిళ సినిమా ‘తెరి’ మీడియా ఇంటర్వ్యూ కోసం డిజైన్ చేసిన శారీ డ్రెస్ ఇది. దీని ఎంపికలోనే ఒక హైలైట్ ఉంది. ఒకే రంగు అదీ చాలా బ్రైట్‌గా ఉండే డ్రెస్‌ను ఎంపిక చేయాలనుకున్నాం. పర్పుల్ కలర్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. అందుకని ప్లెయిన్ జార్జెట్ పర్పుల్ శారీ తీసుకున్నాం. దీనికి అదే రంగు కలర్ జాకెట్‌ను జత చేశాం. అయితే ఆర్మీప్రింట్స్ ఉన్న నకోడా ఫాబ్రిక్ను తీసుకొని డిజైన్ చేశాం. ఈ డ్రెస్సే పెద్ద హైలైట్. అందుకని ఆభరణాలేవీ ఉపయోగించలేదు. ఈ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంది. ఈ గాగ్రాచోలీ సినిమా రిలీజ్ ఫంక్షన్లో ప్రత్యేకంగా నిలిచింది. దీనిని సబ్యసాచి డిజైన్ చేశారు. మోచేతుల వరకు ఉండే బ్లౌజ్, పెద్ద అంచుతో లెహంగా, అంచు రంగు దుపట్టా హంగులుగా అమరాయి. సంప్రదాయ వేడుకలకు ఈ తరహా డ్రెస్సింగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈషార్ట్ గౌన్ శంకరాభరణం సినిమా ఆడియోలాంచ్ వేడుకకు డిజైన్ చేసినది. ఈ ఫ్రాక్‌ని మన్కానంద డిజైనర్ డిజైన్ చేశారు. ఈ ఫ్రాక్‌కి షిఫాన్, జార్జెట్ ఫ్యాబ్రిక్స్‌ని వాడారు. ఫ్రాక్ అంటే చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అందుకని వేరే యాక్ససరీస్ ఏవీ ఉపయోగించలేదు. ముదురాకుపచ్చ, నీలం, నలుపురంగుల ప్రింట్ మ్యాక్సీ డ్రెస్ ఇది. ‘అత్తారింటì కి దారేది’ సినిమాలోని పాట కోసం ఎంపిక చేశాం. ఎలాంటి శరీరాకృతి గలవారికైనా సూట్ అయ్యే డ్రెస్ ఇది. ఈ డ్రెస్‌లో ఎక్కడా ఫిటింగ్ ఉండదు. రెగ్యులర్ మ్యాక్సీకి ఫ్యాన్సీ బెల్ట్ ఉపయోగించేసరికి లుక్‌లో స్టైలిష్ మార్పు వచ్చింది. బెల్ట్‌తో పాటు మెడలో వేసుకునే హారానికి ప్రాముఖ్యం ఇచ్చాం. దీనికీ ఫ్యాన్సీ నెక్‌లైన్‌ని తీసుకున్నాం. లూజ్ హెయిర్‌స్టైల్, చెవులకు చిన్న స్టడ్స్ తప్ప ఎక్కడా ఇతరత్రా యాక్ససరీస్ ఉపయోగించలేదు. -
క్రికెట్ కోసమే నటుడినయ్యా!
తమిళసినిమా: క్రికెట్ ఆడడం కోసమే నటుడినయ్యానంటున్నారు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ఎన్జే.సత్య. ఆ కథేంటో చూద్దామా విజయ్ నటించిన భైరవా, త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న శింబు త్రిపాత్రాభినయం చేసిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం వంటి పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సత్య తాజాగా నటుడి అవతారమెత్తి పలు చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా బిజీగా ఉన్న సమయంలో నటుడిగా మారడానికి కారణం నటనపై ఆసక్తి కాదట. మరేమిటన్నది ఆయన మాటల్లోనే..నన్ను ఒక క్రికెట్ క్రీడాకారుడిగా చూడాలన్నది మా నాన్న కల. నేను నా ఆసక్తితో కాస్ట్యూమ్ డిజైనర్నయ్యాను. అయితే నాన్న కల నిజం చేయడానికిప్పుడు నటుడిగా మారాను. ఇప్పుడు నా లక్ష్యం ఇక్కడ ప్రతి ఏడాది సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆడుతున్నారు. అందులో నేనూ భాగస్వామ్యం కావాలనుకున్నాను. అయితే ఆ జట్టులో చోటు సంపాదించాలంటే చిన్నచిన్న పాత్రల్లోనైనా కనీసం ఏడు చిత్రాల్లో నటించాలని చెప్పారు. అందుకే జీవా, వెట్రివేల్, కిడారి, పొదువాగ ఎమ్మనసు తంగం, అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాల్లో నటించాను. ఇప్పుడు నటుడిగానూ మంచి పాత్రలు లభిస్తున్నాయి. ముఖ్యంగా శింబు నటించిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటి కస్తూరితో కలిసి నటించాను. ఇందులో మంచి గుర్తిం పున్న పాత్రలో నటించాను. ఈ చిత్రం విడుదల తరువాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయనే నమ్ముతున్నాను. ఇకపై నటుడిగానే కొనసాగాల ని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. -
డాటర్ డిజైనర్... డాడ్ లుక్ సూపర్!
మమ్మీ డాడీ స్టైల్‌గా కనిపించాలని పిల్లలు కోరుకుంటారు. కొన్ని టిప్స్ కూడా ఇస్తుంటారు. వీలైతే వాళ్ల కోసం షాపింగ్ చేస్తారు. అదే డాడీ హీరో అనుకోండి... సినిమాలో ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ బాగుండాలని అనుకుంటారు. ఒకవేళ డిజైనింగ్ మీద అవగాహన ఉంటే, స్వయంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత అదే చేస్తున్నారు. తండ్రి 150వ చిత్రం ‘ఖైదీ నం. 150’కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారామె. డాడీ స్టైలిష్‌గా కనిపించడం కోసం చాలా శ్రద్ధగా డ్రెస్సులు తయారు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు చూసి, చిరంజీవి లుక్ సూపర్ అని అభిమానులు మురిసిపోతున్నారు. అన్నట్లు.. తండ్రికి మాత్రమే కాదు.. సినిమా మొత్తానికి సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే... ప్రస్తుతం ఈ చిత్రబృందం యూరప్ వెళ్లడానికి రెడీ అవుతోంది. అక్కడ పాటలను చిత్రీకరించనున్నారు. స్లోవేనియా, క్రొయేషియా తదితర అందమైన లొకేషన్లలో ఈ చిత్రీకరణ జరగనుందని చిత్ర నిర్మాత రామ్‌చరణ్ తెలిపారు. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తారని చెప్పారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ ప్రత్యేక పాటకు చిరంజీవి సరసన లక్ష్మీరాయ్ కాలు కదిపారు. హిందీ నటుడు తరుణ్ అరోరా విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమేరా: రత్నవేలు, కళ: తోట తరణి. -
బాలీమస్త్
బాలీవుడ్లో ప్రతీ తార మస్త్ మస్త్‌గా కనపడుతుంది కదూ! కొరియోగ్రాఫర్‌గా కెరియర్ స్టార్ట్ చేసి కాస్ట్యూమ్ డిజైనర్‌గా హిట్టు కొడుతున్న విక్రమ్ ఫడ్నిస్ డిజైన్లు బాలీవుడ్‌కే మస్త్ మస్త్. అందుకే, ఈయన స్టెప్ మస్త్... ఈయన కట్ మస్త్.. ఎంజాయ్ బాలీ మస్త్!! హిందీ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ వ్యక్తి తన పంథాను మార్చుకుని అంతకు మించిన ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగితే.. ఆ వ్యక్తి పేరు విక్రమ్ ఫడ్నిస్ అని సెలబ్రిటీలు ఇట్టే చెప్పేయగలరు. బాలీవుడ్ స్టార్ల ఫేవరేట్ డిజైనర్‌గానే కాకుండా ఇండియా ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్లలో ఒక ఊపు, ఉత్సాహాన్ని తీసుకువచ్చిన వ్యక్తిగా మంచి పేరుంది విక్రమ్‌కు. ముంబయ్‌లో జుహూ పేరుతో రిటైల్ స్టోర్‌ను నడుపుతున్న విక్రమ్ తన పేరు మీదుగా ఇండియన్, వెస్ట్రన్ వేర్‌ను ఆడ-మగ ఇద్దరికీ సరికొత్త ఆకర్షణలను అలంకరిస్తున్నాడు. విదేశాలలో డర్బన్, చికాగో, జమైకా వంటి నగరాలతో పాటు మన దేశంలో ప్రముఖ పట్టణాలలో స్టోర్స్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోనూ ప్రముఖ ఫ్యాషన్ షోల ద్వారా తన డిజైన్స్‌ను తెలుగువారికీ పరిచయం చేశారు విక్రమ్. -
పవర్ఫుల్అప్పియరెన్స్
ఫైటింగ్‌లతో విలన్లు... ‘కటింగ్’లతో హీరోయిన్లు... డైలాగ్స్‌తో ఆడియన్స్... ఎవరైనా పడిపోవాల్సిందే హీరో దెబ్బకు! అయితే ఎంతమందిని కొట్టాడని, పడగొట్డాడనీ కాదు... స్క్రీన్‌లోంచి కొట్టొచ్చినట్టుంటేనే హీరో! పవన్‌లో ఆ పవర్ ఉంది. ఆ లుక్కు, ఆ కిక్కు, ఆ స్మైల్, ఆ స్టైల్ అన్నిట్లో... కరెంట్ పాసవుతూ ఉంటుంది! ఆరడగుల కరెంట్!! అదిగో... ఆ కరెంట్‌కే కొలతలు తీశాడో కుర్రాడు! షాక్ అతడికి కొట్టలేదు, పవన్ ఫ్యాన్స్‌కి కొట్టింది!! ఏం డిజైనింగ్! ఏం పవనైజింగ్! కొమరం పులి దగ్గర్నుంచి ‘అత్తారింటి...’ వరకు...ఏం స్టెయిలింగ్!! ఈవారం ‘ముస్తాబు’ కంప్లీట్‌గా పవర్స్టార్దేన ప్పా... సిద్దప్పా! అత్తారింటికి దారేది ఈ సినిమాలో గౌతమ్ పాత్ర గొప్పింటి తరహాకు చెందినది. ఫారిన్లో ఉండే వాతావరణాన్ని, ధనవంతుడిగా చూపించడానికి ఇందులో టీ షర్టపైన టు లేయర్సగా జాకెట్స్ వాడారు. ఈ సినిమాలో ఎక్కువగా హుడీస్, 2-3 లేయర్ టీ షర్ట్స్ వాడుతూ ట్రెండీగా ఉంచటానికి ఎక్కువగా ట్రై చేశారు. గబ్బర్‌సింగ్ క్యారెక్టర్‌కు తగ్గట్టు షర్ట్ కలర్, ఫ్యాబ్రిక్ ఎలివేట్ అయ్యేలా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. పోలీస్ పాత్రకు తగ్గట్టు షర్ట్స్, లెనిన్ ప్యాంట్స్ వాడారు. పెద్ద బెల్ట్ వాడటం ఇందులో హైలైట్. పాటల చిత్రీకరణలో కార్గోస్ ప్యాంట్స్ ఎక్కువ ట్రై చేశారు. వీటిలో ఎక్కువగా వాడింది పోలీస్యూనిఫామ్! కాని ఇందుకోసం విభిన్న రంగులను ఎంచుకున్నారు. తీన్మార్ ఈ సినిమాలో మైఖేల్ క్యారెక్టర్ కోసం డిజైన్ చేసిన డ్రెస్ ఇది. స్టైలిష్ లుక్ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ ఇది. 2011 ట్రెండ్‌లో వస్తున్న మార్పులు, ఫ్యాషన్లను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినది. లెనిన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ప్యాంట్, లేయర్ షర్ట్, లోపల ప్రింటెడ్ టీ షర్ట్స్ వాడారు. కెమెరామెన్ గంగతో రాంబాబు కుర్తా, ధోతీ మన దేశ సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన డ్రెస్. ఈ డ్రెస్‌కు హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్‌ను రాజేశ్ ఉపయోగించారు. కలర్ కాంబినేషన్‌స ఇందులో ప్రధానమైనవి. తీన్మార్ ఇందులోనే అర్జున్ పాల్వాయి అనే క్యారెక్టర్‌కు డిజైన్ చేసిన డ్రెస్ ఇది! 70వ దశకంలో ఉండే లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. ఇందుకోసం లెనిన్, కాటన్ కుర్తాలు వాడారు. అలాగే డ్రెస్ ఫిట్‌గా ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కెమెరామెన్ గంగతో రాంబాబు ఇందులో ముందు మెకానిక్ క్యారెక్టర్ ఉంటుంది. దానికి తగ్గుట్టు యూనిఫామ్ ఉండాలని ప్యాంట్, షర్ట్ ఒకే రంగులో ఉండేలా డిజైన్ చేశారు. జెమ్ సూట్స్, ఫుల్స్లీవ్స్ టీ షర్ట్, పైన యూనిఫామ్ ఇందులో బాగా ఎలివేట్ అయ్యాయి. ఆ తర్వాత రిపోర్టర్ పాత్రకు లేయరింగ్ టైప్స్ ఎక్కువ వాడారు. ఎంపిక ముందు... మగవారికిప్యాంట్ షర్ట్ మినహా డ్రెస్సింగ్‌లో స్టైల్స్ ఏముంటాయి అనుకుంటారు. కాని కాస్త ట్రై చేస్తే ధరించే దుస్తుల్లో చాలా వేరియేషన్స్ చూపించవచ్చు. డ్రెస్‌ను ఎంపిక చేసుకునే ముందు నచ్చిన రంగులు, సౌకర్యం చూసుకోవాలి. ఆ తర్వాత కలర్ కాంబినేషన్స్, స్టైల్స్, ప్రస్తుత ట్రెండ్ దృష్టిలో పెట్టుకోవాలి. క్యాజువల్, ఆఫీస్, పార్టీ... ఇలా దేనికి ఎలా రెడీ అవ్వాలనే విషయంపైనా అవగాహన ఉండాలి. అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం.. ఏ పార్టీ ఏ తరహాకు చెందినదో.. దానిని బట్టి డ్రెస్ ఎంపిక, స్టైల్స్ సెట్ చేసుకోవాలి. ఏ డ్రెస్ ధరించినా ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా కనిపించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పవన్ సర్కి డిజైన్ చేశాను. - రాజేష్ మోరే, పవన్ కళ్యాన్ కాస్ట్యూమ్స్ డిజైనర్